APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు 2024 (APPSC Group 1 Result 2024): విడుదల తేదీ, సమయం, డౌన్‌లోడ్ లింక్, కటాఫ్

Guttikonda Sai

Updated On: March 19, 2024 03:15 PM

APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు (APPSC Group 1 Result 2024) త్వరలో విడుదల కానున్నాయి, అభ్యర్థులు ఈ ఆర్టికల్ లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 
APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు 2024

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు 2024 (APPSC Group 1 Result 2024) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-I సర్వీసెస్ జనరల్/లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ పోస్టుల కోసం జనవరి 1, 2024 నుండి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. గ్రూప్ 1 పోస్టుల కోసం ఎంపిక ప్రక్రియ ప్రకారం, అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా మార్చి 17, 2024న షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడింది. నోటిఫికేషన్ నెం- 12/2023కి అనుబంధంగా గ్రూప్ 1 పోస్టులకు రాత పరీక్ష మార్చి 17, 2024న రాష్ట్రంలోని 18 జిల్లా కేంద్రాల్లో నిర్వహించబడింది. స్క్రీనింగ్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించారు. పేపర్ I పరీక్షలకు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మరియు పేపర్ II మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు నిర్వహించబడ్డాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష పూర్తి అవ్వడంతో త్వరలోనే ఫలితాలు కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నది. అధికారికంగా ఫలితాల విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు 2024 ముఖ్యంశాలు (APPSC Group 1 Result 2024 : Highlights)

ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైటు PSC.gov.in
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల విడుదల తేదీ తెలియాల్సి ఉంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల విడుదల సమయం తెలియాల్సి ఉంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల కోసం అవసరమైన వివరాలు హాల్ టికెట్ నెంబర్ మరియు అభ్యర్థి పేరు

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు ముఖ్యమైన తేదీలు 2024 (APPSC Group 1 Result Important Dates 2024)

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు 2024 కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టిక నుండి వివరంగా తెలుసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష తేదీ 17 మార్చి 2024
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్సర్ కీ విడుదల 19 మార్చి 2024
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల తేదీ తెలియాల్సి ఉంది.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు ఎలా చెక్ చేయాలి ? ( How to Check APPSC Group 1 Result 2024)

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో విడుదల చేస్తారు. ఈ పరీక్ష కు హాజరైన అభ్యర్థులు క్రింద ఇచ్చిన స్టెప్స్ ను అనుసరించడం ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
  • అధికారిక వెబ్సైటు PSC.gov.in ఓపెన్ చేయండి.
  • వెబ్సైటు లో ఉన్న "Results" సెక్షన్ ఓపెన్ చేయండి.
  • ఫలితాల సెక్షన్ లో ఉన్న "ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు" అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు పరీక్ష లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితా ను డౌన్లోడ్ చేసుకోండి.
  • డౌన్లోడ్ చేసిన జాబితా లో మీ పేరు మరియు హాల్ టికెట్ నెంబర్ ఆ జాబితా లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు డైరెక్ట్ లింక్ ( APPSC Group 1 Result 2024 Direct Link)

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి, అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా కూడా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ చేయబడుతుంది)

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు కటాఫ్ ( APPSC Group 1 Result 2024 Cut Off )

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లో తర్వాతి ప్రక్రియ కు వెళ్ళడానికి కటాఫ్ చాలా ముఖ్యమైనది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల అయిన తర్వాత కటాఫ్ విడుదల చేయబడుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థుల కటాఫ్ స్కోరు పరీక్ష క్లిష్టత స్థాయి, అభ్యర్థి కేటగిరీ, ఖాళీల సంఖ్య మొదలైన వాటి మీద ఆధారపడుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అంచనా కటాఫ్ ను కేటగిరీ ప్రకారంగా క్రింద పట్టిక లో అందించడం జరిగింది.
కేటగిరీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కటాఫ్ ( అంచనా)
జనరల్ 90
BC 86
SC/ST 77

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మరియు లేటెస్ట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

/articles/appsc-group-1-prelims-result/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top 10 Education Colleges in India

View All
Top