TSPSC Group 4 Exam Date 2023: జూలై 1న TSPSC గ్రూప్ 4 ఎగ్జామ్, పక్కాగా ఏర్పాట్లు, నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీTSPSC గ్రూప్ 4 ఎగ్జామ్ డేట్ 2023 (TSPSC Group 4 Exam Date 2023): TSPSC (Telangana State Public Service Commission) గ్రూప్ 4 పరీక్ష తేదీ 2023 జూలై 1న (TSPSC Group 4 Exam Date 2023) జరగనుంది. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పరీక్ష రోజు దగ్గరపడుతుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కమిషన్ 2,846 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతంలో జరిగిన పొరపాట్లను పరిగణలోకి తీసుకుని పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. అన్ని నిబంధనలను పక్కాగా అవలంభించనుంది. పరీక్ష ప్రారంభానికి పావుగంట ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసివేస్తామని TSPSC తెలియజేసింది. కాగా ఈ పరీక్షకు దాదాపుగా 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు.
TSPSC గ్రూప్ 4 ఎగ్జామ్ డేట్ 2023 పూర్తి వివరాలు (TSPSC Group 4 Exam Date 2023-Overview)
TSPSC గ్రూప్ 4 ఎగ్జామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున పట్టికలో ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించవచ్చు.| కండక్టింగ్ అథారిటీ | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
|---|---|
| పరీక్ష | TSPSC గ్రూప్ 4 ఎగ్జామ్ 2023 |
| TSPSC గ్రూప్ 4 ఎగ్జామ్ డేట్ | జూలై 1, 2023 |
| TSPSC గ్రూప్ 4 హాల్ టికెట్ 2023 విడుదల | జూన్ 24, 2023 |
| TSPSC Group 4 ఎంపిక విధానం | సీబీటీ/ఆఫ్‌లైన్ |
| అధికారిక వెబ్‌సైట్ | tspc.gov.in |
| TSPSC Group 4 ఆన్సర్ కీ విడుదల తేదీ | తెలియాల్సి ఉంది. |
| TSPSC Group 4 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల తేదీ | తెలియాల్సి ఉంది |
TSPSC గ్రూప్ 4 పరీక్ష రోజు గైడ్‌లైన్స్ (TSPSC Group 4 Exam Day Guidelines)
TSPSC గ్రూప్ 4 పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు ఎగ్జామ్ రోజు ఈ దిగువున తెలిపిన రూల్స్ పాటించాల్సి ఉంటుంది.- జూలై 1, 2023న పేపర్-1 పరీక్ష10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే 9.45 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను లోపలికి అనుమతించరు.
- మధ్యాహ్యం ఎగ్జామ్ 2:30 గంటల నుంచి 5:00 గంటల వరకు జరుగుతుంది. 2.15 తర్వాత ఎగ్జామ్ సెంటర్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కమిషన్ అధికారులు తెలియజేశారు.
- పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్‌తో కూడిన కారు తాళాలు, నిషేధిత, విలువైన వస్తువులకు అనుమతి లేదు. అభ్యర్థులు పరీక్షా హాల్‌కు షూలు ధరించి వెళ్లకూడదు. కేవలం చెప్పులతో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.
- పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులను తప్పనిసరిగా చెక్ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులు ప్రతీ సెషన్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్‌ని ఇన్విజిలేటర్ కు అందించి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.
- ఓఎంఆర్ షీట్‌లో బ్లూ, బ్లాక్ పెన్‌తో మాత్రమే అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నెంబర్ రాయాల్సి ఉంటుంది. బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగిస్తే ఓఎంఆర్ షీట్ చెల్లదని అధికారులు తెలియజేశారు.
- పరీక్షా కేంద్రంలోకి వెళ్లాక అభ్యర్థులు ఇన్విజిలేటర్‌కు అభ్యర్థులు తమ ఫోటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ అభ్యర్థి కాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















