ఏపీ ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఇక్కడ గత ట్రెండ్‌లను అనుసరించి పరీక్షా ఫలితాలు ఎప్పుడొస్తాయో అంచనాగా తెలియజేశాం. బోర్డు ప్రకటించిన తర్వాత ఫలితాల విడుదల తేదీని ఇక్కడ అందిస్తాం.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ (AP ఇంటర్) 2026 మొదటి, రెండో సంవత్సర ఫలితాలను బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BIEAP) ఏప్రిల్ 2026 నెలలో విడుదల చేసే ఛాన్స్ ఉంది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్లను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌లైన bie.ap.gov.in, resultsbie.ap.gov.in లలో తమ ఫలితాలను చెక్ చేయవచ్చు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24, 2026లో జరగనున్నాయి. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 25, 2026వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్షల అనంతరం ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఇంటర్ పరీక్షా ఫలితాలు చాలా కీలకం. చాలా ప్రవేశ పరీక్షలకు ఇంటర్ ఫలితాలను ప్రాధాన్యంగా తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు.
అయితే ఈ ఏడాది అంటే 2026లో ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఏ తేదీన వచ్చే అవకాశం ఉందో.. తెలుసుకోవాలి. ఫిబ్రవరి, మార్చిలో పరీక్షలైపోతున్నాయి కాబట్టి.. త్వరలోనే రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. కానీ కచ్చితంగా తేదీలను అంచనా వేయాలంటే మనం గత సంవత్సరాల ట్రెండ్‌లను పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే గత మూడేళ్లుగా ఏపీ ఇంటర్ ఫలితాలు పరీక్షలు ముగిసిన 22, 23 రోజుల్లో విడుదలవుతున్నాయి. కేవలం 2022లో మాత్రమే పరీక్షలు జరిగిన 29 రోజులకి రిజల్ట్స్ వచ్చాయి. ఈ విధంగా చూసుకుంటే 2026 పరీక్షలు ముగిసిన 22 నుంచి 25 రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయి. అంటే ఏప్రిల్ 16 లేదా ఏప్రిల్ 17, 20 తేదీల్లో రిజల్ట్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
నిజానికి కోవిడ్ వైరస్ కారణంగా 2021, 2022 సంవత్సరాల్లో విద్యా సంవత్సరంపై ప్రభావం పడింది. అందుకే అప్పుడు ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు, వాటి ఫలితాలు కూడా విడుదల కావడానికి కూడా చాలా ఆలస్యమైంది. కానీ 2023, 2024, 2025 సంవత్సరాల్లో పరీక్షలకు, ఫలితాలు విడుదలకు మధ్య గ్యాప్ చాలా వరకు తగ్గింది. ఇలా చూసుకున్నా ఈ ఏడాది కచ్చితంగా ఏప్రిల్ నెలలోనే ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఇది కేవలం అంచనాగా మాత్రమే అందిస్తున్నాం. విద్యార్థులు ఇది గమనించాలి. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన తర్వాత అసలైన విడుదల తేదీని మేము అప్‌డేట్ చేస్తాం.
ఏపీ ఇంటర్ ఫలితాలు ఏ ఏడాదిలో ఏ తేదీల్లో విడుదలయ్యాయి?
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు గత నాలుగేళ్లలో పరీక్షలు ముగిసిన ఎన్ని రోజులకు ఏ తేదీల్లో విడుదలయ్యాయో ఈ దిగువున అందించాం. విద్యార్థులు గమనించవచ్చు.
సంవత్సరం | పరీక్షలు ముగిసిన తేదీలు | ఫలితాలు వెల్లడించిన తేదీ | పరీక్షలకు, ఫలితాలకు మధ్య ఉన్న గ్యాప్ |
|---|---|---|---|
2025 | మార్చి 20 | ఏప్రిల్ 12, 2025 | 23 రోజులు |
2024 | మార్చి 20 | ఏప్రిల్ 12 | 23 రోజులు |
2023 | ఏప్రిల్ 4వ తేదీన | ఏప్రిల్ 24 | 22 రోజులు |
2022 | మే 24, 2022 | జూన్ 22 | 29 రోజులు |
ఏపీ ఇంటర్ ఫలితాలు 2026 అంచనా విడుదల తేదీ
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2026 ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో ఇచ్చిన తేదీల్లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత మూడు, నాలుగేళ్ల ఫలితాల విడుదల తేదీ ట్రెండ్స్‌ను అనుసరించి అంచనాగా ఈ తేదీలను అందించాం. ఇవి కేవలం అంచనాగా అందించిన తేదీలు మాత్రమే ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
ఏపీ ఇంటర్ ఫలితాలు అంచనా | తేదీ |
|---|---|
రిజల్ట్స్ విడుదల తేదీ -1 (అంచనా) | ఏప్రిల్ 16 |
రిజల్ట్స్ విడుదల తేదీ -2 (అంచనా) | ఏప్రిల్ 17 |
రిజల్ట్స్ విడుదల తేదీ -3 (అంచనా) | ఏప్రిల్ 20 |
ఎన్ని మార్కులు వస్తే విద్యార్థులు పాస్ అవుతారు?
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా విధానంలో ఈ ఏడాదే మార్పులు చేర్పులు చేశారు. దాని ప్రకారం క్వాలిపైయింగ్ మార్కులు కూడా చిన్న చిన్న మార్పులు జరిగాయి. ముఖ్యంగా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మార్కుల్లో కొత్త నిబంధనలు వచ్చాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. థియరీ పరీక్షల్లో 30 శాతం మార్కులు సాధించినా మొత్తంగా అంటే థియరీ, ప్రాక్టీకల్స్‌లో 35 శాతం మార్కులు సాధిస్తేనే పాసైనట్టు. సైన్స్ ప్రాక్టీకల్స్‌కి విద్యార్థులు 11 మార్కులు సాధిస్తే చాలు క్వాలిఫై అయినట్టే.
సబ్జెక్టులు | ఎన్ని మార్కులకు పేపర్ | 30 శాతం పాస్ మార్కులు |
|---|---|---|
లాంగ్వేజ్ పేపర్లు (తెలుగు, ఇంగ్లీష్, సంస్కృతం) | 100 | 35 మార్కులు |
మ్యాథ్స్ (1A, 1B (ఒకేపేపర్)) | 100 | 35 మార్కులు |
ఫిజిక్స్, కెమిస్ట్రీ | 85 (థియరీ) | 29 మార్కులు |
బయాలజీ | 85 (థియరీ) | 29 మార్కులు |
2వ సంవత్సరం విద్యార్థులకు పాస్ మార్కులు ఎంతంటే?
2026లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పాస్ మార్కుల విధానం పాత పద్ధతిలోనే ఉంటుంది. అంటే 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే విద్యార్థులు గతంలో కంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మ్యాథ్స్ 1A, 1B పేపర్లను కలపి ఇప్పుడు 100 మార్కులకు ఒకే పేపర్‌గా మార్చారు. బోటనీ, జువాలజీలను కలిపి ఒకే సబ్జెక్టుగా పరిగణిస్తారు. 80 శాతం ఫైనల్ ఎగ్జామ్ మార్కులు, 20 శాతం ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల వెయిటేజీ విధానం కూడా అమల్లో ఉంది.
ఎన్ని మార్కులకు పేపర్ | పాస్ మార్కులు ఎంత? |
|---|---|
100 మార్కులు | 35 మార్కులు |
75 మార్కుల పేపర్ (మ్యాథ్స్) | 26 మార్కులు |
60 మార్కుల పేపర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ) | 21 మార్కులు |
ఇంటర్ ఫలితాల్లో పాస్ అయితే ఏమవుతుంది?
ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు పాసైతే వారి వారి ఇష్టాలను బట్టి ఎంసెట్ రాసి ఇంజనీరింగ్, మెడికల్ వైపు అడుగులు వేయవచ్చు. లేదంటే తమకు నచ్చిన కోర్సుల్లో డిగ్రీలో జాయిన్ అయి చదువును సాగించవచ్చు. ఈ ఇంటర్ ఫలితాల్లో మార్కులను బట్టి.. అభ్యర్థులు మంచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తమ లక్ష్యంవైపుగా అడుగులు వేయాలంటే ఇంటర్ ఫలితాలే కీలకం అని చెప్పుకోవచ్చు.ఇంటర్ ఫెయిలైతే?
ఇంటర్మీడియట్‌లో విద్యార్థులెవరైనా ఫెయిలైతే.. ఏ మాత్రం భయపడాల్సిన, బెంగపడాల్సిన అవసరం లేదు. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్లు ఫెయిల్ అయిన తర్వాతే అత్యున్నత దశకు చేరుకున్న చరిత్ర ఉంది. కాబట్టి ఇంటర్‌లో ఫెయిల్ అవ్వడం అనేది జీవితాన్ని ఆపేసి, మార్చేసేది కాదు. ఇది ఎదుగుదలలో భాగంగానే చూడాలి.అభ్యర్థులు ఇంటర్ పెయిల్ అయ్యారని తెలిసిన వెంటనే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అందులో మొదట తక్షణమే చేయాల్సిన పనులు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. మీకు రావాల్సిన మార్కుల కంటే తక్కువ వచ్చాయని నమ్మకం ఉంటే ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.
వెంటనే సప్లిమెంటరీ పరీక్షలకు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. సప్లిమెంటరీ పరీక్షల తేదీలను బోర్డు ప్రకటిస్తుంది. ఆ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత విద్యార్థులు ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాలి. అసలు మీరు ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో ఎక్కడ వీక్‌గా ఉన్నారో వాటిని గుర్తించాలి. గత సంవత్సరాల మోడల్ పేపర్లను సాధన చేయాలి. ముఖ్యమైన ఛాప్టర్లను మళ్లీ మళ్లీ చదవుతూ ఉండాలి. మీకు అర్థం కాని సబ్జెక్టులు, సిలబస్‌లో సందేహాలను మీ స్నేహితులను, టీచర్లను అడిగి తెలుసుకోవాలి.
వేరే కారణాల వల్ల ఒక వేళ విద్యార్థులు రెగ్యులర్ పద్ధతిలో ఇంటర్ చేయడం కష్టంగా ఉంటే ఓపెన్ ఇంటర్మీడియట్ చేయవచ్చు.















Similar Articles
Boost Your MAH B.Ed CET 2026 RC Speed with These Smart Tips
MAH B.Ed CET 2026 Idioms & Phrases to Score 25+ Easily
Colleges Accepting CUET in MP - State, Central, Deemed & Private Colleges List
5 Certifications You Can Do While Waiting for Your CTET Results
CTET vs KVS vs DSSSB: Which is Better for Teaching Aspirants in 2026?
Difference between CTET & TET Exam - Check How to Apply, Exam Pattern & Syllabus