AP EAPCET 2026 రిజిస్ట్రేషన్‌కి అవసరమైన డాక్యుమెంట్లు ఇవే, పరీక్షా విధానం

manohar

Published On:

AP EAPCET 2026 రిజిస్ట్రేషన్ ఇప్పటికే ప్రారంభమైంది,చివరి తేదీ మార్చి 7,2026 వరకు కొనసాగుతుంది.అర్హులైన అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలి.AP EAPCET 2026 రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పరీక్ష విధానం పూర్తి సమాచారం కింద చూడవచ్చు.

Documents Required for AP EAPCET 2026 Registration and  Exam Pattern
FREE WORKSHOP

Want to unlock the other 99%?

Join our live, hands-on session and watch Claude build apps, dashboards & campaigns in real time.

  • SESSIONClaude Live Session by Experts
  • WHENUpcoming Saturday · 6 PM – 7 PM
  • FORMATPractical · No theory · Live demos

AP EAPCET 2026 కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు అత్యంత ముఖ్యమైన ప్రవేశ పరీక్షలలో ఒకటి .ఈ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది మరియు అధికారిక సమాచారం ప్రకారం దరఖాస్తు చివరి తేదీ మార్చి 7, 2026 . ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు చివరి తేదీ వరకు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు పూర్తి చేయాలి. చివరి రోజుల్లో సర్వర్ సమస్యలు లేదా ఇతర సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

ప్రతి సంవత్సరం AP EAPCETకు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటారు కాబట్టి ముందుగానే అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకోవడం ఎంతో అవసరం. అధికారిక వెబ్‌సైట్‌లో వచ్చే నోటిఫికేషన్లు, అప్డేట్స్ తరచుగా చెక్ చేయండి. ఈ పరీక్ష గురించి పూర్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ , డాక్యూమెంట్స్ మరియు పరీక్ష విధానం అన్ని దశల గురించి క్రింద ఉన్న ఈ కథనాన్ని చదవండి.

AP EAPCET 2026 రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు (Documents required for AP EAPCET 2026 registration)

AP EAPCET 2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్లను తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి.

  • SSC (10వ తరగతి) హాల్ టికెట్ నంబర్
  • ఇంటర్మీడియట్ (10+2) హాల్ టికెట్ నంబర్
  • అభ్యర్థి పూర్తి పేరు మరియు పుట్టిన తేదీ (SSC సర్టిఫికెట్ ప్రకారం)
  • కేటగిరీ సర్టిఫికెట్ (SC/ST/BC/OBC అభ్యర్థులకు)
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కమ్ సర్టిఫికెట్ – ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం)
  • స్టడీ సర్టిఫికెట్ (6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) లేదా నివాస ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ కార్డు వివరాలు
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో (స్కాన్ కాపీ)
  • అభ్యర్థి సంతకం (స్కాన్ కాపీ)

AP EAPCET 2026కి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి? (How to register for AP EAPCET 2026?)

AP EAPCET 2026కు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అభ్యర్థులు ఈ క్రింది దశలను పాటించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.inని సందర్శించాలి.
  • ఆ తరువాత “Pay Registration Fee” లింక్‌పై క్లిక్ చేయాలి
  • అవసరమైన వివరాలు ఇచ్చి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
  • ఫీజు చెల్లించిన తర్వాత “Fill Application Form” ఆప్షన్ ఎంచుకోవాలి
  • వ్యక్తిగత మరియు విద్యా వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి
  • అవసరమైన డాక్యుమెంట్ల వివరాలు ఇవ్వాలి
  • ఫోటో మరియు సంతకం స్కాన్ కాపీలు అప్‌లోడ్ చేయాలి
  • నమోదు చేసిన వివరాలు మరోసారి చూసుకుని పరిశీలించాలి
  • అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి
  • చివరగా అప్లికేషన్ ఫారమ్ ఆవుట్ ప్రింట్ తీసుకోవడం మంచిది

AP EAPCET 2026 పరీక్ష విధానం (AP EAPCET 2026 Exam Pattern)

AP EAPCET 2026 పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు, ప్రశ్నలు పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి.

  • పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
  • ప్రశ్నల రకం: బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQs)
  • మొత్తం ప్రశ్నలు: 160
  • పరీక్ష వ్యవధి: 3 గంటలు
  • ప్రతి ప్రశ్నకు: 1 మార్కు
  • నెగటివ్ మార్కింగ్: లేదు

ఇంజినీరింగ్ స్ట్రీమ్ (Engineering Stream):

  • మ్యాథమెటిక్స్: 80 ప్రశ్నలు
  • ఫిజిక్స్: 40 ప్రశ్నలు
  • కెమిస్ట్రీ: 40 ప్రశ్నలు

అగ్రికల్చర్ & ఫార్మసీ స్ట్రీమ్ (Agriculture & Pharmacy Stream):

  • బోటనీ: 40 ప్రశ్నలు
  • జువాలజీ: 40 ప్రశ్నలు
  • ఫిజిక్స్: 40 ప్రశ్నలు
  • కెమిస్ట్రీ: 40 ప్రశ్నలు

AP EAPCET 2026 ముఖ్య సూచనలు (AP EAPCET 2026 Important Instructions)

AP EAPCET 2026కి దరఖాస్తు మరియు తదుపరి దశల్లో అభ్యర్థులు ఈ క్రింది సూచనలు తప్పకుండా పాటించాలి.

  • అధికారిక వెబ్‌సైట్ లోని నోటిఫికేషన్లను తరచుగా తనిఖీ చేయాలి
  • రిజిస్ట్రేషన్ వివరాలు డాక్యూమెంట్ల ప్రకారం సరిగా నమోదు చేయాలి
  • అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలను ఒకసారి పరిశీలించండి
  • అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ తీసుకుని భద్రంగా ఉంచుకోండి
  • హాల్ టికెట్ విడుదలైన వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి
  • పరీక్ష రోజున హాల్ టికెట్ తప్పకుండా తీసుకువెళ్లండి
  • పరీక్ష కేంద్రానికి సమయానికి ముందే చేరుకోండి
  • పరీక్ష సమయంలో అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించండి

మొత్తం గా, AP EAPCET 2026 కి సంబంధించిన అన్ని ముఖ్య వివరాలు ముందే తెలుసుకుని, సరైన సమాచారం పాటిస్తూ సరైన సమయంలో ఆధారంగా దరఖాస్తు చేసుకోవడం మంచిది.

/articles/ap-eapcet-2026-registration-documents-details/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All
Top