ఏపీ ఐసెట్ 2023కి హాజరవుతున్నారా? అయితే ఏపీ ఐసెట్ పరీక్ష రోజున ఏ మార్గదర్శకాలను, (AP ICET Exam day Guidelines) నియమాలను పాటించాలో, వెంట ఏ పత్రాలను తీసుకెళ్లాలో ఈ ఆర్టికల్లో తెలుసుకోండి.
- ఏపీ ఐసెట్ 2023 పరీక్ష రోజు ముఖ్యాంశాలు (AP ICET 2023 Exam …
- ఏపీ ఐసెట్ 2023 పరీక్ష రోజున తీసుకెళ్లాల్సిన పత్రాలు (Documents to Carry …
- ఏపీ ఐసెట్ 2023 పరీక్ష రోజు మార్గదర్శకాలు (AP ICET 2023 Exam …
- ఏపీ ఐసెట్ 2023 పరీక్ష రోజు కోసం చేయవలసినవి (Do’s for AP …
- AP ICET 2023 పరీక్ష రోజున చేయకూడనివి (Don’ts for AP ICET …
- ఏపీ ఐసెట్ 2023 పరీక్ష రోజు కోసం COVID మార్గదర్శకాలు (COVID Guidelines …

ఏపీ ఐసెట్ 2023 ఎగ్జామ్ డే గైడ్ లైన్స్ (AP ICET Exam day Guidelines): AP ICET 2023 మే 24, 25వ తేదీల్లోజరుగుతుంది. అయితే అభ్యర్థులు AP ICET 2023 పరీక్ష రోజు కొన్ని మార్గదర్శకాలను, నియమాలను కచ్చితంగా పాటించాలి. ఆ మార్గదర్శకాలకు (AP ICET Exam day Guidelines) అనుగుణంగా లేకపోతే పరీక్ష హాల్లోకి ప్రవేశించడానికి అనుమతించబడరు. కాబట్టి AP ICET 2023 పరీక్ష రోజు కోసం ముందుగానే అన్ని వివరాలు తెలుసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం AP ICET లేదా ఆంధ్ర ప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ పరీక్షని నిర్వహించడం జరుగుతుంది. ఇది రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ పరీక్ష. CAT/MAT/XAT/CMAT/ATMA/SNAP వంటి ఇతర మేనేజ్‌మెంట్ ఎంట్రన్స్ పరీక్షల మాదిరిగానే, AP ICET 2023 పరీక్షకు కూడా బాగా ప్రిపేర్ అవ్వడం అవసరం. అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్ష రోజు కోసం ఏమి తీసుకెళ్లాలి ? ఏమి తీసుకెళ్లకూడదు ? ఇతర ముఖ్యమైన AP ICET పరీక్ష రోజు మార్గదర్శకాల గురించి తెలుసుకోవాలి.
ఇది కూడా చదవండి: ఏపీ ఐసెట్ 2023 నార్మలైజేషన్ ప్రక్రియ, స్కోర్‌ని ఎలా లెక్కిస్తారంటే?
ఏపీ ఐసెట్ 2023 పరీక్ష రోజు ముఖ్యాంశాలు (AP ICET 2023 Exam Day Highlights)
AP ICET 2023 పరీక్షలకు హాజరయ్యే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా AP ICET 2023 పరీక్ష విధానం గురించి తెలుసుకోవాలి. Exam pattern of AP ICETకి సంబంధించి ఇక్కడ కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి:
- AP ICET పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో నిర్వహించబడుతుంది.
- AP ICET 2023 పరీక్ష వ్యవధి 150 నిమిషాలు, అంటే 2 గంటల 30 నిమిషాలు.
- మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి.
- ప్రశ్నపత్రం మూడు విభాగాలుగా విభజించబడుతుంది: విశ్లేషణాత్మక సామర్థ్యం, కమ్యూనికేషన్ ఎబిలిటీ మరియు గణిత సామర్థ్యం (Mathematical Ability).
- సెక్షనల్ లిమిట్ ఉండదు. అభ్యర్థులు ఒక సెక్షన్ నుంచి మరొకదానికి మారవచ్చు. వారి సౌలభ్యం ప్రకారం సమాధానం ఇవ్వవచ్చు.
- ప్రశ్నపత్రం ఇంగ్లీషు, తెలుగులో ఉంటుంది. కమ్యూనికేషన్ ఎబిలిటీ సెక్షన్ మాత్రమే ఇంగ్లీషులో ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఏపీ ఐసెట్ ఎంబీఏ పరీక్ష 2023, ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ఫార్మ్, సిలబస్
ఏపీ ఐసెట్ 2023 పరీక్ష రోజున తీసుకెళ్లాల్సిన పత్రాలు (Documents to Carry on AP ICET 2023 Exam Day)
అభ్యర్థులు పరీక్ష రోజు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన పత్రాల జాబితా ఇక్కడ ఉంది. ఏదైనా పత్రాలు లేకుంటే అభ్యర్థులు పరీక్షకు అనుమతించబడరు:
- AP ICET 2023 హాల్ టికెట్
- ID రుజువు (ఆధార్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్/ఓటర్ ID/పాస్‌పోర్ట్ మొదలైనవి)
- హాల్ టికెట్ లో పేర్కొన్నట్లయితే ఏవైనా ఇతర పత్రాలు.
AP ICET 2023 పరీక్ష రోజు కోసం అభ్యర్థులు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సిన ఇతర వస్తువులు
బాల్ బ్లాక్/బ్లూ పెన్ | 50 ml శానిటైజర్ |
మాస్క్ | చేతి తొడుగులు |
పారదర్శక వాటర్ బాటిల్ |
ఏపీ ఐసెట్ 2023 పరీక్ష రోజు మార్గదర్శకాలు (AP ICET 2023 Exam Day Guidelines)
AP ICET 2023 పరీక్ష రోజు మార్గదర్శకాలు ఈ కింద ఇవ్వబడ్డాయి:
- అభ్యర్థులు తప్పనిసరిగా వారి AP ICET హాల్ టికెట్‌ని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్ష హాల్లోకి ప్రవేశించడానికి హాల్ టికెట్, చెల్లుబాటు అయ్యే IDని తీసుకెళ్లాలి.
- అభ్యర్థులందరూ తప్పనిసరిగా శానిటైజర్లు, వాటర్ బాటిళ్లు, గ్లౌజులు, బాల్ పెన్ను తీసుకెళ్లాలి.
- చివరి నిమిషంలో తేడాలు రాకుండా ఉండేందుకు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి.
- పరీక్షా కేంద్రానికి బయలుదేరే ముందు అన్ని సూత్రాలు, సిద్ధాంతాలు మరియు భావనలను రివైజ్ చేసుకోవాలి.
- ఎల్లప్పుడూ ప్రశాంతంగా , సంయమనంతో ఉండాలి. పరీక్షకు ముందు లేదా పరీక్ష సమయంలో భయపడకూడదు.
ఏపీ ఐసెట్ 2023 పరీక్ష రోజు కోసం చేయవలసినవి (Do’s for AP ICET 2023 Exam Day)
AP ICET 2023 పరీక్ష రోజున అభ్యర్థులు అనుసరించాల్సిన కొన్ని సూచనలు ఇక్కడ ఉన్నాయి:
- పరీక్షకు ఒక రోజు ముందు అభ్యర్థులు తప్పనిసరిగా తమ పరీక్షా కిట్‌ని సిద్ధం చేసి, పరీక్ష రోజు వెంట తీసుకెళ్లడానికి పక్కన పెట్టుకోవాలి. ఈ కిట్‌లో AP ICET 2023 హాల్ టికెట్ , ID ప్రూఫ్, శానిటైజర్, గ్లోవ్స్, మాస్క్, బాల్ పెన్, పారదర్శక వాటర్ బాటిల్‌ను పెట్టుకోవాలి.
- అభ్యర్థులందరూ పరీక్షా కేంద్రానికి చేరుకున్నప్పటి నుంచి సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా అన్ని సమయాల్లో మాస్క్‌లు ధరించడం ద్వారా భద్రతా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి.
- పరీక్షా కేంద్రంలో ఏవైనా అవసరమైన ఎంట్రీ ప్రోటోకాల్‌లను పూర్తి చేయడానికి ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
- ప్రశ్నపత్రాన్ని ప్రయత్నించే ముందు అన్ని సూచనలను జాగ్రత్తగా చదవాలి.. ఆపై పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.
- ప్రణాళికాబద్ధంగా పరీక్షను ప్రారంభించాలి.. ప్రతి సెక్షన్ కోసం సమయాన్ని కేటాయించుకోవాలి. పరీక్ష ముగింపులో రివైజ్ కోసం 15-20 నిమిషాలు ఉంచుకోవాలి. అన్ని విభాగాలను ప్రయత్నించాలని నిర్ధారించుకోవాలి.. ముందుగా మీరు కచ్చితంగా ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అప్పుడు తెలియని లేదా సంక్లిష్టమైన వాటికి వెళ్లాి.. AP ICET 2023 పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి, మీరు తర్వాత అన్ని ప్రశ్నలను ప్రయత్నించవచ్చు.
- పరీక్ష వ్యవధి ముగిసిన తర్వాత మాత్రమే అభ్యర్థులు పరీక్ష హాలు నుంచి బయటకు రావడానికి అనుమతించబడతారని గుర్తుంచుకోండి. పరీక్ష సమయంలో అభ్యర్థులెవరూ బయటకు వెళ్లడానికి అనుమతించరు.
AP ICET 2023 పరీక్ష రోజున చేయకూడనివి (Don’ts for AP ICET 2023 Exam Day
పరీక్ష రోజున అభ్యర్థులు చేయకూడని పనుల జాబితా ఇక్కడ ఉంది:
- అభ్యర్థులు ఎలాంటి డిబార్ చేయబడిన వస్తువులను తీసుకెళ్లకూడదని తెలుసుకోవాలి. ఎలక్ట్రానిక్ వాచీలు, కాలిక్యులేటర్‌లు, మొబైల్ ఫోన్‌లు, కెమెరాలు, స్టడీ మెటీరియల్‌లు, పుస్తకాలు, నోట్‌లు, పేపర్లు లేదా అలాంటి ఇతర వస్తువులు అనుమతించబడవు. వీటిలో ఏవైనా వస్తువులు కలిగి ఉంటే, అభ్యర్థిత్వం వెంటనే రద్దు చేయబడుతుంది.
- పరీక్ష రోజున అన్ని పత్రాలు మరియు అవసరమైన వస్తువులను తీసుకెళ్లాలి.
- పరీక్ష సమయంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. భయాందోళనలు గందరగోళానికి లేదా తప్పు సమాధానాలకు దారితీయవచ్చు. అందువల్ల ప్రశాంతంగా ఉండి, ప్రతి ప్రశ్నకు శ్రద్ధగా సమాధానం ఇవ్వడం మంచిది.
- ఎలాంటి తినుబండారాలు తీసుకెళ్లకూడదు. అలా తీసుకెళ్లిన వారిని పరీక్ష హాలులోకి అనుమతించరు.
ఇది కూడా చదవండి: ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయడానికి ఏ డాక్యుమెంట్లు అవసరం?
ఏపీ ఐసెట్ 2023 పరీక్ష రోజు కోసం COVID మార్గదర్శకాలు (COVID Guidelines for AP ICET 2023 Exam Day)
పరీక్ష రోజున అభ్యర్థులు అనుసరించాల్సిన మార్గదర్శకాల జాబితా క్రింద ఇవ్వబడింది:
- అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరినప్పటి నుంచి వెళ్లే వరకు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
- చేరుకున్న సమయం నుంచి సామాజిక దూరాన్ని పాటించాలి.
- పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తారు. ఉష్ణోగ్రత ఎక్కువగా లేదా అసాధారణంగా ఉంటే, అభ్యర్థులు లోపలికి అనుమతించబడరు.
- పరీక్ష అంతటా రెగ్యులర్ వ్యవధిలో శానిటైజర్ ఉపయోగించాలి.
- ఫోటో క్యాప్చర్ పూర్తయినప్పుడు, అభ్యర్థులు తమ వంతు కోసం వేచి ఉండాలి.
- కేటాయించిన సీట్లో మాత్రమే కూర్చోవాలి.
- కోవిడ్ డిక్లరేషన్‌ను పూర్తి చేయాలి.
- పరీక్ష హాల్ నుంచి బయలుదేరేటప్పుడు డ్రాప్-డౌన్ బాక్స్‌లో రఫ్ పేపర్‌ను సబ్మిట్ చేయాలి.
AP ICET 2023 పరీక్ష పూర్తైన తర్వాత, AP ICET 2023 Answer Key విడుదల చేయబడుతుంది. ప్రిలిమినరీ ఆన్సర్ కీలపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. AP ICET 2023 పరీక్ష ముగిసిన తర్వాత అభ్యర్థులు ప్రశ్నపత్రం విశ్లేషణ, ఆశించిన కటాఫ్‌ను చెక్ చేయవచ్చు. AP ICET 2023 results జూలై-సెప్టెంబర్, 2023 మధ్య తాత్కాలికంగా తుది సమాధాన కీలతో పాటుగా ప్రకటించబడుతుంది. బాగా స్కోర్ చేయడానికి, అభ్యర్థులు ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభించాలి మరియు AP ICET 2023 పరీక్షలకు హాజరు కావాలి.
అడ్మిషన్ -సంబంధిత సహాయం కోసం, Common Application Form (CAF) పూరించండి లేదా మా టోల్-ఫ్రీ నంబర్ 1800-572-9877కు కాల్ చేయండి. అభ్యర్థులు Q and A zone ద్వారా కూడా ప్రశ్నలను అడగవచ్చు.
అన్ని అప్‌డేట్‌లు మరియు టిప్స్ కోసం CollegeDekhoతో చూస్తూ ఉండండి!
సిమిలర్ ఆర్టికల్స్
ఏపీ ఐసెట్( AP ICET 2023) అంచనా ప్రశ్న పత్రాలు: ముఖ్యమైన ప్రశ్నలు, అధ్యాయాలు మరియు విశ్లేషణ
ఇంటర్మీడియట్ తర్వాత అత్యుత్తమ మేనేజ్మెంట్ కోర్సులు (Top Management Courses after Intermediate) - ఎంచుకోవడానికి కారణాలు కెరీర్ స్కోప్
టీఎస్ ఐసెట్ 2023 ఎనలిటికల్ ఎబిలిటీకి (TS ICET Analytical Ability 2023) ప్రిపరేషన్ టిప్స్ ఇక్కడ తెలుసుకోండి
ఏపీ ఐసెట్ 2023 నార్మలైజేషన్ ప్రక్రియ, (AP ICET 2023 Score Calculation) స్కోర్‌ని ఎలా లెక్కిస్తారంటే?
తెలంగాణ ఐసెట్ 2023 కోసం (TS ICET 2023 Preparation Tips) లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ టిప్స్
List of Documents Required for TS ICET Counselling 2023: తెలంగాణ ఐసెట్ 2023 కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి