
బాసర ఐఐఐటీ అడ్మిషన్ 2023 (Basara IIIT Admission 2023): బాసర ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల బీటెక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. బాసర IIITలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ B.Tech ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి (Basara IIIT Admission 2023) నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్ www.rgukt.ac.inలో జారీ చేయబడింది. జూన్ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 26న మెరిట్ జాబితా ప్రకటించడం జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులు జూలై 1న రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 చెల్లించాలి.
బాసర ఐఐటీ అడ్మిషన్ 2023-నోటిఫికేషన్ లింక్ |
ఐఐఐటీ బాసర అడిషన్లు 2023-24 పూర్తి వివరాలు (IIIT Basara Admissions 2023-24 Overview)
బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు సంబంధించిన షెడ్యూల్ పూర్తి వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.ఈవెంట్ | బీటెక్ అడ్మిషన్లకు TS RGUKT IIIT బాసర నోటిఫికేషన్ 202324 |
కండక్టింగ్ అథారిటీ | రాజీవ్ గాంధీ యూనివర్సిటీ టెక్నాలజీ (RGUKT-తెలంగాణ రాష్ట్రం) |
అడ్మిషన్ల క్లాసులు | ఇంటిగ్రేటెడ్ బీటెక్ అడ్మిషన్లు |
అడ్మిషన్ ప్రాసెస్ | RGUKT అడ్మిషన్లు పదో తరగతి GPA ఆధారంగా జరుగుతాయి. |
అప్లికేషన్ సబ్మిషన్ ప్రారంభం | 05-06-2023 |
అప్లికేషన్ సబ్మిట్ చేసే లాస్ట్‌డేట్ | 19-06-2023 |
ఎగ్జామ్ డేట్ | ఎటువంటి ఎగ్జామ్ లేదు, పదో తరగతి జీపీఏపై ఆధారపడి ఉంటుంది |
మెరిట్ లిస్ట్ రిజల్ట్స్ డేట్ | 26-06-2023 |
రిపోర్టింగ్ డేట్ | 01-07-2023 |
అధికారిక వెబ్‌సైట్ | https://www.rgukt.ac.in/ |
బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు కేవలం పదో తరగతిలో వచ్చే మార్కులు ఆధారంగానే జరుగుతాయి. ఈ విషయాన్ని ఆర్జీయూకేటీ వీసీ వెల్లడించారు. అలాగే 18 ఏళ్లు మించిన విద్యార్థులకు అవకాశం ఉండదు. ట్రిపుల్ ఐటీలోని 85 శాతం సీట్లు లోకల్ వాళ్లకు, మిగిలిన 15 శాతం సీట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వర్తిస్తాయి. విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలియజేయడం జరిగింది. కాగా బాసర ట్రిపుల్ ఐటీల్లో పీహెచ్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా వారికి జూన్ 24 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది.
బాసర ట్రిపుల్ ఐటీలో (Basara IIIT Admission 2023) జాయిన్ అవ్వాలనుకునే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుని ఫాలో అవ్వాలి. అడ్మిషన్ కోసం అవసరమైన పత్రాలను దగ్గరే ఉంచుకోవాలి. ముందుగానే వాటిని సిద్దం చేసుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.