TS LAWCET 2026 నోటిఫికేషన్ విడుదల: లా కోర్సుల ప్రవేశాలకు అధికారిక ప్రక్రియ ప్రారంభం

manohar

Published On:

TS LAWCET 2026 నోటిఫికేషన్ విడుదలతో తెలంగాణలో లా కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ మొదలవుతోంది.3 ఏళ్ల LLB, 5 ఏళ్ల LLB, 2 ఏళ్ల LLM కోర్సులకు ఈ పరీక్ష ద్వారా అర్హత పొందిన అభ్యర్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు.

TS LAWCET Notification, Application

TS LAWCET 2026 నోటిఫికేషన్‌తో తెలంగాణలో లా విద్యలో ప్రవేశాల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది అభ్యర్థుల సంఖ్య పెరుగుతుండటంతో ఈసారి పరీక్ష నిర్వహణను మరింత సక్రమంగా చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. పరీక్ష ద్వారా ఇంటర్మీడియట్ అర్హతతో 5 ఏళ్ల LLB, డిగ్రీ అర్హతతో 3 ఏళ్ల LLB, ఇంకా LLB పూర్తి చేసినవారికి 2 ఏళ్ల LLM కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరించబడతాయి మరియు పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది. లా రంగంలో ఉద్యోగావకాశాలు, న్యాయ విద్యకు పెరుగుతున్న ప్రాముఖ్యంతో TS LAWCET కి ప్రాధాన్యం పెరిగింది. సరైన ప్రణాళికతో సిద్దమైతే ఈ పరీక్ష ద్వారా మంచి కాలేజీలో చేరే అవకాశం ఉంటుంది.

TS LAWCET 2026 ముఖ్యమైన తేదీలు (TS LAWCET 2026 Important Dates)

TS LAWCET 2026 కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల నుంచి పరీక్ష తేదీ వరకు అన్ని ముఖ్యమైన తేదీల వివరాలు ఈ క్రింది ఇవ్వబడ్డాయి.

వివరాలు

తేదీలు

TS LAWCET 2026 నోటిఫికేషన్ విడుదల

జనవరి 08,2026

TS LAWCET 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ

ఫిబ్రవరి 10,2026

TS LAWCET 2026 ఆలస్య ఫీజు లేకుండా చివరి తేదీ

ఏప్రిల్ మొదటి వారం (అంచనా )

TS LAWCET 2026 అడ్మిట్ కార్డ్ విడుదల

మే రెండో వారం (అంచనా)

TS LAWCET 2026 పరీక్ష తేదీ

మే 18,2026

ప్రాథమిక ఫలితాల ప్రకటన

మే చివరి వారం (అంచనా )

కౌన్సిలింగ్ ప్రారంభం

జూన్ 2026 (అంచనా )

TS LAWCET 2026కు ఎలా దరఖాస్తు చేయాలి (How to apply for TS LAWCET 2026)

TS LAWCET 2026 దరఖాస్తు పూర్తి ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. అభ్యర్థులు దరఖాస్తు దశలవారీగా ఈ క్రింది విధముగా దరఖాస్తు పూర్తి చేయాలి.

  • ముందుగా TS LAWCET అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  • హోమ్‌పేజీలో కనిపించే “Apply Online for TS LAWCET 2026” లింక్‌పై క్లిక్ చేయండి.
  • కొత్త అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి.
  • అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
  • ఇంటర్మీడియట్/డిగ్రీ/LLB వంటి అర్హత పరీక్ష వివరాలు, మార్కులు, ఉత్తీర్ణత సంవత్సరం నమోదు చేయాలి.
  • పరీక్ష రాయాలనుకునే కోర్సు (3 సంవత్సరాల LLB/5 సంవత్సరాల LLB/2 సంవత్సరాల LLM) ఎంపిక చేయాలి.
  • పరీక్ష కేంద్రాల ప్రాధాన్యత (Exam Centre Preference) ఎంచుకోవాలి.
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం స్కాన్ కాపీలను సూచించిన ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుమును డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.
  • చెల్లింపు పూర్తయిన తర్వాత ఫారమ్ ను ఒకసారి పూర్తి గా పరిశీలించాలి.
  • అన్ని వివరాలు సరిగా ఉన్నాయని నిర్ధారించుకుని దరఖాస్తు‌ను సబ్మిట్ చేయాలి.
  • అప్లికేషన్ నంబర్ నోట్ చేసుకుని, దరఖాస్తు ఫారమ్ ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

TS LAWCET 2026 కు ఎవరు అర్హులు? (Who is eligible for TS LAWCET 2026?)

TS LAWCET 2026 ద్వారా లా కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు కోర్సును బట్టి నిర్దిష్ట అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

5 సంవత్సరాల LLB (ఇంటర్మీడియట్ అర్హతతో) (5 years LLB (with intermediate qualification))

  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత
  • సాధారణ వర్గాలకు కనీసం 45% మార్కులు ఉండాలి
  • BC అభ్యర్థులకు 42% మార్కులు సరిపోతాయి
  • SC / ST అభ్యర్థులకు 40% మార్కులు చాలు
  • ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా అప్లై చేయవచ్చు

3 సంవత్సరాల LLB (డిగ్రీ అర్హతతో) (3 years LLB (with degree qualification))

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • సాధారణ వర్గాలకు కనీసం 45% మార్కులు అవసరం
  • BC అభ్యర్థులకు 42% మార్కులు ఉండాలి
  • SC / ST అభ్యర్థులకు 40% మార్కులు సరిపోతాయి
  • ఫైనల్ ఇయర్‌లో చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు

2 సంవత్సరాల LLM (LLB అర్హతతో) (2 years LLM (with LLB qualification))

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి LLB డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
  • విశ్వవిద్యాలయం/ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు వర్తిస్తాయి
  • LLB ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు

సాధారణ అర్హతలు (General Qualifications)

  • అభ్యర్థులు భారతీయ పౌరులు అయ్యి ఉండాలి
  • తెలంగాణ రాష్ట్ర స్థానిక లేదా స్థానికేతర నిబంధనలకు లోబడి ఉండాలి
  • గరిష్ట వయస్సు పరిమితి లేదు (ప్రస్తుత నిబంధల ప్రకారం)

TS LAWCET 2026 పరీక్ష విధానం (TS LAWCET 2026 Exam Pattern)

TS LAWCET 2026 పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించబడుతుంది. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ పద్దతిలో ఉంటాయి.

  • పరీక్ష విధానం: ఆన్‌లైన్ (Computer Based Test – CBT)
  • మొత్తం ప్రశ్నల సంఖ్య: 120
  • మొత్తం మార్కులు: 120
  • పరీక్ష సమయం: 90 నిమిషాలు
  • ప్రశ్నల రకం: బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQs)
  • ప్రతి ప్రశ్నకు: 1 మార్కు
  • నెగటివ్ మార్కులు: లేవు
  • ప్రశ్న పత్ర భాష: తెలుగు / ఇంగ్లీష్

ప్రశ్న పత్ర విభాగాలు (Question paper sections)

  • జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ
  • కరెంట్ అఫైర్స్
  • లా స్టడీ ఆప్టిట్యూడ్

ముఖ్య గమనికలు (Important Notes)

  • పూర్తి పరీక్ష ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది
  • ఒక్క ఒక్క ప్రశ్నకు నాలుగు ఎంపికలు ఉంటాయి
  • పరీక్ష సమయంలో క్యాల్క్యులేటర్ ఉపయోగించడానికి అనుమతి లేదు

గత సంవత్సరాల ట్రెండ్స్ (Last Year Trends)

గత కొన్ని సంవత్సరాల్లో TS LAWCET పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. ముఖ్యంగా 5 సంవత్సరాల LLB కోర్సులో విద్యార్థుల ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. లా చదివిన తర్వాత న్యాయవాది, న్యాయ సేవలు, కార్పొరేట్ లా వంటి వివిధ ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి కారణం వల్ల మరింత మంది లా కోర్సుల వైపు ఆకర్షితులు అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని అధికారులు పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచడం, ఆన్‌లైన్ విధానాన్ని మరింత సులభతరం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. 2026లో పోటీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ముందుగానే పథకం రూపొందించి సిద్ధం కావడం అవసరం.

మొత్తంగా TS LAWCET 2026 నోటిఫికేషన్ లా కోర్సులలో ప్రవేశం కోరుకునే అభ్యర్థులకు మంచి అవకాశంగా ఉంది. అర్హతలున్న వారు గడువులోపు దరఖాస్తు చేసి, పరీక్షకు సమయానికి సిద్దమైతే కోరుకున్న కోర్సులో అడ్మిషన్ పొందే అవకాశాలు ఉన్నాయి.

/articles/ts-lawcet-2026-notification-application-dates-eligibility/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Law Colleges in India

View All
Top