JEE మెయిన్ 2024 జనవరి సెషన్‌కు చివరి 15 రోజుల్లో ఎలా సిద్ధం కావాలి? (How to Prepare for JEE Main 2024 January Session in Last 15 days?)

Guttikonda Sai

Updated On: September 11, 2023 12:08 PM

 మేము 15 రోజుల్లో JEE మెయిన్ 2024 కి సిద్ధం కావడానికి మీకు సహాయపడే కొన్ని ఉపయోగకరమైన చిట్కాలను మరియు అంతిమ ప్రణాళికను రూపొందించాము.

JEE Main Preparation Tips

JEE మెయిన్ 2024ఎగ్జామ్ అఫిషియల్ వెబ్ సైట్ nta.nic.in సూచించిన ప్రకారం జనవరి మరియు ఏప్రిల్ సెషన్లలో నిర్వహించనున్నారు. దేశంలోనే అత్యంత ఛాలెంజింగ్ మరియు పాపులర్ అయిన ఇంజనీరింగ్ అడ్మిషన్స్ సంబంధించిన ఎగ్జామ్స్ లలో ఒకటి అయినా ఈ ఎగ్జామ్ ని ఫేస్ చేయడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో వేలాది మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా ,అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్మార్ట్ మైండ్ గల విద్యార్థులు ఒకరిపై ఒకరు పోటీ పడడానికి సిద్ధమవుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. నిజానికి చెప్పాలంటే ఈ JEE మెయిన్ 2023  ఎగ్జామ్ దేశంలోని అత్యంత కష్టమైన ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ లో ఒకటి, విద్యార్థులందరూ ఈ మిగిలిన 15 రోజులలో ఒక స్ట్రాటజిక్ ప్లాన్, పట్టుదల మరియు అవసరమైన మోటివేషన్తో వారి మొదటి అటెంప్ట్ లో ఈ ఎగ్జామ్ లో మంచి మార్కులు సాధించగలరు.

క్విక్ లింక్ - JEE Main paper solving strategy

విద్యార్థులకు వారి ప్రిపరేషన్కు సహాయం చేసే క్రమంలో భాగంగా  JEE  మెయిన్ 2024ఎక్సమ్ కి ప్రిపేర్ కావడానికి ఒక మంచి ప్లానును CollegeDekho అందిస్తుంది. విద్యార్థులు తమ JEE మెయిన్ 2024ఎక్సమ్ ఫేజ్-1 కు రెడీ కావడానికి మేము అత్యంత ప్రభావంతమైన లాస్ట్-మినిట్ స్టడీ మెథడ్స్ ను ఇందులో పొందుపరిచాము. కాబట్టి విద్యార్థులందరూ మేము ఇస్తున్న గైడ్లైన్స్ ను ఫాలో అవ్వడం వలన ఎగ్జామ్లో ఎక్కువ మార్కులను పొందే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి - JEE Main Passing Marks 2023

15 రోజుల్లో JEE మెయిన్‌కు సిద్ధం కావడానికి చిట్కాలు (Tips to Prepare for JEE Main in 15 days)

స.నెం.

ప్రిపరేషన్ ట్రిక్స్

1

రివిజన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేయండి

2

మీ షెడ్యూల్ ను ఫాలో అవ్వండి.

3

టైం మేనేజ్మెంట్

4

పోమోడోరో విధానాన్ని అనుసరించండి

5

సులభంగా ఉండే నోట్స్ రాసుకోండి.

6

రోజు వారీ టాపిక్స్ షెడ్యూల్ చేయండి

7

ముఖ్యమైన  ప్రశ్నలను  ప్రాక్టీస్ చేయండి

8

ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్‌లను సాల్వ్ చేయండి.

9

మీ పరీక్షా వ్యూహాన్ని ఆప్టిమైజ్ చేయండి

10

కొత్త అంశాన్ని ప్రారంభించవద్దు

11

నెగెటివ్ గా ఆలోచించవద్దు

12

ఆందోళన చెందవద్దు

మంచి అవగాహన కలిగి ఉండటానికి ప్రతి పాయింటర్‌ను వివరణాత్మక మార్గంలో చూద్దాం.

1. రివిజన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేయండి

విద్యార్థులు ముందుగా 15 రోజులలో తమ రివిజన్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి.విద్యార్థులు ప్రతి కోర్సుకు ఐదు రోజుల చొప్పున కేటాయిస్తే మంచి మార్కులు పొందగలరు.ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ టైం టేబుల్ కు విద్యార్థులు కట్టుబడి ఉండాలి,లేకపోతే ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేయడం వీలు కాదు.కాబట్టి,ఎప్పుడు మీరు ఏమి రివిజన్ చేయాలనుకుంటున్నారో పూర్తిగా అది మీ ఇష్టంతో కూడుకున్నది.అది పూర్తి సిలబస్ అయిన లేదా సిలబస్ లో కొంత భాగమైన అనేది మీ వీలును బట్టి ఎంచుకోండి. విద్యార్థులు తాము ఎంచుకున్న సిలబస్ లో నుండి  కీ పాయింట్స్ మీద దృష్టి పెట్టవచ్చు లేదా డీప్ గా కూడా వాటిని రివైజ్ చేసుకోవచ్చు. ఏది ఏమైనా కూడా పూర్తిగా విద్యార్థుల ఎంపికపై ఆధారపడి ఉంటుంది.

2. మీ షెడ్యూల్ ను ఫాలో అవ్వండి.

JEE మెయిన్ స్టడీ మెటీరియల్ మరియు అన్ని ఫార్ములాలను షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ రోజు వరకు కనీసం రోజుకు ఒకసారి గుర్తు తెచ్చుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. అదేవిధంగా ఒక చార్ట్ మరియు స్టిక్ నోట్స్ను బెడ్ కు  దగ్గరలో పెట్టుకోవడం వలన వాటిని చెక్ చేసుకునే వీలు ఉంటుంది.

3. టైం మేనేజ్మెంట్

ప్రాక్టీస్ ఎగ్జామ్స్ లేదా ప్రీవియస్ ఇయర్ పేపర్ ను ఆన్సర్ చేస్తున్నప్పుడు టైం ని మ్యానేజ్ చేయడంపై కాన్సెంట్రేట్ చేయాలి. రియలిస్టిక్ స్ట్రాటజీని  పెంపొందించుకోవడం వలన నిజంగా చాలా మేలు కలుగుతుంది. ఉదాహరణకు,ఒకవేళ నిజమైన ఎగ్జామ్ షెడ్యూలు మధ్యాహ్నం మూడు గంటలకు అనుకుంటే విద్యార్థులు తమ మాక్ టెస్ట్ ను మధ్యాహ్నం అదే టైముకు ప్రాక్టీస్ చేసేలా టైమును సెట్ చేసుకోవాలి.విద్యార్థులు అసలైన JEE మెయిన్ ఎగ్జామ్ టైమింగ్స్ ను ఫాలో అవ్వడం వలన తమ టైమును మేనేజ్ చేసుకోవడంలో కొంతలో కొంత ఎక్స్పీరియన్స్ ను పొందగలరు.

4. పోమోడోరో విధానాన్ని అనుసరించండి

మీరు తొందరగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారా? ఒకవేళ అలా అయితే మీకు ఈ పోముడోరో టెక్నిక్ అనేది ఒక సొల్యూషన్ అవుతుంది.

POMODORO TECHNIQUE

ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ అది ఏంటంటే 25 నిమిషాల టైమును ఒక పనికి కేటాయిస్తే ఇక ఆ టైంలో వేరే ఏ పనిని కూడా చేయకపోవడం. ఆ టైములో ఫోన్ ,సోషల్ మీడియా ,ఈమెయిల్ వంటి వాటికీ దూరంగా ఉండటం .మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా చేతుల్లో ఉన్న పని పై ఉండేటట్టు చూసుకోవాలి ఆ పనే ఇప్పుడు JEE మెయిన్ 2024ప్రిపరేషన్.ప్రతి 25 నిమిషాల సెషన్కు ఒకసారి మధ్యలో ఐదు నుండి ఏడు నిమిషాల బ్రేక్ తీసుకోవాలి, అలాగే ఇలాంటి నాలుగు సెషన్స్ కంప్లీట్ చేసుకుంటే 25 నుండి 30 నిమిషాల లాంగ్ బ్రేక్ ను తీసుకో వడం వలన మెదడును రిఫ్రెష్ చేసుకున్నట్టు ఉంటుంది.

5. సులభంగా ఉండే నోట్స్ రాసుకోండి.

విద్యార్థులు తమకు ఉపయోగపడే నోట్స్ షార్ట్ గా రాసుకుని తమతో ఉంచుకునే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే విద్యార్థులు కీ ఫార్ములా మరియు కాన్సెప్ట్లను రాయడం వలన బ్రీఫ్ గా గుర్తించుకునే వీలు ఉంటుంది.రోజుకు కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు విద్యార్థులు వీటికి కేటాయిస్తే సరిపోతుంది .ఇది విద్యార్థులు ముఖ్యమైన ఫార్ములాలు మరియు కాన్సెప్ట్లను గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది.

మీ JEE Main syllabus ని మూడు విభాగాలుగా విభజించవచ్చు:

  • అతి సంక్లిష్టమైన
  • కష్టమైన సబ్జెక్టులు
  • సులభమైన సబ్జెక్టులు

6. రోజు వారీ టాపిక్స్ షెడ్యూల్ చేయండి

  • 0-5 రోజులు -అత్యంత కష్టమైన సబ్జెక్టులను రివిజన్ చేసుకోవాలి
  • 6-10 రోజులు -కొంచెం తక్కువ కష్టంగా అనిపించే టాపిక్స్ ను ఎంచుకోవాలి
  • 10-12 రోజులు -సులభమైన టాపిక్స్ ను ప్రాక్టీస్ చేయాలి
  • 12-15 rojulu– మాక్ టెస్టులను సాల్వ్ చేయడం వలన మీరు ఎందులో వెనకబడి ఉన్నారో  దానిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయవచ్చు అని  ఒక అవగాహనకు రాగలరు.

సాధ్యమైనంతవరకు ఆఖరి క్షణం వరకు మీరు మీకు కష్టమైన టాపిక్స్ ను వాయిదా వేయకుండా చూసుకోండి. ముందుగా వాటిని కవర్ చేయడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

7. ముఖ్యమైన  ప్రశ్నలను  ప్రాక్టీస్ చేయండి

మీరు JEE మెయిన్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ లేదా JEE మెయిన్ మాక్ టెస్ట్ లను సాల్వ్ చేసేటప్పుడు ఎక్కువసార్లు అడిగే కొన్ని ప్రశ్నలను లేదా కొన్ని కష్టమైనా ప్రశ్నలను చూసి వాటిని నోట్ చేసుకోవాలి.ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయకుండా వదిలేయడం మంచి పద్ధతి కాదు. దానికి బదులుగా, ఎగ్జామ్లో మంచి ఫలితాలు పొందడానికి ఈ క్యూస్షన్స్ తొందరగా మరియు పర్ఫెక్ట్ గా సాల్వ్ చేయగలిగే మార్గాలను ఎంచుకోవాలి

8. ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్‌లను సాల్వ్ చేయండి.

క్యూస్షన్స్ ను ఫాస్ట్గా మరియు కరెక్ట్ గా ఆన్సర్ చేయడానికి మీకు కష్టపడి పని చేయడంతో పాటుగా స్మార్ట్ వర్క్ కూడా అవసరం. దీనిని సాధించడానికి ఒక పద్ధతి ఉంది . అది ఏంటంటే రోజు ఆన్సర్ చేసే క్యూస్షన్స్ తో పాటు వీటిని చివరి రోజు వరకు రోజు ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒకటే ప్రాక్టీస్ చేయడానికి సాధ్యమవుతుంది.

మాక్ టెస్టులకు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీరు క్యూస్షన్స్ ఆన్సర్ చేసే పద్ధతిని ట్రాక్ చేయాలి. క్యూస్షన్స్ అడిగిన పద్ధతిలోనే ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ముందుగా వచ్చిన, మీకు సులభమైన ప్రశ్నలను ఫిజిక్స్ ,మ్యాథమెటిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టుల ప్రశ్నలలో మీకు వచ్చిన ప్రశ్నలు ఆధారంగా వాటిని ఆన్సర్ చేయడం ప్రారంభించవచ్చు .ఇది మీకు ఎగ్జామ్ రాసే టైములో ప్రశాంతంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉండడానికి సహాయపడుతుంది.

9. మీ పరీక్షా వ్యూహాన్ని ఆప్టిమైజ్ చేయండి

సాధారణంగా 50 శాతం ప్రశ్నలు సులభంగా ఉంటాయి .అటువంటి క్వశ్చన్స్ కోసం వెతకండి మరియు వాటినే ముందుగా సాల్వ్ చేయండి. పేపర్ స్టార్ట్ చేసేటప్పుడు కష్టమైన ప్రశ్నలను మీరు గమనించినట్లయితే టెన్షన్ పడకండి .ఎగ్జాంను కంటిన్యూ చేస్తూ ఉంటే మామూలు క్వశ్చన్స్ కూడా మీకు కనిపిస్తాయి. మీరు స్టార్టింగ్ నుండి వెనక్కి తగ్గడానికి ట్రై చేయకండి .ఎందుకంటే ముందుకు వెళ్లే కొద్దీ మీరు తక్కువ కష్టతరమైన క్వశ్చన్స్ ఎదుర్కొనే అవకాశం ఎల్లప్పుడూ కలిగి ఉంటారు .క్యూస్షన్స్ ఎంచుకొని మీ శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి .ఈ లక్ష్యాన్ని సాధించడంలో మాక్ టెస్టులు మీకు సహాయపడతాయి.

10. కొత్త అంశాన్ని ప్రారంభించవద్దు

మీరు మీ సిలబస్ ను పూర్తి చేసినా ,చేయకపోయినా ఈ టైంలో ఎల్లప్పుడూ కొత్త టాపిక్ స్టార్ట్ చేయవద్దు. ఇది ఇప్పటికే మీకు ఉన్న టెన్షన్ ను పెంచుతుంది.దానికి బదులుగా మీరు ఇప్పటికి నేర్చుకున్న వాటిని సాల్వ్ చేయడంపై కాన్సన్ట్రేట్ చేయండి.

11.నెగెటివ్ గా ఆలోచించవద్దు

ఒకవేళ మీరు నేర్చుకున్న ఏ టాపిక్ లో అయినా 20 చాప్టర్లలో 15 మాత్రమే కాన్ఫిడెంట్గా నేర్చుకున్నట్లు మీకు అనిపిస్తే మిగతా 5 టాపిక్కుల కోసం కంగారు పడకండి. ముఖ్యంగా ఎగ్జామ్ డేట్ కి ముందు టైం తక్కువగా ఉన్నప్పుడు మీరు అసలు కంగారు పడొద్దు. మీకు NIT's అడ్మిషన్లలో సీట్ రావడానికి 180 మొత్తం మార్కులు వస్తే సరిపోతుంది .(i.e.50% మార్కులు).

12. ఆందోళన చెందవద్దు

విద్యార్థులు ఈ సమయంలో అసలు ఆందోళన చెందకూడదు.మీరు స్ట్రెస్ లేనటువంటి హెల్తీ లైఫ్ స్టైల్ ను కలిగి ఉండాలి.ఈ సమయంలో విద్యార్థులు తమ హెల్త్ పై తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.ఎందుకంటే ఏవైనా హెల్త్  ఇష్యూస్ ఉన్న వారి ప్రిపరేషన్ పై ప్రభావాన్ని చూపుతాయి.స్ట్రెస్ ను తగ్గించుకోండి . రిలాక్స్ గా మరియు నమ్మకం గా ఉండండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

JEE మెయిన్ 2024ఎక్సమ్ కు కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున విద్యార్థులు ఆందోళన చెందవచ్చు లేదా ఆత్మీయ విశ్వాసం కోల్పోవచ్చు. మీరు ఇప్పటికీ JEE మెయిన్ ఎగ్జాంలో పాస్ అయ్యే మీ లక్ష్యాన్ని పూర్తి అంకిత భావంతో మరియు తెలివి గల మంచి ప్లాన్ తో సాధించగలరని మీకు మేము హామీ ఇస్తున్నాము.

పైన ఇచ్చిన టిప్స్ చాలా చక్కగా వివరించబడ్డాయి మరియు ఎగ్జామ్ చివరి రోజులలో టైంను విలువైనదిగా మరియు రిజల్ట్ దృష్టిలో ఉంచుకునేలా చేయడానికి రూపొందించబడ్డాయి .ఎగ్జామ్కు ముందు కొన్ని రోజులలో టెన్షన్  కాకుండా ముందుగానే సిద్ధంగా ఉండాలని మేము సూచిస్తున్నాము .కానీ మిమ్మల్ని మీరు మరియు మీ సమయాన్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి నమ్మకంగా మరియు ప్రశాంతంగా ఉండి ముందుకు సాగిపోండి.

How to Prepare Maths for JEE Mains 2023 JEE Main 2023: List of Chapters & Topics Covered Under Mathematics Section
How to Prepare Chemistry for JEE Main 2023 JEE Main 2023: List of Chapters & Topics Covered Under Chemistry Section
How to Prepare Physics for JEE Mains 2023 JEE Main 2023: List of Chapters & Topics Covered Under Physics Section


జేఈఈ మెయిన్ 2024గురించిన ముఖ్యమైన సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/how-to-prepare-for-jee-main-in-last-15-days/
View All Questions

Related Questions

How is LPU B.Tech CSE? Are the placements good?

-Vani JhaUpdated on September 22, 2025 11:40 PM
  • 52 Answers
Aston, Student / Alumni

LPU's B.Tech. CSE program is well-regarded for its industry-aligned curriculum and strong placement record. In recent drives, the highest international package reached ₹2.5 Cr, with top recruiters including tech giants like Google, Microsoft, and Amazon. The program's focus on practical skills and specializations in emerging technologies ensures graduates are well-prepared for excellent career opportunities.

READ MORE...

What is the B.tech fee for Mechanical Engineering at LPU?

-testUpdated on September 22, 2025 11:38 PM
  • 57 Answers
Aston, Student / Alumni

The total per-semester fee for B.Tech. in Mechanical Engineering at LPU is ₹144,500. This includes a program fee of ₹140,000 and an examination fee of ₹4,500. A one-time uniform fee of ₹4,000 is also applicable. For more information related to scholarships kindly contact their concerned department.

READ MORE...

Is getting into LPU difficult?

-Saurabh JoshiUpdated on September 22, 2025 11:41 PM
  • 89 Answers
Aston, Student / Alumni

Gaining admission to LPU is generally not considered difficult for most programs, provided you meet the basic eligibility criteria. The university offers a transparent, student-friendly admission process, primarily through its own entrance and scholarship exam, LPUNEST, or by accepting scores from other national-level exams. With a wide range of programs and scholarship opportunities, LPU aims to make quality education accessible to a broad spectrum of students.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All