
ఏపీ ఆన్‌లైన్ డిగ్రీ అడ్మిషన్ 2023 (AP Online Degree Admission 2023):
ఏపీలోని ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఉన్నత చదువుల కోసం కొందరు ప్రవేశ పరీక్షలకు ప్రీపేర్ అవుతుంటే మరికొందరు డిగ్రీలో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌లో మంచి మార్కులతో పాసైన విద్యార్థులు తమ అభిరుచికి తగ్గట్టుగా బీఏ, బీకామ్, బీఎస్సీలో (AP Online Degree Admission 2023) చేరవచ్చు. తమకు నచ్చిన కాలేజీలను ఎంచుకుని గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయవచ్చు. దీనికోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా కాలేజీలకు వెళ్లినా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని విద్యార్థులు గుర్తించాలి. డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో అందజేయడం జరిగింది.
కళాశాలల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు
https://oamdc.ap.gov.in/
లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ విద్యాశాఖ బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్ ఎంట్రీకి అవకాశం కల్పించింది. అర్హత గల విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ కోసం https://oamdc.ap.gov.inకు లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో ఇంటర్ చదివిన విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేసి తల్లిదండ్రుల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర బోర్డులు దాటిన వారు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సహాయ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది.
ఏపీ డిగ్రీ అడ్మిషన్ 2023 షెడ్యూల్ (AP Degree Admission 2023 schedule)
ఏపీ డిగ్రీ అడ్మిషన్ 2023కు సంబంధించిన పూర్తి షెడ్యూల్, ముఖ్యమైన వివరాలు ఈ దిగువున తెలియజేశాం.ఏపీ డిగ్రీ అడ్మిషన్ 2023 నోటిఫికేషన్ | తెలియాల్సి ఉంది |
---|---|
విద్యార్థుల రిజిస్ట్రేషన్ | తెలియాల్సి ఉంది |
ఏపీ డిగ్రీ అడ్మిషన్ 2023 వెబ్ ఆప్షన్లు | తెలియాల్సి ఉంది |
ఏపీ డిగ్రీ అడ్మిషన్ 2023 స్పెషల్ కేటగిరి వెరిఫికేషన్ | తెలియాల్సి ఉంది |
ఏపీ డిగ్రీ సీట్ అలాట్‌మెంట్ 2023 | తెలియాల్సి ఉంది |
కాలేజీల్లో విద్యార్థుల రిపోర్టింగ్ | తెలియాల్సి ఉంది |
తరగతులు ప్రారంభం | తెలియాల్సి ఉంది |
ఏపీ డిగ్రీ అడ్మిషన్ 2023 దరఖాస్తు విధానం (AP Degree admission 2023 Apply Online Procedure)
డిగ్రీలో అడ్మిషన్ కోసం ఆన్‌లైన్‌లో చాలా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ విధానం ఐదు స్టెప్స్‌లో ఉంటుంది.- ప్రీ రిజిస్ట్రేషన్, ఫీజు పేమంట్
- అప్లికేషన్ ఐడీ, పాస్ వర్డ్ జనరేట్
- విద్యార్తులు వివరాల ఎంట్రీ, కన్ఫర్మేషన్
- సర్టిఫికెవట్ వెరిఫికేషన్, మెరిట్ లిస్ట్ జనరేషన్, వెబ్ ఆప్షన్లు
- సీట్ అలాట్‌మెంట్, అడ్మిసన్ కన్ఫర్మేషన్
ఏపీలో డిగ్రీ 2023 అడ్మిషన్ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? How to Apply for Degree 2023 Admissions in AP?
ఏపీలోని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో బీఏ, బీకామ్, బీఎస్సీల్లో అడ్మిషన్లు పొందడానికి అభ్యర్థులు ముందుగా సంబంధిత వెబ్‌సైట్ https://oamdc.ap.gov.inలోకి వెళ్లాలి. హోంపేజీలోని ఆన్‌లైన్ దరఖాస్తు ఫార్మ్‌పై క్లిక్ చేయాలి. మొదట విద్యార్థులు లాగిన్ ఆధారాలను పొందడానికి, తర్వాతి ప్రక్రియ కోసం యాక్సెస్ చేయడానికి దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ కేటగిరికి చెందిన విద్యార్థులు అంటే ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారు రూ.100లు, జనరల్ అభ్యర్థులు రూ.200లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులు డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ముందు రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, సంతకం ఇమేజ్‌ని దగ్గర ఉంచుకోవాలి.- వెబ్‌సైట్‌లో మొదట ప్రీ-రిజిస్ట్రేషన్ బటన్‌పై క్లిక్ చేసి, రిజిస్టర్‌పై క్లిక్ చేయాలి
- తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యలో అర్హత సాధించిన విద్యార్థులు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌ని ఎంచుకుని, హాల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
- విద్యార్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే మొబైల్ నెంబర్లను నమోదు చేయాలి. భవిష్యత్తులో కమ్యూనికేషన్ కోసం ఈ నెంబర్ ఉపయోగించబడుతుంది
- విద్యార్థులు తమ రిజర్వేషన్ కేటగిరిని ఎంచుకోవాలి.
- దరఖాస్తు ఫీజు రిజర్వేషన్ కేటగిరీపై ఆధారపడి ఉంటుంది (మొత్తం స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది).
- క్యాప్చాను నమోదు చేసి, చెల్లింపుకు వెళ్లుపై క్లిక్ చేయాలి.
- దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత భవిష్యత్ ఉపయోగం కోసం దాని హార్డ్ కాపీని తీసుకోండి
ఏపీ డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్‌కు కావాల్సిన పత్రాల జాబితా ( Required Documents for AP Degree Online Admission 2023)
ఏపీ డీగ్రీ అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన పత్రాలను ఈ దిగువున ఇవ్వడం జరిగింది.- పదో తరగతి మార్కుల లిస్ట్
- ఇంటర్మీడియట్ మార్కుల లిస్ట్
- ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్లు
- కుల ధ్రువీకరణ పత్రం
- ఆదాయ ధ్రువీకరణ పత్రం/రేషన్ కార్డ్,
- ఆర్థికంగా బలహీనమైన విభాగం (EWS) సర్టిఫికెట్
- ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్
- నివాస ధ్రువీకరణ పత్రం.
- ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్
- అభ్యర్థి దరఖాస్తు వివరాలను ఆన్‌లైన్‌లో పూరించి, వెబ్ ఆప్షన్‌లను అమలు చేస్తే తప్ప సీటు కేటాయింపు కోసం పరిగణించబడడు. ప్రతి జిల్లాలో కనీసం 4 హెల్ప్‌లైన్ కేంద్రాలు ఉంటాయి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?




సిమిలర్ ఆర్టికల్స్
TS DEECET 2025 Exam Dates: తెలంగాణ డీసెట్ 2025 పరీక్ష తేదీ, రిజిస్ట్రేషన్, సిలబస్, రిజల్ట్స్, కౌన్సెలింగ్
తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ గెస్ పేపర్ 2025 (TS Inter 2nd Year Guess Papers 2025)
TS TET 2024 పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డ్, ఫలితాల పూర్తి వివరాలు (TS TET 2024 Exam Dates)
ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ 2024 రిలీజ్ (AP DSC 2024 Syllabus), పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సీటెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (CTET July Application Form 2023) ఇవే
CTET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (CTET 2024 Application Form Correction)