TSRJC CET ఫలితాలు 2024 ( TSRJC CET Results 2024) : విడుదల తేదీ మరియు సమయం, లింక్, కౌన్సెలింగ్ ప్రక్రియ

Guttikonda Sai

Updated On: April 21, 2024 09:50 am IST

TSRJC CET 2024 ఫలితాలు మరో రెండు వారాల్లో విడుదల అయ్యే అవకాశం ఉన్నది, విద్యార్థులు ఫలితాల విడుదల తేదీ, సమయం, డైరెక్ట్ లింక్ మొదలైన వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
TSRJC CET ఫలితాలు 2024 ( TSRJC CET Results 2024) : విడుదల తేదీ మరియు సమయం, లింక్, కౌన్సెలింగ్ ప్రక్రియ

TSRJC CET ఫలితాలు 2024 ( TSRJC CET Results 2024) : TSRJC 2024 పరీక్ష ఈరోజు అంటే  21 ఏప్రిల్ తేదీన జరుగుతుంది.. ఈ పరీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఉన్న దాదాపు 3000 సీట్లను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం లో మొత్తం 35 TSRJC కళాశాలలు ఉన్నాయి. వీటిలో 20 బాలికల కళాశాలలు కాగా మిగతా 15 బాలుర కళాశాలలు. విద్యార్థులకు ఈ కళాశాలల్లో ఇంటర్మీడియట్ MPC, BiPC , MEC కోర్సులు అందుబాటులో ఉన్నాయి. TSRJC 2024 పరీక్ష ద్వారా ఈ కళాశాలలో అడ్మిషన్ సాధించిన విద్యార్థులకు విద్య మరియు వసతి ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది. ఈరోజు పూర్తి అయిన TSRJC CET 2024 పరీక్ష ఫలితాలు మరో రెండు వారాలలో విడుదల కానున్నాయి. 

TSRJC CET 2024 ఫలితాలు ముఖ్యమైన తేదీలు ( TSRJC CET 2024 Important Dates) 

TSRJC CET 2024 ఫలితాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు. 

ఈవెంట్ 

తేదీలు 

TSRJC CET పరీక్ష 

21 ఏప్రిల్ 2024

TSRJC CET ఆన్సర్ కీ 

24 ఏప్రిల్ 2024 ( అంచనా)

TSRJC CET ఫలితాలు 

మే మొదటి వారం 2024 

TSRJC CET కటాఫ్ విడుదల 

మే మొదటి వారం 2024

TSRJC CET కౌన్సెలింగ్ 

మే చివరి వారం 2024

TSRJC CET తరగతుల ప్రారంభం 

జూన్ రెండవ వారం 2024 

TSRJC CET కటాఫ్ 2024 ( TSRJC CET 2024 Cut Off )

10వ తరగతి తర్వాత విద్యార్థులకు ఉచితంగా విద్య మరియు వసతి అందించే కళాశాలలు కాబట్టి సాధారణంగా TSRJC కళాశాలల్లో అడ్మిషన్ కోసం పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే TSRJC CET 2024 కటాఫ్ కళాశాలను బట్టి , విద్యార్థుల జెండర్ ను బట్టి మరియు కేటగిరీ ను బట్టి మారుతూ ఉంటుంది. కళాశాలకు సంబంధించిన కటాఫ్ సాధించిన విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్ లభిస్తుంది. అధికారులు TSRJC CET 2024 కటాఫ్ ను విడుదల చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. 

కేటగిరీ 

TSRJC CET 2024 కటాఫ్ 

జనరల్ 

తెలియాల్సి ఉంది 

BC 

తెలియాల్సి ఉంది 

SC / ST 

తెలియాల్సి ఉంది 

TSRJC CET 2024 కౌన్సెలింగ్ ( TSRJC CET 2024 Counselling )

TSRJC CET 2024 ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థుల ర్యాంక్ ప్రకారంగా కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది. ఈ కౌన్సెలింగ్ రెండు దశల్లో జరుగుతుంది, 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి TSRJC CET 2024 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే కౌన్సెలింగ్ లో పాల్గొనడానికి వీలవుతుంది. TSRJC CET 2024 కౌన్సెలింగ్ మే నెల చివరి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నది. కౌన్సెలింగ్ లో పాల్గొనే విద్యార్థులు వారి సెర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేపించాలి, తర్వాత ఛాయిస్ ఫిల్లింగ్ ద్వారా వారికి కేటాయించిన తేదీలలో వెబ్ ఆప్షన్స్ పూరించాలి. తర్వాత విద్యార్థులు వారికి కేటాయించిన కళాశాలల్లో నిర్ణీత గడువు లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 

TSRJC CET 2024 పరీక్ష గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి CollegeDekho ను ఫాలో అవ్వండి. 

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/tsrjc-cet-result/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!