AP ఇంటర్ 2వ సంవత్సరం కెమిస్ట్రీ ముఖ్యమైన 8 మార్కుల ప్రశ్నల జాబితా 2026

manohar

Published On:

AP ఇంటర్ 2వ సంవత్సరం కెమిస్ట్రీ 2026కు సంబంధించిన విద్యార్థులు ముఖ్యమైన 8 మార్కుల ప్రశ్నల జాబితాను ఈ ఆర్టికల్‌లో చూడండి. పరీక్షలో ఏ టాపిక్స్‌పై ఎక్కువగా ఫోకస్ చేయాలో తెలుసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది.

AP Inter 2ndYear Chemistry Important 8 Marks Questions 2026

AP ఇంటర్ 2వ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్నవిద్యార్థులు ఈ సయమంలో మీలో చాలామందికి “ఏం చదవాలి?” లేదా “ఏ ప్రశ్నలు ముఖ్యమైనవి?” అని ఆలోచిస్తున్నారని మాకు తెలుసు. ముఖ్యంగా కెమిస్ట్రీలో ప్రత్యేకంగా 8 మార్కుల ప్రశ్నలు మీ మొత్తం మార్కులని బాగా ప్రభావితం చేస్తాయి. అందుకే ముందుగా ఆ ముఖ్యమైన ప్రశ్నలఈ క్రింద ఇచ్చిన జాబితాని చూడండి మరియు వాటిలోని కాన్సెప్ట్‌లు స్పష్టంగా అర్థం చేసుకోండి. కేవలం జ్ఞాపకం పెట్టుకోవడం కాకుండా , ప్రతి ప్రశ్న వెనక ఉన్న థియరీ, సూత్రాలు మరియు ఉదాహరణలు ఎంతగా ఉపయోగపడతాయో తెలుసుకోండి, అప్పుడు మాత్రమే పూర్తి మార్కులు సాధించవచ్చు. రోజూ కొంత సమయం తీసుకుని ఆ 8 మార్కుల ప్రశ్నలను పరీక్షలో రాస్తున్నట్లే ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా సాలిడ్ స్టేట్, సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ వంటి ముఖ్య చాప్టర్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి. ఈ విధంగా ప్లాన్ చేసి స్థిరంగా సిద్ధమైతే, పరీక్ష రోజు మీరు ఒత్తిడి లేకుండా నమ్మకంగా పేపర్ ప్రయత్నం చేసి మంచి ఫలితాలు పొందగలుగుతారు.

AP ఇంటర్ 2వ సంవత్సరం కెమిస్ట్రీ 2026 : ముఖ్యమైన 8 మార్కుల ప్రశ్నలు (AP Inter 2nd Year Chemistry 2026: Important 8 Marks Questions)

AP ఇంటర్ 2వ సంవత్సరం కెమిస్ట్రీ 2026 పరీక్షలో ఎక్కువగా వచ్చే అవకాశము ఉన్న కీలక 8 మార్కుల ప్రశ్నల జాబితా విద్యార్థుల కోసం ఈ క్రింద టేబుల్ పట్టికలో ఇవ్వడం జరిగింది.

క్రమ సంఖ్య

8 మార్కుల ముఖ్యమైన ప్రశ్నలు

1

a) గాల్వానిక్ ఘటాలు అంటే ఏమిటి ? గాల్వానిక్ ఘటాల పనిచేయు విధానాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.

(b) చర్యా క్రమాంకానికి మరియు చర్యాణుతకు మధ్యగల భేదాలను వ్రాయండి.

2

(a) అయాన్ల స్వతంత్రీయ అభిగమనాల కోల్రాష్, నియమాన్ని తెలిపి వివరించండి.

(b) చర్య అణుత అంటే ఏమిటి ? దీనికి చర్య క్రమాంకానికి గల భేదం ఏమిటి ? ద్విఅణుత,త్రిక అణుత వాయు చర్యలను తెలుపండి.

3

ఆక్సిజన్ నుండి ఓజోన్ను ఎలా తయారు చేస్తారు ? ఈ క్రింది వానితో ఓజోన్ చర్యను వివరించండి.

(a) C₂H₂ (b) Kl (c) Hg (d) PbS

4

క్వాంటం సంఖ్యలు అనగా నేమి ? క్వాంటం సంఖ్యల ప్రాముఖ్యతను వివరించండి.

5

(i ) ఈ క్రింది వాటిని సరైన ఉదాహరణలతో వివరించండి.

(a) ఆల్కైల్ హాలైడ్ను ఈధర్ మార్చుట.

(b) ఫినాల్ను సాలిసిలిక్ ఆమ్లంగా మార్చుట.

(ii ) (a) గ్రిగ్నార్డ్ కారకం నుండి కార్బాక్సిలిక్ ఆమ్లం మరియు ఆల్కహాల్ లను ఎలా తయారు చేస్తారు ? ఉదాహరణ ఇవ్వండి.

(b) కార్బైల్ ఎమీన్ చర్య అంటే ఏమిటి ? ఉదాహరణ తెలపండి.

6

(i) ఈ క్రింది వాటితో క్లోరిన్ ఎలా చర్య జరువుతుంది ?

(a) FeSO4

(b) పొడి స్లేజ్డ్ లైమ్

(ii) H₂SO4 ను కాంటాక్ట్ పద్ధతిలో ఏ విధంగా తయారు చేస్తారు ?

7

(a) డేనియల్ ఘటాన్ని ఉదాహరణతో గాల్వానికి ఘటం ఎలా పనిచేస్తుంది అనే దానిని రేఖా చిత్రం సహాయంతో వివరించండి.

(b) అయాన్ల స్వతంత్రీయ అభిగమనాల కోల్రాష్ నియమాన్ని తెలిపి, వివరించండి.

8

(a) నత్రికామ్ల తయారీలో జరిగే రసాయన చర్యలను తెలపండి. (ఆస్వాల్డ్ పద్ధతి)

(b) ఆక్సిజన్ నుంచి ఓజోన్ను ఎలా తయారు చేస్తారు ? ఈ కింది వాటితో ఓజోన్ చర్యను వివరించండి.

(i) C2H4 (ii) KI

AP ఇంటర్ 2వ సంవత్సరం కెమిస్ట్రీ 2026: ఈ ఆర్టికల్ చదివిన తర్వాత విద్యార్థుల మనసులో వచ్చే సాధారణ సందేహాలు (AP Inter 2nd Year Chemistry 2026: Common doubts that come to the minds of students after reading this article)

ఈ ముఖ్యమైన 8 మార్కుల ప్రశ్నల జాబితా చూస్తే AP ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులలో కొన్ని సహజమైన సందేహాలు రావడం సహజమే. “ఇవే ప్రశ్నలు నిజంగా పరీక్షలో వస్తాయా?”, “ప్రతి ప్రశ్నను ఎంత లోతుగా సిద్ధం కావాలి?”, “సమాధానం ఎంత పొడవుగా రాయాలి?”, “డయాగ్రామ్‌లు తప్పనిసరిగా గీయాలా?” వంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. కొంత మంది మాత్రం “కేవలం ఇవే ప్రశ్నలు చదివితే సరిపోతుందా లేక పూర్తి చాప్టర్ నేర్చుకోవాలా?” అని కూడా ఆలోచిస్తారు. నిజానికి, ఈ జాబితా కేవలం మీకు దిశ చూపడానికి మాత్రమే. ప్రతి ప్రశ్న వెనుక ఉన్న కాన్సెప్ట్‌లను బాగా అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తేనే పూర్తి మార్కులు సాధించగలుగుతారు.

AP ఇంటర్ 2వ సంవత్సరం కెమిస్ట్రీ 2026: పరీక్షకు ముందు చివరి నిమిషాల్లో పాటించాల్సిన ముఖ్య సూచనలు (AP Inter 2nd Year Chemistry 2026: Important instructions to follow in the last minutes before the exam)

AP ఇంటర్ 2వ సంవత్సరం పరీక్ష దగ్గరపడినప్పుడు విద్యార్థులు కొత్త టాపిక్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించకండి. ఇప్పటికే సిద్ధం చేసిన ముఖ్య విషయాలు, ముఖ్యంగా 8 మార్కుల ప్రశ్నల కాన్సెప్ట్స్, సూత్రాలు, డయాగ్రామ్‌లను మళ్ళీ రివైజ్ చేయండి. రోజుకు కొంత సమయం పెట్టి రెండు లేదా మూడు దీర్ఘ ప్రశ్నలను పరీక్షలో రాస్తున్నట్లు ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ కూడా పెరుగుతుంది, కన్ఫిడెన్స్ కూడా వస్తుంది. గత ప్రశ్నపత్రాలను చూసి ఎక్కువగా వచ్చే టాపిక్స్‌ మీదే దృష్టి పెట్టండి. చివరి రోజుల్లో ప్రశాంతంగా ప్లాన్ చేసి రివిజన్ చేస్తే పరీక్షలో మంచి ఫలితాలు వస్తాయి.

AP ఇంటర్ 2వ సంవత్సరం కెమిస్ట్రీలో 8 మార్కుల ప్రశ్నలు మంచి స్కోరు సాధించడానికి ఎంతో కీలకం. ముఖ్యమైన ప్రశ్నలను ముందే గుర్తించి వాటి కాన్సెప్ట్స్‌ను బాగా అర్థం చేసుకుని తరచుగా ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తే పేపర్ ధైర్యంగా రాయగలుగుతారు. చివరి రోజుల్లో సులభంగా, ప్లాన్ ప్రకారం రివైజన్ చేసి సిద్ధంగా ఉంటే టెన్షన్ లేకుండా పేపర్ సరిగా ప్రయత్నం చేసి మంచి ఫలితాలు పొందటం ఖాయం.

/articles/ap-inter-2nd-year-chemistry-important-8-marks-questions-2026/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top