ఏపీ ఐసెట్ పరీక్ష మే 25&26 తేదీలలో జరగనుంది. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి విద్యార్థుల కోసం ప్రిపరేషన్ స్ట్రాటజీ (AP ICET Preparation Strategy) ను ఈ ఆర్టికల్ లో అందించాం.

ఏపీ ఐసెట్ 2023 ప్రిపరేషన్ స్ట్రాటజీ (AP ICET Preparation Strategy) : ఏపీ ఐసెట్ 2023 పరీక్షలో విద్యార్థులు మంచి స్కోరు సాధించడానికి పరీక్ష సమయంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి తప్పులు చేయకూడదు అని తెలుసుకోవాలి. విద్యార్థులు ఏపీ ఐసెట్ 2023 పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి అవసరమైన టిప్స్ ను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. విద్యార్థులు మాథెమాటిక్స్ సబ్జెక్ట్ లొ ప్రశ్నలను సులువుగా సాల్వ్ చేసే విధానం , కమ్యునికేషన్ అండ్ అనలిటికల్ సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఎలా అని విద్యార్థులు ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఈరోజే రెండో దశ ఏపీ ఐసెట్ సీట్ల కేటాయింపు ఫలితం విడుదల, ఈ లింక్‌తో చెక్ చేసుకోండి
ఏపీ ఐసెట్ పరీక్షను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష మే 25 & 26 ,2023 తేదీలలో నిర్వహించనున్నారు. ఏపీ ఐసెట్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. విద్యార్థులు ఏపీ ఐసెట్ 2023 పరీక్ష ప్రిపరేషన్ ప్రారంభించే ముందు వారి సిలబస్ ను మరియు మార్కింగ్ స్కీం ను తెలుసుకోవాలి. విద్యార్థుల కోసం ఈ ఆర్టికల్ లో ఏపీ ఐసెట్ 2023 పరీక్ష కు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే స్ట్రాటజీ (AP ICET Preparation Strategy) పూర్తిగా వివరించడం జరిగింది.
ఏపీ ఐసెట్ పరీక్ష తేదీలు 2023 (AP ICET Exam Dates 2023)
విద్యార్థులు ఏపీ ఐసెట్ 2023 పరీక్ష కు సంబందించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
ఈవెంట్స్ | తేదీలు |
---|---|
AP ICET 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల | TBA |
ఆలస్య రుసుము లేకుండా రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ | TBA |
AP ICET అప్లికేషన్ ఫార్మ్ ఆలస్య రుసుముతో సమర్పణ (రూ. 2000/-, 3000/- మరియు 5000/- + నమోదు రుసుము) | TBA |
AP ICET 2023 కోసం అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు | TBA |
AP ICET 2023 విడుదల హాల్ టికెట్ | TBA |
AP ICET 2023 పరీక్ష | మే 25 & 26, 2023 |
AP ICET 2023 ప్రాథమిక జవాబు కీ | TBA |
జవాబు కీ అభ్యంతరాలను సమర్పించడానికి చివరి తేదీ | TBA |
AP ICET 2023 ఫలితాలు | TBA |
AP ICET 2023 కౌన్సెలింగ్ ప్రారంభం | TBA |
ఏపీ ఐసెట్ 2023 ప్రిపరేషన్ కోసం చేయవలసినవి మరియు చేయకూడనివి. (Do’s and Don’ts for AP ICET 2023 Preparation)
విద్యార్థులు ఏపీ ఐసెట్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ (AP ICET Preparation Strategy)చేసే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి. ప్రిపరేషన్ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అంశాలను చేయకూడదు అని ఈ క్రింద వివరంగా తెలుసుకోవచ్చు.
చేయవలసినవి
- టైం మేనేజ్మెంట్
విద్యార్థులు ఏపీ ఐసెట్ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాల్సి ఉంటుంది, దానికి విద్యార్థులకు కేటాయించే సమయం 150 నిమిషాలు. కాబట్టి విద్యార్థులు పరీక్ష వ్రాసే సమయంలో వారికి కేటాయించిన సమయాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. పరీక్షలో సమయాన్ని ఎలా ఉపయగించుకోవాలో అని ఇప్పటి నుండే ప్లాన్ చేసుకోవాలి.
- నిద్రకు సరైన సమయం కేటాయించండి
చాలా మంది విద్యార్థులు చేసే తప్పు పని ఏంటంటే రాత్రి 1 లేదా 2 గంటల వరకు చదివి ఉదయం ఆలస్యంగా లేవడం. లేదా రాత్రి కేవలం 3 నుండి 4 గంటలు మాత్రమే నిద్ర పోవడం, ఇది విద్యార్థుల ఆరోగ్యం మీద ప్రభావం చూపించడమే కాకుండా వారి కాన్సంట్రేషన్ పవర్ ను దెబ్బ తీస్తుంది. అర్థ రాత్రి ఆలస్యంగా పడుకునే కంటే రాత్రి త్వరగా పడుకుని ఉదయాన్నే లేచి చదవడం వలన విద్యార్థుల మైండ్ ఫ్రెష్ గా ఉండడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు.
- మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయండి
ఏపీ ఐసెట్ 2023 మోడల్ పేపర్లను సాల్వ్ చేయడం విద్యార్థులకు చాలా అవసరం. వీలైనన్ని ఎక్కువ మోడల్ పేపర్ లనుAP ICET 2023 sample papers మరియు మాక్ టెస్ట్ లను విద్యార్థులు సాల్వ్ చేయాలి. దీని వల్ల విద్యార్థులకు ప్రశ్నల విధానం మీద అవగాహన వస్తుంది, టైం మేనేజ్మెంట్ కూడా అలవాటు అవుతుంది.
చేయకూడనివి
- ఒన్ నైట్ ప్రిపరేషన్ వద్దు
ఏ పరీక్ష అయినా ముందు రోజు రాత్రి మాత్రమే ప్రిపేర్ అయ్యే అలవాటు చాలా మందికి ఉంటుంది, కానీ కాంపిటీటివ్ పరీక్షలలో అలాంటి అలవాటు ఉంటే మీకు మీరే నష్టం చేసుకోవడమే అవుతుంది. కాబట్టి మొత్తం సిలబస్ ను ఒకేసారి పూర్తి చేద్దాం అనే ఆలోచన వద్దు. మీకు ఉన్న సమయానికి టైం టేబుల్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి.
- ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
విద్యార్థులు ఏపీ ఐసెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సమయంలో వారి ఆరోగ్యం పట్ల కూడా సరైన శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు ఏదైనా చేయగలరు అని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ప్రిపేర్ అవుతున్న సమయంలో విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
- బద్దకంగా ఉండవద్దు
ఏపీ ఐసెట్ పరీక్ష కోసం చాలా మంది విద్యార్థులు మీతో పోటీ పడుతున్నారు అని మీరు గుర్తుంచుకోవాలి. మంచి కళాశాల లో సీట్ సాధించాలి అంటే మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి విద్యార్థులు బద్దకాన్ని వదిలించుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి.
- ఫోన్ అసలు వద్దు
మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ మీకు ప్రిపరేషన్ కు చాలా ఉపయోగపడుతుంది అని మీరు అనుకోవచ్చు కానీ అదే ఫోన్ చాలా సులభంగా మీ దృష్టి మరల్చగలదు అని మీరు తెలుసుకోవాలి. కాబట్టి ప్రిపేర్ అవుతున్న సమయంలో విద్యార్థులు ఫోన్ ఆఫ్ చేసి ఉంచడం చాలా అవసరం.
- టైం వృథా చేయవద్దు
గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా మనం తిరిగి తీసుకుని రాలేము మీ చేతిలో ఉన్న అత్యంత విలువైన వస్తువు సమయమే. ఉన్న సమయాన్ని వృథా చేసుకుంటే తర్వాత సమయం దొరకదు కాబట్టి విద్యార్థులు వారి సమయాన్ని వృథా చేయకుండా ప్రిపేర్ అవ్వాలి.
ఏపీ ఐసెట్ 2023 ప్రిపరేషన్ కోసం ఉత్తమమైన పుస్తకాలు (Best Books for AP ICET 2023 Preparation)
ఏపీ ఐసెట్ 2023 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు క్రింది జాబితాలో ఉన్న పుస్తకాలను ప్రిపేర్ అయితే మంచి మార్కులు సాధించవచ్చు.
- Analytical & Logical Reasoning For Management Entrance Tests - Peeyush Bhardwaj
- Quantitative Aptitude Quantum CAT - Sarvesh K. Sharma
- Data Interpretation and Data Sufficiency - Arihant
- Better English - Norman Lewis
- Objective General English - S.P Bakshi
ఏపీ ఐసెట్ 2023 : పరీక్ష రోజు తీసుకువెళ్ళకూడని వస్తువులు (AP ICET 2023: Things not to carry on the exam day)
ఈ క్రింది జాబితాలో ఉన్న వస్తువులను ఏపీ ఐసెట్ పరీక్ష హాలులోకి అనుమతించరు కాబట్టి విద్యార్థులు ఈ వస్తువులు తీసుకుని రాకుండా జాగ్రత్త వహించాలి.
- పెన్సిల్ బాక్స్, ప్లాస్టిక్ ఫ్యానీ ప్యాక్, పెన్ మరియు ఇతర స్టేషనరీలు\
- సెల్ ఫోన్లు, గడియారాలు, హెడ్‌సెట్‌లు, ఇయర్‌బడ్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు
- రిస్ట్‌బ్యాండ్‌లు, గొలుసులు మరియు కంకణాలు ఆభరణాలకు ఉదాహరణలు.
- చిప్స్, కాల్చిన వస్తువులు, చాక్లెట్ బార్‌లు మొదలైన వినియోగ వస్తువులు
ఏపీ ఐసెట్ 2023 కోసం మరిన్ని వివరాల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
తెలంగాణలో ఎంబీఏ అడ్మిషన్లు (MBA Admissions in Telangana 2024) ముఖ్యమైన తేదీలు, వెబ్ ఆప్షన్లు, అర్హతలు
TS ICET Rank 25000 to 35000 accepting Colleges: టీఎస్ ఐసెట్ 2024లో 25,000 నుంచి 35,000 ర్యాంక్‌ను అంగీకరించే కాలేజీలు ఇవే
ఏపీ ఐసెట్( AP ICET 2023) అంచనా ప్రశ్న పత్రాలు: ముఖ్యమైన ప్రశ్నలు, అధ్యాయాలు మరియు విశ్లేషణ
ఏపీ ఐసెట్ 2023 (AP ICET 2023 Documents Required) కౌన్సెలింగ్ కోసం అవసరమైన డాక్యుమెంట్ల లిస్ట్
ఏపీ ఐసెట్ 2023 నార్మలైజేషన్ ప్రక్రియ, (AP ICET 2023 Score Calculation) స్కోర్‌ని ఎలా లెక్కిస్తారంటే?
ఏపీ ఐసెట్ 2023 పరీక్ష రోజు పాటించాల్సిన (AP ICET Exam day Guidelines) మార్గదర్శకాలు ఇవే