తెలంగాణ బి ఫార్మా అడ్మిషన్ (TS B. Pharma Admission ) నోటిఫికేషన్ TSCHE ద్వారా మార్చి 03 వ తేదీన విడుదల అయ్యింది. బి ఫార్మా అప్లికేషన్ , కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్స్ , సీట్ల కేటాయింపు, ట్యూషన్ ఫీజు మొదలైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ లో గమనించవచ్చు.
- తెలంగాణ బి ఫార్మా అడ్మిషన్ 2023 కు ఆమోదించే ప్రవేశ పరీక్షలు (Entrance …
- తెలంగాణ బి ఫార్మా ముఖ్యమైన తేదీలు 2023 ( TS B Pharma …
- తెలంగాణ బి ఫార్మ్ 2023 కావాల్సిన అర్హతలు ( Telangana B Pharm …
- తెలంగాణ బి ఫార్మా అడ్మిషన్ ప్రాసెస్ 2023 (Telangana B Pharma Admission …
- తెలంగాణలో బి ఫార్మా ప్రవేశానికి అవసరమైన పత్రాలు (Documents Required for B …
- తెలంగాణ బి ఫార్మా సెలెక్షన్ ప్రాసెస్ 2023 (Telangana B Pharma Selection …
- తెలంగాణ బి ఫార్మా కౌన్సెలింగ్ ప్రక్రియ 2023 (Telangana B Pharma Counselling …
- తెలంగాణ బి ఫార్మా సీట్ల కేటాయింపు 2023 (Telangana B Pharma Seat …
- తెలంగాణ బి ఫార్మా అడ్మిషన్ రిజర్వేషన్ పాలసీ 2023 (Telangana B Pharma …
- తెలంగాణ బి ఫార్మా సీట్ మ్యాట్రిక్స్ 2023 (Telangana B Pharma Seat …
- తెలంగాణలోని టాప్ బి ఫార్మా కాలేజీలు (Top B Pharma Colleges in …

తెలంగాణ బి ఫార్మా అడ్మిషన్ 2023(TS B. Pharma Admission 2023): తెలంగాణ రాష్ట్రం లో B.Pharma అడ్మిషన్స్ Jawaharlal Nehru Technological University (JNTU), హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. తెలంగాణలో ఈ B.Pharma కోర్సులో అడ్మిషన్(TS B. Pharma Admission 2023) కోసం ప్రతి ఏడాది రెండు లక్షల పైన విద్యార్థులు స్టేట్ లెవెల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు హాజరవుతారు. TSCHE ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించబడే ఈ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)విధానంలో నిర్వహిస్తారు. తెలంగాణలోని B.Pharma కాలేజీలలో అడ్మిషన్స్ కేవలం మెరిట్ ఆధారంగా జరుగుతాయి.
తెలంగాణలో B. Pharma కోర్సులో అడ్మిషన్ పొందాలనుకునే ఇంటర్ సెకండియర్ విద్యార్థులు తప్పనిసరిగా ఎంట్రెన్స్ టెస్ట్ ను క్లియర్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ B. Pharma అడ్మిషన్స్ 2023(TS B. Pharma Admission 2023) కు సంబంధించిన వివరాలు అనగా ఎలిజిబిలిటీ, ముఖ్యమైన తేదీలు,అడ్మిషన్ విధానం, సెలక్షన్ ప్రాసెస్ మొదలైనవి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.
తెలంగాణ బి ఫార్మా అడ్మిషన్ 2023 కు ఆమోదించే ప్రవేశ పరీక్షలు (Entrance Exams Accepted for Telangana B Pharma Admission 2023)
ఈ కోర్సు కు తెలంగాణలోని మెజారిటీ ప్రైవేట్ టెక్నికల్ యూనివర్సిటీలు TS EAMCET లో వచ్చిన స్కోరు ను బట్టి అడ్మిషన్ ఇస్తాయి .తెలంగాణలోని గవర్నమెంట్ కాలేజీలలో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా TS EAMCET లో వాలిడ్ స్కోరును సంపాదించాలి. అదేవిధంగా స్టేట్ కోటాలో కూడా TS EAMCET స్కోరు తప్పనిసరి.
తెలంగాణ బి ఫార్మా ముఖ్యమైన తేదీలు 2023 ( TS B Pharma Important Dates 2023)
తెలంగాణ రాష్ట్రంలో B. Pharma అడ్మిషన్(TS B. Pharma Admission 2023) ప్రోగ్రాంలో పాల్గొనాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా దానికి సంబంధించిన గవర్నమెంట్ నిర్వహించే స్టేట్ లెవెల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(TS EAMCET) యొక్క ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకోవాలి. కింద ఇవ్వబడిన టేబుల్ లో తెలంగాణ B. Pharma అడ్మిషన్ 2023 కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఉన్నాయి.
కార్యక్రమం | ముఖ్యమైన తేదీలు |
దరఖాస్తు ఫారమ్ ప్రారంభ తేదీ | 03 మార్చి 2023 |
దరఖాస్తు ఫారమ్ ముగింపు తేదీ | తెలియాల్సి ఉంది |
తెలంగాణ బి ఫార్మా అడ్మిట్ కార్డ్ 2023 | తెలియాల్సి ఉంది |
తెలంగాణ బి ఫార్మా ప్రవేశ పరీక్ష 2023 | 10,11 మార్చి 2023 |
TS EAMCET 2023 కౌన్సెలింగ్ - ఆన్‌లైన్ ఇన్ఫర్మేషన్ ఫిల్లింగ్, అప్లికేషన్ ఫీజు & డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ | తెలియాల్సి ఉంది |
సర్టిఫికెట్ వెరిఫికేషన్ | తెలియాల్సి ఉంది |
వెబ్ ఆప్షన్స్ నమోదు | తెలియాల్సి ఉంది |
తాత్కాలిక సీట్ల కేటాయింపు ఫలితం | తెలియాల్సి ఉంది |
ట్యూషన్ ఫీజు చెల్లింపు | తెలియాల్సి ఉంది |
తెలంగాణ బి ఫార్మ్ 2023 కావాల్సిన అర్హతలు ( Telangana B Pharm Eligibility 2023)
తెలంగాణ B. Pharma అడ్మిషన్స్(TS B. Pharma Admission 2023) కు అవసరమైన ఎలిజిబిలిటీ క్రింది పట్టికలో వివరించబడింది.
కేటగిరీ | అర్హత ప్రమాణం |
విద్యాపరమైన అర్హత | ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్ |
కనీస మార్కుల శాతం | 45% లేదా అంతకంటే ఎక్కువ |
విషయ ప్రాధాన్యత | ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ |
జాతీయత | భారతీయుడు |
నివాస అవసరాలు | తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ నివాసి. స్థానిక/స్థానికేతర స్థితి అవసరాలకు అనుగుణంగా ఉండాలి |
వయో పరిమితి | అడ్మిషన్ల ప్రారంభ తేదీ నాటికి 16 సంవత్సరాలు ఉండాలి |
తెలంగాణ బి ఫార్మా అడ్మిషన్ ప్రాసెస్ 2023 (Telangana B Pharma Admission Process 2023)
ఫార్మసీ కోర్సు కు అవసరమైన అర్హతలు ఉన్నా విద్యార్థులు కింద పేర్కొన్న విధంగా తెలంగాణ అడ్మిషన్ B. Pharma 2023(TS B. Pharma Admission 2023)లో పాల్గొనవచ్చు. పైన చెప్పినట్లుగా TS EAMCET 2023 యొక్క అడ్మిషన్ గైడ్లైన్స్ ఆధారంగా నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు అడ్మిషన్లు జరుగుతాయి. కాబట్టి అభ్యర్థులకు కింద చెప్పిన విధంగా కోర్సులలో అడ్మిషన్ ఇవ్వబడుతుంది.
TS EAMCET క్వాలిఫైయింగ్ మార్కులు (TS EAMCET Qualifying Marks)
జనరల్ కేటగిరి కి చెందిన విద్యార్థులు TS EAMCET ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో కనీసం 25% మార్కులు సాధించాలి .ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో పాస్ అయిన విద్యార్థి తెలంగాణలోని B. Pharma ప్రోగ్రాంలో అడ్మిషన్ (TS B. Pharma Admission 2023)కోసం పరిగణించబడతారు. మరియు SC/ST కేటగిరి విద్యార్థులకు,TS EAMCET లో మినిమం మార్కులు అర్హత అవసరం లేదు కానీ TS EAMCET ఎంట్రన్స్ స్కోరులో నాన్ జీరో స్కోరును పొందాలి.
TS EAMCET ర్యాంకింగ్ (TS EAMCET Ranking)
తెలంగాణ B. Pharma కౌన్సిలింగ్ ప్రాసెస్ కు రిజిస్టర్ చేసుకోవాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా 2023లో ఒక వ్యాలీడ్ ర్యాంకును పొందాలి ఈ ర్యాంకు విద్యార్థులకు వారి TS EAMCET ఎంట్రెన్స్ ఎగ్జామ్ స్కోరును బట్టి కేటాయిస్తారు .TSCHE విద్యార్థులకు వచ్చిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లోని స్కోరులో 25% వెయిటేజీని మరియు వారి TS EAMCET ఎగ్జామ్ లోని 75% వెయిటేజీని ఆధారంగా చేసుకుని ర్యాంకులను కేటాయిస్తారు.
మెరిట్ జాబితా (Merit List)
TSCHE యొక్క అడ్మిషన్ అథారిటీస్ పేర్కొన్న విధంగా విద్యార్థుల యొక్క TS EAMCET లో మెరిట్ లిస్టు తయారుచేస్తారు.
ఒకవేళ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు మార్కులు సమానంగా వచ్చినట్లయితే దానికి సంబంధించిన ర్యాంకుల విభజన విధానాన్ని అడ్మిషన్(TSCHE B.Pharma admission 2023) అధారిటీ కింది విధంగా అనుసరిస్తుంది.
- ముందుగా TS EAMCET లో విద్యార్థులు పొందిన మొత్తం స్కోర్ ను పరిగణలోకి తీసుకుంటారు మరియు ఎక్కువ స్కోర్ సాధించిన విద్యార్థులను మెరిట్ లిస్ట్ లో చేర్చుతారు.
- పైన చెప్పిన రూల్ తర్వాత కూడా వారి మార్కులు సమానంగా ఉంటే అప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ లో కెమిస్త్రీ లేదా బయాలజీ లో స్కోర్ చేసిన మొత్తం మార్కులు పరిగణలోకి తీసుకోబడతాయి.
- పైన పేర్కొన్న రెండు నియమాల తర్వాత కూడా మార్కులు సమానంగా ఉన్నట్లయితే అలాంటప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ లోని మొత్తం మార్కులు పరిగణలోకి తీసుకుంటారు.
- పైన మూడు నియమాల తర్వాత కూడా మార్కులు సమానంగా ఉంటే అప్పుడు వారికి ఏజ్ ను బట్టి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది, అనగా పెద్దవారికి మొదటి ర్యాంక్ చిన్నవారికి తర్వాతి ర్యాంక్ కేటాయించబడుతుంది
తెలంగాణలో బి ఫార్మా ప్రవేశానికి అవసరమైన పత్రాలు (Documents Required for B Pharma Admission in Telangana)
విద్యార్థులందరూ కూడా కింద చెప్పిన డాక్యుమెంట్స్ ను తప్పనిసరిగా కౌన్సిలింగ్ కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
10వ తరగతి మార్క్స్ సర్టిఫికేట్
ఇంటర్మీడియట్ మార్క్స్ సర్టిఫికేట్
TS EAMCET అడ్మిట్ కార్డ్
TS EAMCET ర్యాంక్ కార్డ్
కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు రసీదు
దరఖాస్తుదారు నివాస ధృవీకరణ పత్రం
కుల ధృవీకరణ పత్రం
ఆదాయ ధృవీకరణ పత్రం
తెలంగాణ బి ఫార్మా సెలెక్షన్ ప్రాసెస్ 2023 (Telangana B Pharma Selection Process 2023)
తెలంగాణలో బి ఫార్మా ప్రోగ్రామ్ ఎంపిక అనేది అభ్యర్థి స్కోర్ మరియు TS EAMCET ప్రవేశ పరీక్షలో పొందిన ర్యాంకింగ్ ఆధారంగా ఉంటుంది. తెలంగాణ బి ఫార్మా ఎంపిక ప్రక్రియ 2023 సమయంలో రాష్ట్ర ప్రభుత్వ కోటా పథకం కూడా వర్తిస్తుంది. Participating colleges of TS EAMCET లో అందించే బి ఫార్మా కోర్సుల కోసం కాబోయే విద్యార్థుల ఎంపిక, తెలంగాణ బి ఫార్మా అడ్మిషన్ల కోసం 2023 కౌన్సెలింగ్ సెషన్ ఆధారంగా ఉంటుంది.
తెలంగాణ బి ఫార్మా కౌన్సెలింగ్ ప్రక్రియ 2023 (Telangana B Pharma Counselling Process 2023)
TS EAMCET లో వాలిడ్ ర్యాంకు ఉన్న విద్యార్థులు అందరూ కూడా తెలంగాణ B. Pharma (TS B. Pharma Admission 2023) కౌన్సిలింగ్ ప్రాసెస్ లో పాల్గొనవచ్చు. తెలంగాణ B.Pharma కౌన్సిలింగ్ ప్రాసెస్ వివిధ దశలలో నిర్వహించబడుతుంది. మరియు మొత్తం ప్రాసెస్ అంతా సెంట్రలైజ్డ్ చేయబడింది. ఈ తెలంగాణ B. Pharma కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించిన వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
1. కౌన్సెలింగ్ ఫీజు (Counselling Fee)
తెలంగాణ B. Pharma (TS B. Pharma Admission 2023)కౌన్సిలింగ్ ప్రాసెస్ యొక్క మొట్టమొదటి స్టేజ్ కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్. జనరల్ కేటగిరి విద్యార్థులు యొక్క కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీజు 1200/- అదేవిధంగా SC/ST కేటగిరి విద్యార్థులకు 600/- వరకు ఉండవచ్చు.
వర్గం | ఫీజు |
జనరల్ | రూ 1200/- |
SC/ ST | రూ. 600/- |
ఈ కౌన్సిలింగ్ ఫీజును మీ వీలును బట్టి క్రెడిట్ కార్డ్ /డెబిట్ కార్డ్ /నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవచ్చు .కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీజును చెల్లించడానికి కింద ఇవ్వబడిన స్టెప్స్ ను అనుసరించవచ్చు.
- TSCHE తెలంగాణ B. Pharma (TSCHE B. Pharma admission 2023) కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ కోసం ఒక కొత్త వెబ్సైట్ను క్రియేట్ చేస్తుంది మరియు విద్యార్థులు అందరూ కూడా ఆ వెబ్సైట్ ద్వారానే తమ కౌన్సిలింగ్ ఫీజును చెల్లించాలి.
- అఫీషియల్ వెబ్సైట్లో "Processing Fee Payment" అనే లింక్ ఉంటుంది,దానిపై క్లిక్ చేయాలి.
- మీ TS EAMCET హాల్ టికెట్ నంబరు మరియు TS EAMCET ర్యాంకును ఎంటర్ చేయండి, తర్వాత "Captcha" ను ఎంటర్ చేయండి.
- అక్కడ "pay fee online"అనే బటన్ ఉంటుంది,ఆ బటన్ పై క్లిక్ చేయండి.
- పేమెంట్ యొక్క గేట్ వే స్క్రీన్ పై కనిపిస్తుంది దాని నుండి మీ పేమెంట్ ను సెలెక్ట్ చేయండి.
- మీ ఫీజును చెల్లించండి.
- కౌన్సిలింగ్ ఫీజు చెల్లించిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. దానిని డిలీట్ చేయకండి.
- మీ కౌన్సిలింగ్ ఫీజు యొక్క రిసిప్ట్ ను తప్పనిసరిగా ప్రింట్ తీసుకోండి.
2. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ (Registration Process)
కౌన్సిలింగ్ ప్రాసెస్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా ముఖ్యమైన స్టేజ్, ఈ స్టేజిలో విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ కోసం ఒక లాగిన్ ఐడీను పొందుతారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గరలోని హెల్ప్ లైన్ సెంటర్లో కింద ఇవ్వబడిన విధంగా జరుగుతుంది
హెల్ప్‌లైన్ సెంటర్ కార్యకలాపాలు:
- కౌన్సెలింగ్ ప్రోసెసింగ్ ఫీజు చెల్లించిన విద్యార్ధులు తమకు సూచించిన తేదీలలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది.
- ఎంట్రన్స్ వద్ద ఉన్న ఆఫీసర్ కు మీ TS EAMCET యొక్క ర్యాంక్ కార్డ్ ను అందజేయాలి.
- రిజిస్ట్రేషన్ హాల్ లో అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూడాలి.
- ర్యాంక్ అనేవి అనౌన్స్ చేయబడతాయి అప్పుడు మీ ర్యాంక్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ డెస్క్ కు వెళ్లాలి.
- రిజిస్ట్రేషన్ డెస్క్ వద్ద,మీ వద్దనున్న కౌన్సెలంగ్ ఫీజ్ పేమెంట్ రెసిప్ట్ లేదా మీ మొబైల్ లోని ఎస్ఎంఎస్ ను రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు చూపించాలి.
- రిజిస్ట్రేషన్ డెస్క్ వద్దనున్న కంప్యూటర్ ఆపరేటర్ మీకు ఒక రిజిస్ట్రేషన్ మరియు వెరిఫికేషన్ ఫామ్ ను ఇస్తారు.
- మీకు ఇచ్చిన ఫామ్ లోని వివరాలు జాగ్రత్తగా చెక్ చేసుకుని అవసరమైన చోట మీ యొక్క సంతకం చేయాలి.
- ఆ ఫామ్ ని సబ్మిట్ చేసిన తర్వాత తరువాతి అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూడాలి.
3. సర్టిఫికెట్ వెరిఫికేషన్ (Certificate Verification)
దీనితో పాటు, అభ్యర్థులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా వెబ్ ఎంపికల కోసం లాగిన్ ID మరియు పాస్‌వర్డ్‌ను కూడా అందుకుంటారు.
వెబ్ ఆప్షన్స్ నమోదు చేయడం (Exercising Web Options): TS EAMCET అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ను ఎంచుకోవడానికి కింద ఇవ్వబడిన విధంగా వివిధ స్టేజ్ లు ఉంటాయి.
అభ్యర్థి నమోదు(Registration of Candidate)
- TS EAMCET కౌన్సిలింగ్ యొక్క అఫీషియల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- "Candidate Registration"ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- లాగిన్ ఐడి, ఎంసెట్ ర్యాంక్,హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టినతేదీ లను ఎంటర్ చేయండి.
- "Generate Password"అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- SMS ద్వారా మీ మొబైల్ ఫోన్ కు ఒక పాస్వర్డ్ పంపబడుతుంది.
- పాస్వర్డ్ ఎంటర్ చేసి తర్వాత స్టేజ్ ను కొనసాగించండి.
ఆప్షన్స్ ఎంట్రీ (Option Entry)
- రిజిస్ట్రేషన్ తర్వాత స్టేజ్ ఆప్షన్స్ ఎంట్రీ (Options Entry), ఇక్కడ "Display Option Entry" పై క్లిక్ చేయండి.
- మీరు సెలెక్ట్ చేసిన జిల్లా ఆధారంగా ఆ జిల్లాలోని కాలేజీల మరియు కోర్సుల లిస్టు స్క్రీన్ పై కనిపిస్తుంది.
- మీరు కాలేజీల ఆప్షన్స్ కు తప్పనిసరిగా 1,2,3,4……. వంటి నంబర్లను ఇచ్చి కాలేజీలలో ఎంచుకోవాలి.
- ఆప్షన్స్ ను ఎంచుకున్న తర్వాత "Confirm and Logout" బటన్ పై క్లిక్ చేయండి.
- మీరు ఎంచుకున్న ఆప్షన్స్ అన్ని సీట్ అలాట్మెంట్ కోసం సేవ్ చేయబడతాయి.
తెలంగాణ బి ఫార్మా సీట్ల కేటాయింపు 2023 (Telangana B Pharma Seat Allotment 2023)
తెలంగాణలో సీట్ల కేటాయింపు(TSCHE B. Pharma Admission 2023) యొక్క విధానం ఈ కింద విధంగా జరుగుతుంది
- విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్స్ వారి కళాశాల సీట్ అలాట్మెంట్ లో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
- విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్స్ ,ఎంచుకున్న కోర్సులు, కాలేజీల యొక్క ఓపెనింగ్ మరియు క్లోసింగ్ ర్యాంకులు మరియు అందుబాటులో ఉన్న సీట్లను బట్టి సీట్ అలాట్ చేయబడుతుంది.
- విద్యార్థులు మొదటి రౌండ్లో సీట్ పొందకపోతే రెండవ రౌండ్లో తమ ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
- విద్యార్థులు తమ సీట్ అలాట్మెంట్లో Up-Gradation ప్రాసెస్ లో కావాలనుకుంటే, అతను/ఆమె వారి సీట్ అలాట్మెంట్ను రిజెక్ట్ చేయవచ్చు లేదా అడ్మిషన్ ప్రాసెస్ యొక్క తర్వాత రౌండ్లలో పాల్గొనవచ్చు.
- మీరు మీకు కేటాయించిన సీట్ ను అంగీకరిస్తే సీట్ అలాట్ యొక్క లెటర్ ని డౌన్లోడ్ చేసుకుని సూచించిన తేదీలో కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయండి.
తెలంగాణ బి ఫార్మా అడ్మిషన్ రిజర్వేషన్ పాలసీ 2023 (Telangana B Pharma Admission Reservation Policy 2023)
తెలంగాణలో B. Pharma (TSCHE B. Pharma admission 2023) అడ్మిషన్స్ కు రాష్ట్ర గవర్నమెంట్ యొక్క రిజర్వేషన్ పాలసీలు వర్తిస్తాయి.గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కాలేజీలలోని కొంత భాగం సీట్లు రిజర్వేషన్ కేటగిరీలో కేటాయించబడతాయి. సెంట్రలైస్డ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా TSCHE (TSCHE B. Pharma admission 2023)గవర్నమెంట్ ఫార్మసీ కాలేజీలలో 100% సీట్లను ప్రైవేటు ఫార్మసీ కాలేజీలలో 70% సీట్లను కేటాయించడానికి అధికారం కలిగి ఉంటుంది.
తెలంగాణ బి ఫార్మా సీట్ మ్యాట్రిక్స్ 2023 (Telangana B Pharma Seat Matrix 2023)
రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఫార్మసీ కాలేజీలలోని మొత్తం సీట్ల వివరాలను తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (Telangana State Board of Technical and Training)(TSBTET)విడుదల చేస్తుంది. తెలంగాణ ఫార్మసీ కాలేజీల అఫీషియల్ సీట్ మ్యాట్రిక్స్ కింద ఇవ్వబడింది.
కళాశాల కేటగిరి | మొత్తం సీట్ల సంఖ్య | కళాశాలల మొత్తం సంఖ్య |
ప్రభుత్వం | 3055 | 14 |
ప్రైవేట్ | 1,05,120 | 200 |
తెలంగాణలోని టాప్ బి ఫార్మా కాలేజీలు (Top B Pharma Colleges in Telangana)
తెలంగాణ B. Pharma (TSCHE B. Pharma admission 2023) సెంట్రలైస్డ్ లేదా వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో దాదాపు అన్ని ప్రైవేట్ కాలేజీలు అన్ని కోర్సులలో 70% సీట్ల తో పాల్గొంటాయి.కింద తెలంగాణాలో కొన్ని టాప్ కాలేజీలు ఇవ్వబడ్డాయి…
కళాశాల పేరు | కోర్సు అందించబడింది | వార్షిక కోర్సు ఫీజు |
బి ఫార్మా | ₹80,000 | |
బి ఫార్మా | ₹52,000 | |
బి ఫార్మా | ₹83,000 | |
బి ఫార్మా | ₹1,00,000 | |
బి ఫార్మా | ₹1,20,000 | |
బి ఫార్మా | ₹35,000 | |
బి ఫార్మా | ₹67,500 | |
బి ఫార్మా | ₹81,000 | |
బి ఫార్మా | ₹32,000 |
తెలంగాణలో బి ఫార్మా ప్రోగ్రామ్‌ను కొనసాగించడానికి మీకు ఆసక్తి ఉంటే మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన సమాచారం ఇవి. మీరు తెలంగాణలో లేదా భారతదేశంలో ఎక్కడైనా అగ్రశ్రేణి ఫార్మసీ కళాశాలల్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటే, మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న Common Application Formని పూరించండి. మా కౌన్సెలర్‌లు మీ అవసరాలకు అనుగుణంగా మీకు బాగా సరిపోయే కోర్సు మరియు కళాశాలను ఎంచుకోవడంలో మీకు సహాయపడగలరు.
సంబంధిత కథనాలు
B Pharma Admission in India 2022 |
అటువంటి మరిన్ని కంటెంట్ కోసం, CollegeDekhoతో చూస్తూ ఉండండి.
సిమిలర్ ఆర్టికల్స్
TS EAMCET B.Pharm/ Pharm.D కటాఫ్ - ముగింపు ర్యాంక్‌లను తనిఖీ చేయండి
TS EAMCET స్కోర్‌ను అంగీకరించే ఫార్మసీ కళాశాలలు
ఆంధ్రప్రదేశ్ బీ ఫార్మా అడ్మిషన్ 2023 (Andhra Pradesh B.Pharm Admission 2023) ఎంట్రన్స్ పరీక్ష, అర్హతలు, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియ గురించి ఇక్కడ తెలుసుకోండి
ఇంటర్మీడియట్ తర్వాత ఫార్మసీ కోర్సుల జాబితా (List of Pharmacy Courses After Intermediate) - అడ్మిషన్ ప్రాసెస్, ఫీజులు, కెరీర్ ఎంపికలు, సాలరీ
తెలంగాణ డీ ఫార్మా అడ్మిషన్ 2023 (Telangana D Pharma Admission 2023): తేదీలు, అర్హత, అప్లికేషన్ ఫార్మ్ , కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు
AP EAPCET BiPC Counselling Process 2023: ఏపీ ఈఏపీసెట్ 2023 బైపీసీ కౌన్సెలింగ్, ముఖ్యమైన తేదీల గురించి ఇక్కడ తెలుసుకోండి