మీరు ఏపీ లాసెట్ 2023కి హాజరవుతున్నారా? పరీక్షకు ముందు గందరగోళంగా ఉందా? అయితే ఏ మాత్రం ఆందోళన చెందనక్కర్లేదు. మొదటి ప్రయత్నంలోనే ఏపీ లాసెట్ 2023లో మంచి స్కోర్ ఎలా సాధించవచ్చో (How to Crack AP LAWCET 2023) తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ను చదవండి.
- ఏపీ లాసెట్ 2023 ముఖ్యాంశాలు (AP LAWCET 2022 Highlights)
- ఏపీ లాసెట్ 2023 సిలబస్ (AP LAWCET 2022 Syllabus)
- ఏపీ లాసెట్ 2023 పరీక్షా సరళి (AP LAWCET 2022 Exam Pattern)
- AP LAWCET 2023 అర్హత మార్కులు (AP LAWCET 2023 Qualifying Marks)
- ఏపీ లాసెట్ 2023 ప్రిపరేషన్ టిప్స్ (AP LAWCET 2022 Preparation Tips)
- AP LAWCET 2023 ముఖ్యమైన పుస్తకాలు (AP LAWCET 2023 Important Books)

ఏపీ లాసెట్ 2023లో మంచి ర్యాంకు ఎలా సాధించవచ్చు? (How to Crack AP LAWCET 2023): ఏపీ లాసెట్‌ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తరపున శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించే state-level law entrance examination. వివిధ లా కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్‌ని నిర్వహించడం జరుగుతుంది. మూడేళ్లు, ఐదు సంవత్సరాల LL.B కోర్సులు LL.B (ఆనర్స్), B.Com LL.B, B.A. LL.B, BBA LL.B మొదలైన వాటికి అడ్మిషన్ల కోసం లాసెట్ నిర్వహించబడుతుంది. ఏపీ లాసెట్ పరీక్ష ఇంగ్లీష్, తెలుగు భాషల్లో నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ లా కాలేజీల్లో జాయిన్ అవ్వొచ్చు. ప్రతి సంవత్సరం AP LAWCET ఆంధ్రప్రదేశ్‌లోని 16 కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది. లాసెట్ 2023లో ఒకే ప్రయత్నంలో పాస్ అయి మంచి స్కోర్ ఎలా సాధించవచ్చో (How to Crack AP LAWCET 2023) ఈ ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది.
ఏపీ లాసెట్ 2023 ఎగ్జామ్ మే 20వ తేదీన జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. రిజిస్ట్రేషన్ లింక్ కూడా యాక్టివేట్ అయింది. లాసెట్ 2023కు కొన్ని రోజులే ఉన్నందు వల్ల అభ్యర్థులు బాగా ప్రిపేర్ అవ్వాలి. ముందుగా అభ్యర్థులు పరీక్షా విధానం, AP LAWCET సిలబస్, AP LAWCET 2023కు సంబంధించిన మంచి పుస్తకాలను, మార్కింగ్ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. అభ్యర్థులు చివరి నిమిషంలో తొందరపడకుండా ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభించాలి. ప్రిపరేషన్ ముందుగానే ప్రారంభించినట్లయితే ఏ అంశాల్లో బలంగా ఉన్నారో, ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది. దాని ప్రకారం ప్రిపరేషన్ స్ట్రాటజీ ని మార్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అభ్యర్థులు AP LAWCET 2023 సిలబస్ మొత్తాన్ని కవర్ చేయడానికి ప్రయత్నించాలి. AP LAWCET అనేది కరెంట్ అఫైర్స్, లా ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ వంటి సబ్జెక్ట్‌లుగా విభజించబడింది. ఈ అంశాలపై విద్యార్థులు పట్టు సాధించాలి. సిలబస్ మొత్తాన్ని కవర్ చేయడమే కాకుండా, సరైన రివిజన్ చేయాలి. ముఖ్యమైన అంశాలను ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆర్టికల్లో లాసెట్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం కొన్ని టిప్స్‌ని అందజేస్తున్నాం. ఆ టిప్స్ మీ ప్రిపరేషన్‌ని వ్యూహాత్మకంగా రూపొందించుకోవడంలో సహాయ పడతాయి.
ఏపీ లాసెట్ 2023 ముఖ్యాంశాలు (AP LAWCET 2022 Highlights)
ఈ దిగువ ఇవ్వబడిన టేబుల్‌లోొ ఏపీ లాసెట్ 2023 (AP LAWCET 2023) ఎంట్రన్స్ పరీక్ష కొన్ని ప్రధాన ముఖ్యాంశాలను కవర్ చేయడం జరిగింది.
పరీక్ష పేరు | ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చట్టం ఎంట్రన్స్ టెస్ట్ |
కండక్టింగ్ బాడీ | శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి |
పరీక్ష స్థాయి | అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి |
పరీక్ష ఫ్రీక్వెన్సీ | సంవత్సరానికి ఒకసారి |
పరీక్ష మోడ్ | కంప్యూటర్-ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష |
పరీక్షా మాధ్యమం | ఇంగ్లీష్ & తెలుగు |
కనీస అర్హత | 10+2 |
మొత్తం మార్కులు | 120 |
మొత్తం ప్రశ్నలు | 120 |
పరీక్ష వ్యవధి | 1 గంట 30 నిమిషాలు |
ఏపీ లాసెట్ 2023 సిలబస్ (AP LAWCET 2022 Syllabus)
దిగువ ఇవ్వబడిన టేబుల్ AP LAWCET 2022 ఎంట్రన్స్ పరీక్షలోని ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన అంశాలను జాబితా చేస్తుంది. అభ్యర్థులు పరీక్షలో బాగా రాణించాలంటే AP LAWCET 2022 యొక్క మొత్తం సిలబస్తో బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి.
సబ్జెక్టులు | అంశాలు |
సమకాలిన అంశాలు | జాతీయ, అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన ముఖ్యమైన వార్తలు, ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన ప్రస్తుత సంఘటనలు, చట్టపరమైన కేసులు/తీర్పులకు సంబంధించిన వార్తలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు |
లా స్టడీ కోసం ఆప్టిట్యూడ్ | చట్టపరమైన నిబంధనలు, దుర్మార్గపు బాధ్యత, టార్ట్‌లు, ఒప్పందాలు మరియు రాజ్యాంగ చట్టం, భారత రాజ్యాంగం మరియు దాని నిర్మాణం, విభాగాలు మరియు షెడ్యూల్‌లు, IPC మరియు CrPC, కఠినమైన బాధ్యత, నేరాల చట్టం, అంతర్జాతీయ చట్టం, చట్టపరమైన అవగాహన కవరింగ్, మేధో సంపత్తి హక్కులు మరియు రాజ్యాంగ చట్టం, రాజకీయాలు |
జనరల్ నాలెడ్జ్ మరియు మెంటల్ ఎబిలిటీ | చారిత్రక సంఘటనలు, ఆర్థిక శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, ఇడియమ్స్, పద బంధాలు, సాధారణ ఇంగ్లీష్‌కు సంబంధించిన విషయాలు |
ఏపీ లాసెట్ 2023 పరీక్షా సరళి (AP LAWCET 2022 Exam Pattern)
మీరు మీ ప్రిపరేషన్‌ను ప్రారంభించే ముందు AP LAWCET 2022 Exam Pattern తెలుసుకోవడం తప్పనిసరి.
- పరీక్షా మీడియం: AP LAWCET 2023 ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం ఇంగ్లీష్, తెలుగు భాషలలో అందుబాటులో ఉంటుంది.
- పరీక్షా సమయాలు: పరీక్ష మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 4:30 వరకు నిర్వహించబడుతుంది.
- ప్రశ్నల రకం: ప్రశ్నపత్రంలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి, ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. విద్యార్థులు నాలుగు ఆప్షన్లలో సరైన సమాధానాన్ని ఎంచుకోవాలి.
- మొత్తం మార్కులు : AP LAWCET 2023 ఎంట్రన్స్ పరీక్ష కోసం మొత్తం మార్కులు 120, ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
AP LAWCET 2023 విభాగాలు | సెక్షన్ చొప్పున ప్రశ్నలు |
సమకాలిన అంశాలు | 30 |
జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ | 30 |
చట్టాన్ని అభ్యసించడానికి ఆప్టిట్యూడ్ | 60 |
మొత్తం మార్కులు | 120 |
AP LAWCET 2023 అర్హత మార్కులు (AP LAWCET 2023 Qualifying Marks)
కౌన్సెలింగ్ రౌండ్‌కు అర్హత సాధించడానికి అభ్యర్థులు లాసెట్‌లో తగిన అర్హత మార్కులను పొందాలి. అయితే వారు అర్హత మార్కుల కంటే ఎక్కువ పొందడానికి ప్రయత్నించాలి. AP LAWCET 2023 కేటగిరీ వారీగా అర్హత మార్కులు ఈ కింది విధంగా ఉన్నాయి. కేటగిరి | అర్హత శాతం | అర్హత మార్కులు |
జనరల్ | 35 శాతం | 120 మార్కులకి 40 మార్కులు రావాలి |
SC/ST | కనీస అర్హత శాతం లేదు | కనీస అర్హత మార్కులు లేవు |
ఏపీ లాసెట్ 2023 ప్రిపరేషన్ టిప్స్ (AP LAWCET 2022 Preparation Tips)
ఏపీ లాసెట్ 2023 (AP LAWCET 2023) ఎంట్రన్స్ పరీక్షని ఒకేసారి క్లియర్ చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా అవసరమైన టిప్స్‌తో సరైన స్ట్రాటజీని రూపొందించాలి. AP LAWCET 2023 ఎంట్రన్స్ పరీక్ష కోసం అవసరమైన టిప్స్‌ని ఇక్కడ ఇవ్వడం జరిగింది.
టైమ్ టేబుల్ తయారు చేసుకోవాలి
విద్యార్థులు నెల వారీగా, వారం వారీగా, రోజువారీగా పరీక్ష కోసం ప్రిపరేషన్‌ని ప్లాన్‌ని రూపొందించుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌కి టైం టేబుల్ తయారు చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌కి ప్రిపేర్ అవ్వడానికి రోజుకు కనీసం 2 గంటలు అవసరం. అయితే టాపిక్‌ల మధ్య 10-15 నిమిషాల విరామం తీసుకోవడం మరిచిపోకూడదు. తర్వాత తగినంత రివిజన్ సమయాన్ని పొందడానికి మొదటి నెలలోపు అన్ని సందేహాలను క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. పరీక్షకు ముందు చివరి రెండు వారాలు తప్పనిసరిగా రివిజన్, మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే కేటాయించుకోవాలి.
మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయాలి
అభ్యర్థులు వీలైనన్ని ఏపీ లాసెట్ మాక్ టెస్ట్‌లని ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. మాక్ టెస్ట్‌లను ప్రాక్టీాస్ చేయడం ద్వారా ఏపీ లాసెట్ పరీక్షా విధానం పూర్తిగా అర్థం అవుతుంది. పరీక్షలో అడిగే ప్రశ్నలు, ప్రశ్న పత్రంపై అవగాహన ఏర్పడుతుంది. మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టిన తర్వాత అభ్యర్థులు తాము సిలబస్‌లో ఏ అంశాల్లో వీక్‌గా ఉన్నారో, ఏ అంశాల్లో బలంగా ఉన్నారో తెలుస్తుంది.
పుస్తకాలు, పాత ప్రశ్న పత్రాలు సేకరించాలి
ప్రిపరేషన్ కోసం కూర్చునే ముందు, AP LAWCET 2023 పరీక్ష కోసం అన్ని పుస్తకాలు, నోట్స్, స్టడీ మెటీరియల్‌లను సేకరించాలి. సబ్జెక్ట్ వారీగా అన్ని AP LAWCET పుస్తకాలు, మాక్ టెస్ట్ పేపర్‌లను సేకరించాలి. తద్వారా మీరు ప్రాక్టీస్ కొనసాగించవచ్చు. అదే విధంగా మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల సిలబస్‌లోని ప్రతి అంశంపై, ప్రశ్నలపై మంచి పట్టు సాధిస్తారు.
కొత్త టాపిక్‌ని ప్రారంభించవద్దు
అభ్యర్థులు మంచి మార్కులు సాధించడానికి ప్రతి టాపిక్‌ని కవర్ చేయాలనుకుంటారు. దీంతో విద్యార్థులు పరీక్షకు ముందు కూడా కొత్త టాపిక్స్‌పై దృష్టి పెడతారు. కానీ ఒక కాన్సెప్ట్‌ని చదవడానికి, అర్థం చేసుకోవడానికి, క్లియర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. పరీక్షకు ముందు చివరి వారాలు పూర్తిగా మీ రివిజన్‌కి పూర్తి సమయాన్ని కేటాయించాలి. అందుకే కొత్త టాపిక్స్‌ని ప్రారంభించకూడదు. మీరు ఇప్పటికే స్టడీ చేసిన వాటిపై మాత్రమే దృష్టి పెట్టాలి.
నోట్స్ తయారు చేసుకోవాలి
మొదటి రోజు నుంచి ప్రతి సబ్జెక్ట్‌ని విడిగా ప్రిపేర్ చేసి, కాన్సెప్ట్‌ను అర్థం చేసుకుంటూ నోట్స్ తయారు చేసుకోవాలి. మీరు ప్రతి టాపిక్ కోసం ప్రిపేర్ చేసే నోట్స్ పరీక్షకు ముందు రివిజన్ చేసుకోవడానికి సహాయపడతాయి. ఆ నోట్స్ వల్ల అన్ని అంశాలను చదవాల్సిన అవసరం ఉండదు. నోట్స్ చదివి అర్థం చేసుకోవచ్చు.
కరెంట్ అఫైర్స్ కోసం ప్రిపరేషన్
కరెంట్ అఫైర్స్ సెక్షన్ అనేది అత్యంత ముఖ్యమైన భాగం. మీరు ప్రతిరోజూ వార్తాపత్రికలు లేదా మ్యాగజైన్‌లను చదివితే 30 మార్కులని పొందడం సులభం అవుతుంది. ప్రశ్నపత్రంలో చట్టపరమైన, రాజకీయ వ్యవహారాలు, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత, విజయాలు, అవార్డులకు సంబంధించిన వివరాలు, లేటెస్ట్ పరిణామాలు ఉంటాయి.
జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ కోసం ప్రిపరేషన్
జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ విభాగం 30 మార్కులకు ఉంటుంది. ఇక్కడ చరిత్ర, భౌగోళికం, ఆర్థికశాస్త్రం, పర్యావరణం గురించి ప్రశ్నలు అడుగుతారు. మానసిక సామర్థ్యం విభాగంలో మ్యాథ్స్, తార్కిక నైపుణ్యాలు రెండూ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ విభాగానికి వీలైనన్ని మాక్ టెస్ట్ పేపర్‌లను ప్రాక్టీస్ చేయాలి.
లా స్టడీ ఆప్టిట్యూడ్ కోసం ప్రిపరేషన్
ఈ సెక్షన్‌కి లోతైన అభ్యాసం అవసరం. ఇది సిలబస్‌లో అత్యంత కీలకమైన భాగం. అభ్యర్థులు భారత రాజ్యాంగంపై డీటెయిల్స్‌తో పాటు దేశంలోని పార్లమెంట్, న్యాయవ్యవస్థ ఇతర ముఖ్యమైన విభాగాలపై దృష్టి పెట్టాలి. ఈ సెక్షన్‌లో 60 మార్కులు ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కాంట్రాక్ట్‌ల చట్టం, రాజ్యాంగ చట్టం, IPC, CrPC సెక్షన్‌లు, విభిన్న జాతీయ, అంతర్జాతీయ చట్టపరమైన కేసులను పూర్తిగా అధ్యయనం చేయాలి.
AP LAWCET 2023 ముఖ్యమైన పుస్తకాలు (AP LAWCET 2023 Important Books)
ప్రవేశ పరీక్షలో మంచి స్కోర్ పొందడానికి అభ్యర్థులు ఈ దిగువ పట్టికలో ఇవ్వబడిన AP LAWCET 2023 ముఖ్యమైన పుస్తకాల జాబితా నుంచి సిద్ధం చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ విభాగానికి నిర్దిష్ట పుస్తకాలు లేవు.జనరల్ నాలెడ్జ్ | లూసెంట్ జనరల్ నాలెడ్జ్ |
మెంటల్ అబిలిటీ | వెర్బల్ & నాన్-వెర్బల్ రీజనింగ్‌కు ఆధునిక విధానం |
లా స్టడీ కోసం ఆప్టిట్యూడ్ | CLAT, ఇతర న్యాయ ప్రవేశ పరీక్షల కోసం లీగల్ ఆప్టిట్యూడ్: ఒక వర్క్‌బుక్ |
లా పరీక్షలు, అడ్మిషన్‌ల గురించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం CollegeDekhoకు చూస్తూ ఉండండి.
సిమిలర్ ఆర్టికల్స్
TS LAWCET 2023 ఫేజ్ I కౌన్సెలింగ్‌కు ఎవరు అర్హులు?
AP LAWCET 2023 అర్హత మార్కులు (AP LAWCET 2023 Qualifying Marks)
AP LAWCET 2023 ఆశించిన కటాఫ్ (AP LAWCET 2023 Expected Cutoff): గత సంవత్సరాల కటాఫ్ ట్రెండ్లను తనిఖీ చేయండి
TS LAWCET 2023 కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాల జాబితా
ఇంటర్మీడియట్ సైన్స్ చదివిన తర్వాత న్యాయశాస్త్రాన్ని (Law Courses after Intermediate Science)ఎలా అభ్యసించాలి
TS LAWCET 2023 పరీక్షను మొదటి ప్రయత్నంలోనే క్రాక్ చేయడం ఎలా? ( Tips and Tricks to Crack TS LAWCET 2023 in First Attempt)