AP ICET 2026 నోటిఫికేషన్ విడుదల, రిజిస్ట్రేషన్ , పరీక్షా విధానం, సిలబస్ గురించి ఇక్కడ తనిఖీ చేయండి

manohar

Published On:

AP ICET 2026 నోటిఫికేషన్ విడుదలైంది. MBA, MCA కోర్సులకు ప్రవేశం కోసం పరీక్ష మే 2,2026న నిర్వహించబడనుంది. అర్హతలు, ఫీజు, పరీక్ష విధానం, ముఖ్యమైన తేదీల పూర్తి వివరాలు విడుదలయ్యాయి. పూర్తి సమాచారం కోసం క్రింద ఉన్న కథనాన్ని చదవండి.

AP ICET 2026 Registration and  Exam Pattern, Syllabus

AP ICET 2026 అనేది ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సాధారణంగా దీన్ని ICET అనే పేరుతో పిలుస్తారు. ఈ పరీక్ష ఆంధ్రప్రదేశ్‌లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) మరియు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA ) కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తారు. ICETలో అభ్యర్థుల విశ్లేషణాత్మక సామర్థ్యం, ​​గణిత సామర్థ్యం, ​​కమ్యూనికేషన్ నైపుణ్యాలు పరీక్షిస్తారు. ఈ ఎంట్రాన్స్ టెస్ట్‌లో వచ్చిన ర్యాంక్‌ను ఆధారంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు మరియు వాటికి అనుబంధ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. ప్రతి ఏడాది వేలాది మంది డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు.

AP ICET–2026 నోటిఫికేషన్‌ని ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం విడుదల చేసింది. ఈ పరీక్షను AP రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) తరఫున ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి MBA, MCA అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. నోటిఫికేషన్‌లో పరీక్ష తేదీ, దరఖాస్తు ప్రక్రియ, ఫీజు వివరాలు, అర్హతలు, పరీక్ష విధానం వంటి వివరాలు ఉన్నాయి.

AP ICET 2026 ముఖ్యమైన తేదీలు (AP ICET 2026 Important Dates)

AP ICET 2026 నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు, పరీక్ష మరియు ఫలితాల సంబంధించిన అన్ని తేదీలను అభ్యర్థులు ఈ క్రింద ఉన్న టేబుల్ పట్టికలో చూడండి.

వివరాలు

తేదీలు

AP ICET 2026 నోటిఫికేషన్‌ విడుదల తేదీ

ఫిబ్రవరి 04,2026

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ

ఫిబ్రవరి 05,2026

లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చివరి తేదీ

మార్చి 02,2026

రూ.1000 లేట్ ఫీజుతో దరఖాస్తు తేదీలు

మార్చి 03,2026 నుండి మార్చి 07,2026

రూ.2000 లేట్ ఫీజుతో దరఖాస్తు తేదీలు

మార్చి 08,2026 నుండి మార్చి 12,2026

రూ.4000 లేట్ ఫీజుతో దరఖాస్తు తేదీలు

మార్చి 13,2026 నుండి మార్చి 17,2026

రూ.10,000 లేట్ ఫీజుతో దరఖాస్తు తేదీలు

మార్చి 18,2026 నుండి మార్చి 21,2026

అప్లికేషన్ కరెక్షన్ తేదీ

మార్చి 23,2026

హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ

ఏప్రిల్ 15,2026 నుండి

AP ICET 2026 పరీక్ష తేదీ

మే 02,2026

ప్రిలిమినరీ కీ విడుదల

మే 05,2026 సాయంత్రం 05 గంటలకు

ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల చివరి తేదీ

మే 07,2026 సాయంత్రం 05 గంటలకు

ఫలితాలు & ర్యాంకుల ప్రకటన తేదీ

మే 16,2026

AP ICET 2026 దరఖాస్తు ఫీజు వివరాలు (AP ICET 2026 Application Fee Details)

AP ICET 2026కి దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ కేటగిరీకి అనుగుణంగా ఈ క్రింద ఇచ్చిన విధముగా ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

  • OC అభ్యర్థులు: రూ. 750
  • BC అభ్యర్థులు: రూ. 700
  • SC / ST అభ్యర్థులు: రూ. 650
  • ఫీజు ఆన్‌లైన్ రూపంలో మాత్రమే చెల్లించాలి
  • డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు
  • ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు
  • లేట్ ఫీజుతో దరఖాస్తు చేసినట్లయితే అదనపు రుసుము ఉండవచ్చు

AP ICET 2026 అర్హతలు (AP ICET 2026 Eligibility)

AP ICET 2026 రాయాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో చెప్పిన అర్హతలను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి.

  • అభ్యర్థి భారత పౌరుడు కావాలి
  • ఆంధ్రప్రదేశ్ స్థానిక / నాన్‑లోకల్ నిబంధనలు పాటించాలి
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీలో నుండి 3 లేదా 4 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

MBA కోర్సు కోసం:

  • ఏ విభాగంలోనైనా డిగ్రీ ఉతీర్ణత సరిపోతుంది

MCA కోర్సు కోసం:

  • డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ స్థాయిలో గణితం (Mathematics) ఒక విషయం‌గా ఉండాలి

AP ICET 2026 పరీక్ష విధానం (AP ICET 2026 Exam Pattern)

AP ICET 2026 ద్వారా అభ్యర్థుల విశ్లేషణ సామర్థ్యం, గణిత నైపుణ్యం మరియు కమ్యూనికేషన్ సామర్థ్యంలను పరీక్షిస్తారు. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత (ఆన్‌లైన్) రూపంలో జరుగుతుంది.ప్రతి ప్రశ్నకు 1 మార్కు . నెగటివ్ మార్కింగ్ లేదు. మొత్తం పరీక్ష వ్యవధి 150 నిమిషాలు.

విభాగం

సెక్షన్ పేరు

ప్రశ్నల సంఖ్య

మార్కులు

సెక్షన్ – A

విశ్లేషణ సామర్థ్యం (Analytical Ability)

75

75

సెక్షన్ – B

కమ్యూనికేషన్ సామర్థ్యం (Communication Ability)

70

70

సెక్షన్ – C

గణిత సామర్థ్యం (Mathematical Ability)

55

55

మొత్తం

—-------

200

200

AP ICET 2026 పరీక్ష కేంద్రాలు (AP ICET 2026 Exam Centers)

AP ICET 2026 పరీక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మరియు హైదరాబాద్‌లోని వివిధ కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో తమకు అనుకూలంగా 5 పరీక్ష కేంద్రాలు తప్పనిసరిగా ఎంపిక చేయాలి. అభ్యర్థుల ఎంపికలు మరియు అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా పరీక్ష కేంద్రాలు కేటాయించబడతాయి. ఒకసారి కేంద్రం కేటాయించబడిన తర్వాత సాధారణంగా మార్పు ఉండదు. అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, కాకినాడ నగరాలతో పాటు హైదరాబాద్‌లో కూడా AP ICET 2026 నిర్వహించబడుతుంది.

AP ICET 2026 ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు (Objections to AP ICET 2026 Preliminary Key)

AP ICET 2026 పరీక్ష పూర్తయ్యాక అధికారిక ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్‌తో ఆన్సర్ కీని జాగ్రత్తగా పరిశీలించి ఏదైనా ప్రశ్న లేదా సమాధానంలో పొరపాటు ఉన్నట్టు అనిపించినప్పుడు నిర్ణీత గడువులో ఆన్‌లైన్ ద్వారా అభ్యంతరాలు నమోదు చేయవచ్చు. ప్రతి ప్రశ్నకి అభ్యంతరం నమోదు చేయడానికి రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీ అన్ని అభ్యంతరాలను పరిశీలించి సరైనదిగా భావిస్తే ఆన్సర్ కీ సవరిస్తుంది. అభ్యంతరం సరైనదిగా ఉంటే చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడుతుంది. కమిటీ తుది నిర్ణయంగా భావించబడుతుంది.

మొత్తంగా చెప్పాలంటే, AP ICET 2026 MBA మరియు MCA కోర్సులలో ప్రవేశం ఆశించే అభ్యర్థుల కోసం అత్యంత కీలకమైన పరీక్ష. నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీలు, అర్హతలు, పరీక్ష విధానం మరియు ఇతర ముఖ్య సూచనలను ముందుగానే తెలుసుకుని సిద్ధంగా ఉంటే మంచి ర్యాంక్ సాధించడంలో సహాయపడుతుంది.

/articles/ap-icet-2026-notification-mba-mca-exam-details/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Management Colleges in India

View All
Top