AP ECET ఫలితం 2024 విడుదల తేదీ (AP ECET Result Release Date 2024) : ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ AP ECET పరీక్ష 2024ని మే 8న నిర్వహించింది. కౌన్సిల్ అధికారికంగా ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ విడుదల తేదీని ప్రకటించినప్పటికీ ఫలితాల ప్రకటన అధికారిక తేదీని ఇంకా వెల్లడించలేదు. మునుపటి సంవత్సరాల ట్రెండ్‌ల ప్రకారం AP ECET ఫలితాలు (AP ECET Result Release Date 2024) సాధారణంగా పరీక్ష తర్వాత 12 రోజులలోపు విడుదలవుతాయి. AP ECET 2024 ఫలితాల ప్రకటన మే 20, 2024 నాటికి లేదా ఆ తర్వాత జరిగే అవకాశం ఉంది. అయితే అధికారికం ఫలితాల ప్రకటనకు 1 రోజు ముందు తేదీ APSCHE ద్వారా నిర్ధారించబడుతుంది.
AP ECET ఫలితాల విడుదల తేదీ 2024: గత సంవత్సరాల ట్రెండ్‌లు (AP ECET Result Release Date 2024: Previous Years Trends)
అధికారిక తేదీ వెలువడనందున, ఫలితాల ప్రకటన తేదీ, సమయాన్ని మాత్రమే అంచనా వేయవచ్చు. దిగువ పట్టికలో ఇవ్వబడిన మునుపటి సంవత్సరాల ఆధారంగా ఫలితాల తేదీలు ఇక్కడ అందించాం.
AP ECET సంవత్సరం | పరీక్ష తేదీ | ఫలితాల విడుదల తేదీ | గ్యాప్ డేస్ |
---|---|---|---|
2024 | మే 8, 2024 | మే 20, 2024 (అంచనా) | 12 రోజులు |
2023 | జూన్ 20, 2023 | జూలై 2, 2023 | 12 రోజులు |
2022 | జూలై 22, 2022 | ఆగస్టు 10, 2022 | 18 రోజులు |
2021 (కోవిడ్ సంవత్సరం) | సెప్టెంబర్ 19, 2021 | అక్టోబర్ 1, 2021 | 12 రోజులు |
ఇది కూడా చదవండి |
AP ECET రెస్పాన్స్ షీట్ విడుదల తేదీ, సమయం 2024
అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితం షేర్ చేయబడిన తర్వాత, అభ్యర్థులు తమ AP ECET స్కోర్‌కార్డ్‌లను చెక్ చేసి దానికగుణంగా తమ భవిష్యత్తును నిర్ణయించుకోవచ్చు. AP ECET స్కోర్‌లు కౌన్సెలింగ్ ప్రక్రియలో అభ్యర్థుల స్థానాన్ని నిర్ణయిస్తాయి. విడుదల చేసిన తర్వాత రిజల్ట్ కార్డ్‌లో చెక్ చేయడానికి ముఖ్యమైన వివరాలను చెక్ చేయండి:
- దరఖాస్తుదారు పేరు
- సంరక్షకుడు/తల్లిదండ్రుల పేరు
- జెండర్
- పుట్టిన తేది
- పరీక్ష తేదీ
- మార్కులు/స్కోర్లు
- ర్యాంక్ (మొత్తం మరియు కేటగిరీ వారీగా)
పైన పేర్కొన్న వివరాల్లో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే, వాటిని వీలైనంత త్వరగా APSCHE వెబ్‌సైట్ హెల్ప్‌డెస్క్‌కు నివేదించాలి. దరఖాస్తుదారులు కౌన్సెలింగ్ ప్రక్రియలో భవిష్యత్తు సూచన కోసం వారి AP ECET ఫలితాల కార్డ్ 2024ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.