WCDSCD Rangareddy District Recruitment 2023: తెలంగాణలో ఉద్యోగాలు, ఇంటర్, డిగ్రీ చేసినవాళ్లకి మంచి ఛాన్స్, పూర్తి వివరాలివే
WCDSCD రంగారెడ్డి జిల్లా రిక్రూట్‌మెంట్ 2023 (WCDSCD Rangareddy District Recruitment 2023):
తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో ఉద్యోగాలు పొందే ఛాన్స్ వచ్చింది. రంగారెడ్డి జిల్లా మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ పరిధిలోని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, చైల్డ్ హెల్ప్‌లైన్ (హైదరాబాద్) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ (WCDSCD Rangareddy District Recruitment 2023) వెలువడింది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
| WCDSCD రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ - ఇక్కడ క్లిక్ చేయండి |
|---|
WCDSCD రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల వివరాలు (WCDSCD Rangareddy District Recruitment 2023 Vacancies Details)
రంగారెడ్డి జిల్లా రిక్రూట్‌మెంట్ 2023కు సంబంధించిన ఖాళీల వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది.| ప్రొటెక్షన్ ఆఫీసర్ | 01 |
|---|---|
| ప్రొటెక్షన్ ఆఫీసర్ | 01 |
| లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ | 01 |
| అవుట్ రీచ్ వర్కర్ | 04 |
| ఎస్‌ఎస్ఏ మే్నేజర్ | 03 |
| ఎస్ఎస్ఏ సోషల్ వర్కర్ పోస్టులు | 02 |
| ఏఎన్ఎం | 04 |
| చౌకీదార్ | 06 |
| ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ | 01 |
| కౌన్సెలర్ | 01 |
| చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్ వైజర్ | 03 |
| కేస్ వర్కర్ | 03 |
WCDSCD రంగారెడ్డి జిల్లా రిక్రూట్‌మెంట్ 2023 అర్హతలు (WCDSCD Rangareddy District Recruitment 2023 Qualifications)
WCDSCD రంగారెడ్డి జిల్లా రిక్రూట్‌మెంట్ 2023లో భాగంగా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.- సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా చేసి ఉండాలి.
- అభ్యర్థులకు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ వివరాలతో కూడిన దరఖాస్తును, అవసరమైన సర్టిఫికెట్లను జత చేసి జిల్లా సంక్షేమ అధికారి ఆఫీస్, డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ విభాగం, వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, హైదరాబాద్ -500038 అడ్రస్‌కు పంపించాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 24, 2023 చివరి తేదీ. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు లాస్ట్‌డేట్ సాయంత్రం 5 గంటలకల్లా దరఖాస్తులు అందేలా పంపించాలి. ఆలస్యంగా అందిన దరఖాస్తులను స్వీకరించబడవు. అలాగే స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని నోటిఫికేషన్‌లో వెల్లడించడం జరిగింది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















