APPSC Group 2 Prelims Exam 2024 Question Paper: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నాపత్రం ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Rudra Veni

Updated On: February 25, 2024 04:11 PM

అభ్యర్థులు psc.ap.gov.inలోని అధికారిక పోర్టల్‌లో pdf ఫార్మాట్‌లో ప్రశ్నపత్రంతో (APPSC Group 2 Prelims Exam 2024 Question paper) పాటు APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 899 ఖాళీలను భర్తీ కోసం APPSC Group 2 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించడం జరిగింది. 
APPSC Group 2 Prelims Exam 2024 Question Paper: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్  పరీక్ష ప్రశ్నాపత్రం ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండిAPPSC Group 2 Prelims Exam 2024 Question Paper: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నాపత్రం ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 ప్రశ్నాపత్రం 2024 (APPSC Group 2 Prelimes Exam 2024 Question Paper) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను ఈరోజు, ఫిబ్రవరి 25, 2024న విజయవంతంగా నిర్వహించింది. APPSC గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వివిధ పరీక్షా కేంద్రాలలో ఒకే షిఫ్టులో జరిగింది. రాష్ట్ర‌వ్యాప్తంగా APPSC గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 1327 పరీక్షా కేంద్రాలలో ఆఫ్‌లైన్ మోడ్‌లో జరిగింది. APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2024 డ్రైవ్ కోసం మొత్తం 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 ప్రశ్నాపత్రం (APPSC Group 2 Prelimes Exam 2024 Question Paper)

అందుబాటులోకి రాగానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 ప్రశ్నాపత్రాన్ని ఈ దిగువున అందజేశాం. ఈ  దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి డైరక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈనాడు ప్రతిభ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 ప్రశ్నాపత్రం PDF


APPSC గ్రూప్ 2 ఆన్సర్ కీ 2024 త్వరలో అధికారిక వెబ్‌సైట్ psc.ap.govలోని అధికారిక పోర్టల్‌లో విడుదల చేయబడుతుందని గమనించాలి. APPSC గ్రూప్ 2 ప్రశ్న పత్రం 2024 (APPSC Group 2 Prelimes Exam 2024 Question Paper) కూడా ఆన్సర్ కీతో పాటు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి లాగిన్ ఆధారాలు లేకుండా అన్ని సెట్‌ల కోసం APPSC గ్రూప్ 2 ఆన్సర్ కీ 2024 pdfని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. APPSC Group 2 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత డైరక్ట్ ‌గా డౌన్‌లోడ్ చేసుకునే విధంగా ఇక్కడ అందజేస్తాం.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 ఎగ్జామ్‌పై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సబ్జెక్టులు ఈజీ నుంచి మోడరేట్‌గా ఉన్నాయని కొందరు అంటున్నారు. ముఖ్యంగా హిస్టరీ, జాగ్రఫీ ప్రశ్నలు సులభంగా ఉన్నాయని కొందరు అభిప్రాయపడ్డారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఓవర్ వ్యూ (APPSC Group 2 Prelims Exam 2024 Overview)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కు సంబంధించిన వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేశాం.

రిక్రూట్‌మెంట్ బాడీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఎగ్జామ్ పేరు APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్
ఖాళీల వివరాలు 899
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్లామ్ డేట్ 2024 ఫిబ్రవరి 25, 2024
ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్, మెయిన్స్ , కంప్యూటర్ టెస్ట్
అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ 2024 ద్వారా మొత్తం 899 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్ ఎగ్జామ్‌కు అర్హులవుతారు. అందుకే ఈ పరీక్ష అభ్యర్థులకు చాలా కీలకం అని చెప్పారు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/appsc-group-2-prelims-exam-2024-question-paper-pdf-download-here-50299/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy