
అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగులో స్పీచ్ (Ambedkar Jayanti Speech in Telugu) : డాక్టర్ అంబేద్కర్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. చరిత్రలో ఆయనకంంటూ కొన్ని పేజీలను సొంతం చేసుకున్న వ్యక్తి అంబేద్కర్. స్త్రీ విద్య కోసం, దళితుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి. ఈ నెల అంటే ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి. ఆయన అసలు పేరు భీమ్‌రావు రామ్‌జీ అంబేద్కర్. ఈయన 1891లో మధ్యప్రదేశ్‌లోని మోవ్ అనే గ్రామంలో పుట్టారు. అంబేద్కర్ వృత్తి రీత్యా న్యాయవాది, ఆర్థికవేత్త, సామాజిక సంస్కర్త. అంతేకాదు మన భారత రాజ్యాంగం రూపకల్పనలో క్రీయశీలక పాత్ర పోషించిన వ్యక్తి. దళితుల కోసం ఆయన చేసిన కృషి వల్ల.. అంబేద్కర్‌కి ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఉన్నాయి. బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి ఈ తరం కచ్చితంగా తెలుసుకోవాలి. ఆయన అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన క్రమాన్ని అందరూ కచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఒక దళిత కుటుంబంలో పుట్టి.. ఎంతో కష్టపడి చదువుకుని ఎన్నో ఉన్న పదవులను అధిరోహించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. మేధస్సుతో పాటు.. మానవత్వం కూడా ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంబేద్కర్. ఆ గొప్పతనం తెలిసే విధంగా విద్యార్థులకు తెలిసేలా అంబేద్కర్ గురించి (Ambedkar Jayanti Speech in Telugu) అన్ని వివరాలను ఇక్కడ అందించాం. అంబేద్కర్ గురించి చాలా తెలియని విషయాలు కూడా ఇక్కడ తెలియజేశాం. భారత రాజ్యాంగ నిర్మాతగానే కాదు.. సమాజంలో మార్పు కోసం పాటుపడ్డ ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంబేద్కర్.
అంబేద్కర్ జయంతి 2025 - చరిత్ర (Ambedkar Jayanthi 2025 - History)
డాక్టర్ బాబా సాహే అంబేద్కర్ ఒక దళిత కుటుంబంలో పుట్టారు. రాంజీ మకోజీ సక్పాల్, భీమాబాయి దంపతులకు అంబేద్కర్ 14వ సంతానం. అందరికంటే చిన్నవాడు. దళిత కుటుంబంలో పుట్టడం వల్ల చిన్నప్పటి నుంచి ఆయన వివక్షతను ఎదుర్కొన్నాడు. ఈ వివక్షతే అంబేద్కర్ గుండెల్లో అగ్గి రగిల్చింది. అందుకే ఈ స్థితిని మార్చాలని అంబేద్కర్ తీవ్రంగా పని చేశారు. బాగా చదువుకుంటే తన పట్ల, తనలాంటి పట్ల వివక్షత పోతుందని నమ్మారు. అందుకే పట్టుదలగా న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. స్కాలర్‌షిప్‌తో అహర్నిశలు కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించారు. 1923లో లండన్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. అంతంటి విద్యావంతుడుగా తిరిగి భారతదేశానికి వచ్చిన అంబేద్కర్‌కి నిరాశ మిగిలింది. అప్పటికీ ఇక్కడ కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆయన కూడా ఆ వివక్షతను ఎదుర్కోకతప్పలేదు. దీంతో అంబేద్కర్ తన జీవితాంతం వివక్ష్తతకు వ్యతిరేకంగా పోరాడారు. అణగారి వర్గాలకు సమానత్వం కల్పించడానికి పోరాటం చేశారు. అంతేకాదు న్యాయవాదిగా బడుగు, బలహీన వర్గాల కోసం పని చేశారు. వారి గొంతుకై నినదించారు.
భారతదేశంలోని ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా అంబేద్కర్ సముచిత పాత్రను పోషించారు. 1955లో మెరుగైన ప్రభుత్వం కోసం మధ్యప్రదేశ్, బీహార్ విభజనను ప్రతిపాదించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిన ఆర్టికల్ 370ని అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతే కాదు అంబేద్కర "ముక్నాయక్" అనే పత్రికిను స్థాపించి, నడిపించారు. 1935లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని పెట్టారు.
అదేవిధంగా అంబేద్కర్ 1935లో ముంబైలో ప్రభుత్వ లా కాలేజ్ ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. 1946లో మొదటి న్యాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. భారత రాజ్యాంగ రూపొందించడానికి ముసాయిదా కమిటీ అధ్యక్షుడుగా అంబేద్కర్ నాయకత్వం వహించారు. 1952లో రాజ్యసభలో కూడా చేరారు.
అంబేద్కర్ జయంతి 2025 - ఆసక్తికరమైన విషయాలు (Ambedkar Jayanti 2025-Intresting Facts)
బాబా సాహేబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ అందించాం. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాయింట్లు వారీగా అందించాం. ఈ అంశాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి.
- డాక్టర్ అంబేద్కర్ విదేశాల నుంచి ఎకనామిక్స్‌లో డాక్టరేట్ (PH.d) పొందిన మొట్టమొదటి భారతీయుడు.
- లండన్ మ్యూజియంలో ప్రముఖ తత్త్వవేత్త కార్ల్ మార్క్స్ విగ్రహంతో పాటు, భారతదేశం నుంచి మన అంబేద్కర్ విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఘనత కేవలం అంబేద్కర్‌కి మాత్రమే దక్కిందని చెప్పుకోవాలి.
- నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ అమర్త్య సేన్ బీఆర్. అంబేద్కర్‌ను తన ఆర్థిక శాస్త్ర పితామహుడిగా భావించారు.
- బాబాసాహెబ్ వ్యక్తిగత గ్రంథాలయం పేరు 'రాజ్‌గిర్'. ఈ లైబ్రరీలో 50,000 కంటే ఎక్కువ పుస్తకాలున్నాయి. అంతేకాదు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ గ్రంథాలయం.
- అంబేద్కర్ హిందీ, పాళీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ వంటి 9 భాషలలో పరిజ్ఞానం ఉంది.
- డాక్టర్ అంబేద్కర్ దాదాపు 21 సంవత్సరాల పాటు ప్రపంచంలోని అన్ని మతాలను అధ్యయనం చేశారు.
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో పాటలు, పుస్తకాలు రాయడం జరిగింది.
- అంబేద్కర్ స్త్రీ విద్య కోసం, దళితుల హక్కుల కోసం విస్త్రృతంగా కృషి చేశారు.
- భారతదేశంలో ఎక్కువ విగ్రహాలున్న ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని చెప్పుకోవచ్చు.
- లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి 'డాక్టర్ ఆల్ సైన్స్' అనే విలువైన డాక్టరేట్ డిగ్రీని పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి, ఏకైక వ్యక్తి అంబేద్కర్. చాలా మంది విద్యార్థులు దీని కోసం ప్రయత్నించారు, కానీ ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదు.
- అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కేవలం రెండు సంవత్సరాల 3 నెలల్లో 8 సంవత్సరాల చదువును పూర్తి చేశాడు. అతను రోజుకు 21 గంటలు చదివారంట.
- డాక్టర్ బాబాసాహెబ్ రాసిన 'వెయిటింగ్ ఫర్ ఏ వీసా' పుస్తకం కొలంబియా విశ్వవిద్యాలయంలో ఒక పాఠ్య పుస్తకంగా ఉంది.
- కొలంబియా విశ్వవిద్యాలయం 2004లో ప్రపంచంలోని టాప్ 100 పండితుల జాబితాను తయారు చేయగా అందులో మొదటి పేరు డాక్టర్ అంబేద్కర్‌ది కావడం విశేషం.
- డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన 8,50,000 మంది మద్దతుదారులతో బౌద్ధమతంలోకి దీక్ష తీసుకోవడం ప్రపంచంలోనే అతిపెద్ద మతమార్పిడిగా నిలిచింది.
- బాబాసాహెబ్‌ను బౌద్ధమతంలోకి ప్రవేశపెట్టిన గొప్ప బౌద్ధ సన్యాసి 'మహంత్ వీర్ చంద్రమణి', ఆయనను 'ఈ యుగం ఆధునిక బుద్ధుడు' అని పిలిచారు.
- ప్రపంచంలో ప్రతిచోటా బుద్ధుని కళ్లు మూసుకున్న విగ్రహాలు, చిత్రాలు ఉంటాయి. కానీ అంబేద్కర్ బుద్ధుని కళ్లు తెరిచిన మొదటి బుద్ధుని చిత్రాన్నిగీశారు.
- నేపాల్‌లోని ఖాట్మండులో జరిగిన 'ప్రపంచ బౌద్ధ మండలిలో అంబేద్కర్‌కు బౌద్ధమతం అత్యున్నత బిరుదు 'బోధిసత్వ'ను ప్రదానం చేశారు.
- అంబేద్కర్ బౌద్ధమత విధానంపై 'బుద్ధుడు, అతని ధమ్మం' అనే పుస్తకం కూడా రాశారు.
- 'ది మేకర్స్ ఆఫ్ ది యూనివర్స్' అనే ప్రపంచ సర్వే ఆధారంగా గత 10 వేల సంవత్సరాలలో 100 మంది మానవతావాద వ్యక్తుల జాబితాను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారు చేసింది. అందులో నాలుగో పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.
- బాబాసాహెబ్ మొదటి విగ్రహాన్ని 1950 లో ఆయన జీవించి ఉన్నప్పుడు నిర్మించారు మరియు ఈ విగ్రహం కొల్హాపూర్ నగరంలో స్థాపించబడింది.
- ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 2011 ప్రకారం ప్రపంచంలోనే మొదటి ప్రతిభావంతులైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే.
- బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన 'రూపాయి సమస్య: దాని మూలం, పరిష్కారాలు' అనే పుస్తకంలోని సూత్రాలను ఉపయోగించి RBI ఏప్రిల్ 1, 1935న స్థాపించబడింది.
- నవంబర్ 27, 1942న న్యూఢిల్లీలో జరిగిన 7వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశంలో అంబేద్కర్ పని సమయాన్ని 12 నుండి 8 గంటలకు తగ్గించారు.
- డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ "వేతన స్కేల్ సవరణ", "'సెలవు ప్రయోజనం, "కరవు భత్యం" (DA) లను కూడా ఏర్పాటు చేశారు.
- అంబేద్కర్ 1952, 1954 ఎన్నికలలో పోటీ చేసారు కానీ ఒక్కసారి కూడా గెలవలేకపోయారు.
- గనుల ప్రసూతి ప్రయోజన చట్టం, మహిళా కార్మిక సంక్షేమ నిధి, శ్రమ దోపిడీ నుంచి మహిళలు, పిల్లలను రక్షించే చట్టాలు వంటి చరిత్రాత్మక చట్టాల ద్వారా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహిళా కార్మికుల హక్కుల కోసం కృషి చేశారు.
- బీఆర్ అంబేద్కర్‌కి 1906లో 15 ఏళ్లకే పెళ్లి చేశారు. అంబేద్కర్ భార్య పేరు రమాబాయి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?


















సిమిలర్ ఆర్టికల్స్
ఉపాధ్యాయ దినోత్సవ గొప్పతనం, విశిష్టతలను ఇక్కడ తెలుసుకోండి
NIRF టాప్ ర్యాంకింగ్ సంస్థలు 2025 , రాష్ట్రాల వారీగా ఉత్తమ 50 విద్యాసంస్థల వివరాలు
SBI PO ప్రిలిమ్స్ ఫలితాల 2025 తేదీ, అధికారిక విడుదల షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి
NIRF 2025 రీసెర్చ్ ర్యాంకింగ్‌లు, టాప్ రీసెర్చ్ యూనివర్సిటీలు & ఇన్స్టిట్యూట్లు ఇవే
విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్ (Independence Day Speech in Telugu)
ఆగస్ట్ 15 గొప్పతనం- భారత స్వతంత్రోద్యమం.. ముఖ్యమైన ఘట్టాలు