
తెలంగాణ ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల (TS Police Constable Results 2023): తెలంగాణ ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు (TS Police Constable Results 2023) రిలీజ్ అయ్యాయి. గత మార్చి, ఏప్రిల్ మధ్య కాలంలో TSLPRB ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఇప్పుడు విడుదలయ్యాయి. ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ రాత పరీక్షలో 84.06 శాతం మంది అర్హత సాధించడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించిన ఫైనల్ రాత పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను TSLPRB అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం జరిగింది. అభ్యర్థులు తమ మార్కుల వివరాలను https://www.tslprb.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోచ్చు. ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లు వెబ్ సైట్ లో తమ వ్యక్తిగత లాగిన్ లో చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 84.06గా ఉంది. మొత్తం 1,79,459 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 1,50,852 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.
TSLPRB ఫైనల్ ఆన్సర్ కీ 2023 డౌన్‌లోడ్ లింక్ (TSLPRB Final Answer Key 2023 Download Link)
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి కానిస్టేబుల్, ఎస్‌ఐ, ఇతర పోస్టుల కోసం ఫైనల్ ఆన్సర్ కీ కోసం సమాధానాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఈ దిగువున అందజేయడం జరిగింది.TS పోలిస్ కానిస్టేబుల్ ఫలితాలు 2023-డైరక్ట్ లింక్ |
TS పోలీస్ ఫలితాలు 2023ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి? (How to Download TS Police Result 2023?)
టీఎస్ పోలీస్ ఫలితాలు 2023ని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఈ దిగువున అందజేయడం జరిగింది.
- TS పోలీస్ అధికారిక వెబ్‌సైట్‌ని tslprb.inలో సందర్శించండి.
- టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత మీ ఆధారాలతో లాగిన్ అవ్వాలి.
- అనంతరం TS పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు, TS పోలీస్ SI ఫలితాలు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేయాలి.
- మార్కుల షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి.
టీఎస్ పోలీస్ మార్క్‌షీట్ 2023లో ఉండే వివరాలు (Details on TS Police Marksheet 2023)
టీఎస్ పోలీస్ మార్క్ షీట్ 2023లో ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి.
- అభ్యర్థి పేరు
- హాల్ టికెట్ నెంబర్
- మార్కులు
- కేటగిరి
- క్వాలిఫైయింగ్ స్టేటస్
- ర్యాంక్
- కటాఫ్ మార్కులు