TS ECET ఫలితం 2026: తేదీ, స్కోర్ కార్డు వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి.

manohar

Published On:

TS ECET 2026 పరీక్ష మే 15, 2026న నిర్వహించబడుతుంది. పరీక్ష పూర్తయ్యాన తర్వాత ఫలితాల విడుదలకు సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటిస్తారు.TS ECET 2026 పరీక్ష తేదీల ఫలితాల గురించి అప్‌డేట్స్‌ను ఈ ఆర్టికల్‌లో అందించాము.

TS ECET Result 2026: Date, Details Mentioned, How to Check

TS ECET 2026 పరీక్షలు మే 15, 2026న అధికారికంగా నిర్వహించబడతాయి. ఈ పరీక్ష ఒకే రోజున, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కంప్యూటర్ ఆధారంగా జరుగుతుంది. పరీక్ష ముగిసిన వెంటనే ఫలితాలపై ఆసక్తి మొదలవుతుంది. సాధారణంగా అధికారులు ముందుగా ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసి అభ్యంతరాల నుంచి అభ్యర్ధనలు స్వీకరిస్తారు. అన్ని అభ్యంతరులను పరిశీలించిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీని సిద్ధం చేస్తారు. ఆ ప్రక్రియ పూర్తైన తర్వాతే TG ECET 2026 ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు. ఫలితాల్లో అభ్యర్థి మార్కులు, ర్యాంక్, క్వాలిఫై స్థితి స్పష్టంగా చూపిస్తారు. అందుచేత ప్రతి అభ్యర్థి తన ఫలితాన్ని జాగ్రత్తగా పరీక్షించి స్కోర్‌కార్డ్‌ను భద్రంగా పెట్టుకోవాలి.

TS ECET 2026 ఫలితాలు ఎప్పుడు విడుదల కావచ్చు అనే ప్రశ్నకు, గత ట్రెండ్స్‌ను చూసితే పరీక్ష తేదీ నుంచి సుమారు 10 నుంచి 15 రోజుల్లోలో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈసారి పరీక్ష మే 15న జరగనుంది, ఫలితాలు ఎక్కువగా మే చివరి వారం లేదా జూన్ మొదటి వారం 2026లో ప్రకటించే అవకాశమే ఉంది. ఖచ్చితమైన తేదీని మాత్రం అధికారులు వారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తారు. దీంతో అభ్యర్థులు అనవసర ఊహాగానాలు నమ్మకుండా, కేవలం అధికారిక నోటిఫికేషన్లను ఫాలో అవుతూ ఉండాలి. ఫలితాల విడుదల తరువాత వెంటనే కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది విషయం దృష్టిలో పెట్టుకుని అవసరమైన సర్టిఫికెట్లను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది.

TS ECET 2026 ముఖ్యమైన తేదీలు (TS ECET 2026 Important Dates)

ఈ క్రింద TS ECET 2026 నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్, చివరి తేదీలు మరియు పరీక్ష తేదీలు అధికారికంగా విడుదలైన వివరాల ఆధారంగా ఈ పట్టిక రూపంలో అందిస్తునాం.

వివరాలు

తేదీలు

TS ECET 2026 నోటిఫికేషన్ విడుదల తేదీ

ఫిబ్రవరి 5, 2026

TS ECET 2026 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ

ఫిబ్రవరి 9, 2026

లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకునే చివరి తేదీ

ఏప్రిల్ 18,2026

TS ECET 2026 పరీక్ష తేదీ

మే 15,2026

TS ECET 2026 పరీక్ష సమయం

ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు

దరఖాస్తు ఫీజు (జనరల్ / BC )

రూ. 900

దరఖాస్తు ఫీజు (SC/ ST )

రూ. 500

TS ECET అధికారిక వెబ్‌సైట్

ecet.tgche.ac.in

TS ECET 2026 ఫలితాలు ఎలా చెక్ చేయాలి? (How to check TS ECET 2026 results?)

TS ECET 2026 ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ క్రింద ఇచ్చిన దశల ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ecet.tgche.ac.in ను ఓపెన్ చేయాలి
  • ఆ తరువాత హోమ్‌పేజీలో ఉన్న “TS ECET 2026 Result” లింక్‌పై క్లిక్ చేయాలి
  • హాల్ టికెట్ నంబర్ నమోదు చేయాలి
  • పుట్టిన తేది (Date of Birth) ఎంటర్ చేయాలి
  • “Submit / Get Result” బటన్‌పై క్లిక్ చేయాలి
  • స్క్రీన్‌పై మీ ఫలితం మరియు ర్యాంక్ కనిపిస్తుంది
  • ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి

TS ECET 2026 ఫలితాల్లో పేర్కొన్న వివరాలు (Details mentioned in TS ECET 2026 results)

TS ECET 2026 ఫలితాల్లో అభ్యర్ధికి సంబంధించిన ముఖ్యమైన ఈ క్రింద ఇచ్చిన విధముగా వ్యక్తిగత, పరీక్ష మరియు ర్యాంక్ వివరాలు స్పష్టంగా ఇవ్వబడతాయి.

  • అభ్యర్థి పేరు
  • హాల్ టికెట్ నంబర్
  • రిజిస్ట్రేషన్ / అప్లికేషన్ నంబర్
  • పుట్టిన తేది
  • అభ్యర్థి కేటగిరీ (General / BC / SC / ST)
  • హాజరైన బ్రాంచ్ / కోర్సు పేరు
  • మొత్తం మార్కులు
  • పొందిన ర్యాంక్
  • క్వాలిఫై అయిన స్థితి (Qualified / Not Qualified)
  • కౌన్సెలింగ్‌కు అర్హత వివరాలు

TS ECET 2026 ముఖ్యమైన సూచనలు (TS ECET 2026 Important Instructions)

TS ECET 2026కి సంబంధించిన పరీక్ష, ఫలితాలు మరియు కౌన్సెలింగ్ ప్రక్రియలో ఈ ముఖ్యమైన సూచనలను తప్పకుండా పాటించాలి.

  • అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే తరచుగా చెక్ చేయండి.
  • అప్లికేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్‌ను సురక్షితంగా ఉంచుకోండి.
  • పరీక్ష రోజు హాల్ టికెట్ మరియు చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ తప్పనిసరి.
  • ఫలితాలు విడుదలయ్యిన వెంటనే స్కోర్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసి ప్రింట్ కాపీ తీసుకోండి.
  • ఫలితాల్లో ఇచ్చిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో వెంటనే పరిశీలించాలి.
  • కౌన్సెలింగ్ సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
  • అధికారికంగా ప్రకటించని తేదీలు లేదా వార్తలను నమ్మకండి.
  • లేట్ ఫీజు, కౌన్సెలింగ్ తేదీల గురించి అప్డేట్స్ కోసం అధికారిక నోటిఫికేషన్లు ఫాలోఅవ్వాలి.

TG ECET 2026 అర్హత ఉన్న విద్యార్థులకు ఇంజినీరింగ్ లేటరల్ ఎంట్రీ ద్వారా మంచి అవకాశాలిచ్చే ముఖ్యమైన పరీక్ష. అధికారిక తేదీలను గమనించి సమయానికి దరఖాస్తు చేయడం, ఫలితాలు మరియు కౌన్సెలింగ్ అప్డేట్స్ కోసం వెబ్‌సైట్‌ని తరుచూ తనిఖీ చేస్తూ ఉండటం మంచిది.

/articles/tg-ecet-2026-result-date-update-exam-completion/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Recent Related News

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All
Top