TSTRANSCO Apprentice Recruitment 2023: తెలంగాణ ట్రాన్స్‌కోలో ఉద్యోగాలు, అప్లై చేసుకోవడానికి నేడే చివరి తేదీ, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
తెలంగాణ ట్రాన్స్‌కో అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2023 (TSTRANSCO Apprentice Recruitment 2023):
హైదరాబాద్‌లోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, కార్పొరేట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నుంచి అప్రెంటీస్ షిప్ నోటిఫికేషన్ (TSTRANSCO Apprentice Recruitment 2023) విడుదలైంది. ఈ అప్రెంటీస్ షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరి తేదీ. అర్హులైన ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రాడ్యుయేట్, టెక్నిషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టులు మొత్తం 92 ఉన్నాయి.
| ట్రాన్స్‌కో అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ |
|---|
ఏపీ ట్రాన్స్‌కో ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు (Important Dates of AP Transco Jobs)
ఈ దిగువ పట్టికలో ఉన్న TSTRANSCO రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున చూడండి| రిక్రూట్‌మెంట్ అథారిటీ | ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ |
|---|---|
| పోస్టుల పేరు | గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ షిప్ |
| కేటగిరి | ఇంజనీరింగ్ ఉద్యోగాలు |
| పోస్టుల సంఖ్య | 92 |
| దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | ఏప్రిల్ 05, 2023 |
| NATS పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 11, 2023 |
| అప్లై చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 12, 2023 |
| టీఎస్ ట్రాన్స్‌కో అధికారిక వెబ్‌సైట్ | https://tstransco.in |
ఏపీ ట్రాన్స్‌కో ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు (Required Qualifications for AP Transco Jobs)
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.- అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- నిబంధనల ప్రకారం రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
- అప్రెంటిస్‌షిప్ నిబంధనల ప్రకారం వయో పరిమితి అనుసరించబడుతుంది.
- అభ్యర్థులు డిప్లొమా/డిగ్రీ (సంబంధిత ఇంజనీరింగ్) పాసై ఉండాలి, 2020,2021, 2022 సంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
- అప్రెంటీస్ శిక్షణ కాలం: ఒక ఏడాది
TSTRANSCO అప్రెంటీస్ జీతం 2023 (TSTRANSCO Apprentice Salary 2023)
ఈ పోస్టుల్లో చేరిన వారికి శిక్షణ కాలంలో అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఏడాది పాటు ఈ ట్రైనింగ్ ఉంటుంది.| పోస్టుల పేరు | స్టైఫండ్ |
|---|---|
| గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్ | 9,000 |
| డిప్లొమా అప్రెంటీస్ | 8,000 |
ఈ ఉద్యోగాలకు డిగ్రీ, డిప్లొమా కోర్సులో అభ్యర్థి పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ h ttps://tstransco.in లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను కూడా వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్ క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















