తెలంగాణ ఇంటర్ 2026 ప్రాక్టికల్ పరీక్షలు మిస్ అయితే ఏమవుతుంది?

manohar

Published On:

TS ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష తేదీ షీట్ 2026 ను డిసెంబర్ 2025 లో విడుదల చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు  ఫిబ్రవరి 02 నుండి ప్రారంభమయ్యాయి. తేదీలు మరియు సమయాల గురించి అన్ని వివరాలు ఇక్కడ అందించబడతాయి. వ్యాసంలో వివరంగా పరిశీలించి మీ సబ్జెక్టులకు పరీక్ష తేదీని పొందండి

TS Intermediate Practical Exam Date Sheet 2026 - Check Telangana 12th Practical Dates

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు 2026 ముగిశాయి. సైన్స్, కామర్స్, ఆర్ట్ స్ట్రీమ్‌ల అన్ని సబ్జెక్టులు ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 02, 2026 నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి పరీక్షలో కనీసం 35 శాతం మార్కులు సాధించడం అవసరం. అయితే ఈ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను మిస్ అయితే ఏం జరుగుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతుంటారు. ప్రాక్టికల్ పరీక్షలు రాయకపోయినా.. థియరీ పరీక్షలు రాయవచ్చా? లేదా? అనే అనుమానాలు వాళ్లలో ఉంటాయి. ఇక్కడ ఇంటర్ ప్రాక్టీకల్ పరీక్షలకు హాజరు కాలేకపోతే ఏం జరుగుతుంది? విద్యార్థులు ఏం చేయాలనే వివరాలను ఇక్కడ అందించాం.
ముందుగా విద్యార్థులు ప్రాక్టీకల్ పరీక్షలు మిస్ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రాక్టీకల్స్‌ పరీక్షలు మిస్ అయిన థియరీ పరీక్షలకు హాజరు కావొచ్చు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులు నిరాశ చెందకుండా థియరీ పరీక్షల కోసం బాగా ప్రిపేర్ అవ్వాలి.

TS ఇంటర్ 2026 ప్రాక్టికల్ పరీక్ష మిస్ అయితే ఏమవుతుంది? (What happens if you miss TS Inter 2026 Practical Exams?)

తెలంగాణ స్టేట్ బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించే TS ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షకు హాజరు కాలేదంటే ఆ సబ్జెక్టులో విద్యార్థి ప్రతిభపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాక్టికల్ మార్కులు ఫైనల్ ఫలితాల్లో కీలక పాత్రను పోషిస్తాయి. కాబట్టి పరీక్ష మిస్ అయితే మొత్తం ఫలితం ప్రభావితం అవుతుంది. అందుకే ఒక వేళ
ఆరోగ్య సమస్యలేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రాక్టికల్ పరీక్షలు మిస్ అయితే విద్యరా్థఉలు వెంటనే సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ లేదా పాఠశాల నిర్వాహకులను సంప్రదించాలి. ఏ కారణంతో ప్రాక్టీకల్స్ మిస్ అయ్యారో దానికి సంబంధించిన అవసరమైన ధ్రువపత్రాలను సబ్మిట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో బోర్డు అనుమతితో రీ‑ప్రాక్టికల్ అవకాశం దొరకే ఛాన్స్ ఉంటుంది. కానీ అది పూర్తిగా అధికారుల నిర్ణయంపై ఆధారపడుతుంది. కొన్ని సందర్భాల్లో బోర్డు ప్రాక్టీకల్స్ మిస్ అయిన బ్యాచ్‌కు వేరే తేదీల్లో ప్రాక్టీకల్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంటుంది. కానీ ఇది బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఒక్కోసారి కాలేజీ ప్రిన్సిపాల్‌ని సంప్రదించి వివరాలను తెలియజేస్తే.. అతని అనుమతితో ఇతర బ్యాచ్‌లతో ప్రాక్టీకల్ పరీక్షలను పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రాక్టీకల్ పరీక్షలు మిస్ అయిన విద్యార్థులు నిరాశ చెందకుండా వెంటనే ఆయా అధికారులు, ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలి.
ఇలాంటి అవకాశాలు లేనప్పుడు.. థియరీ పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తారు. ఆ సమయంలో మళ్లీ ప్రాక్టీకల్ పరీక్షలను కూడా నిర్వహిస్తారు. అప్పుడు విద్యార్థులు ప్రాక్టీకల్ పరీక్షలను పూర్తి చేయవచ్చు.

TS ఇంటర్మీడియట్ ప్రాక్టీకల్ పరీక్షలను సులువుగా తీసుకుంటే ఏమవుతుంది?

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టీకల్ పరీక్షలకు చాలామంది విద్యార్థులు హాజరై ఉంటారు. ఈ ప్రాక్టీకల్స్ విద్యార్థులు సులువుగా తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కొన్ని కోర్సుల్లో ఈ ప్రాక్టికల్ పరీక్షల మార్కులు కీలకంగా ఉంటాయి. అలాంటి సబ్జెక్టుల్లో మార్కులు తగ్గిపోయి.. ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దీంతో మొత్తం గ్రేడ్ కావొచ్చు, పాయింట్లు, పర్సంటేజ్‌లు తగ్గిపోవచ్చు. అలాగే తర్వాత రాబోయే కొన్ని ప్రవేశ పరీక్షలకు ఇంటర్ మార్కులను మెయిన్‌గా చూడడం జరుగుతుంది. అలాంటప్పుడు ప్రాక్టీకల్స్ మార్కులు తక్కువైతే విద్యార్థులకు మైనస్ అవుతుంది. ఈ ప్రాక్టీకల్స్‌ సరిగ్గా పూర్తి చేయలేకపోతే అడ్వాన్సడ్ సప్లిమెంటరీకి వెళ్లాల్సి ఉంటుంది. దాంతో మార్కుల లిస్ట్‌లో సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైనట్టు వస్తుంది.

TS ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 2026లో మొత్తం మార్కులు సాధించగలమా? ఎలా సాధ్యమవుతుంది? (Can we get full marks in TS Inter Practical Exams 2026? How is it possible?)

తెలంగాణ స్టేట్ బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించే TS ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో పూర్తి మార్కులు సాధించడం సాధ్యమా? కాదా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే దీనికి సాధ్యమే అనే సమాధానం చెప్పుకోవచ్చు. కానీ అది క్రమబద్ధమైన సిద్ధత, స్పష్టమైన కాన్సెప్ట్ అవగాహన, ల్యాబ్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మార్కులు రికార్డ్ వర్క్, వైవా, ఎక్స్‌పెరిమెంట్ ఎగ్జిక్యూషన్, ప్రెజెంటేషన్ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. కాబట్టి విద్యార్థులు ముందుగానే అన్ని ప్రయోగాలను పూర్తిగా ప్రాక్టీస్ చేయాలి. రికార్డ్ బుక్‌ను శుభ్రంగా, పూర్తిగా నిర్వహించాలి. వైవా ప్రశ్నలకు ధైర్యంగా, స్పష్టంగా సమాధానాలు చెప్పేలా సిద్ధం కావాలి. ప్రతి దశలో జాగ్రత్తగా పనిచేసి సూచనలు కచ్చితంగా పాటిస్తేః TS ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో 2026లో ఫుల్ మార్కులు సాధించడం కష్టమైన విషయం కాదు, అది సాధించగల లక్ష్యమే.

TS ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష తేదీ 2026 (TS Inter Practical Exam Date 2026)

ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 2026 ప్రారంభమయ్యాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష తేదీ 2026 ఈ క్రింద ఇవ్వబడింది.

వివరాలు

తేదీలు

TS ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష తేదీ 2026 విడుదల

డిసెంబర్ 2025

TS ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష ( సైన్స్, కామర్స్ , ఆర్ట్స్ -విభాగాలు) తేదీ 2026

ఫిబ్రవరి 02, 2026

TS ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైన తేదీ

ఫిబ్రవరి 02, 2026

TS ఇంటర్ 2026 ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం సెషన్

ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు

మధ్యాహ్నం సెషన్ టైమింగ్

మధ్యాహ్నం 2:00 PM నుండి సాయంత్రం 5:00 PM గంటల వరకు

/articles/what-happens-if-you-miss-tg-inter-2026-practical-exams/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top