
టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ 2023 ఉద్యోగాలు (TSSPDCL Recruitment 2023):
పదో తరగతి అర్హతతో తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) పోస్టులను భర్తీ చేస్తోంది. 1601 ఉద్యోగాల భర్తీకి (TSSPDCL Recruitment 2023) ఇప్పటికే రెండు నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. అందులో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులు 48 ఉండగా, జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 1553 ఉన్నాయి. జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 8వ తేదీ నుంచి మొదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈరోజే (మార్చి 28) చివరి తేదీ. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోవాలి. కొన్ని గంటల్లో దరఖాస్తు ప్రక్రియ ముగిసిపోనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు TSSPDCL వెబ్‌సైట్
tssouthernpower.cgg.gov.in, www.tssouthernpower.com
లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
టీఎస్‌పీఎస్‌డీసీఎల్ ఉద్యోగాలకు ముఖ్యమైన తేదీలు (Important Dates for TSPSDCL Jobs)
టీఎస్‌పీఎస్‌డీఎల్ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలని ఇక్కడ అందించడం జరిగింది. అభ్యర్థులు ఈ టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 08, 2023 |
---|---|
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | మార్చి 28, 2023 |
అప్లికేషన్ కరెక్షన్ విండో | ఏప్రిల్ 01 నుంచి ఏప్రిల్ 4, 2023 వరకు |
హాల్ టికెట్ డౌన్‌లోడ్ | ఏప్రిల్ 24, 2023 |
పరీక్ష తేదీ | ఏప్రిల్ 30, 2023 |
TSSPDCL పోస్టులకు అర్హత ప్రమాణాలు (Eligibility Criteria for TSSPDCL Posts)
జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు సేలరీ రూ.39,000లు, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.64,295 బేసిక్ వేతనంతో మొత్తం రూ.99,345 జీతం లభిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ దిగువున తెలియజేసిన అర్హత ప్రమాణాలు కచ్చితంగా ఉండాలి- కేవలం పదో తరగతి, ఐటీఐ పాసైన అభ్యర్థులు లైన్‌మెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్‌లో అర్హత పొంది ఉండాలి.
- ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో రెండేళ్ల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
- అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ప్రాసెసింగ్ ఫీజు రూ. 200లు చెల్లించాలి. అదనంగా పరీక్ష కోసం ఫీజు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. అయితే EWS అభ్యర్థులు, SC/ST/BC వర్గాల వారు పరీక్ష ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. .
TSSPPDCL ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే? (How to apply for TSSPDCL Jobs)
టీఎస్‌పీఎస్‌డీసీఎల్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఈ దిగువున చెప్పిన విధంగా దరఖాస్తు చేసుకోవాలి.- అభ్యర్థులు మొదటగా www.tssouthernpower.com లో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోం పేజీలో కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి
- తర్వాత సబ్మిట్ అప్లికేషన్‌పై క్లిక్ చేయాలి, దాంతో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది
- అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫార్మ్‌ని పూరించాలి
- అనంతరం దరఖాస్తు ఫీజు చెల్లించాలి
- తర్వాత అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



