తెలంగాణ ఐసెట్ 2025 లోకస్ స్టేటస్ అర్హతలు, దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు (TG ICET 2025 Local Status)

Rudra Veni

Updated On: March 07, 2025 02:27 PM

తెలంగాణ ఐసెట్ 2025 దరఖాస్తు ప్రక్రియ (TS ICET 2025 Local Status) మార్చి 10 నుంచి ప్రారంభంకానుంది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు TG ICET 2025కి ఎలా దరఖాస్తు చేసుకోవాలో? ఇక్కడ అందించాం. 

 
తెలంగాణ ఐసెట్ 2025 లోకస్ స్టేటస్ అర్హతలు, దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు (TG ICET 2025 Local Status)

తెలంగాణ ఐసెట్ 2025 లోకల్ స్టేటస్ (TG ICET 2025 Local Status) : తెలంగాణ ఐసెట్ 2025 దరఖాస్తు ప్రక్రియ సోమవారం అంటే మార్చి 10 నుంచి ప్రారంభమవుతుంది. MCA, MBAల్లో రాణించాలనుకునే అభ్యర్థులు TG ICET 2025కి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తెలంగాణ ఐసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్ల గురించి ఇక్కడ అందించాం. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TG CHE) తరపున నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం TG ICET 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. TG ICET 2025 పరీక్ష జూన్ 8,  9 తేదీల్లో జరగనుంది. MGU నల్గొండ TG ICET రిజిస్ట్రేషన్ విండోను (లేట్ ఫీజు లేకుండా) మే 3న క్లోజ్ అవుతుంది. కనీసం 50 శాతం స్కోరుతో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్న అభ్యర్థులు TG ICET పరీక్షకు అర్హులవుతారు.

TG ICET 2025 అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇది విశ్లేషణాత్మక సామర్థ్యం, కమ్యూనికేషన్ సామర్థ్యం, మ్యాథ్స్ సామర్థ్యాన్ని పరీక్షించే మూడు వేర్వేరు విభాగాల నుంచి మొత్తం 200 MCQలను కలిగి ఉంటుంది. పరీక్ష రాసేవారు 150 నిమిషాల్లోపు అన్ని 200 MCQలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

TG ICET అర్హత ప్రమాణాలు 2025 (TG ICET Eligibility Criteria 2025)

తెలంగాణ ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హత ప్రమాణాలను 2025 ఇక్కడ తెలుసుకోండి.
  • అభ్యర్థులు ఏ విభాగంలోనైనా కనీసం 50 శాతం (రిజర్వ్డ్ కేటగిరీలకు 45 శాతం) మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
  • అభ్యర్థులు భారతీయ పౌరులు అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల (ప్రవేశ నిబంధనలు) ఆర్డర్, 1974లో పేర్కొన్న స్థానిక/స్థానికేతర హోదా కోసం ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • TG ICET 2025 ద్వారా ప్రవేశం కోరుకునే విదేశీ పౌరులు సంబంధిత విశ్వవిద్యాలయాలు నిర్దేశించిన సాధారణ మరియు నిర్దిష్ట అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

తెలంగాణ ఐసెట్ లోకల్ స్టేటస్ 2025  (TG ICET 2025 Local Status)

తెలంగాన ఐసెట్‌ 2025కు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఉండాల్సిన లోకల్ స్టేటస్‌ అర్హతలు ఏమిటో ఇక్కడ చూడండి.
  • OU ప్రాంతానికి చెందిన స్థానిక అభ్యర్థులుగా ప్రకటించడానికి అర్హులైన అభ్యర్థులందరూ అర్హులు.
  • రాష్ట్రం వెలుపల చదువుకున్న కాలాలను మినహాయించి మొత్తం పది సంవత్సరాల కాలం రాష్ట్రంలో నివసించిన అభ్యర్థులు లేదా రాష్ట్రం వెలుపల ఉద్యోగ కాలాలను మినహాయించి మొత్తం పది సంవత్సరాల పాటు తల్లిదండ్రులలో ఒక్కరైనా నివసించిన వారి పిల్లలు అర్హులు.
  • ఈ రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు మరియు రాష్ట్రంలోని ఇతర సారూప్య పాక్షిక ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రుల పిల్లలు అర్హులు.
  • రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం లేదా విశ్వవిద్యాలయం లేదా ఇతర సమర్థ అధికారం, రాష్ట్రంలోని ఇలాంటి ఇతర పాక్షిక ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగం చేస్తున్న వారి జీవిత భాగస్వాములు అభ్యర్థులు.

TS ICET దరఖాస్తు ఫార్మ్ 2025 కోసం అవసరమైన పత్రాల జాబితా (List of Documents Required for TS ICET Application Form 2025)

TS ICET 2025 దరఖాస్తు ఫార్మ్‌ను పూరించే ప్రక్రియకు అభ్యర్థి ఈ కింది డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఈ డాక్యుమెంట్లన్ని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది దరఖాస్తును ఒకేసారి పూరించడానికి వారికి సహాయపడుతుంది.
  • పదో తరగతి మార్కుల షీట్
  • ఇంరట్మీడియట్ మార్కుల సీట్
  • డిగ్రీ మార్కుల షీట్
  • ఆధార్ కార్డ్
  • ఫోన్ నెంబర్
  • స్కోన్ చేసిన అభ్యర్థి ఫోటో
  • స్కాన్ చేసిన అభ్యర్థి సంతకం
  • క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ వివరాలు

TS ICET దరఖాస్తు ఫార్మ్ 2025 (TG ICET Application Form 2025)

TS ICET 2025 రిజిస్ట్రేషన్లు అధికారిక వెబ్‌సైట్ icet.tsche.ac.inలో చేసుకోవచ్చు. తెలంగాణలో MBA లేదా MCA అడ్మిషన్ల కోసం ఆశించే అభ్యర్థులు TS ICET దరఖాస్తు ఫార్మ్‌ను పూరించి సబ్మిట్ చేయాలి.  TS ICET 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సంబంధిత డాక్యుమెంట్లను ఇతర దశలతో పాటు అప్‌లోడ్ చేయాలి. TG ICET దరఖాస్తు ఫార్మ్ 2025ని పూరించి సబ్మిట్ చేయడానికి దశలవారీ ప్రక్రియ దిగువన అందించాం.
  • మొదటి దశ: TS ICET దరఖాస్తు ఫీజు చెల్లింపు
  • రెండో దశ: TS ICET దరఖాస్తు ఫీజు చెల్లింపు స్థితిని చెక్ చేయడం
  • మూడో దశ: వ్యక్తిగత వివరాలను పూరించడం
  • నాలుగో దశ: విద్యా వివరాలను పూరించడం
  • ఐదో దశ: డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడం

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ts-icet-2025-local-status-required-documents-for-application-form/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Management Colleges in India

View All