TSPSC Group 3 Edit Option: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 3 దరఖాస్తులో తప్పులను ఎడిట్ చేసుకునేందుకు ఛాన్స్, ఈరోజు నుంచే అందుబాటులోకి కరెక్షన్ విండో

Rudra Veni

Updated On: August 16, 2023 11:10 AM

TSPSC Group 3 దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని సవరించుకోవడానికి  (TSPSC Group 3 Edit Option) అందుబాటులోకి వచ్చింది. ఆగస్ట్ 16వ తేదీ నుంచి  ఆగస్ట్ 21 వరకు కరెక్షన్ విండో అందుబాటులోకి వచ్చింది. 
 
TSPSC Group 3 Edit Option: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 3 దరఖాస్తులో తప్పులను ఎడిట్ చేసుకునేందుకు ఛాన్స్, ఈరోజు నుంచే అందుబాటులోకి కరెక్షన్  విండోTSPSC Group 3 Edit Option: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 3 దరఖాస్తులో తప్పులను ఎడిట్ చేసుకునేందుకు ఛాన్స్, ఈరోజు నుంచే అందుబాటులోకి కరెక్షన్ విండో

TSPSC Group 3 ఎడిట్ ఆప్షన్ (TSPSC Group 3 Edit Option): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 3కి దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. తమ దరఖాస్తుల్లో సవరణలు (TSPSC Group 3 Edit Option) చేసుకునేందుకు కరెక్షన్ విండో అందుబాటులోకి రానుంది. ఈరోజు నుంచి అంటే ఆగస్ట్ 16 నుంచి 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కరెక్షన్ విండో అధికారిక వెబ్‌సైట్‌లో tspsc.gov.in యాక్టివ్‌గా ఉంటుంది. ఈ విండో ద్వారా అభ్యర్థులు తమ అప్లికేషన్‌లో తప్పులను సరిదిద్దుకోవచ్చు. కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు.  అయితే  ఒక్కో అభ్యర్థికి ఒకసారి మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నట్టు TSPSC స్పష్టం చేసింది.  కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవాలి. TSPSC 2023 సవరణకు సంబంధించిన లింక్‌ను ఈ దిగువున అందజేయడం జరిగింది.

TSPSC గ్రూప్ 3 దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ పూర్తి వివరాలు  (TSPSC Group 3 Edit Option Details)

TSPSC గ్రూప్ 3 కోసం అప్లికేషన్‌ పూరించే సమయంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఆగస్ట్ 21వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. TSPSC గ్రూప్ 3 దరఖాస్తులో సవరణలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ అందజేయడం జరిగింది.
సంస్థ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)
పోస్ట్ TSPSC గ్రూప్ 3
పోస్టులు 1388
TSPSC గ్రూప్ 3 దరఖాస్తు సవరణ ప్రారంభ తేదీ ఆగస్ట్ 16, 2023
TSPSC గ్రూప్ 3 దరఖాస్తు చివరి తేదీ 21 ఆగస్ట్ 2023
అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in

TSPSC గ్రూప్ 3 దరఖాస్తు సవరించడానికి స్టెప్స్  (Steps to Edit TSPSC Group 3 Application)


TSPSC గ్రూప్ 3 పోస్ట్ కోసం దరఖాస్తుని సవరించడానికి ఈ కింది స్టెప్స్‌ని ఫాలో అవ్వండి.
  • ముందుగా అభ్యర్థులు tspsc.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోంపేజీలో TSPSC గ్రూప్ 3 దరఖాస్తు‌ సవరించే లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో TSPSC ID, పుట్టిన తేదీతో లాగిన్ అవ్వాలి.
  • అనంతరం ఓపెన్ అయ్యే అప్లికేషన్‌లో అవసరమైన దిద్దుబాట్లు చేసి సబ్మిట్ చేయాలి.
TSPSC గ్రూప్ 3 ద్వాారా 26 విభాగాలకు చెందిన పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యాశాఖ, హోంశాఖ, రెవెన్యూ శాఖ, సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, ఆర్థిక శాఖ వంటి విభాగాల్లో ఈ  ఖాళీలున్నాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/tspsc-group-3-edit-option-will-be-available-till-august-21-44013/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy