ఏపీ ఐసెట్ ఎంబీఏ 2023 పరీక్షకు (AP ICET MBA Exam 2023) సంబంధించిన ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియ, సిలబస్, పరీక్షా విధానం, మునుపటి సంవత్సరం కటాఫ్‌ల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు.
- ఏపీ ఐసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (AP ICET 2023 Important Dates)
- ఏపీ ఐసెట్ 2023 అడ్మిట్ కార్డు (AP ICET 2023 Admit Card)
- AP ICET 2023 పరీక్షా కేంద్రాలు (AP ICET 2023 Exam Centres)
- AP ICET 2023 ప్రిపరేషన్ టిప్స్ (AP ICET 2023 Preparation Tips)
- AP ICET 2023 సిలబస్ (AP ICET 2023 Syllabus
- AP ICET 2023 పరీక్షా సరళి (AP ICET 2022 Exam Pattern)
- AP ICET 2023 జవాబు కీ (AP ICET 2023 Answer Key)
- AP ICET 2022 ఫలితాలు (AP ICET 2022 Results)
- ఏపీ ఐసెట్ 2023 కటాఫ్ (AP ICET 2023 Cutoff)
- AP ICET 2022 ఎంపిక ప్రక్రియ (AP ICET 2022 Selection Process)
- AP ICET 2023కు ఎలా దరఖాస్తు చేయాలి..? (How to Apply for …
- ఏపీ ఐసెట్ 2023 అర్హత ప్రమాణాలు (AP ICET 2022 Eligibility Criteria)
- టాప్ MBA కళాశాలలు AP ICET 2022 స్కోర్‌ను అంగీకరిస్తున్నాయి (Top MBA …

ఏపీ ఐసెట్ ఎంబీఏ 2023 (AP ICET MBA Exam 2023): ఆంధ్ర విశ్వవిద్యాలయం AP ICET 2023 (ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నిర్వహిస్తుంది. AP ICET అనేది MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ఎంట్రన్స్ పరీక్ష. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కాలేజీలు అడ్మిషన్ కోసం AP ICET స్కోర్‌లను పరిగణనలోకి తీసుకుంటాయి. AP ICET 2023 మే 25, 26వ తేదీల్లో జరుగుతుంది. AP ICET 2023 కోసం రిజిస్ట్రేషన్లు మే 2023 రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. AP ICET 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువన అందించడం జరిగింది.
ఏపీ ఐసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (AP ICET 2023 Important Dates)
ఏపీ ఐసెట్ 2023 (AP ICET 2023) పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదలకానుంది. AP ICET 2023 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ కింది పట్టికలో ఇవ్వడం జరిగింది.
ఈవెంట్ | తేదీలు |
AP ICET 2023 నోటిఫికేషన్ తేదీ | మార్చి 17, 2023 |
AP ICET 2023 ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ సబ్మిషన్‌కి ప్రారంభం తేదీ | మార్చి 20, 2023 |
ఆలస్య ఫీజు లేకుండా దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | ఏప్రిల్ 19, 2023 |
INR 2,000/- ఆలస్య రుసుముతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | మే 5, 2023 |
INR 3,000 లేట్ ఫీజుతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | మే 10, 2023 |
INR 5,000 లేట్ ఫీజుతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | మే 15, 2023 |
AP ICET 2023 అప్లికేషన్ కరెక్షన్ విండో | మే 16, 17, 2023 |
AP ICET 2023 అడ్మిట్ కార్డు లభ్యత | మే 20, 2023 |
AP ICET 2023 పరీక్ష తేదీ | మే 25, 26, 2023 |
AP ICET 2023 ప్రిలిమినరీ కీ | తెలియాల్సి ఉంది |
ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను స్వీకరించడానికి చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
AP ICET 2022 యొక్క తుది సమాధాన కీ విడుదల, ఫలితాల ప్రకటన | తెలియాల్సి ఉంది |
ఏపీ ఐసెట్ 2023 అడ్మిట్ కార్డు (AP ICET 2023 Admit Card)
ఏపీ ఐసెట్ 2023 అడ్మిట్ కార్డులను పరీక్షకు ముందు విడుదల చేస్తారు. AP ICET 2023 admit cardలను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేసి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులో అభ్యర్థి పరీక్షకు సంబంధించిన వివరాలు, హాల్ టికెట్ నెంబర్, తేదీలు, సూచనలు ఉంటాయి. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఒక్కసారి వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయో..? లేదో..? చెక్ చేసుకోవాలి. పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా అడ్మిట్ కార్డును తీసుకెళ్లాలి.
AP ICET 2023 పరీక్షా కేంద్రాలు (AP ICET 2023 Exam Centres)
ఏపీ ఐసెట్ 2023కు పరీక్షా కేంద్రాలను ఈ దిగువున పట్టికలో తెలియజేయడం జరిగింది.
జిల్లా పేరు | ఎగ్జామ్ సెంటర్ |
కృష్ణా జిల్లా |
|
గుంటూరు |
|
అనంతపూర్ |
|
YSR కడప |
|
వెస్ట్ గోదావరి |
|
విజయనగరం |
|
విశాఖపట్నం |
|
శ్రీకాకుళం |
|
నెల్లూరు |
|
ప్రకాశం |
|
కర్నూలు |
|
తూర్పు గోదావరి |
|
చిత్తూరు |
|
హైదరాబాద్ (తెలంగాణ) |
|
AP ICET 2023 ప్రిపరేషన్ టిప్స్ (AP ICET 2023 Preparation Tips)
ఏపీ ఐసెట్ 2023 (AP ICET 2023) ప్రిపేర్ కావాలనుకునే అభ్యర్థులు పరీక్షను బాగా రాసేందుకు ఈ దిగువున తెలిపిన టిప్స్‌ని ఫాలో అవ్వాలి.
- పరీక్షకు సంబంధించిన సిలబస్ స్టడీ చేయాలి.
- సిలబస్‌లో టాపిక్స్‌ని విభజించి, ప్రతిదానికి ఒక నిర్ణీత సమయానికి కేటాయించుకోవాలి.
- గత సంవత్సరం ప్రశ్నపత్రాలు, మోడల్ పరీక్షా పేపర్లను ప్రాక్టీస్ చేయాలి.
- ముందు గరిష్ట మార్కులతో కూడిన టాపిక్‌లను అధ్యయనం చేయాలి.
- రివిజన్ చేసుకోవడం కోసం సొంతంగా నోట్స్‌ను ప్రిపేర్ చేసుకోవాలి.
AP ICET 2023 సిలబస్ (AP ICET 2023 Syllabus
AP ICET 2023 పరీక్షను ఏ, బీ, సీ అనే మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. ప్రతి సెక్షన్‌లో కనీసం రెండు లేదా మూడు సబ్ టాపిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఏపీ ఐసెట్ 2023 (AP ICET 2023) సిలబస్ గురించి పూర్తి వివరాలు ఈ దిగువున అందజేశాం ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించవచ్చు.
సెక్షన్ పేరు | టాపిక్ | సిలబస్ |
సెక్షన్ – ఎ | విశ్లేషణాత్మక సామర్థ్యం |
|
సమస్య పరిష్కారం |
| |
సెక్షన్ – B (గణిత సామర్థ్యం) | అంకగణిత సామర్థ్యం |
|
బీజగణిత మరియు రేఖాగణిత సామర్థ్యం |
| |
స్టాటిస్టికల్ ఎబిలిటీ |
| |
సెక్షన్ – సి | కమ్యూనికేషన్ సామర్థ్యం |
|
AP ICET 2023 పరీక్షా సరళి (AP ICET 2022 Exam Pattern)
ఏపీ ఐసెట్ (AP ICET 2023) 2023లో 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. AP ICET 2022లో ప్రతికూల మార్కింగ్ లేదు. AP ICET 2022 ఎంట్రన్స్ పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో (కంప్యూటర్-ఆధారిత పరీక్ష) నిర్వహించడం జరుగుతుంది. ఏపీ ఐసెట్ 2023 (AP ICET 2023)కు సంబంధించి పరీక్షా విధానం గురించి ఈ దిగువున తెలుసుకోవచ్చు.
టాపిక్ పేరు | ప్రశ్నల పేరు | మార్కులు కేటాయించబడింది |
డేటా సమృద్ధి (సెక్షన్ – A) | 20 | 20 |
సమస్య పరిష్కారం | 55 | 55 |
అంకగణిత సామర్థ్యం (సెక్షన్ – B) | 35 | 35 |
బీజగణిత మరియు రేఖాగణిత సామర్థ్యం | 30 | 30 |
స్టాటిస్టికల్ ఎబిలిటీ | 10 | 10 |
పదజాలం (సెక్షన్ – సి) | 10 | 10 |
వ్యాపారం మరియు కంప్యూటర్ పరిభాష | 10 | 10 |
ఫంక్షనల్ గ్రామర్ | 15 | 15 |
పఠనము యొక్క అవగాహనము | 15 | 15 |
మొత్తం | 200 | 200 |
ఒక సెషన్‌లోని ప్రశ్నాపత్రం మరొక సెషన్ కంటే క్లిష్టంగా ఉంటే, AP ICET 2022 అడ్మిషన్ ప్రాసెస్‌లో అభ్యర్థులకు ఎలాంటి నష్టం ఉండకుండా ఉండేందుకు పరీక్ష అథారిటీ మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియను అనుసరిస్తుంది.
AP ICET 2023 జవాబు కీ (AP ICET 2023 Answer Key)
ఏపీ ఐసెట్ 2023 (AP ICET 2023) జవాబు కీని పరీక్ష అయిన కొన్ని రోజుల్లో విడుదల చేయడం జరుగుతుంది. ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడుతుంది. ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.
AP ICET 2022 ఫలితాలు (AP ICET 2022 Results)
ఏపీ ఐసెట్ 2023 (AP ICET 2023) ఫలితాలు ఎగ్జామ్ జరిగిన కొంతకాలం తర్వాత విడుదలవుతాయి. ఆన్‌లైన్‌లోనే జరిగే పరీక్ష కాబట్టి వీలైనంత త్వరగా ఈ రిజిల్ట్స్ వెలువడతాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. AP ICET 2023 రిజల్ట్స్ రాష్ట్ర స్థాయి ర్యాంక్‌తో పాటు అభ్యర్థులు సాధించిన స్కోర్‌లను కలిగి ఉంటాయి. అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ను చూసుకున్న తర్వాత AP ICET 2023 స్కోర్ కార్డ్, ర్యాంక్ కార్డుల ప్రింటవుట్‌ను తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
ఏపీ ఐసెట్ 2023 కటాఫ్ (AP ICET 2023 Cutoff)
అభ్యర్థులు కేటగిరీ వారీగా AP ICET 2023 కటాఫ్‌ను ఈ దిగువన పరిశీలించ వచ్చు.
- ఏపీ ఐసెట్ 2023కి అర్హత సాధించడానికి జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు కనీసం 25 శాతం మార్కులు సాధించాలి. అంటే (200కి 50) స్కోర్ చేయాలి.
- రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు AP ICET 2023లో కనీస అర్హత మార్కు లేదు.
AP ICET 2022 ఎంపిక ప్రక్రియ (AP ICET 2022 Selection Process)
MBA కోర్సు కోసం అభ్యర్థులను ఎంపిక చేయడానికి పరీక్షా అధికారం క్రింది పద్ధతిని అనుసరిస్తుంది: -
- అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్‌పై ఆధారపడి ఉంటుంది అంటే AP ICET 2023 పరీక్షలో అభ్యర్థులు సాధించిన ర్యాంక్, స్కోర్‌లపై ఆధారపడి ఉంటుంది.
- ఎగ్జామినేషన్ అథారిటీ ర్యాంక్ వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్, సీట్ల కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తుంది.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవాలి.
- అభ్యర్థులు పొందిన AP ICET 2023 ర్యాంక్, స్కోర్, వెబ్ ఆప్షన్‌లు (కాలేజీ ప్రాధాన్యతలు), రిజర్వేషన్ విధానం, కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్ల ఆధారంగా సీటు కేటాయింపు జరుగుతుంది.
- సీటు కేటాయింపు తర్వాత అభ్యర్థులు తప్పనిసరిగా కళాశాలలో రిపోర్ట్ చేసి, కోర్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
AP ICET 2023కు ఎలా దరఖాస్తు చేయాలి..? (How to Apply for AP ICET 2022?)
ఏపీ ఐసెట్ 2023 (AP ICET 2023) ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫార్మ్‌ని ఈ దిగువున తెలిపిన విధంగా సబ్మిట్ చేయాలి.
ఫీజు చెల్లింపు (Fee Payment): ఆన్‌లైన్ అప్లికేషన్‌ను పూరించే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు ఫీజును రూ. 550. క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఫీజు చెల్లింపు తర్వాత అభ్యర్థులు పేమంట్ ఐడీని అందుకుంటారు. అభ్యర్థులు సమీపంలోని AP ఆన్‌లైన్ కేంద్రానికి వెళ్లి ఏపీ ఐసెట్ 2023 దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. ఫీజు చెల్లించడానికి అభ్యర్థులు అడ్మిట్ కార్డు టికెట్ నెంబర్, పేరు, మొబైల్ నెంబర్‌ని ఇవ్వాలి. ఫీజు చెల్లింపు తర్వాత AP ఆన్‌లైన్ కేంద్రం పేమంట్ ఐడీతో పాటు సంబంధిత రసీదుని జారీ చేస్తుంది.
పేమంట్ స్టేటస్‌ని చెక్ చేయడం (Check Payment Status): ఆన్‌లైన్ దరఖాస్తును పూరించే ముందు ఏపీ ఐసెట్ 2023 (AP ICET 2023) అధికారిక వెబ్‌సైట్‌లో పేమంట్ స్థితిని అభ్యర్థులు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.
అప్లికేషన్ పూరించాలి (Fee Payment): అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయడానికి ఏపీ ఐసెట్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ లింక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటుంది. అప్లికేషన్ ఫార్మ్ లింక్‌పై క్లిక్ చేసి ఫీజు పేమంట్ ఐడీని నమోదు చేయాలని తద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ చేసిన తర్వాత అన్ని వివరాలని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. పరీక్ష రాయాలనుకునే జిల్లాను ఎంచుకుని సబ్మిట్ చేయాలి.
ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ (Print Application Form): ఏపీ ఐసెట్ 2023 ( AP ICET 2023) అప్లికేషన్ ఫార్మ్ విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత దాని ప్రింటవుట్ తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్‌ని తీసుకుని దగ్గర ఉంచుకోవాలి.
ఏపీ ఐసెట్ 2023 అర్హత ప్రమాణాలు (AP ICET 2022 Eligibility Criteria)
ఏపీ ఐసెట్ 2023కు (AP ICET 2023) దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా తమ అర్హత ప్రమాణాలను చెక్ చేసుకోవాలి. అభ్యర్థులు కచ్చితంగా భారత పౌరులై ఉండాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలి. అభ్యర్థులు లోకల్ అయితే ఆ అర్హతలకు తగ్గట్టుగా నాన్ లోకల్ అయితే ఆ అర్హతలకు తగ్గట్టుగా ఉండాలి. ఇతర రాష్ట్ర విద్యార్థులు మేనేజ్‌మెంట్ కోటా కింద MBA కళాశాలల్లో అడ్మిషన్ పొందవచ్చు.
ఎడ్యుకేషనల్ MBA కోసం అర్హత కోర్సు (Educational Qualification for MBA Coure): దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌లో UG డిగ్రీ కోర్సు పాసై ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతిలో మ్యాథ్స్ సబ్జెక్టులలో ఒకటిగా చదివి ఉండాలి.
కనీస అర్హత మార్కులు (Minimum Qualifying Marks):అభ్యర్థులు తప్పనిసరిగా UG స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు (రిజర్వ్ చేయబడిన వర్గాలకు 45%) స్కోర్ చేసి ఉండాలి. తద్వారా వారు ఎంట్రన్స్ పరీక్షకు అర్హులుగా పరిగణించబడతారు.
టాప్ MBA కళాశాలలు AP ICET 2022 స్కోర్‌ను అంగీకరిస్తున్నాయి (Top MBA Colleges Accepting AP ICET 2022 Score)
ఆంధ్రప్రదేశ్‌లో MBA లేదా MCA కోర్సులో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులందరూ AP ICET 2023కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ఐసెట్ 2023కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటాము.
AP ICET 2022 స్కోర్‌ను ఆమోదించే ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ MBA కళాశాలల జాబితాను ఈ దిగువున అందజేశాం.
- Andhra Loyola College, Vijayawada
- Vignan's Foundation for Science, Technology and Research (Deemed to be University), Guntur
- ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
- Narasaraopeta Engineering College, Guntur
- PVP Siddhartha Institute of Technology, Vijayawada
- KITS Guntur
- Narasaraopeta Institute of Technology, Guntur
- VR Siddhartha Engineering College, Vijayawada
- Koneru Lakshmaiah (KL) Deemed University, Guntur
- Godavari Institute of Engineering & Technology, Rajahmundry
- Lakireddy Balireddy College, Mylavaram
- Sree Vidyaniketan Institute of Management, Tirupati
ఆంధ్రప్రదేశ్‌లో MBA లేదా MCA కోర్సులో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులందరూ AP ICET 2023కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ఐసెట్ 2023కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటాము.
AP ICET 2022 పరీక్షకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం CollegeDekhoకు చూస్తూ ఉండండి.
సిమిలర్ ఆర్టికల్స్
ఏపీ ఐసెట్( AP ICET 2023) అంచనా ప్రశ్న పత్రాలు: ముఖ్యమైన ప్రశ్నలు, అధ్యాయాలు మరియు విశ్లేషణ
ఇంటర్మీడియట్ తర్వాత అత్యుత్తమ మేనేజ్మెంట్ కోర్సులు (Top Management Courses after Intermediate) - ఎంచుకోవడానికి కారణాలు కెరీర్ స్కోప్
టీఎస్ ఐసెట్ 2023 ఎనలిటికల్ ఎబిలిటీకి (TS ICET Analytical Ability 2023) ప్రిపరేషన్ టిప్స్ ఇక్కడ తెలుసుకోండి
ఏపీ ఐసెట్ 2023 పరీక్ష రోజు పాటించాల్సిన (AP ICET Exam day Guidelines) మార్గదర్శకాలు ఇవే
ఏపీ ఐసెట్ 2023 నార్మలైజేషన్ ప్రక్రియ, (AP ICET 2023 Score Calculation) స్కోర్‌ని ఎలా లెక్కిస్తారంటే?
తెలంగాణ ఐసెట్ 2023 కోసం (TS ICET 2023 Preparation Tips) లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ టిప్స్