TS TET 2023 Exam Latest News: రేపే టీఎస్ టెట్ ఎగ్జామ్, అభ్యర్థులు ఈ విషయాలు గుర్తుపెట్టుకోకపోతే అంతే సంగతులు..
టీఎస్ టెట్ 2023 ఎగ్జామ్ డేట్ లేటెస్ట్ న్యూస్ (TS TET 2023 Exam Latest News):
తెలంగాణలో రేపు అంటే సెప్టెంబర్ 15, 2023న టెట్ పరీక్ష (TS TET 2023 Exam Latest News) జరగనుంది. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 15వ తేదీన అంటే శుక్రవారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. పేపర్-1 పరీక్షకు 2 లక్షల 69 వేల, 557 మంది, పేపర్-2 పరీక్షకు 2 లక్షల 08 వేల 498 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పేపర్-1కు 1139 పరీక్షా కేంద్రాలను, పేపర్-2 పరీక్ష నిర్వహణకు 913 కేంద్రాలను అధికారులు కేటాయించారు.
పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చనున్నారు. పరీక్షలు మొత్తం సీసీ కెమెరాల నిఘాలోనే సాగుతాయి. పరీక్షలు నిర్విఘ్నంగా, ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షలు జరిగినంతసేపు విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో చేరుకునేందుకు ప్రత్యేకంగా బస్సులను కల్పించాలని ఆర్టీసీ సంస్థను విద్యాశాఖ అధికారులు కోరడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
టీఎస్ టెట్ అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ (Rules For TS Tet Candidates)
తెలంగాణ టెట్ 2023 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందులో ఏ విషయాన్ని పాటించకపోయినా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్‌ను దిగువున అందించడం జరిగింది.
- అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందే చేరుకోవాలి. ఆలస్యమైతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించే అవకాశం లేదు.
- TS TET 2023 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ను సరిచూసుకోవాలి. ఏమైనా లోపాలు ఉంటే పరీక్షకు ముందే సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. హాల్ టికెట్‌లో ఏమైనా తప్పులు ఉంటే.. పరీక్ష హాలులో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సరి చేసుకోవాలి.
- అదే విధంగా పరీక్ష పూర్తైన తర్వాత మాత్రమే అభ్యర్థులు బయటకు రావాల్సి ఉంటుంది. ఉదయం జరిగే పరీక్షలో మధ్యాహ్నం 12, మధ్యాహ్న సెషన్‌లో 5.00 గంటల లోపు అభ్యర్థులెవరూ పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించబడరు.
- పరీక్షా కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను, విలువైన వస్తువులను తీసుకెళ్లకూడదు.
- OMR షీట్లో బ్లూ/బ్లాక్ పెన్‌తో మాత్రమే అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నెంబర్ రాయాల్సి ఉంటుంది. హాల్ టికెట్, ప్రశ్నపత్రం నెంబర్ సరిగ్గా రాయకపోయినా, ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదు.
- మీకు ఇచ్చిన ప్రశ్నాపత్రం మీరు ఎంచుకున్న భాషలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలా లేకపోతే వెంటనే ఇన్విజిలేటర్‌కి తెలియజేయాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్, రిక్రూట్‌మెంట్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకోండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















