
TS EDCET అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు 2023 (TS EDCET 2023 Application Form Correction): తెలంగాణ రాష్ట్ర EDCET 2023 దరఖాస్తు లింక్ మే ఒకటో తేదీతో ముగిసింది. అభ్యర్థులు ఇప్పటికే సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫార్మ్‌లో తప్పులను సవరించుకోవడానికి కరెక్షన్ విండో (TS EDCET 2023 Application Form Correction) ఈ వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దరఖాస్తు ఫార్మ్‌లో సమాచారాన్ని దిద్దుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ edcet.tsche.ac.inని సందర్శించి, ముగింపు తేదీకు ముందు అప్లికేషన్ ఫార్మ్‌లో తప్పులు దిద్దుకోవచ్చు.
TS EDCET అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు 2023 తేదీ (TS EDCET Application Form Correction 2023 Date)
పరీక్ష అధికారులు TS EDCET అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ 2023 తేదీని ఇంకా నిర్ధారించలేదు. అయితే ఎంట్రన్స్ పరీక్షను మే 18న షెడ్యూల్ చేసినందున, అభ్యర్థులు ఈ వారం దరఖాస్తు దిద్దుబాటు విండో మొదలయ్యే అవకాశం ఉంది. అంచనా తేదీలను ఈ దిగువన చెక్ చేయవచ్చు:
ఈవెంట్ | తేదీ |
---|---|
TS EDCET అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు ప్రారంభం | ఈ వారం (అంచనా) |
TS EDCET కోసం చివరి తేదీ అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు | ప్రకటించబడవలసి ఉంది |
TS EDCET 2023 పరీక్ష | మే 18, 2023 |
TS EDCET అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటుకు 2023 స్టెప్స్ (TS EDCET Application Form Correction 2023: Steps to Edit Application Form)
దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్ర EDCET 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని సవరించడానికి/సరిదిద్దడానికి ఈ దిగువ పేర్కొన్న సూచనలను అనుసరించవచ్చు:
TS EDCET అధికారిక వెబ్‌సైట్‌ను www.edcet.tsche.ac.in సందర్శించాలి
హోంపేజీలో 'TS EDCET అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ 2023' లింక్‌పై క్లిక్ చేయాలి.
అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
సూచనలను పరిశీలించి అవసరాలకు అనుగుణంగా సంబంధిత ఫీల్డ్‌లలో మార్పులు చేయడానికి ముందుకు కొనసాగాలి.
అన్ని వివరాలను ధ్రువీకరించి, అసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు దిద్దుబాటు తేదీపై లేటెస్ట్ ప్రకటన కోసం దరఖాస్తుదారులు TS EDCET వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండాలని సూచించారు. దరఖాస్తు దిద్దుబాటు విండోను క్లోజ్ చేసిన తర్వాత అభ్యర్థులు ఇకపై ఆన్‌లైన్ ఫార్మ్‌లోని సమాచారానికి ఎటువంటి మార్పులు చేయలేరు.
ఎంట్రన్స్ పరీక్షలు, బోర్డులు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని
Education News
కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID ద్వారా news@collegedekho.com మమ్మల్ని సంప్రదించవచ్చు.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



