AP ఇంటర్ 1వ సంవత్సరం తెలుగు 6 మార్కుల ముఖ్య ప్రశ్నలను ఒకే చోట టేబుల్ రూపంలో అందించాము. పద్య, గద్య, నాన్-డిటైల్ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నలను ఈ క్రింది ఆర్టికల్ లో చూసి ప్రాక్టీస్ చేయండి.

AP ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్ష సమయం దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థుల్లో చాలామందికి ఒకే సందేహం ఉంటుంది. “తెలుగు పేపర్‌లో పూర్తి 100 మార్కులు సాధించగలమా? అధి సాధ్యమవుతుందా?” అని. అయితే తెలుగు సబ్జెక్ట్ సులభమే అనిపించినప్పటికీ సరైన విధంగా ప్రిపేర్ కాకపోతే మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. తెలుగు పేపర్ మొత్తం 100 మార్కులుగా ఉంటుంది. ఇందులో A, B, C సెక్షన్లు ఉంటాయి. ఎక్కువ మంది టెన్షన్ పడే భాగం 6 మార్కుల ప్రశ్నలు. ఇవి కేవలం పాఠం చదివి రాయడం మాత్రమే కాదు, సరైన క్రమం, స్పష్టమైన భావం, సులభమైన భాషలో వివరణ ఇవ్వడం చాలా ముఖ్యం.
తెలుగు సిలబస్‌లోని పద్య, గద్య, నాన్-డీటైల్ అనే మూడు విభాగాల నుంచి ఈ 6 మార్కుల ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. ప్రతీ భాగానికి సమాధానం రాసే విధానం కొంచెం భిన్నం. పద్య భాగంలో సందర్భం, భావం, కవి ఉద్దేశ్యం వివరించాలి. గద్య భాగంలో ముఖ్యాంశాలు, సారాంశం స్పష్టం చేయాలి. నాన్-డీటైల్‌లో కథ ప్రధాన భావం, సందేశం, నీతి చెప్పాలి. ఈ పద్ధతిలో పైన చెప్పిన అంశాలపై క్రమబద్ధంగా ప్రాక్టీస్ చేస్తే 90 నుంచి 100 మార్కుల వరకు సాధించగలరు. విద్యార్థులకై ఈ మూడు భాగాలకు సంబంధించిన ముఖ్య 6 మార్కుల ప్రశ్నలను ఈ కింద టేబుల్లో అందించాం. ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి.
AP ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు 6 మార్కుల ముఖ్య ప్రశ్నలు పద్య, గద్య, నాన్- డీటైల్ భాగాల వారి పూర్తి టేబుల్ (AP Inter 1st Year Telugu 6 Marks Important Questions Complete Table of Verse, Prose, Non-Detail Sections)
AP ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు కోసం పద్య, గద్య, నాన్- డీటైల్ మూడు భాగాల నుంచి వచ్చే ముఖ్యమైన 6 మార్కుల ప్రశ్నలను ఈ దిగువున ఇచ్చిన టేబుల్ రూపంలో అందించాం. ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి.
క్రమ సంఖ్య | పద్య భాగం | గద్య భాగం | నాన్ - డీటైల్ |
|---|---|---|---|
1 | తను హృద్భాషల - సత్యంబు దైత్యోత్తమా. | కర్ణుని రూప రేఖలు పరాక్రమము వివరించండి. | దుర్గాబాయి దేశముఖ జీవిత చరిత్రను తెలియజేయండి. |
2 | ఆపదలందు ధైర్యగుణ - సజ్జనాళికిన్. | వేములపల్లి శ్రీకృష్ణ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలపాలన్నాడు ? | దారికడ్డంగా పడుకున్న పులి వృత్తాంతమును వివరించండి. |
3 | సాలప్రాంకు ప్రభూతాశ్చర్యులై రచ్చటన్ | ప్రహ్లాదుని విద్యాభ్యాస వృత్తాంతాన్ని వివరించండి. | స్త్రీ జనోద్ధరణకు కందుకూరివారు చేసిన కృషిని తెల్పండి. |
4 | జలముల నగ్ని, .... మూర్ఖత మాన్పవచ్చునే! | సంక్రాంతి పండుగ మానవాళికిచ్చే సందేశాన్ని విశ్లేషించండి. | తెలుగు భాషా విశిష్టతను వివరించండి. |
5 | బసవేశ్వరుని పెండ్లి ఆధారంగా ఆంధ్రుల వివాహ వేడుకలను వివరించండి. | మిత్ర భేదం పాఠ్యభాగం ద్వారా తెలియ వచ్చే నీతిని వివరించండి. | సాత్విక భావాలను వివరించండి. |
6 | ఎన్నోయేండ్లు గతించి పాషాణముల్! | చిత్రకళలు అంటే ఏమిటి ? వాటి స్వరూప స్వభావాలను గురించి వివరించండి. | హాస్యం యొక్క లక్షణాలను తెలపండి. |
7 | అన్నమయ్య సంకీర్తన లోని సారాంశాన్ని వివరించండి. | పొడుపు కథల పుట్టుక, వ్యాప్తి గురించి వివరంగా రాయండి. | యార్లగడ్డ తెలియజేసిన ఏవేని నాలుగు ముఖ్యమైన పదాలను వివరించండి. |
8 | జనులు నుతింపగా - - నీకు నర్హమే. | తిన్నడు శివుణ్ణి తన ఊరికి రమ్మని పిలిచిన విధానాన్ని వ్రాయండి. | పావురాలు వలలో తగులుకున్న విధం తెల్పండి. |
AP ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగులో 6 మార్కుల ప్రశ్నకు ఎంత లెంగ్తీలో సమాధానాన్ని రాయాలి? (How long should the answer for AP Inter 1st year Telugu, 6 marks be written?)
AP ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగులో 6 మార్కుల ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు సాధారణంగా రెండు తప్పులు జరుగుతాయి. చాలా చిన్నగా రాయడం లేదా అవసరానికి మించి పెద్దగా రాయడం. నిజంగా 6 మార్కుల జవాబు సుమారు 10 నుంచి 15 పంక్తుల వరకు, అంటే ఒక మధ్యస్థ పేరాగ్రాఫ్ పరిమాణంలో ఉండాలి. సమాధానం రాసేటప్పుడు మొదట సందర్భం లేదా పరిచయాన్ని చిన్నగా చెప్పి తర్వాత ప్రధాన భావం, ముఖ్యాంశాలు క్లియర్‌గా వివరించి, చివరగా ఒక చిన్న ముగింపు వాక్యం పెట్టాలి. పద్యంలో భావం, కవి ఉద్దేశ్యం తప్పనిసరిగా ఉండాలి, గద్యంలో ముఖ్యాంశాలు, సారాంశం ఉండాలి, నాన్-డీటైల్‌లో కథ సందేశం, నీతి స్పష్టం చేయాలి. ఇలా క్రమంగా సులభమైన భాషలో రాస్తే పూర్తిగా 6 మార్కులు పొందడం చాలా సులభం.
AP ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్ష కోసం సమయాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? (How to plan time for AP Inter 1st year Telugu exam?)
AP ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి చదివితే సరిపోదు.. పరీక్షలో సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. మొత్తం పరీక్షకి 3 గంటలు ఉండటంతో అందుకే మొదటి 10 నుంచి 15 నిమిషాలు ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదవడానికి కేటాయించడం మంచిది. సులభంగా వచ్చే ప్రశ్నలను ముందుగా ప్రయత్నించాలి. తర్వాత ఎక్కువ సమయం తీసుకునే 6 మార్కుల ప్రశ్నలకు సరిపడా సమయం కేటాయించండి. సాధారణంగా ప్రతి 6 మార్కుల ప్రశ్నకు 8 నుంచి 10 నిమిషాలకంటే ఎక్కువ సమయం తీసుకోవద్దు. సమాధానాలను స్పష్టంగా, పద్ధతిగా, అవసరమైన పొడవులోనే రాయండి. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. మార్కులు కూడా సులభంగా వస్తాయి. చివరికి కనీసం 10 నిమిషాలు మిగిల్చుకుని రాసిన సమాధానాలను ఒకసారి చూసి చిన్న తప్పులను సరిచేస్తే మంచి ఫలితం సాధించవచ్చు.
AP ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్షలో మంచి మార్కులు పొందడం చాలా సాధ్యమే. పద్య, గద్య, నాన్-డిటైల్ భాగాలను బాగా అర్థం చేసుకుని, 6 మార్కుల ప్రశ్నలకు సరైన రీతిలోసులభమైన భాషలో సమాధానాలు రాయడం అలవాటు చేసుకోండి. సమయాన్ని బాగా ప్లాన్ చేసి, చివరి రోజుల్లో ముఖ్యమైన ప్రశ్నలను రివైజ్ చేస్తే తెలుగు పేపర్‌లో 90–100 మార్కులు సాధించటం పూర్తిగా సాధ్యమే.














సిమిలర్ ఆర్టికల్స్
AP ఇంటర్ 2వ సంవత్సరం కెమిస్ట్రీ ముఖ్యమైన 8 మార్కుల ప్రశ్నల జాబితా 2026
AP ఇంటర్ 1వ సంవత్సరం కెమిస్ట్రీ ముఖ్యమైన 8 మార్కుల ప్రశ్నల జాబితా 2026
తెలంగాణ ఇంటర్ 2026 ప్రాక్టికల్ పరీక్షలు మిస్ అయితే ఏమవుతుంది?
TG TET టాపర్స్ లిస్ట్ 2026 పేపర్ 1, 2 : జిల్లాల వారీగా టాప్‌లో నిలిచిన అభ్యర్థుల వీళ్లే
TG TET ఫలితాలు 2026 వచ్చేశాయ్, డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండి
TG TET హాల్ టికెట్ 2026 డౌన్లోడ్ లింక్, సబ్జెక్టుల వైజుగా పరీక్ష షెడ్యూల్