
జిల్లా ప్రకారంగా APRJC కళాశాలల్లో మొత్తం సీట్ల సంఖ్య (District-Wise Total No. of Seats in APRJC Colleges 2025)
: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థ ఏప్రిల్ 2025న APRJC CET 2025 పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు. APRJC 2025 ఫలితాలు ఈరోజు అంటే మే 14, 2025న విడుదలకానున్నాయి. APRJC 2025 పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ తమ ఫలితాలను తెలుసుకోవడానికి కటాఫ్ మార్కులను తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 10 APRJC కాలేజీలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో అడ్మిషన్ సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం విద్య, వసతి ఉచితంగా అందిస్తుంది. కాబట్టి ఈ కళాశాలల్లో అడ్మిషన్ పొందడానికి విద్యార్థుల నుండి పోటీ ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ (APREI) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. APRJC కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు MPC, BiPC, MEC, CEC, EET, CGT గ్రూప్ లు అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల ప్రకారంగా ఉన్న కళాశాలలు , అందించే కోర్సుల జాబితా మరియు సీట్ల సంఖ్య ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
లేటెస్ట్ -
APRJC ఫలితాల డైరెక్ట్ లింక్
APRJC బాలికల కళాశాలల జాబితా |
---|
APRJC 2025 కళాశాలల జాబితా ( List of APRJC Colleges 2025)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 10 APRJC కళాశాలలు ఉన్నాయి, వాటి జాబితా క్రింద ఉన్న పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
క్రమ సంఖ్య | కళాశాల పేరు | ప్రదేశం | అడ్మిషన్ పరిధి ( విద్యార్థుల జిల్లా ప్రకారంగా ) |
---|---|---|---|
1 | APRJC బాలికల కళాశాల | శృంగవరపు కోట | శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ , తూర్పు గోదావరి, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్ఠీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
2 | APRJC కళాశాల ( కో - ఎడ్యుకేషన్ ) | నిమ్మకూరు | శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్ఠీఆర్ , గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఒకేషనల్ కోర్సులకు : అన్ని జిల్లాలకు |
3 | APRJC బాలుర కళాశాల | నాగార్జున సాగర్ | అన్ని జిల్లాలకు |
4 | APRJC బాలుర కళాశాల | వేంకటగిరి | శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ , తూర్పు గోదావరి, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్ఠీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
5 | APRJC బాలుర కళాశాల | గ్యారంపల్లి | తిరుపతి, చిత్తూరు , అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం , వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూల్ |
6 | APRJC బాలుర కళాశాల | కొడిగెనహళ్లి | తిరుపతి, చిత్తూరు , అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం , వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూల్ |
7 | APRJC బాలికల కళాశాల | బనవాసి, ఎమ్మిగనూరు | తిరుపతి, చిత్తూరు , అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం , వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూల్ |
8 | APRJC బాలుర కళాశాల ( మైనారిటీ ) | గుంటూరు | శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు , విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్ఠీఆర్ , గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
9 | APRJC బాలుర కళాశాల (మైనారిటీ ) | కర్నూలు | తిరుపతి, చిత్తూరు , అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం , వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూల్ |
10 | APRJC బాలికల కళాశాల ( మైనారిటీ) | వాయలపాడు | అన్ని జిల్లాలు |
APRJC కళాశాలల సీట్ల సంఖ్య గ్రూప్ ప్రకారంగా ( Number of Seats in APRJC Colleges - Group Wise)
APRJC కళాశాలల్లో ఉన్న సీట్ల సంఖ్యను గ్రూప్ ప్రకారంగా తెలుసుకోవడానికి క్రింది టేబుల్ పరిశీలించవచ్చు.MPC | BiPC | MEC | CEC | EET | CGT | |
---|---|---|---|---|---|---|
APRJC కళాశాల, శృంగవరపు కోట | 60 | 40 | 30 | 0 | 0 | 0 |
APRJC కళాశాల, నిమ్మకూరు | 50 | 30 | 25 | 30 | 30 | 30 |
APRJC కళాశాల, నాగార్జున సాగర్ | 80 | 60 | 45 | 45 | 0 | 0 |
APRJC కళాశాల , వేంకటగిరి | 60 | 40 | 30 | 0 | 0 | 0 |
APRJC కళాశాల, గ్యారంపల్లి | 60 | 40 | 30 | 0 | 0 | 0 |
APRJC కళాశాల, కొడిగెనహళ్లి | 50 | 30 | 25 | 30 | 0 | 0 |
APRJC కళాశాల, బనవాసి | 60 | 40 | 30 | 0 | 0 | 0 |
APRJC కళాశాల, గుంటూరు | 8 | 8 | 0 | 7 | 0 | 0 |
APRJC కళాశాల, కర్నూలు | 8 | 8 | 0 | 7 | 0 | 0 |
APRJC కళాశాల, వాయలపాడు | 8 | 8 | 0 | 7 | 0 | 0 |
APRJC CET 2025 రిజర్వేషన్ పాలసీ ( APRJC CET 2025 Reservation Policy)
APRJC 2025 జనరల్ కళాశాలలకు ఉండే రిజర్వేషన్ పాలసీ క్రింది పట్టికలో గమనించవచ్చు.
కేటగిరీ | రిజర్వేషన్ శాతం |
---|---|
OC | 38% |
BC - A | 7% |
BC - B | 10% |
BC - C | 1% |
BC - D | 7% |
BC - E | 4% |
SC | 15% |
ST | 6% |
PHC | 3% |
స్పోర్ట్స్ | 3% |
CAP | 3% |
ఆనాధలు | 3% |
APRJC మైనారిటీ కళాశాలకు సంబంధించిన రిజర్వేషన్ పాలసీ ను క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
కేటగిరీ | రిజర్వేషన్ శాతం |
---|---|
మైనారిటీ | 79% |
SC | 15% |
ST | 6% |
APRJC CET 2025 పరీక్షకు సంబంధించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?




సిమిలర్ ఆర్టికల్స్
ఉపాధ్యాయ దినోత్సవ గొప్పతనం, విశిష్టతలను ఇక్కడ తెలుసుకోండి
NIRF టాప్ ర్యాంకింగ్ సంస్థలు 2025 , రాష్ట్రాల వారీగా ఉత్తమ 50 విద్యాసంస్థల వివరాలు
SBI PO ప్రిలిమ్స్ ఫలితాల 2025 తేదీ, అధికారిక విడుదల షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి
NIRF 2025 రీసెర్చ్ ర్యాంకింగ్‌లు, టాప్ రీసెర్చ్ యూనివర్సిటీలు & ఇన్స్టిట్యూట్లు ఇవే
విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్ (Independence Day Speech in Telugu)
ఆగస్ట్ 15 గొప్పతనం- భారత స్వతంత్రోద్యమం.. ముఖ్యమైన ఘట్టాలు