ఏపీ లాసెట్ 2023 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ముగిసిన తర్వాత ఏపీ లాసెట్ అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ (AP LAWCET 2022 Application Form Correction) ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
- ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు కోసం ముఖ్యమైన తేదీలు (Important …
- ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ డీటెయిల్స్ (AP LAWCET 2022 …
- ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ విధానం (Steps for AP …
- ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు కోసం ముఖ్యమైన సూచనలు (Important …
- ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ తర్వాత ఏమిటి? (What After …
- Faqs

ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ (AP LAWCET 2022 Application Form Correction): ఏపీ లాసెట్ 2023కు అప్లై చేసుకునే క్రమంలో అభ్యర్థులు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైన పొరపాట్లు జరిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏపీ లాసెట్ 2023కు దరఖాస్తుకు చివరి తేదీ ముగిసిన తర్వాత ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ కరెక్షన్ విండో యాక్టివేట్ అవుతుంది. కరెక్షన్ విండో ద్వారా అప్లికేషన్‌లో జరిగిన పొరపాట్లను, తప్పులను (AP LAWCET 2022 Application Form Correction) సరిదిద్దుకోవచ్చు. AP LAWCET 2023 అప్లికేషన్ కరెక్షన్ విధానం గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఏపీ లాసెట్ లేదా ఆంధ్రప్రదేశ్ కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్ state-level law exam. ఈ పరీక్షని APSCHE, హైదరాబాద్ తరపున శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. లాసెట్ 2023 ఎగ్జామ్ ద్వారా మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులో అడ్మిషన్ పొందవచ్చు. ఏపీ లాసెట్ సంవత్సరానికి ఒకసారి నిర్వహించబడుతుంది. పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి. అభ్యర్థులు తప్పు లేదా అసంపూర్ణ సమాచారాన్ని పూరించిన పక్షంలో తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోవాలి. ఇప్పటికే లాసెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ లింక్ కూడా యాక్టివేట్ అయింది.
ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు కోసం ముఖ్యమైన తేదీలు (Important Dates for AP LAWCET 2022 Application Form Correction)
AP LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలని అభ్యర్థులు ఈ దిగువున అందజేసిన టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
ముఖ్యమైన ఈవెంట్స్ | తేదీలు |
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | తెలియాల్సి ఉంది |
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
అప్లికేషన్ కరెక్షన్ ప్రారంభం | తెలియాల్సి ఉంది |
అప్లికేషన్ కరెక్షన్ ముగిసే తేదీ | తెలియాల్సి ఉంది |
AP LAWCET 2023 హాల్ టికెట్ | తెలియాల్సి ఉంది |
AP LAWCET 2023 పరీక్ష | తెలియాల్సి ఉంది |
ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ డీటెయిల్స్ (AP LAWCET 2022 Application Form Correction Details)
అభ్యర్థి స్వయంగా పొరపాట్లను కరెక్ట్ చేసుకోగలిగే కేటగిరీలు, కరెక్షన్ కోసం అభ్యర్థులు రిక్వెస్ట్ చేయాల్సిన ఫీల్డ్‌ల గురించి ఈ ఆర్టికల్లో పూర్తిస్థాయిలో తెలియజేయడం జరిగింది.
కేటగిరి 1
కేటగిరి 1లో భాగంగా కరెక్షన్ కోసం అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా ఏపీ లాసెట్ 2023 కన్వీనర్‌కి రాతపూర్వకంగా రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అభ్యర్థనను పంపించేటప్పుడు అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లను, డాక్యుమెంట్లను స్కాన్ చేసి జోడించాలి. దీంతోపాటు పేమంట్ ఐడీ, మొబైల్ నెంబర్, అర్హత పరీక్ష హాల్ టికెట్ నెంబర్ (డిగ్రీ/డిప్లొమా), పదో తరగతి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను పేర్కొనాలి. కేటగిరి 1 కిందకు వచ్చే ఫీల్డ్‌లు ఈ దిగువన ఇవ్వడం జరిగింది.
కరెక్షన్/సమస్య | అవసరమైన పత్రాలు |
శాఖ మార్పు | క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ (డిగ్రీ/డిప్లొమా) |
అభ్యర్థి పేరు | SSC మార్క్ మెమో |
తండ్రి పేరు | SSC మార్క్ మెమో |
DOB (తేదీ SSC ప్రకారం లేదా దాని సమానమైనది) | SSC మార్క్ మెమో |
సంతకం | స్కాన్ చేసిన సంతకం |
ఫోటోగ్రాఫ్ | JPEG ఆకృతిలో సరైన ఫోటోగ్రాఫ్ |
క్వాలిఫైయింగ్ హాల్ నెంబర్ టికెట్ (డిగ్రీ/డిప్లొమా) | క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ (డిగ్రీ/డిప్లొమా) స్కాన్ చేసిన కాపీ |
కేటగిరి 2
అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అయిన తర్వాత అభ్యర్థులు తమను తాము మార్చుకోగల అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
అర్హత పరీక్ష | స్థానిక ప్రాంతం స్థితి |
అర్హత పరీక్ష (ఉత్తీర్ణత/ కనిపించిన సంవత్సరం) | తల్లిదండ్రుల వార్షిక ఆదాయం |
బోధనా మాద్యమం | మైనారిటీ/నాన్-మైనారిటీ |
చదువుకునే ప్రదేశం | అధ్యయనం డీటెయిల్స్ |
తల్లి పేరు | జెండర్ |
పుట్టిన ప్రదేశం | SSC హాల్ టికెట్ నెంబర్ |
కమ్యూనిటీ | ఆధార్ కార్డ్ డీటెయిల్స్ |
మొబైల్ నెంబర్ | కరస్పాండెన్స్ ప్రాంతం |
స్పెషల్ కేటగిరి | ఈ మెయిల్ ఐడీ |
ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ విధానం (Steps for AP LAWCET 2022 Application Form Correction)
AP LAWCET 2022 అప్లికేషన్ ఫార్మ్‌లో కరెక్షన్ చేయడానికి అభ్యర్థులు తప్పనిసరి ఈ దిగువున తెలియజేసిన స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి.
అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అవసరమైన డీటెయిల్స్‌తో లాగిన్ అవ్వాలి.
అప్లికేషన్ ఫార్మ్ స్క్రీన్‌పై కొత్త పాప్ అప్‌తో తెరవబడుతుంది.
అవసరమైన కరెక్షన్స్‌ని జాగ్రత్తగా చేయాలి.
పూర్తైన తర్వాత అభ్యర్థి తప్పనిసరిగా ఫార్మ్‌ని సబ్మిట్ చేసి భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి
ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు కోసం ముఖ్యమైన సూచనలు (Important Instructions for AP LAWCET 2022 Application Form Correction)
AP LAWCET 2022 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చేయబడుతుంది.
అభ్యర్థులు AP LAWCET 2022 అప్లికేషన్ ఫార్మ్‌లో కొన్ని నిర్దిష్ట ఫీల్డ్‌లలో మాత్రమే సవరణలు చేయగలరు.
నిర్ణీత వ్యవధి వరకు మాత్రమే దిద్దుబాట్లు అనుమతించబడతాయి. AP LAWCETలో దిద్దుబాట్లు చేయడానికి చివరి తేదీ దాటిన తర్వాత అభ్యర్థులు తదుపరి మార్పులు చేయలేరు.
AP LAWCET 2022 అప్లికేషన్ ఫార్మ్ కోసం ఆఫ్‌లైన్ మోడ్ దిద్దుబాట్లు ఏవీ నిర్వహించబడవు.
కేవలం లాగిన్ చేయడం ద్వారా అభ్యర్థులు స్వయంగా కొన్ని రంగాలలో దిద్దుబాట్లు చేయవచ్చు, ఇతర రంగాలలో అభ్యర్థి ఈ-మెయిల్ ద్వారా రాతపూర్వక అభ్యర్థన చేయాలి. ఈ-మెయిల్‌లో అభ్యర్థులు సహాయక పత్రాలను కూడా జతచేయాలి.
ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ తర్వాత ఏమిటి? (What After AP LAWCET 2022 Application Form Correction?)
ఏపీ లాసెట్ ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. leading colleges of AP LAWCETలో ఒకదానిలో అడ్మిషన్ పొందడానికి చాలామంది అభ్యర్థులు ఈ ఎంట్రన్స్ పరీక్షకు హాజరవుతారు. అభ్యర్థులు తమ పరిసర ప్రాంతాల్లో టాప్ లా కాలేజీలు గురించి తెలుసుకోవడానికి ఈ హెల్ప్‌లైన్ నెంబర్ 1800-572-9877 (టోల్-ఫ్రీ)కి డయల్ చేయవచ్చు. నిపుణులు అభ్యర్థులు కోరే సహాయం చేయడానికి అభ్యర్థులకు అందుబాటులోకి వస్తారు. ఏవైనా పరిష్కారం కాని సమస్యల కోసం, QnA zoneలో మాకు తెలియజేయవచ్చు.
ఏపీ లాసెట్ 2023కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు CollegeDekhoని ఫాలో అవ్వొచ్చు.
సిమిలర్ ఆర్టికల్స్
TS LAWCET 2023 ఫేజ్ I కౌన్సెలింగ్‌కు ఎవరు అర్హులు?
AP LAWCET 2023 అర్హత మార్కులు (AP LAWCET 2023 Qualifying Marks)
AP LAWCET 2023 ఆశించిన కటాఫ్ (AP LAWCET 2023 Expected Cutoff): గత సంవత్సరాల కటాఫ్ ట్రెండ్లను తనిఖీ చేయండి
TS LAWCET 2023 కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాల జాబితా
ఇంటర్మీడియట్ సైన్స్ చదివిన తర్వాత న్యాయశాస్త్రాన్ని (Law Courses after Intermediate Science)ఎలా అభ్యసించాలి
TS LAWCET 2023 పరీక్షను మొదటి ప్రయత్నంలోనే క్రాక్ చేయడం ఎలా? ( Tips and Tricks to Crack TS LAWCET 2023 in First Attempt)