JEE Main Cutoff 2023 for SC Category: SC కేటగిరీకి JEE మెయిన్ అంచనా కటాఫ్ 2023 ఎంతంటే?

Andaluri Veni

Updated On: April 20, 2023 11:31 am IST

SC కేటగిరికి  JEE మెయిన్ 2023 అంచనా కటాఫ్ (JEE Main Cutoff 2023 for SC Category) ఇక్కడ ఇవ్వడం జరిగింది. కటాఫ్ విలువలను ప్రభావితం చేసే ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు విశ్లేషణ గత ట్రెండ్‌లపై ఆధారపడి ఉంటుంది.
JEE Main Expected Cutoff 2023 for SC CategoryJEE Main Expected Cutoff 2023 for SC Category

SC కేటగిరికి  JEE మెయిన్ 2023 అంచనా కటాఫ్  (JEE Main Cutoff 2023 for SC Category): గత ట్రెండ్‌ల ఆధారంగా SC కేటగిరీకి JEE మెయిన్ కటాఫ్ (JEE Main Cutoff 2023 for SC Category) ప్రతి సంవత్సరం 3 నుంచి 4 శాతం తగ్గుతోంది. అయితే ఈ ఏడాది కటాఫ్‌లో తగ్గుదల అంచనా వేయగా గత సంవత్సరాల్లో కంటే ఇది ఎక్కువగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే కటాఫ్‌ను ప్రభావితం చేసే ప్రధాన కారకాల్లో ఒకటి రిజిస్ట్రేషన్‌ల సంఖ్య, ఈ విద్యా సంవత్సరంలో సెషన్ 2 కోసం దాదాపు 3 లక్షల రిజిస్ట్రేషన్‌లు 2022 సెషన్‌తో పోలిస్తే పెరిగాయి. 

సెషన్ 1 కోసం రిజిస్ట్రేషన్‌లు రెండు సంవత్సరాల పాటు ఒకే పరిధిలో ఉన్నప్పటికీ ఈ వ్యత్యాసం ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ల సంఖ్యను పెంచుతుందని, తద్వారా కటాఫ్‌లు కఠినంగా మారుతాయని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు గరిష్ట కటాఫ్ పర్సంటైల్ కూడా పెరిగే అవకాశం ఉంది. గరిష్ట కటాఫ్ పర్సంటైల్ కారణంగా దీనిపై రిజర్వ్ చేయబడిన విద్యార్థి జనరల్ కేటగిరీ కింద అడ్మిషన్ పొందుతాడు. అతని/ఆమె రిజర్వేషన్ రద్దు చేయబడుతుంది.

SC కేటగిరీకి JEE మెయిన్ ఊహించిన కటాఫ్ 2023 (JEE Main Expected Cutoff 2023 for SC Category)

SC కేటగిరీ అభ్యర్థులకు, కనిష్ట, గరిష్ట కటాఫ్‌లు అంచనా వేయబడిన పర్సంటైల్‌లు ఈ కింది విధంగా ఉన్నాయి. 

JEE మెయిన్ SC అంచనా కటాఫ్ 2023
కనిష్ట కటాఫ్ పర్సంటైల్41 నుంచి 43 పర్సంటైల్
గరిష్ట కటాఫ్ పర్సంటైల్87 నుంచి 90 పర్సంటైల్

ఈ JEE మెయిన్ కటాఫ్ NIT, IIIT, GFTI కౌన్సెలింగ్‌కు అర్హత కోసం మాత్రమే అని అభ్యర్థులు గమనించాలి. JEE అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందాలంటే మీ ర్యాంక్ తప్పనిసరిగా 2,50,000 అభ్యర్థులలోపు ఉండాలి. ఇది కూడా కేటగిరీల వారీగా విభజించబడింది. JEE మెయిన్ ఫలితం తర్వాత పంపిణీ తెలియజేయబడుతుంది. ఈ కటాఫ్‌కు అర్హత సాధించనంత మాత్రానా JEE అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఎలిజిబిలిటీకి గ్యారంటీ ఉండదు. 

JEE మెయిన్ SC కటాఫ్ 2023: మునుపటి ట్రెండ్‌లు (JEE Main SC Cutoff 2023: Previous Trends)

2022 నుంచి 2019 వరకు JEE మెయిన్ కటాఫ్ పర్సంటైల్ ట్రెండ్‌లను ఈ  దిగువున ఉన్న టేబుల్ ద్వారా చెక్ చేయవచ్చు. 2019కి ముందు ఫలితాలు, కటాఫ్ పర్సంటైల్‌లకు బదులుగా రా మార్కులు ఆధారంగా ఇవ్వడం జరిగింది. 

సంవత్సరంకనిష్ట కటాఫ్ పర్సంటైల్గరిష్ట కటాఫ్ పర్సంటైల్
202243.082095488.4037478
202146.882533887.8950071
202050.176024590.3765335
201954.012815589.7548849


తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/jee-main-expected-cutoff-2023-for-sc-category-39024/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!