TSPSC Group 4 Result: అతి త్వరలో TSPSC గ్రూప్‌-4 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోవాలి

Rudra Veni

Updated On: February 01, 2024 02:43 PM

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్‌-4 ఫలితాల విడుదలపై దృష్టి సారించారు. ఈ మేరకు ఫలితాలు (TSPSC Group 4 Result) ఈ వారంలో ఎప్పుడైనా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.  
TSPSC Group 4 Result: అతి త్వరలో TSPSC గ్రూప్‌-4 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోవాలిTSPSC Group 4 Result: అతి త్వరలో TSPSC గ్రూప్‌-4 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోవాలి

TSPSC గ్రూప్ 4 ఫలితాలు 2023 (TSPSC Group 4 Result): టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాల (TSPSC Group 4 Result) వెల్లడిపై దృష్టి సారించింది. ఈ వారంలో ఎప్పుడైనా ఫలితాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.  ఇప్పటికే  TSPSC Group 4 ప్రాథమిక, తుది కీలను కూడా టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.   తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ గ్రూప్ 4 పోస్టుల కోసం రాత పరీక్షను 01 జూలై 2023న నిర్వహించింది. ఈ పరీక్షకు 7,62,872 మంది హాజరయ్యారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.  ఫలితాలు విడుదలైన తర్వాత  మెరిట్ జాబితాకు ఎంపికైన అభ్యర్థులకు తర్వాతి దశలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలు 2023 విడుదల తేదీ (TSPSC Group 4 Result 2023 Announcement Date)

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలు 2024 ఈ వారంలో ఏ రోజునైనా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. సంబంధిత వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

బోర్డు పేరు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్
పోస్టు కేడర్ గ్రూప్ 4
ఖాళీల సంఖ్య 9,168
రాత పరీక్ష తేదీ జూలై 01, 2023
TSPSC గ్రూప్ 4 ఫలితాల విడుదల తేదీ త్వరలో
అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in

TSPSC గ్రూప్ 4 ఫలితం 2023ని చెక్ చేసే విధానం (Steps to check the TSPSC Group 4 Result 2023)

TSPSC గ్రూప్ 4కు సంబంధించిన ఫలితాలను చెక్ చేసుకునే విధానం ఈ దిగువున అందజేశాం.
  • స్టెప్ 1: అభ్యర్థులు ముందుగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్‌ను https://tspsc.gov.in సందర్శించాలి.
  • స్టెప్ 2: హోమ్‌పేజీలో న్యూస్ ఫీడ్ విభాగం కోసం వెదికి, దానిపై క్లిక్ చేయాలి.
  • స్టెప్ 3: "గ్రూప్-4 సర్వీసెస్ (19/2022) రాత పరీక్ష ఫలితం" అనే లింక్‌ని గుర్తించి దానిపై క్లిక్ చేయాలి.
  • స్టెప్ 4: TSPSC గ్రూప్ 4 ఫలితాల PDF ఆన్‌లైన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల పేర్లు, రోల్  నెంబర్‌లతో స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
  • స్టెప్ 5: Ctrl+F షార్ట్‌కట్‌తో మీ పేర్లు/రోల్ నెంబర్ కోసం శోధించాలి.
  • స్టెప్ 6: అభ్యర్థులు TSPSC గ్రూప్ 4 ఫలితం 2023ని డౌన్‌లోడ్ చేసుకోవాలి, భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/tspsc-group-4-results-will-be-released-soon-49300/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy