AP ICET 2024 Application Form: ఏపీ ఐసెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్‌ కరెక్షన్ విధానం, ముఖ్యమైన తేదీలు

Rudra Veni

Updated On: March 06, 2024 02:45 PM

AP ICET 2024 దరఖాస్తు ఫార్మ్‌ను  (AP ICET 2024 Application Form)  పూరించేటప్పుడు పొరపాటు జరిగిందా? AP ICET 2024 కోసం ఫార్మ్ కరెక్షన్ విండోలో వివరాలను ఎలా కరెక్షన్ చేయగలరో ఇక్కడ చూడండి. 

logo
AP ICET Application Form Correction

ఏపీ ఐసెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ (AP ICET 2024 Application Form): AP ICET 2024 దరఖాస్తు ఫార్మ్ దిద్దుబాటు విండో cets.apsche.ap.gov.inలో ఏప్రిల్ 28, 2024న యాక్టివేట్ అవుతుంది. అభ్యర్థులు మార్పులు చేయడానికి లేదా ఎడిట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అభ్యర్థి తమ దరఖాస్తు ఫార్మ్‌లో పొరపాటు చేసినట్లయితే, వారు ఈ విండోలో దిద్దుబాట్లు చేయవచ్చు. AP ICET 2024 దరఖాస్తు‌లో రెండు కేటగిరీల అంశాలు ఉన్నాయి - కేటగిరి 1, కేటగిరి 2.

AP ICET 2024 పరీక్ష కోసం నమోదు ప్రక్రియ మార్చి 6, 2024న ప్రారంభమైంది. ఏప్రిల్ 7, 2024 వరకు కొనసాగుతుంది.  AP ICET 2024 పరీక్ష మే 6 & 7, 2024న నిర్వహించబడుతుంది. కేటగిరీ 1‌లో అంశాలను కరెక్షన్ చేసుకోవడానికి అభ్యర్థులు AP ICET హెల్ప్‌డెస్క్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కేటగిరి 2లో అంశాలను AP ICET ఫార్మ్ కరెక్షన్ విండోలో ఆన్‌లైన్‌లో సరిదిద్దవచ్చు. AP ICET కన్వీనర్ పరీక్ష కోసం ఫార్మ్ దిద్దుబాటు ప్రక్రియను నిర్వచించారు. అధికారిక సంస్థ ద్వారా పేర్కొన్న AP ICET 2024 దరఖాస్తు ఫార్మ్ దిద్దుబాటు ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడ అందించబడ్డాయి. ముఖ్యమైన తేదీలు, వివరణాత్మక దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు ప్రక్రియ, ఇతర వివరాలను ఇక్కడ చెక్ చేయండి.

ఏపీ ఐసెట్ అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ 2024 డైరక్ట్ లింక్ (AP ICET Application Form Correction 2024 Direct Link)

AP ICET దరఖాస్తు ఫార్మ్‌ను సవరించాలనుకునే అభ్యర్థులు దిగువ పేర్కొన్న లింక్‌ను సందర్శించడం ద్వారా అలా చేయవచ్చు.

AP ICET అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ 2024 - డైరక్ట్ లింక్

ఏపీ ఐసెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ తేదీలు (AP ICET 2023 Application Form Correction Dates)

ఏపీ ఐసెట్ అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ విండో ముందుగా తెరవబడుతుంది. ఏపీ ఐసెట్ కరెక్షన్ విండోకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఇక్కడ చెక్ చేసుకోండి.

ఈవెంట్

తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం మార్చి 06, 2024

ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ

ఏప్రిల్ 7, 2024

రూ.1000ల ఆలస్య రుసుముతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ రెండో వారం, 2024

రూ. 2,000/-ఆలస్య రుసుముతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్

మే మొదటి వారం, 2024

రూ. 3,000/- ఆలస్య రుసుముతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ

మే రెండో వారం, 2024

రూ. 5,000/- ఆలస్య రుసుముతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ

మే రెండో వారం, 2024

AP ICET 2024 అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు విండో తెరవబడుతుంది

మే మూడో వారం, 2024

AP ICET 2024 ఎగ్జామ్ డేట్

మే 6, 7, 2024

ఏపీ ఐసెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ - కేటగిరీ 1, కేటగిరీ 2 (AP ICET 2024 Application Form Correction - Category 1 and Category 2)

Add CollegeDekho as a Trusted Source

google

పైన పేర్కొన్న విధంగా AP ICET అప్లికేషన్ ఫార్మ్‌లో రెండు రకాల అంశాలు లేదా ఫీల్డ్‌లు ఉన్నాయి. ఈ కేటగిరీలు ఒక అంశాన్ని అభ్యర్థి నేరుగా సవరించవచ్చా లేదా అనేది నిర్వచిస్తుంది. ఈ రెండు వర్గాల డీటెయిల్స్ ఈ దిగువు ఇవ్వడం జరిగింది.

AP ICETలో కేటగిరి 1 అంశాలు అప్లికేషన్ ఫార్మ్ 2024 (Category 1 Items in AP ICET Application Form 2024)

ఏపీ ఐసెట్‌ కేటగిరి 1లోని అంశాలు నేరుగా కరెక్ట్ చేయడం అవ్వదు.  ఈ అంశాలను కరెక్ట్ చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ మెయిల్ ద్వారా రాత పూర్వక అభ్యర్థనను అందించాలి. వివరణాత్మక ప్రక్రియని ఈ దిగువున అందజేయడం జరిగింది.

అంశం

కరెక్షన్ కోసం అవసరమైన పత్రం

అభ్యర్థి పేరు

పదో తరగతి మార్క్ షీట్

పుట్టిన తేదీ

తండ్రి పేరు

సంతకం

స్కాన్ చేసిన సంతకం

ఫోటో

పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

సంఘం/ రిజర్వేషన్ వర్గం

సమర్థ సంస్థ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్

అర్హత పరీక్ష హాల్ టికెట్ నెంబర్

అర్హత పరీక్ష హాల్ టికెట్

ఏపీ ఐసెట్ దరఖాస్తు ఫార్మ్‌ 2024లోని కేటగిరి 2  అంశాలు: ఈ కేటగిరిలోని అంశాలను అభ్యర్థులు ఆన్‌లైన్ ఫార్మ్ కరెక్షన్ విండో ద్వారా అభ్యర్థులు నేరుగా సరిదిద్దుకోవచ్చు.

జెండర్

తల్లి పేరు

మొబైల్ నెంబర్

ఈ మెయిల్ ID

ఆధార్ కార్డ్ & EWS డీటెయిల్స్

ప్రత్యేక రిజర్వేషన్ వర్గం

తల్లిదండ్రుల వార్షిక ఆదాయం

స్థానిక ప్రాంతం స్థితి

పరీక్ష రకం

అర్హత పరీక్షలో హాజరైన/ ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం

క్లాస్ 12వ/ గ్రాడ్యుయేషన్ చదువుతున్న ప్రదేశం

ఇంటర్/ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్

క్లాస్ 10వ హాల్ టికెట్ నంబర్

పుట్టిన రాష్ట్రం, జిల్లా

సంప్రదించాల్సిన చిరునామా

మైనారిటీ/నాన్-మైనారిటీ హోదా

అర్హత పరీక్షలో బోధనా మాధ్యమం

ఏపీ ఐసెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు ప్రక్రియ (AP ICET 2024 Application Form Correction Process)

ఏపీ ఐసెట్ 2024 కోసం  అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ ప్రక్రియ కేటగిరీ 1, కేటగిరీ 2లకు వేరు వేరుగా ఉంటుంది.

కేటగిరి 1 అంశాలకు సంబంధించిన ఫార్మ్ దిద్దుబాటు ప్రక్రియ ( Form Correction Process for Category 1 Items)

  1. అభ్యర్థి తప్పనిసరిగా ఈ మెయిల్ ద్వారా రాత పూర్వకంగా తప్పనిసరిగా పంపించాలి. కరెక్షన్ విండో ఓపెన్ అయిన తర్వాత అధికారులు సంబంధిత మెయిల్‌ ఐడీని అభ్యర్థులకు తెలియజేయడం జరుగుతుంది.

  2. అభ్యర్థులు తాము కరెక్ట్ చేయాలనుకుంటున్న అంశాల గురించి రాయడమే కాకుండా అవసరమైన సర్టిఫికెట్లను, డాక్యుమెంట్లను కూడా జత చేయాలి.

  3. అభ్యర్థుల సర్టిఫికెట్లను, డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి, కమిటీ ఆమోదం పొందిన తర్వాత కన్వీనర్ ద్వారా అప్లికేషన్‌లో సవరణలు జరుగుతాయి.

కేటగిరి 2 అంశాలకు సంబంధించిన ఫార్మ్ దిద్దుబాటు ప్రక్రియ (Form Correction Process for Category 2 Items)

  1. అభ్యర్థి తప్పనిసరిగా AP ICET 2024 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, ఫార్మ్ కరెక్షన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

  2. తర్వాత అభ్యర్థిని పేజీలో అడిగిన విధంగా వారి డీటెయిల్స్ నమోదు చేసి లాగిన్ అవ్వాలి.

  3. తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫార్మ్‌లోని కేటగిరీ 2 అంశాలలో దేనినైనా కరెక్ట్ చేయగలుగుతారు.

  4. కరెక్ట్ చేసిన తర్వాత అభ్యర్థి తప్పనిసరిగా ఫార్మ్‌ని సబ్మిట్ చేయాలి.

  5. అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్ అయ్యే సమయంలో మాత్రమే కేటగిరి 2 అంశాల్లోని కరెక్ట్ చేయవచ్చు. ఎప్పుడుబడితే అభ్యర్థులు ఏదైనా పరీక్షా కేంద్రం, ప్రాంతీయ కేంద్రాల్లో కరెక్ట్ చేసుకోలేరు.


మీకు ఏవైనా సందేహాలు ఉంటే, వాటిని CollegeDekho QnA Zone లో పోస్ట్ చేయండి. అడ్మిషన్లకు సంబంధించి సహాయం కోసం, మా హెల్ప్‌లైన్ నెంబర్ 18005729877కు కాల్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ap-icet-application-form-correction/

Related Questions

Are the hostels of Quantum University good?

-AshishUpdated on December 13, 2025 10:56 AM
  • 17 Answers
Shweta Kumari, Student / Alumni

Hostels are very well furnished and quiet affordable for students belongs to middle class families. Food is also full of variety and good in taste. Sharing rooms with free wi-fi facility, gym, laundry with many more facilities like sports too.

READ MORE...

How is the placement record of Quantum University?

-surajUpdated on December 13, 2025 11:21 AM
  • 31 Answers
Shweta Kumari, Student / Alumni

Quantum university offers a good placement ratio of 85% batch getting placed through campus placement and the highest package is 33LPA for last year. So a good option for your higher studies.

READ MORE...

How can I get seat in hostel

-Saroj kumar jenaUpdated on December 13, 2025 07:21 AM
  • 1 Answer
Ashish Aditya, Content Team

Dear student, The MPC Autonomous College does offer hostel accommodation for students. There are separate accommodations for male and female candidates. The hostel buildings are located inside the college campus. To get a seat in the MPC Autonomous College hostel you must fill the hostel requirement form and submit it to the college principal. The hostel rooms will be allotted by the principle only.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy