ఇంటర్మీడియట్ తర్వాత (Fine Arts Courses After Inter) ఫైన్ ఆర్ట్స్‌తో మంచి కెరీయర్

Andaluri Veni

Updated On: November 24, 2023 04:43 pm IST

ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలో? విద్యార్థులు సతమతం అవుతుంతారు. సరైన కెరీర్ ఆప్షన్లు కోసం చూస్తుంటారు. అయితే కొంతమంతి రెగ్యులర్‌గా కాకుండా క్రియేటివ్ రంగాల్లో రాణించాలనుకుంటారు. అలాంటి వారికి కూడా ఫైన్ ఆర్ట్స్ కోర్సులు (Fine arts courses after Inter) అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 
ఇంటర్మీడియట్ తర్వాత  (Fine Arts Courses After Inter) ఫైన్ ఆర్ట్స్‌తో మంచి కెరీయర్

ఇంటర్మీడియట్ తర్వాత ఫైన్ ఆర్ట్స్ కోర్సులు (Fine arts courses after Inter): ఇంటర్మీడియట్ పూర్తైన తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి? ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? ఇలాంటి ఎన్నో కెరీర్‌కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులకు కచ్చితంగా ఈ డౌట్ ఉంటుంది.  అయితే విద్యార్థులు ఎటువంటి సందేహాలు పెట్టుకోనవసరం లేదు. ఎందుకంటే  ఇంటర్ తర్వాత విద్యార్థులకు మంచి కెరీర్ ఆప్షన్లు ఉన్నాయి. కొంతమంది రెగ్యులర్ కోర్సులు చేయాలని ఉండదు. దాంతో విద్యార్థులు ఘర్షణ పడుతుంటారు. అయితే  క్రియేటివ్ రంగాల్లో కూడా మంచిగా సెటిల్ అయ్యే కోర్సులు (Fine arts courses after Inter) విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్ తర్వాత ఆ వైపుగా అడుగులు వేస్తే కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. 

హైదరాబాద్‌లోని జేఎన్ఏఎఫ్‌ఏయూ  (JNAFA) ఫైన్ ఆర్ట్స్ కోర్సులను (Fine arts courses after Inter) అందిస్తోంది.  2023-24 విద్యా సంవత్సరానికి JNAFAAU దాని అనుబంధ కాలేజీల్లో ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (FADEE)ని నిర్వహిస్తోంది. దీనికోసం ఇంటర్ పాసైన అభ్యర్థులు జూన్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.  ఈ పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది. ర్యాంకు సాధించిన అభ్యర్థులు BFA (అప్లైడ్ ఆర్ట్) పెయింటింగ్, స్కల్ ప్చర్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, ఇంటీరియల్ డిజైన్ వంటి కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అభ్యర్థి అభిరుచికి తగ్గట్టుగా కోర్సును ఎంచుకోవచ్చు. 

BFA ప్రోగ్రామ్‌లు, సీట్ల ఖాళీలు (BFA Programmes, Seat Vacancies)

కోర్సులు, సీట్ల వివరాలు ఈ దిగువున తెలిపిన విధంగా ఉన్నాయి. అభ్యర్థులు గమనించవచ్చు.  
బీఎఫ్‌ఏ (అప్లైడ్ ఆర్ట్)  50 సీట్లు
బీఎఫ్ఏ (పెయింటింగ్)35 సీట్లు
బీఎఫ్ఏ (స్కల్‌ప్చర్)20 సీట్లు
బీఎఫ్‌ఏ (యానిమేషన్)60 సీట్లు
బీఎఫ్‌ఏ (ఫోటోగ్రఫీ)50 సీట్లు
బీడీజైన్ (ఇంటీరియల్ డిజైన్)60 సీట్లు

JNAFA విశ్వవిద్యాలయంలో BFA ప్రవేశానికి అర్హత (Eligibility For BFA Admission in JNAFA University)  

JNAFA విశ్వవిద్యాలయంలో BFA ప్రవేశాలకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి. 
  • ఇంటర్మీడియట్ లేదా తత్సమానం పాసై ఉండాలి.
  • ప్రవేశ పరీక్ష రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు
  • రూ.1,800 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.900)
  • ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు ఉంటుంది. 

JNAFA విశ్వవిద్యాలయంలో BFA ప్రవేశానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు (Important Dates of  BFA Admission in JNAFA University)  

JNAFA యూనివర్సిటీలో బీఎఫ్ఏ ప్రవేశానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.  
ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ   తెలియాల్సి ఉంది
రూ.2000 ఆలస్య ఫీజుతో దరఖాస్తు చివరి తేదీ   తెలియాల్సి ఉంది
ప్రవేశ పరీక్ష తేదీలు   తెలియాల్సి ఉంది
అధికారిక వెబ్‌సైట్jnafauadmissions.com
దరఖాస్తు విధానంఆన్‌లైన్

ఫైన్ ఆర్ట్స్  ప్రవేశ పరీక్షా విధానం  (Fine Arts Entrance Test Procedure)

అప్లయిడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ఫ‌చర్ అండ్ యానిమేషన్ కోర్సులకు పేపర్ ఏలో మెమొరీ, డ్రాయింగ్, కలరింగ్ విభాగాల్లో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఏదైనా అంశాన్ని ఇస్తారు. దానిని పెయింటింగ్ వేయాలి. పరీక్ష సమయం 90 నిమిషాలు.

Paper B ఆబ్జెక్టివ్ తరహాలో 50 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 50 నిమిషాలు. ఇందులో జీకే, కరెంట్ అఫైర్స్ 15 ప్రశ్నలు, ఇంగ్లీష్ 15 ప్రశ్నలు, జనరల్ ఆర్ట్ ఓరియంటెడ్ 20 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.  

పేపర్ సీ  ఆబ్జెక్టివ్ డ్రాయింగ్‌లో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. ఇందులో భాగంగా ఏదైనా వస్తువు లేదా బొమ్మ చూపిస్తారు. దానిని పెన్సిల్‌తో దీసి దాని చుట్టూ పరిసరాలను ఊహించి పెయింటింగ్ రూపొందించాలి. 

ఫైన్ ఆర్ట్స్-ఫోటోగ్రఫీ కోర్సు (Fine Arts-Photography Course)


కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్స్ పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. పరీక్షా సమయం 90 నిమిషాలు. ఇందులో డ్రాయింగ్, కంపోజిషన్ నైపుణ్యాలు పరిశీలిస్తారు. పెన్సిల్‌తో ఇచ్చిన చిత్రాలకు షేడ్‌లు ఇవ్వడం, చిత్రాలను ఓ క్రమ పద్ధతిలో అమర్చడం వంటి టెస్ట్‌లు ఉంటాయి. అలాగే మరో ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ 50 మార్కులకు నిర్వహిస్తారు. 

ఫైన్ ఆర్ట్స్-ఇంటీరియల్ డిజైన్‌ (Fine Arts-Interior Design)

ఇంటీరియల్ డిజైన్‌లోనూ 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. మూడు గంటల వ్యవధిలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షలో కరెంట్ అఫైర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలస్ట్రేటివ్, అనలికటల్ అండ్ డిజైన్ ఎబిటీ, మెమొరీ డ్రాయింగ్, కలర్ కో ఆర్డినేషన్ వాటిపై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 

ఫైన్ ఆర్ట్స్- ఉద్యోగ అవకాశాలు (Fine Arts- Job Opportunities)

క్రియేటివ్ రంగంలో స్థిరపడాలనుకునే వ్యక్తులు  ఫైన్ ఆర్ట్స్ మంచి ఛాయిస్ అనే చెప్పాలి. ఫైన్ ఆర్ట్స్ కోర్సులు చేసి మంచి నైపుణ్యం సంపాదించుకునే అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ రంగంలో భారీ అవకాశాలు ఉ న్నాయి. గతంలో కంటే  ఆర్ట్ స్టూడియోలు, అడ్వర్జైజింగ్ కంపెనీలు, గ్రాఫిక్, ప్రింటింగ్, పబ్లిషింగ్, ఫ్యాషన్ సంస్థలు, ఎలక్ట్రానిక్, టెక్స్‌టైల్ పరిశ్రమ, ఫిల్మ్ అండ్ థియేటర్, మల్టీమీడియా, యానిమేషన్ తదితర సంస్థలు పెరిగాయి. ఈ సంస్థలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. అంతేకాదు ఈ కోర్సులు చేసిన వారికి ఫ్రీలాన్సింగ్, స్వయం ఉపాధికి కూడా మంచి అవకాశం ఉంది. ఒక్కసారి ఈ రంగంలో క్లిక్ అయితే మంచి గుర్తింపు, మంచి డబ్బు సంపాదించుకోవచ్చు. 

బీఎస్సీ డిజైన్ (BSc in Design) 

డిజైన్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అనేది అనేక విభిన్న కళాశాలలు, యూనివర్సిటీలలో సంపాదించగలిగే డిగ్రీ. డిగ్రీ ప్రోగ్రామ్ సాధారణంగా పూర్తి చేయడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది. డిజైన్ రంగంలో కెరీర్‌లోకి ప్రవేశించడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తుంది. డిజైన్‌లో BSc సంపాదించే విద్యార్థులు సాధారణంగా గ్రాఫిక్ డిజైనర్‌లు, వెబ్ డిజైనర్‌లు, ఇంటీరియర్ డిజైనర్‌లు లేదా ఇతర డిజైన్-సంబంధిత వృత్తులుగా కెరీర్‌లను కనుగొంటారు.

ఉద్యోగావకాశాలు:

  • ప్యాషన్ డిజైన్
  • ఇంటరీయర్ డిజైన్
  • Fashion Merchandise
  • ప్రొడక్ట్ డిజైన్ 
  • జ్యూయలరీ డిజైన్ 
  • గ్రాఫిక్ డిజైన్ 
  • ఫర్నిచర్ డిజైన్  
  • Visual Merchandise
  • ప్యాషన్ కన్సల్టెన్సీ 
  • ఇండస్ట్రీయల్ డిజైన్ 

బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా  (Bachelor of Mass Media)

బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా అనేది నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఇది మీడియా, కమ్యూనికేషన్ పరిశ్రమలలో కెరీర్‌లకు విద్యార్థులను సిద్ధం చేయడంపై దృష్టి పెడుతుంది. పాఠ్యప్రణాళికలో జర్నలిజం, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్ మరియు మీడియా స్టడీస్‌లో కోర్స్ వర్క్ ఉంటుంది.

  • రేడియో జాకీయింగ్
  • ప్రకటనలు
  • పబ్లిక్ రిలేషన్స్
  • జర్నలిజం
  • ఈవెంట్ మేనేజ్మెంట్
  • డిజిటల్ కమ్యూనికేషన్స్
  • బిజినెస్ కన్సల్టెంట్
  • ఫిల్మ్ మేకింగ్


ఇంటర్మీడియట్  తర్వాత ఈ ఫైన్ ఆర్ట్స్ కోర్సులు పూర్తైన తర్వాత విద్యార్థులు టీచింగ్ ఫీల్డ్‌లో ఆర్టిస్ట్‌గా లేదా ఫోటోగ్రాఫర్/నటుడిగా పని చేసే అవకాశం ఉంటుంది. డైరెక్షన్, పెయింటింగ్, యాక్టింగ్, డ్యాన్స్, ఫ్యాషన్ రంగాలలో ఫ్రీలాన్సర్‌గా పని చేయడం ద్వారా ఇంటర్ తర్వాత ఫైన్ ఆర్ట్స్‌లో మంచి వృత్తిలో కూడా స్థిరపడవచ్చు.   

అంతేకాకుండా విద్యార్థులు విద్యావేత్తలు, డిజైన్, సినిమా పరిశ్రమ అన్నీ ఆచరణీయ ఆప్షన్లు. పబ్లిషింగ్ లేదా టెక్స్‌టైల్ పరిశ్రమలలో, మీరు పీరియాడికల్స్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, మ్యాగజైన్‌ల క్రియేటివ్  విభాగాల్లో పని చేయవచ్చు. ఫైన్ ఆర్ట్ గ్రాడ్యుయేట్లు ప్రధాన గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు. బేకింగ్, ఆర్ట్ గ్యాలరీలు, థియేటర్, జర్నలిజం మరియు పబ్లిక్ రిలేషన్స్‌తో సహా వివిధ రంగాలలో శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు ఎగ్జిబిషన్‌లు, వాణిజ్య గ్యాలరీలలో ప్రదర్శించడం ద్వారా డబ్బు పొందవచ్చు. మీ క్రియేషన్‌లను వర్క్‌షాప్‌లు, నిధుల సమీకరణలు, బోటిక్‌లు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ షోలలో విక్రయించవచ్చు.

ఫైన్ ఆర్ఠ్స్ చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ రంగంలో డబ్బుతో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు. ఫిల్మ్, వీడియో గేమ్‌ల పరిశ్రమలు యానిమేషన్‌లో స్పెషలైజేషన్‌తో ఇంటర్మీడియట్ తర్వాత  ఫైన్ ఆర్ట్స్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులను కూడా తీసుకుంటాయి. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ ఆర్టికల్స్‌ కోసం College Dekho వెబ్‌సైట్‌ని ఫాలో అవ్వండి. 

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/fine-arts-courses-and-career-options-after-intermediate/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Education Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!