తెలంగాణ BSc అడ్మిషన్ 2024 (Telangana BSc Admissions 2024) ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు , అర్హత, సీట్ల కేటాయింపు

Preeti Gupta
Preeti GuptaUpdated On: November 28, 2023 04:36 pm IST

తెలంగాణ BSc అడ్మిషన్ 2024 (Telangana BSc Admissions 2024) ప్రాసెస్ మెరిట్ ఆధారంగా జరుగుతుంది, తెలంగాణ BSc అడ్మిషన్ 2024 ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫారమ్, వెబ్ ఆప్షన్స్, సీట్ల కేటాయింపు గురించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు 

విషయసూచిక
 1. తెలంగాణ BSc అడ్మిషన్ ముఖ్యాంశాలు 2024 (Telangana BSc Admission Highlights 2024)
 2. తెలంగాణ BSc అడ్మిషన్ తేదీలు 2024 (Telangana BSc Admission Dates 2024)
 3. తెలంగాణ BSc అడ్మిషన్ అర్హత ప్రమాణాలు 2024 (Telangana BSc Admission Eligibility …
 4. తెలంగాణ BSc అప్లికేషన్ ఫార్మ్ 2024 (Telangana BSc Application Form 2024)
 5. తెలంగాణ BSc అడ్మిషన్‌కు దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు 2024 (Documents Required …
 6. తెలంగాణ BSc అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫీజు 2024 (Telangana BSc Admission Registration …
 7. తెలంగాణ BSc సీట్ల కేటాయింపు విధానం 2024 (Telangana BSc Seat Allotment …
 8. తెలంగాణ BSc అడ్మిషన్ పార్టిసిపేటింగ్ యూనివర్శిటీలు 2024 (Telangana BSc Admission Participating …
 9. డైరక్ట్ అడ్మిషన్ల కోసం తెలంగాణలోని టాప్ BSc కాలేజీల జాబితా (List of …
 10. తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ 2024 ఎగ్జామ్ పేపర్ నమూనా  (Telangana B.Sc. Nursing …
 11. తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ 2024 ఎగ్జామ్ అడ్మిట్ కార్డు (Telangana B.Sc. Nursing …
 12. తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ 2024 పరీక్షా ఫలితాలు (Telangana B.Sc. Nursing 2024 …
 13. తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ 2024 కౌన్సెలింగ్ (Telangana B.Sc. Nursing 2024 Counseling)
Telangana BSc Admission 2022 (Started) - Dates, Application Form, Eligibility, Choice Filling, Seat Allotment

తెలంగాణ BSc అడ్మిషన్ 2024 (Telangana BSc Admissions 2024) : ప్రతీ సంవత్సరం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఆన్‌లైన్ సర్వీస్ తెలంగాణ (DOST) అడ్మిషన్ (Telangana B.Sc admission 2024) ప్రాసెస్‌ను నిర్వహిస్తుంది. దీని ద్వారా విద్యార్థులు BA, B.SC, BCA, BSW, B.Com, BBM వంటి వివిధ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రాములలో అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవచ్చు.DOST అడ్మిషన్ ప్రక్రియ ద్వారా పైన పేర్కొన్న డిగ్రీ కోర్సులు లలో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు ఈ క్రింద ఇవ్వబడిన ఫేమస్ యూనివర్సిటీలలో వాటి అనుబంధ కాలేజీలలో జరిగే అడ్మిషన్ల కోసం అప్లై చేసుకోవచ్చు.

 • శాతవాహన యూనివర్సిటీ (Satavahana University)

 • పాలమూరు యూనివర్సిటీ (Palamuru University)

 • మహాత్మాగాంధీ యూనివర్సిటీ  (Mahatma Gandhi University)

 • తెలంగాణ యూనివర్సిటీ  (Telangana University)

 • కాకతీయ యూనివర్సిటీ  (Kakatiya University)

 • ఉస్మానియా యూనివర్సిటీ  (Osmania University)

        ఈ ఆర్టికల్ లో తెలంగాణ రాష్ట్రంలో DOST  ద్వారా జరిగే B.Sc అడ్మిషన్ (Telangana B.Sc admission 2024) ప్రాసెస్‌ను గురించిన వివరాలను తెలుసుకోవచ్చు . తెలంగాణ B.Sc అడ్మిషన్ ప్రాసెస్ 2024 (Telangana B.Sc admission 2024) DOST అఫీషియల్స్ విద్యార్థుల క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్‌లోని మార్కుల ఆధారంగా తయారు చేసిన మెరిట్ లిస్టును బట్టి సీట్ అలోకేషన్ ప్రాసెస్ జరుగుతుంది. తెలంగాణ లో  B.Sc కోర్సు (Telangana B.Sc admission 2024) కోసం అడ్మిషన్లు త్వరలో మొదలు అవుతున్నాయి. విద్యార్థులందరూ ఈ అడ్మిషన్ (Telangana B.Sc admission 2024) ప్రాసెస్ కు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఈ ఆర్టికల్లో తెలంగాణ B.Sc అడ్మిషన్ (Telangana B.Sc admission 2024) ప్రాసెస్ కు సంబంధించిన ఎలిజిబిలిటీ, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ మరియు ఇతర వివరాలు తెలియజేబడ్డాయి.

తెలంగాణ BSc అడ్మిషన్ ముఖ్యాంశాలు 2024 (Telangana BSc Admission Highlights 2024)

 తెలంగాణ B.Sc అడ్మిషన్ (Telangana B.Sc admission 2024) ప్రాసెస్‌కు సంబంధించిన మొత్తం సమాచారం కింద టేబుల్లో ఇవ్వబడింది

విశేషాలువివరాలు

ప్రక్రియ పేరు

డిగ్రీ సర్వీసెస్ ఆన్‌లైన్ తెలంగాణ (DOST) అడ్మిషన్ ప్రాసెస్

ఆఫిషియేటింగ్ బాడీ

తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE)

నమోదు మోడ్

ఆన్‌లైన్

పాల్గొనే విశ్వవిద్యాలయాలు

06

సీట్ల కేటాయింపు రౌండ్ల సంఖ్య

03

తెలంగాణ BSc అడ్మిషన్ తేదీలు 2024 (Telangana BSc Admission Dates 2024)

అభ్యర్థులు కింది టేబుల్లో అందించిన మూడు దశల కోసం తెలంగాణ రాష్ట్రంలో (DOST) BSc అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలను చెక్ చేయవచ్చు:-

ఈవెంట్

తేదీ

అధికారిక నోటిఫికేషన్ విడుదలతెలియాల్సి ఉంది

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ (దశ 1)

తెలియాల్సి ఉంది

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ

తెలియాల్సి ఉంది

వెబ్ ఎంపికలు – దశ 1

తెలియాల్సి ఉంది
ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్తెలియాల్సి ఉంది

సీట్ల కేటాయింపు - ఫేజ్ 1

తెలియాల్సి ఉంది

రిపోర్టింగ్ - దశ 1

తెలియాల్సి ఉంది
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ (దశ 2)తెలియాల్సి ఉంది 

వెబ్ ఎంపికలు – దశ 2

తెలియాల్సి ఉంది
ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

తెలియాల్సి ఉంది

సీట్ల కేటాయింపు – ఫేజ్ 2

తెలియాల్సి ఉంది

రిపోర్టింగ్ – ఫేజ్ 2

తెలియాల్సి ఉంది
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ (ఫేజ్ 3)తెలియాల్సి ఉంది 
వెబ్ ఎంపికలు – దశ 3తెలియాల్సి ఉంది
ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్తెలియాల్సి ఉంది
సీట్ల కేటాయింపు – ఫేజ్ 3తెలియాల్సి ఉంది
రిపోర్టింగ్ – ఫేజ్ 3తెలియాల్సి ఉంది
ఫేజ్-I, ఫేజ్-II మరియు ఫేజ్-IIIలో ఆన్‌లైన్ మోడ్ ద్వారా తమ సీట్లను నిర్ధారించుకున్న అభ్యర్థులచే కళాశాలలకు నివేదించడంతెలియాల్సి ఉంది
ఓరియెంటేషన్ ప్రోగ్రామ్తెలియాల్సి ఉంది
తరగతుల ప్రారంభంతెలియాల్సి ఉంది
స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ తెలియాల్సి ఉంది
స్పెషల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ తెలియాల్సి ఉంది
స్పెషల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ తెలియాల్సి ఉంది
సెల్ఫ్ రిపోర్టింగ్ తెలియాల్సి ఉంది

తెలంగాణ BSc అడ్మిషన్ అర్హత ప్రమాణాలు 2024 (Telangana BSc Admission Eligibility Criteria 2024)

 DOST ద్వారా తెలంగాణ యూనివర్సిటీలు నిర్వహించే B.SC అడ్మిషన్ (Telangana B.Sc admission 2024) ప్రాసెస్ ఎలిజిబిలిటీకి సంబంధించిన వివరాలు కిందటేబుల్లో ఇవ్వబడ్డాయి.

సాధారణ అర్హత

 • దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, తెలంగాణ రాష్ట్రం (BIETS) లేదా మరొక గుర్తింపు పొందిన బోర్డ్ (CBSE, ICSE మొదలైనవి) ద్వారా నిర్వహించబడే అర్హత పరీక్ష.

 • CBSE, ICSE లేదా BIETS కాకుండా ఇతర బోర్డు నుంచి అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన దరఖాస్తుదారులు తప్పనిసరిగా వారి సంబంధిత సంస్థలు/పాఠశాలల అధిపతులు తప్పనిసరిగా BIETS జారీ చేసిన అర్హత సర్టిఫికేట్‌ను సమర్పించినట్లు హామీ ఇవ్వాలి.

 • మొదటి ప్రయత్నంలో వారి సంబంధిత అర్హత పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది

BSc అర్హత

 • దరఖాస్తుదారులు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో చదువుకోవాలనుకునే సబ్జెక్ట్‌లో 40% మొత్తంతో వారి సంబంధిత అర్హత పరీక్షలను క్లియర్ చేసి ఉండాలి

తెలంగాణ BSc అప్లికేషన్ ఫార్మ్ 2024 (Telangana BSc Application Form 2024)

      తెలంగాణ B.SC అడ్మిషన్ (Telangana B.Sc admission 2024) అప్లికేషన్ ఫార్మ్‌ను డిగ్రీ సర్వీస్ ఆన్లైన్ తెలంగాణ (DOST) వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు.DOST  ద్వారా విడుదల చేయబడిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ద్వారా విడుదల చేయబడుతుంది. విద్యార్థులు తమ అప్లికేషన్ ఫామ్ ను ఫీల్ చేసే క్రమంలో దానికి అవసరమయ్యే డాక్యుమెంట్లను కూడా తప్పనిసరిగా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ అడ్మిషన్ (Telangana B.Sc admission 2024) ప్రాసెస్‌లో లాస్ట్ స్టేజ్ అప్లికేషన్ ఫీజును చెల్లించడంతో పూర్తవుతుంది. DOST  ద్వారా నిర్వహించబడుతున్న తెలంగాణ B.SC అడ్మిషన్ (Telangana B.Sc admission 2024) కు సంబంధించిన ప్రాసెస్‌ను కింద వరస క్రమంలో ఇవ్వడమైనది.

 1. DOST అధికారిక వెబ్‌సైట్‌లోని డైరెక్టు లింక్ (dost.cgg.gov.in)పై క్లిక్ చేయాలి.
 2. Candidate pre-registration లింక్‌పై క్లిక్ చేయాలి.
 3. పేరు ,క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ వివరాలు, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు మొదలైన వాటిని వాటికి సంబంధించిన బాక్సులలో ఎంటర్ చేయాలి. 
 4. డిక్లరేషన్ బాక్స్‌ను చెక్ చేసి aadhar authentication బటన్ పై క్లిక్ చేయాలి.
 5. మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌కు వచ్చిన OTP ను ఎంటర్ చేయాలి. 
 6.  కంప్యూటర్ స్క్రీన్ పై ఉన్న మీ "DOST ID" ను నోట్ చేసుకోవాలి. 
 7. మీ DOST రిజిస్ట్రేషన్ ఫీజును సబ్మిట్ చేయడానికి "Process to pay"బటన్ పై క్లిక్ చేయాలి.
 8. మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ కు వచ్చిన అంకెల PIN నెంబర్లను నోట్ చేసుకోవాలి.
 9. మీ DOST ID, PIN నెంబర్‌ను ఎంటర్ చేసి "Login"ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 10. ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలి. 
 11. మీ స్కాన్ చేసిన డాక్యుమెంట్లను, ఫోటోలు అప్‌లోడ్ చేయాలి. 
 12. "Preview"బటన్ పై క్లిక్ చేసి మీ వివరాలు అన్నీ కరెక్ట్ గా ఉన్నది లేనిది చెక్ చేసుకోవాలి
 13. మీ అప్లికేషన్ ఫార్మ్‌ను సబ్మిట్ చేయాలి.
 14. ఆటో జనరేటెడ్ అప్లికేషన్ సబ్మిషన్ మెయిల్ వచ్చిన తర్వాత "web options" బటన్ పై క్లిక్ చేయాలి.
 15. మీ సబ్జెక్టు ఆప్షన్స్‌లను ఎంచుకున్న తర్వాత "web options with CBCS "ట్యాబ్ పై క్లిక్ చేయాలి.

తెలంగాణ BSc అడ్మిషన్‌కు దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు 2024 (Documents Required to Apply for Telangana BSc Admission 2024)

తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ 2024 కోసం అవసరమైన డాక్యుమెంట్ల గురించి ఈ దిగువున అందించడం జరిగింది.    

 • ఆధార్ కార్డు
 • తెలంగాణ ఎంసెట్ 2023 హాల్ టికెట్
 • తెలంగాణ ఎంసెట్ 2023 ర్యాంక్ కార్డ్
 • బర్త్ సర్టిఫికెట్ (SSC మార్క్స్ మెమో). (తప్పనిసరి)
 • మార్కుల మెమోరాండం
 • 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
 • స్టడీ సర్టిఫికెట్లు - రెండు సంవత్సరాలకు ఇంటర్మీడియట్ లేదా తత్సమానం/GNM
 • నివాస ధ్రువీకరణ పత్రం
 • EWS సర్టిఫికెట్ (వర్తిస్తే)
 • PwD సర్టిఫికెట్ (అవసరమైతే)
 • ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ 
 • కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)
 • తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)
 • ఆధార్ కార్డ్ (తప్పనిసరి)
 • సర్వీస్ సర్టిఫికెట్ (వర్తిస్తే)
 • అభ్యర్థి తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో (తప్పనిసరి)
 • అభ్యర్థి సంతకం నమూనా (తప్పనిసరి)

తెలంగాణ BSc అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫీజు 2024 (Telangana BSc Admission Registration Fee 2024)

DOST ద్వారా నిర్వహించబడుతున్న తెలంగాణ B.SC అడ్మిషన్ ప్రాసెస్2024 (Telangana B.Sc admission 2024)యొక్క ఫీజు కు సంబంధించిన వివరాలు కింద ఇవ్వడమైనది

రౌండ్ 1

రూ.200/-

రౌండ్ 2

రూ.400/-

రౌండ్ 3

రూ.400/-

తెలంగాణ BSc సీట్ల కేటాయింపు విధానం 2024 (Telangana BSc Seat Allotment Process 2024)

విద్యార్థులు కేటగిరి ఆధారంగా వారి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌లోని మార్కుల ఆధారంగా TSCHE అఫీషియల్స్ తెలంగాణ BSc డిగ్రీ ప్రోగ్రాం (Telangana B.Sc admission 2024) లలో విద్యార్థులకు వివిధ యూనివర్సిటీలో, సంబంధిత కాలేజీలలో సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు వారికి కేటాయించిన సీటుకు సంతృప్తి చెందినట్లయితే వారు ఆన్‌లైన్ ద్వారా రిపోర్ట్ చేసి సిట్ కన్ఫర్మేషన్  ఫీజును చెల్లించి వారి సీటును తప్పనిసరిగా కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత  విద్యార్థులు లాస్ట్ డేట్ కన్నా ముందుగానే కాలేజ్‌కు  చేరుకుని వారికి సూచించిన అన్ని డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి. అడ్మిషన్ ఫీజును చెల్లించాలి. విద్యార్థులు తమకు కేటాయించిన సీటుపై అసంతృప్తి చెందినట్లయితే వారు వారికి కేటాయించిన సీట్లను రిజర్వ్ చేసుకోవడానికి ఫీజును  చెల్లించి, ఆపై సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ తర్వాతి రౌండ్లలో పాల్గొనవచ్చు. విద్యార్థులు తమ సీటు అలాట్మెంట్ రిజల్ట్స్ ను అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి చెక్ చేసుకునే స్టెప్స్ కింద ఇవ్వబడ్డాయి

 • ఈ పేజ్ లో ఇవ్వబడిన DOST అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేయండి
 • DOST Seat Allotment results 2024 లింక్ పై క్లిక్ చెయ్యండి
 • సీట్ అలాట్మెంట్ లిస్ట్ కంప్యూటర్/ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది
 • సీట్ అలాట్మెంట్ లిస్టులో మీ పేరు ఉంటే తదుపరి సూచనల కోసం దానిని సేవ్ చేయండి

తెలంగాణ BSc అడ్మిషన్ పార్టిసిపేటింగ్ యూనివర్శిటీలు 2024 (Telangana BSc Admission Participating Universities 2024)

 TSCHE అఫీషియల్స్ సూచించిన అన్ని డిమాండ్లను నెరవేర్చిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలోని ఈ క్రింది 6 యూనివర్సిటీలలో మరియు సంబంధిత కాలేజీలలో BSc డిగ్రీ ప్రోగ్రాంలో అడ్మిషన్ (Telangana B.Sc admission 2024)కల్పిస్తారు.

 • శాతవాహన యూనివర్సిటీ (Satavahana University)

 • పాలమూరు యూనివర్సిటీ (Palamuru University)

 • మహాత్మా గాంధీ యూనివర్సిటీ  (Mahatma Gandhi University)

 • తెలంగాణ యూనివర్సిటీ  (Telangana University)

 • కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University)

 • ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University)

డైరక్ట్ అడ్మిషన్ల కోసం తెలంగాణలోని టాప్ BSc కాలేజీల జాబితా (List of Top BSc Colleges in Telangana for Direct Admissions)

  ఈ  కింద ఇవ్వబడిన లింకులలోని కాలేజీలలో తెలంగాణ బీఎస్సీ డిగ్రీ ప్రోగ్రాంలో (Telangana B.Sc admission 2024) విద్యార్థులు డైరెక్టర్ అడ్మిషన్ను పొందవచ్చు

కళాశాల/విశ్వవిద్యాలయం పేరు

సగటు వార్షిక కోర్సు ఫీజు 

SUN ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టూరిజం అండ్ మేనేజ్‌మెంట్

1,00,000/-

గీతం (డీమ్డ్ యూనివర్సిటీ), హైదరాబాద్

65,000/- నుండి 75,000/-

రూట్స్ కొలీజియం, హైదరాబాద్

1,30,000/-

ఆది గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, హైదరాబాద్

55,000/-

ఉన్నత విద్య కోసం ICFAI ఫౌండేషన్

1,00,000/-

తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ 2024 ఎగ్జామ్ పేపర్ నమూనా  (Telangana B.Sc. Nursing 2024 Exam Paper Pattern)

దరఖాస్తుదారుల సూచన కోసం పేపర్ నమూనాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఈ దిగువున అందించాం. 

 • ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో ఆబ్జెక్టివ్ తరహా బహుళైచ్ఛిక ప్రశ్నలు మాత్రమే ఉంటాయి.
 • మొత్తం పేపర్‌ను ప్రాక్టీస్ చేయడానికి దరఖాస్తుదారులకు అధికారులు నిర్దిష్ట కాలపరిమితిని ఇస్తారు.
 • దరఖాస్తుదారులు పేపర్‌ను పరిష్కరించడానికి అదనపు సమయ పరిమితిని పొందరు.
 • సబ్జెక్ట్ వారీగా సిలబస్ గురించి సమాచారాన్ని పొందడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలి.
 • సిలబస్‌పై అధికారులు ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ 2024 ఎగ్జామ్ అడ్మిట్ కార్డు (Telangana B.Sc. Nursing 2024 Exam Admit Card)

తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ 2024 ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా విడుదల చేయబడతాయి. దరఖాస్తుదారులు అడ్మిట్ కార్డ్ పొందడానికి అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. అడ్మిట్ కార్డ్ తప్పనిసరిగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

అడ్మిట్ కార్డు లేకుండా  దరఖాస్తుదారులు ప్రవేశ పరీక్షకు హాజరు కాలేరు. కాబట్టి దరఖాస్తుదారులు ప్రవేశ పరీక్ష సమయంలో అడ్మిట్ కార్డును తీసుకెళ్లాలని సూచించారు.  ఎందుకంటే అది ధ్రువీకరించబడుతుంది.   అడ్మిట్ కార్డ్ పరీక్షకు హాజరయ్యే దరఖాస్తుదారు గుర్తింపు కార్డు అయినందున అడ్మిషన్ ప్రక్రియ సమయం వరకు సురక్షితంగా ఉంచాలి.

తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ 2024 పరీక్షా ఫలితాలు (Telangana B.Sc. Nursing 2024 Exam Result)

ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన దరఖాస్తుదారులు ఫలితాల ప్రకటన గురించి విశ్వవిద్యాలయం నుంచి నోటిఫికేషన్ పొందుతారు. అయితే దరఖాస్తుదారుల సూచన కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఫలితాలు విడుదల చేయబడతాయి.

దరఖాస్తుదారులు ఆధారాలను ఉపయోగించి విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఫలితాన్ని తప్పనిసరిగా వెబ్‌సైట్ నుంచి చూసి సేవ్ చేసుకోవాలి.

తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ 2024 కౌన్సెలింగ్ (Telangana B.Sc. Nursing 2024 Counseling)

ఫలితాల ప్రకటన తర్వాత కౌన్సెలింగ్ రౌండ్ నిర్వహించే అధికారులు నిర్వహిస్తారు. ఫలితాల ప్రకటన తర్వాత నిర్వహణ అధికారులు దరఖాస్తుదారుల మెరిట్ జాబితాను ప్రిపేర్ చేస్తారు. ప్రవేశ పరీక్షలో దరఖాస్తుదారులు సాధించిన ర్యాంక్ మెరిట్ జాబితాలో ఉంటుంది. ప్రవేశ పరీక్షలో దరఖాస్తుదారులు సాధించిన మార్కుల ఆధారంగా ఇది తయారు చేయబడుతుంది. మెరిట్‌ల జాబితాలో తమ పేర్లను గుర్తించిన దరఖాస్తుదారులు కౌన్సెలింగ్ రౌండ్‌కు హాజరు కావడానికి విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందడానికి అర్హులు. యూనివర్శిటీ దరఖాస్తుదారులు అడ్మిషన్ పొందడానికి కౌన్సెలింగ్ సెషన్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ విధానం కోసం దరఖాస్తు చేసుకోవాలి.

తెలంగాణ BSc అడ్మిషన్‌ గురించి మరింత సమాచారం మరియు అప్‌డేట్‌ల కోసం, CollegeDekhoకు చూస్తూ ఉండండి!

/articles/telangana-bsc-admission/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

 • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

 • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

 • ఉచితంగా

 • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

సిమిలర్ ఆర్టికల్స్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Apply Now

Top 10 Science Colleges in India

View All
Top