
స్వతంత్ర దినోత్సవం 2025పై తెలుగులో వ్యాసం, స్పీచ్ (Independence day 2025 Speech Essay in Telugu) : ఎందరో యోధుల త్యాగం, ఎంతోమంది కలల తీరం.. లెక్కలేనంతమంది వీరుల నినాదం, ఆంగ్లేయుల దమనకాండకు చరమగీతం.. భారత దేశ స్వతంత్రం. ఆగస్ట్ 15న మన దేశం బానిస సకెంళ్లను తెంచుకుని స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంది. రక్తపుటేరు పారించిన బ్రిటిష్ వాళ్ల ఆధిపత్యాన్ని తరిమికొట్టింది. ఇది "మా దేశం.. మా ఊపిరి.. మా హక్కు అంటూ.." నినదించి, పోరాడిన మహానుభావుల త్యాగఫలం మన స్వతంత్రం. ఇందుకే భారత స్వతంత్ర దినోత్సవం (Independence day 2025 Speech Essay in Telugu) ప్రజల పండుగగా మారింది. కుల, మతాలకు అతీతంగా ఆగస్ట్ 15 భారతీయులందరికి ఒక ముఖ్యమైన రోజు.
ముఖ్యమైన లింకులు:
భారత స్వతంత్ర దినోత్సవం రోజున ప్రతి స్కూలు, ప్రతి ఇల్లు, కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటాయి. పోరాటానికి చిహ్నంగా ఉండే మన జెండాలు ప్రతి వీధిలో గర్వంగా రెపరెపలాడతాయి. దేశ స్వతంత్రం కోసం.. పోరాడిన వీరుల స్మరణతో ప్రతి హృదయం నిండిపోతుంది.ఇందుకే ఆగస్ట్ 15 స్వతంత్సం దినోత్సవం గొప్పతనం గురించి కచ్చితంగా ప్రతి తరం.. తెలుసుకోవాలి. స్వేచ్ఛతో హాయిగా జీవిస్తున్న ఈ కాలం కోసం.. ఎందరు..తమ ప్రాణాలను పునాదిగా మార్చారో ఆ చరిత్రను అర్థం చేసుకోవాలి. ఈరోజును అనుభవిస్తున్న స్వతంత్రం.. నిరుపయోగం కాకుండా ఉండాలంటే.. అణచివేత నిండిన భారత స్వతంత్రం ఉద్యమం గురించి తరతరాలు చెప్పుకోవాలి. ఆగస్ట్ 15, 2025 భారతదేశ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా.. కొన్ని ఆసక్తికరమైన విషయాలను, స్వతంత్సోద్యమంలో మైలురాళ్లుగా ఉన్న ఘటనలను ఇక్కడ అందిస్తున్నాం.
ఈ ఏడాది థీమ్..
ఈ ఏడాది ఆగస్ట్ 15, 2025న మనం భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం మన గొప్ప చరిత్రను కచ్చితంగా మననం చేసుకోవాలి. మన దేశం ప్రాముఖ్యతను, ఔచిత్యాన్ని మరో తరానికి ప్రవహించేలా చేయాలి. ఈ సందర్భంగా మన స్వేచ్ఛ కేవలం ఒక చారిత్రక సంఘటన కాదని, ఇది ఒక బాధ్యత అని ప్రతి ఒక్కరి కర్తవ్యం అని గుర్తించుకోవాలి. ప్రతి పౌరుడు భారతదేశ అభివృద్ధి, శ్రేయస్సుకు దోహదపడాలని పిలుపునివ్వాలి. దీనికోసం భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దేశం నలుమూలల స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు కార్యక్రమాలను రూపొందించింది. MyGov.in ప్రకారం 2025 స్వాతంత్ర్య దినోత్సవం థీమ్ 'New India , Empowered India'. భారతదేశ పురోగతి, సాధికారతను ఈ థీమ్ నొక్కి చెబుతుంది.ఈ థీమ్ కింద దేశభక్తి, జాతీయ ఐక్యతను పెంపొందించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ, MyGov సహకారంతో వివిధ కార్యకలాపాలు, పోటీలను నిర్వహిస్తోంది. ఇందులో పెయింటింగ్ పోటీలు, వ్యాస రచన, ప్రసంగ పోటీలు, దేశభక్తి గీతం, నాటక ప్రదర్శనలు, పోస్టర్ తయారీ వంటి పోటీలు జరగనున్నాయి. అదే విధంగా ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా న్యూఢిల్లీలోని ఎర్రకోట దగ్గర గ్రాండ్ కవాతు ఉంటుంది. ప్రతి పాఠశాల, ప్రతి సంస్థలో జెండా ఆవిరష్కణ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతాయి.
భారత స్వంతంత్ర పోరాట చరిత్ర...
భారతదేశం .. ఇప్పడు గొప్ప ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందడానికి ఎన్నో ఉద్యమాలే కారణం. ఎందరో మహానుభావులు బ్రిటీష్ ఆధిపత్యంపై చేసిన తిరుగుబాటులే కారణం. అణచివేతకు వ్యతిరేకంగా ఎంతోమంది వీరులు తమ శరీరాలని, గొంతులను ఒక ఆయుధంగా మార్చారు. ఉరికి వేలాడారు, తూటాలకు బలైయ్యారు. ఈ దేశం కోసం రక్తతర్పణం చేశారు. భారత ప్రజలపై జరిగే దాడులను ఆపేందుకు ఎంతగానో పరితపించారు.. దారులు వేరైనా.. గమ్యం ఒక్కటిగా కదిలారు. అటువంటి వీరుల త్యాగాల చరిత్ర భారత దేశ యవనికపై విరాజిల్లుతుంది. 1857 నుంచి 1947 వరకు అనేక పోరాటాలు జరిగాయి. అన్ని కూడా స్వతంత్రం సాధించడానికి దోహదపడ్డాయి. భారతదేశ స్వతంత్రోద్యమంలో మొట్ట మొదటి చారిత్రక సంఘటనగా చెప్పాలంటే.. సిపాయి తిరుగుబాటు (Sipayi Tirugubatu) గురించి మాట్లాడుకోవాలి.సిపాయిల తిరుగుబాటు (Sipayi Tirugubatu History)
స్వతంత్ర పోరాటం.. సిపాయి తిరుగుబాటుతో మొదలైంది. 19వ శతాబ్దం చివరిలో భారత జాతీయవాదం ఆలోచన చిగుర్లు తొడిగింది. ఈ సందర్భంలో 1857 తిరుగుబాటు ప్రారంభమైంది. ఒక తిరుగుబాటుగా మొదలై విదేశీ ఆధిపత్యంపై వ్యతిరేకతను దేశవ్యాప్తంగా వ్యాపింపచేసింది. అయితే 1857 సిపాయి తిరుగుబాటు విజయవంతం కాలేదు కానీ ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర కాంక్షను రగిలించింది. భారతదేశంలో బ్రిటిష్ పాలనను అంతం చేయాలనే అంతిమ లక్ష్యానికి సిపాయి తిరుగుబాటు ఒక నాందిగా మారింది.సిపాయి తిరుగుబాటు మే 10, 1857న మీరట్‌లో ప్రారంభమైంది. తర్వాత ఢిల్లీ, ఆగ్రా, కాన్పూర్, లక్నో వరకు వ్యాపించింది. 1856లో బ్రిటీష్ వారు రాయల్ ఎన్‌ఫీల్డ్ తుపాకీని ప్రవేశపెట్టగా.. దీనికోసం వాడే తూటాల చివరి భాగాన్నీ నోటితో కొరికి ఉపయోగించాల్సి వచ్చేది. అయితే ఈ తూటాల చివర ఆవు, పంది కొవ్వు పూసినట్లు తెలియడంతో భారతీయ సిపాయిలు తూటాలను కొరకడాన్ని నిరాకరించారు. దీంతో తిరుగుబాటు ప్రారంభమైంది. దీనిని "జాతీయ తిరుగుబాటు", "ప్రథమ భారత స్వాతంత్రం సంగ్రామం"గా కూడా చరిత్రకారులు వర్ణించారు.
స్వదేశీ ఉద్యమం (Swadeshi Movement) - వందేమాతర ఉద్యమం
స్వదేశీ ఉద్యమం 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైంది. బ్రిటీష్ పాలనకు, వైఖరికి వ్యతిరేకంగా ఈ పోరాటం ఊపందుకుంది. స్వదేశీ ఉద్యమం విదేశీ వస్తువులను బహీష్కరించడం, దేశీయ వస్తువులను, పరిశ్రమలను పోత్సహించడమే లక్ష్యంగా సాగింది. బాల గంగాధర్ తిలక్, లాలాలజ్‌పత్‌రాయ్, బిపిన్ చంద్రపాల్ , అరబిందో ఘోష్ వంటి వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. భారత స్వతంత్ర పోరులో ఈ పోరాటం శక్తివంతంగా మారింది.హోమ్ రూల్ ఉద్యమం
భారత స్వరాజ్య సమరంలో1916 నంచి 1918 వరకు జరిగిన హోమ్ రూల్ ఉద్యమం గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే బెంగాల్ విభజన చట్టంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భారతీయులు బ్రిటీష్ రాజ్యంపై ఒక ఉప్పెనలా విరుచుకుపడ్డారు. ఆ ఉప్పెనే హోమ్‌రూల్ ఉద్యమం. దేశమంతటా వ్యాపించింది. కార్మికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమ సమయంలో బ్రిటీష్ పాలకులు క్రూర అణచివేత విధానాలను అవలభించారు. దీంతో అనేక మంది విప్లవ శంఖారావాన్ని పూరించారు. ఎంతమంది విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. సాయుధ తిరుగుబాటు చేశారు.సహాయ నిరాకరణ ఉద్యమం (Sahaya Nirakarana Udyamam History in Telugu)
భారత స్వతంత్ర పోరాటంలో భాగంగా 1920 నుంచి 1922 మధ్యకాలంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో 1920 సెప్టెంబరు 4న, భారత జాతీయ కాంగ్రెస్ (INC) ఈ పోరాటం ప్రారంభమైంది. రౌలత్ చట్టం, జలియన్ వాలా బాగ్ వంటి ఊచకోత వంటి బ్రిటిష్ చర్యలకు నిరసనగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. అయితే బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించకుండా, వారి పాలనను ఎదిరించడం ఈ ఉద్యమ లక్షణం. అహింసాయుత పద్ధతుల ద్వారా బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమికొట్టడమే ధ్యేయంగా ఎంతోమంది ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే 1922లో చౌరీచౌరా సంఘటన తర్వాత ఈ ఉద్యమం ముగిసింది.క్విట్ ఇండియా ఉద్యమం (Quit India Udyamam in Telugu)
భారత స్వతంత్ర ఉద్యమాల్లో క్విట్ ఇండియా ఉద్యమం కూడా చాలా ముఖ్యమైనది. ఈ ఉద్యమాన్ని ఆగస్ట్ ఉద్యమం అని కూడా అంటారు. 1942లో మహాత్మా గాంధీ స్వయంగా Do Or Die అనే నినాదంతో ఈ పోరాటానికి పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వారి పాలన నుంచి తక్షణమే విరమణ కోరుతూ ఈ పోరు సాగింది. అయితే ఇందులో ఎంతోమంది మహిళలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రతను బట్టి.. పలు ప్రాంతాల్లో నాయకులు జైలు పాలయ్యారు.స్వాతంత్య్రం అనేది మనకు వరంగా లభించిన పుణ్యం. ఈ వరాన్ని మనం కాపాడుకోవాలి, భవిష్యత్తు తరాలకు మరింత బలమైన, అభివృద్ధి చెందిన భారత్‌ను అందించాలి. కాబట్టి, మనం ఎప్పుడూ దేశభక్తి భావంతో, నిజాయితీతో జీవించి, “సత్యమేవ జయతే” అనే సిద్ధాంతాన్ని ఆచరిద్దాం.
జై హింద్
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?




సిమిలర్ ఆర్టికల్స్
ఉపాధ్యాయ దినోత్సవ గొప్పతనం, విశిష్టతలను ఇక్కడ తెలుసుకోండి
NIRF టాప్ ర్యాంకింగ్ సంస్థలు 2025 , రాష్ట్రాల వారీగా ఉత్తమ 50 విద్యాసంస్థల వివరాలు
SBI PO ప్రిలిమ్స్ ఫలితాల 2025 తేదీ, అధికారిక విడుదల షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి
NIRF 2025 రీసెర్చ్ ర్యాంకింగ్‌లు, టాప్ రీసెర్చ్ యూనివర్సిటీలు & ఇన్స్టిట్యూట్లు ఇవే
విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్ (Independence Day Speech in Telugu)
భారతీయ జెండా ప్రత్యేకతలు ఏమిటో తెలుసా? (Indian Flag History in Telugu)