TS PGECET 2023 పూరించడానికి అవసరమైన పత్రాలు అప్లికేషన్ ఫార్మ్ - ఫోటో, స్పెసిఫికేషన్‌లు మరియు స్కాన్ చేయవలసిన డాక్యుమెంట్లు (Documents Required to Fill TS PGECET 2023 Application Form in Telugu )

Guttikonda Sai

Updated On: October 03, 2023 09:45 AM

ఆలస్య రుసుము లేకుండా TS PGECET 2023 కి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 30, 2023.  TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాల జాబితా ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Documents Required to Fill TS PGECET 2023 Application Form

TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (Documents Required to Fill TS PGECET 2023 Application Form in Telugu ): TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ మార్చి 3, 2023 తేదీన ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల చేయబడింది. అధికారిక వెబ్సైట్ pgecet.tsche.ac.in ద్వారా విద్యార్థులు TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేయవచ్చు. TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేయడానికి విద్యార్థులు తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాల్సిన కొన్ని పత్రాలు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి మరియు కొన్ని డాక్యుమెంట్లను కౌన్సెలింగ్ లో వెరిఫై చేపించుకోవాలి. TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాల జాబితా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, తేదీ జనన ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం , మొదలైనవి. ఈ పత్రాలన్నీ తప్పనిసరిగా అధికారులు నిర్దేశించిన స్పెసిఫికేషన్‌లో అప్‌లోడ్ చేయాలి.

ఇది కూడా చదవండి: రెండో దశ  TS PGECET సీట్ల కేటాయింపు ఫలితం రిలీజ్, ఒక్క క్లిక్‌తో ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

TS PGECET 2023 పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 30, 2023.  TS PGECET 2023 పరీక్ష మే 29 నుండి జూన్ 1, 2023 వరకు నిర్వహించబడుతుంది.

TS PGECET 2023  రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఫీజులు చెల్లించడం, ఫారమ్‌లను పూరించడం, పత్రాలను అప్‌లోడ్ చేయడం, ఫారమ్‌ను సమర్పించడం మొదలైన స్టెప్స్  ఉంటాయి. TS PGECET దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ విద్యార్థులకు INR 1100 మరియు SC/ST/PWD అభ్యర్థులకు INR 600. మీరు రాబోయే TS PGECET 2023 పరీక్ష లో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటే, అప్లికేషన్ ఫార్మ్ ని పూరించే ముందు అర్హత ప్రమాణాలను ఒకసారి తనిఖీ చేయండి.

TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ , స్పెసిఫికేషన్‌లు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మరియు మరిన్నింటిని పూరించడానికి అవసరమైన పత్రాల గురించి పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోండి.

TS PGECET 2023 అప్లికేషన్ తేదీలు

TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీల వివరాలు క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.

కార్యక్రమం

తేదీలు

TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల

మార్చి 3, 2023

ఆలస్య రుసుము లేకుండా TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ ని సమర్పించడానికి చివరిగా తేదీ

ఏప్రిల్ 30, 2023

పరీక్ష తేదీ

మే 29, 2023 నుండి జూన్ 1, 2023 వరకు

TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు

TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ ని పూరించడానికి ముందు, విద్యార్థులు తమ వద్ద అన్ని డాక్యుమెంట్‌లను అవసరమైన స్పెసిఫికేషన్‌లలో పాటుగా సిద్ధంగా ఉండాలి.  TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాల జాబితాను ఈ క్రింద పరిశీలించండి.

  • ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ క్లాస్ 1 నుండి ఇంటర్మీడియట్/ 10+2/ తత్సమానం
  • MRO లేదా సంబంధిత అధికారి జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం
  • NCC, PH, స్పోర్ట్స్ , CTC కింద దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల కోసం ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్
  • MRO లేదా సంబంధిత అధికారి జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం
  • MRO లేదా సంబంధిత అధికారి జారీ చేసిన రెసిడెన్సీ సర్టిఫికెట్
  • ఆధార్ కార్డు
  • అభ్యర్థి స్కాన్ చేసిన సంతకం
  • అభ్యర్థి స్కాన్ చేసిన ఫోటో
  • జనన ధృవీకరణ పత్రం / SSC లేదా సమానమైన సర్టిఫికేట్
  • స్థానిక స్థితి సర్టిఫికేట్ (OU/AU/SVU/నాన్-లోకల్)
  • క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్  / ఇంటర్మీడియట్ / 10+2 / తత్సమానం
  • TS / AP ఆన్‌లైన్ సెంటర్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ సమాచారం నుండి పొందిన రసీదు ఫారమ్ (డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేస్తే) నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్

TS PGECET 2023 డాక్యుమెంట్ స్పెసిఫికేషన్‌లు

TS PGECET 2023  పత్రాలను అప్‌లోడ్ చేస్తున్నప్పుడు, విద్యార్థులు తప్పనిసరిగా అవసరమైన మార్గదర్శకాల ప్రకారం ఉండేలా జాగ్రత్త పడాలి. విద్యార్థి ఫోటో మరియు సంతకం కోసం అవసరమైన స్పెసిఫికేషన్ లు క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.

పత్రాలు

ఫైల్ పరిమాణం

ఫైల్ ఫార్మాట్

మార్గదర్శకాలు

సంతకం

30 KB కంటే తక్కువ

JPEG/JPG

తెలుపు కాగితంపై నీలం లేదా నలుపు పెన్నుతో సంతకం చేయాలి.

ఫోటోగ్రాఫ్

50 KB కంటే తక్కువ

JPEG/JPG

కలర్ ఫోటో ఇటీవల తీసుకున్నది అయ్యి ఉండాలి.

TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ ని ఎలా పూరించాలి?

TS PGECET అప్లికేషన్ ఫార్మ్ ఆన్లైన్ లో మాత్రమే పూర్తి చేయడానికి వీలు అవుతుంది. TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్  పూరించడానికి క్రింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి.

స్టెప్ 1: దరఖాస్తు రుసుము చెల్లింపు

TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించే ముందు, అభ్యర్థులు ముందుగా దరఖాస్తు రుసుమును చెల్లించాలి. TS PGECET దరఖాస్తు రుసుములను రెండు విధాలుగా చెల్లించవచ్చు-

AP/ TS ఆన్లైన్ మోడ్  - దరఖాస్తుదారులు AP / TS ఆన్‌లైన్ చెల్లింపు కేంద్రాలలో చెల్లించాలి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా వారి పేరు, తండ్రి పేరు, సెల్ ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, SSC హాల్ టికెట్ మరియు వారు SSCలో ఉత్తీర్ణత సాధించిన నెల మరియు సంవత్సరాన్ని తప్పనిసరిగా ఎంటర్  చేయాలి. ఫీజు చెల్లించిన తర్వాత ట్రాన్సక్షన్ ఐడీ ను అధికారిక వెబ్సైటు లో ఎంటర్ చేసి వారి అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేయడం కొనసాగించాలి.

డెబిట్/క్రెడిట్ కార్డ్ - దరఖాస్తు రుసుములను డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌తో ఆన్‌లైన్‌లో కూడా చెల్లించవచ్చు.

స్టెప్ 2: అప్లికేషన్ ఫార్మ్ ని పూరించండి

TS PGECET 2023  రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన తర్వాత  అభ్యర్థులు  తప్పనిసరిగా అప్లికేషన్ ఫార్మ్ ను పూర్తి చేయాలి. విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, అకడమిక్ డీటెయిల్స్ మొదలైన డీటైల్స్ అందించాలి. విద్యార్థులు TS PGECET 2023 అనుబంధ కళాశాలల జాబితా తెలుసుకోవాలి, అప్లికేషన్ ఫార్మ్ ని పూరించేటప్పుడు వారు తమ ఛాయిస్ ని అందించవలసి ఉంటుంది.

స్టెప్ 3: మీ చెల్లింపు స్థితిని తనిఖీ చేయండి

రుసుము చెల్లించి, అప్లికేషన్ ఫార్మ్ పూరించిన తర్వాత మీ చెల్లింపు స్థితిని తనిఖీ చేయండి, అది క్లియర్ చేయబడిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, ఫీజు చెల్లింపు నిర్దారించిన తర్వాత  TS PGECET అప్లికేషన్ ఫార్మ్ 2023 ను పూర్తి చేయడం కొనసాగించండి.

స్టెప్ 4: అప్లికేషన్ ఫార్మ్ సమర్పణ

చివరగా, అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ ఫార్మ్ ని సమర్పించాలి మరియు తదుపరి సూచన కోసం దాని యొక్క అనేక ప్రింట్‌అవుట్‌లను తీసుకోవాలి.

TS PGECET 2023 దరఖాస్తు రుసుము

TS PGECET 2023 దరఖాస్తు రుసుమును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, TS ఆన్‌లైన్ మరియు AP ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా చెల్లించవచ్చు. కేటగిరీ ప్రకారంగా TS PGECET 2023 అప్లికేషన్ ఫీజు క్రింది విధంగా ఉన్నాయి.

కేటగిరీ

దరఖాస్తు రుసుము

SC/ ST/ PWD కేటగిరీ విద్యార్థులు

INR 600

జనరల్ కేటగిరీ విద్యార్థులు

INR 1100

గమనిక- ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు రాయాలనుకుంటే, ప్రతి పరీక్షకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.

TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలపై ఈ పోస్ట్ సహాయపడింది అని మేము భావిస్తున్నాము. TS PGECET 2023 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/documents-required-to-fill-ts-pgecet-application-form/
View All Questions

Related Questions

I have only a short memo for my Intermediate (12th class). Is this acceptable for online verification and document upload for M.Pharm admission through TS PGECET 2025?”

-Shivani TallapalliUpdated on August 04, 2025 04:42 PM
  • 1 Answer
srishti chatterjee, Content Team

Dear student, No, a short memo will not be accepted. Official TS PGECET 2025 counselling requires a consolidated marks memo (CMM) for the Intermediate (12th class) examination, along with all other required educational documents for verification. While you can apply with the memo, admission confirmation will require the original, comprehensive documents.

READ MORE...

I want the pdf of previous year cutoff rank for TS PGECET

-DineshkumarUpdated on August 19, 2025 04:04 PM
  • 1 Answer
Lipi, Content Team

Hi student,

Unfortunately, the authority does not release any cutoff PDF. The TS PGECET cutoff is released in the form of opening and closing ranks. Moreover, if you wish to access the previous year's cutoff ranks, then you can check them on our TS PGECET 2025 cutoff page. The TS PGECET cutoff varied based on different colleges as well as specializations.

We hope this answer clears your query.

In case of further queries, you can write to hello@collegedekho.com or call our toll free number 18005729877, or simply fill out our Common Application Form on the website.

READ MORE...

Dear Convener, I have been allotted a PG seat through GATE, but the seat does not come under the fee reimbursement scheme. Therefore, I kindly request your guidance to secure a seat through my PGECET Rank 19 in the upcoming Phase-II counselling.

-Tammireddy Gowri NaiduUpdated on September 15, 2025 05:02 PM
  • 1 Answer
Rupsa, Content Team

Dear Student,

If fee reimbursement is an important criterion for admission, then participating in TS PGECET Phase-II counselling based on your rank of 19 is a feasible and appropriate course of action. To participate in the second phase of TS PGECET 2025 counselling, please ensure you have all your original certificates and documents ready for verification. You must complete the registration and fee payment within the stipulated period to be eligible for seat allotment. Although Phase II dates have not been announced yet, we suggest you keep checking the official website for the latest updates so that you don't …

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All