AP POLYCET అప్లికేషన్ ఫార్మ్ 2024 (AP POLYCET Application Form 2024 in Telugu) ని ఎలా పూరించాలి?

Guttikonda Sai

Updated On: February 20, 2024 01:02 pm IST

AP POLYCET 2024 అప్లికేషన్ ఫార్మ్ 20 ఫిబ్రవరి 2024 తేదీన విడుదల అయ్యింది. AP POLYCET అప్లై చేసుకునే విద్యార్థులకు కావాల్సిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో వివరంగా అందించడం జరిగింది .
AP POLYCET application form 2024 in Telugu

AP POLYCET 2024 దరఖాస్తు ఫారమ్ (AP POLYCET Application Form 2024) : స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET) 2024 కోసం అప్లికేషన్‌ని ( AP POLYCET 2024 Application Form) ఫిబ్రవరి 20న విడుదల చేసింది. AP POLYCET కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి లింక్ polycetap.nic.in యాక్టివేట్ చేయబడింది. కనీస అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన దరఖాస్తుదారులందరూ చివరి తేదీ ఏప్రిల్ 5, 2024 లోపు రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ను పూరించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రాష్ట్ర ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో పాలిటెక్నిక్/డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పించడానికి AP POLYCET పరీక్షను ఏటా నిర్వహిస్తారు. అందువల్ల, అభ్యర్థులు 10వ తరగతి అడ్మిట్ కార్డ్ నంబర్ మరియు విద్యా వివరాలు వంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం తప్పనిసరిగా అవసరమైన అన్ని పత్రాలతో సిద్ధం కావాలి.

AP POLYCET 2024 యొక్క దరఖాస్తు ఫారమ్‌ను పూరించే ముందు, అభ్యర్థులు తప్పనిసరిగా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన అర్హత ప్రమాణాలను తప్పక తనిఖీ చేయాలి. AP POLYCET 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు AP POLYCET అడ్మిట్ కార్డ్‌లు మాత్రమే జారీ చేయబడతాయి.AP POLYCET 2024 యొక్క దరఖాస్తు ప్రక్రియలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ఫారమ్ నింపడం, అవసరమైన పత్రాల అప్‌లోడ్ మరియు దరఖాస్తు రుసుము చెల్లింపు ఉంటాయి. తేదీలు, ఫీజులు మరియు ప్రక్రియతో సహా AP POLYCET 2024 రిజిస్ట్రేషన్ గురించి మరిన్ని వివరాల కోసం, కథనాన్ని చదవండి.

AP POLYCET దరఖాస్తు ఫార్మ్ 2024 లింక్ (AP POLYCET Application Form 2024 Link)

అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పుడైనా లింక్ ( AP POLYCET 2024 Application Form)  SBTET ద్వారా యాక్టివేట్ చేయబడుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా తమ సమాచారాన్ని పూరించాలి. అర్హత గల అభ్యర్థులు తమ POLYCET దరఖాస్తు ఫార్మ్‌లను చివరి తేదీలోపు పూర్తి చేయాలి. పోర్టల్‌లో బయటకు వచ్చిన తర్వాత ఈ దిగువన నమోదు చేసుకోవడానికి మేము లింక్‌ను అప్‌డేట్ చేస్తాం.

ఏపీ పాలిసెట్ రిజిస్ట్రేషన్ లింక్ 2024 ( యాక్టివేట్ చేయబడింది)

10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ ఎందుకు ఎంచుకోవాలి?

10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే విద్యార్థులు 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ కోర్సును ఎంచుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వారికి డిప్లొమా లేదా పాలిటెక్నిక్ పూర్తి చేయగానే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారు డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు లేదా ఇంజనీరింగ్ చదవడానికి కూడా అవకాశం ఉన్నది. 10వ తరగతి తర్వాత విద్యార్థులు పాలిటెక్నిక్ లో వారికి ఇష్తమైన బ్రాంచ్ లేదా కోర్సును ఎంచుకోవచ్చు. తర్వాత అదే బ్రాంచ్ ను ఇంజనీరింగ్ లో కూడా కొనసాగించవచ్చు. ఇంజనీరింగ్ కు సంబంధించిన సబ్జెక్టు లే పాలిటెక్నిక్ లో కూడా ఉంటాయి కాబట్టి పాలిటెక్నిక్ నుండి ఇంజనీరింగ్ కు వెళ్లడం సులభంగా ఉంటుంది. ఈ పరీక్షకు హాజరు కావాలి అనుకునే విద్యార్థులు వారి 10వ తరగతి సిలబస్ తో పాటుగా ఇప్పటి నుండే రీజనింగ్ మరియు ఆప్టిట్యూడ్ కూడా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాలి. తద్వారా AP POLYCET 2024 పరీక్షలో మంచి రాంక్ సాధించవచ్చు.

ఇది కూడా చదవండి - AP POLYCET లో 50,000 నుండి 75,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
ఇది కూడా చదవండి - AP POLYCET లో 10,000 నుండి 15,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా

AP POLYCET 2024 అప్లికేషన్ ఫార్మ్ ముఖ్యాంశాలు (AP POLYCET Application Form Highlights)

విద్యార్థులు AP POLYCET 2024 రిజిస్ట్రేషన్ గురించిన ముఖ్యమైన సమాచారం ఈ క్రింది పట్టిక నుండి తెలుసుకోవచ్చు.

విశేషాలు

డీటెయిల్స్

AP POLYCET పూర్తి రూపం

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష

AP POLYCET  అప్లికేషన్ ఫార్మ్ మోడ్

ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్

పరీక్ష నిర్వహణ అధికారం

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్

AP POLYCET 2024 అధికారిక వెబ్‌సైట్

appolycet.nic.in

AP POLYCET దరఖాస్తు రుసుము 2024

రూ. OC/ BC అభ్యర్థులకు 400
రూ. SC/ST అభ్యర్థులకు 100

AP POLYCET పరీక్ష తేదీ

27 ఏప్రిల్, 2024


AP POLYCET 2024 అప్లికేషన్ తేదీలు (AP POLYCET Application Dates 2023)

AP POLYCET 2024 పరీక్ష కోసం అప్లై చేసుకునే విద్యార్థులకు అప్లికేషన్ ఫార్మ్ (AP POLYCET Application Form 2024) ఫిబ్రవరి నెలలో విడుదల చేయబడుతుంది. విద్యార్థులు AP POLYCET 2024 కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబందించిన ముఖ్యమైన తేదీల వివరాలు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.

ఈవెంట్స్

తేదీలు

AP POLYCET రిజిస్ట్రేషన్  ప్రారంభం

20,ఫిబ్రవరి, 2024

AP POLYCETఅప్లికేషన్ ఫార్మ్  పూరించడానికి చివరి తేదీ

05 ఏప్రిల్, 2024

AP POLYCET 2024 హాల్ టికెట్ విడుదల

ఏప్రిల్, 2024

AP POLYCET 2024 పరీక్ష తేదీ

27 ఏప్రిల్, 2024





ఇది కూడా చదవండి - AP POLYCET కళాశాలల జాబితా మరియు సీట్ మ్యాట్రిక్

AP POLYCET 2024 అర్హత ప్రమాణాలు (AP POLYCET Eligibility Criteria 2024)

AP POLYCET Application Form 2024 పూర్తి చేయడానికి విద్యార్థులు తప్పని సరిగా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రూపొందించిన అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు అయ్యి ఉండాలి. 10వ తరగతి పరీక్షల్లో కనీసం 35% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. విద్యార్థులు AP POLYCET 2024 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కూడా వారికి డిప్లొమా లో సీట్ లభించదు.

AP POLYCET 2024 అప్లికేషన్ ఫార్మ్ ను ఎలా పూరించాలి? (How to Fill the AP POLYCET Application Form?)

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ( SBTET) AP POLYCET 2024 అప్లికేషన్ ఫార్మ్ ను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మోడ్ లలో విడుదల చేస్తారు. విద్యార్థులు వారి అనుకూలత ను బట్టి కావాల్సిన మోడ్ లో అప్లై చేసుకోవచ్చు. నిర్ణీత గడువు లోపుగా విద్యార్థులు AP POLYCET 2024 అప్లికేషన్ ఫార్మ్ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

AP POLYCET 2024 అప్లికేషన్ ఫార్మ్ ఆన్లైన్ మోడ్ లో పూరించే విధానం (Steps to fill the AP POLYCET application form in online mode)

  • రిజిస్ట్రేషన్ : ఏపీపాలిసెట్ అధికారిక వెబ్సైట్ apploycet.nic.in ఓపెన్ చేసి ' AP POLYCET Apply Online' అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. మీ 10వ తరగతి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, 10వ తరగతి ఉత్తీర్ణత సంవత్సరం ఎంటర్ చేయండి.
  • అప్లికేషన్ ఫార్మ్ పూరించడం : రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత ఓపెన్ అయిన అప్లికేషన్ ఫార్మ్ లో మీ వ్యక్తిగత సమాచారం మరియు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ నింపండి.
  • డాక్యుమెంట్లు అప్లోడ్ : AP POLYCET 2024కు అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేస్తున్న సమయంలో విద్యార్థులు వారి ఫోటో మరియు సంతకం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేసే సమయంలో అవసరమైన స్పెసిఫికేషన్ ఫాలో అవ్వాలి. ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేసిన తర్వాత విద్యార్థులు వారి పరీక్ష కేంద్రం ను ఎంపిక చేసుకోవాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లింపు : విద్యార్థులు అప్లికేషన్ ఫార్మ్ లో అన్ని డీటెయిల్స్ పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు ను చెల్లించాలి. విద్యార్థులు ఆన్లైన్ లో చేసిన ట్రాన్స్క్షన్ ఐడీ ను జాగ్రత్త చేసుకోవాలి.
  • అప్లికేషన్ ఫార్మ్ సబ్మిషన్ : విద్యార్థులు వారి అప్లికేషన్ ఫార్మ్ ను సబ్మిట్ చేసే ముందు మరొక్కసారి వారు పూర్తి చేసిన వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. వివరాలు సరిగా ఉంటే అప్లికేషన్ ను సబ్మిట్ చేయండి. AP POLYCET 2024 హాల్ టికెట్ మీ ఈమెయిల్ ఐడి కు వస్తుంది.

AP POLYCET 2024 అప్లికేషన్ ఫార్మ్ ఆఫ్లైన్ లో పూరించే విధానం (Steps to fill the AP POLYCET application form in offline mode)

  • విద్యార్థులు AP POLYCET 2024హెల్ప్ లైన్ సెంటర్ కు వెళ్లి అక్కడ బుక్ లెట్ కొనుగోలు చేయాలి.
  • AP POLYCET 2024అప్లికేషన్ ఫార్మ్ ను క్యాపిటల్ లెటర్స్ లో బ్లూ లేదా బ్లాక్ పెన్ తో పూరించాలి.
  • అప్లికేషన్ ఫార్మ్ లో విద్యార్థులు వారి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ను అతికించాలి.
  • విద్యార్థులు నెట్ బ్యాంకింగ్ లేదా క్యాష్ రూపంలో దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • నిర్దేశించిన ప్రదేశంలో విద్యార్థులు వారి సంతకం చేయాలి. విద్యార్థులు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ను అధికారులు ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారు.
  • విద్యార్థులు వారి హాల్ టికెట్ ను ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి - AP POLYCET 2024 కౌన్సెలింగ్ కు అవసరమైన పత్రాల జాబితా

AP POLYCET 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి సూచనలు (Instructions to Fill the AP POLYCET Application Form for Computerization Purpose)

  • విద్యార్థులు AP POLYCET 2024 అప్లికేషన్ ఫార్మ్ ను క్యాపిటల్ లెటర్స్ లో బ్లూ లేదా బ్లాక్ పెన్ తో మాత్రమే నింపాలి
  • అప్లికేషన్ ఫార్మ్ లోని 4,5,6,7 &9 అంశాలకు ఎదురుగా ఉన్న బాక్స్ లలో మాత్రమే కోడ్ ను వ్రాయాలి
  • విద్యార్థులు పరీక్షకు హాజరు అవ్వాలి అనుకుంటున్న పట్టణం లేదా నగరాన్ని ఎంచుకోవాలి.
  • ఏప్రిల్ / మే 2024 లో 10వ తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థులు అయితే వారి మొబైల్ నెంబర్ ను వ్రాయాలి. 2022 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అయితే వారి 10వ తరగతి హాల్ టికెట్ నెంబర్ ను వ్రాయాలి.
  • నిర్దేశించిన చోట ఆధార్ నెంబర్ ను వ్రాయాలి.

AP POLYCET 2024 అప్లికేషన్ ఫీజు (AP POLYCET Application Fee 2024)

జనరల్ కేటగిరీ, OC మరియు BC విద్యార్థులకు AP POLYCET 2024 అప్లికేషన్ ఫీజు 400/- రూపాయలు. SC/ ST విద్యార్థులకు అప్లికేషన్ ఫీజు 100/- రూపాయలు. విద్యార్థులు వారి ఫీజు ను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో చెల్లించవచ్చు.

ఇది కూడా చదవండి - AP POLYCET లో మంచి స్కోరు ఎంత?

AP POLYCET 2024 హాల్ టికెట్ 2024 (AP POLYCET Hall Ticket 2024)

AP POLYCET 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు AP POLYCET 2024 హాల్ టిక్కెట్లు విడుదల చేయబడతాయి. ఏపీ పాలిసెట్ హాల్ టికెట్లను ఏప్రిల్ మూడవ వారంలో అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. విద్యార్థులు వారి AP POLYCET 2024 హాల్ టికెట్ ను తప్పని సరిగా పరీక్ష కేంద్రానికి తీసుకుని వెళ్ళాలి. లేనిచో విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు.

AP POLYCET 2024 గురించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరియు లేటెస్ట్ ఎడ్యుకేషనల్ న్యూస్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.


Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

FAQs

AP POLYCET 2024 దరఖాస్తు రుసుము ఎంత?

OC/BC కేటగిరీ అభ్యర్థులకు AP POLYCET 2024 పరీక్ష దరఖాస్తు రుసుము రూ. 400 మరియు రూ. SC/ST కేటగిరీ అభ్యర్థులకు 100.

 

AP POLYCET 2024 పరీక్షకు హాజరు కావడానికి అర్హత ప్రమాణాలు ఏమిటి?

AP POLYCET అర్హత ప్రమాణాలు ప్రకారం, అభ్యర్థులు భారతీయ జాతీయతను కలిగి ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలోని స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుండి SSC పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా కనీసం 35% మొత్తంతో సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి గణితం తప్పనిసరి.

అభ్యర్థులు ఆఫ్‌లైన్ మోడ్‌లో AP POLYCET 2024 పరీక్షకు దరఖాస్తు చేయవచ్చా?

అవును. AP POLYCET 2024 యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది.

 

AP POLYCET 2024 పరీక్ష నిర్వహణ సంస్థ ఏది?

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) ఆంధ్రప్రదేశ్ AP పాలీసెట్ పరీక్షను నిర్వహించే అధికార సంస్థ.

 

AP POLYCET 2024 పరీక్ష ఎప్పుడు నిర్వహించబడుతుంది?

AP POLYCET 2024 పరీక్ష తేదీ ఇంకా ప్రకటించలేదు. ఈ పరీక్ష మే నెలలో జరిగే అవకాశం ఉంది.

 

/articles/how-to-fill-ap-polycet-application-form/
View All Questions

Related Questions

I have to joined this collage.how can I join it.

-arvind bhannareUpdated on July 25, 2024 05:21 PM
  • 1 Answer
Priya Haldar, Student / Alumni

Dear Arvind,

The application form for Government Polytechnic Nagpur can be downloaded from the college website. The application fee is Rs 500 for the general category and Rs 250 for the reserved categories. After the application deadline, the college will shortlist the candidates based on merit. The shortlisted candidates will be called for an interview. The interview will be conducted to assess the candidate's academic knowledge, aptitude, and personality. The final selection of candidates will be based on the marks obtained in the interview and the merit of the candidate's 12th standard examination.

READ MORE...

I want to know cits course detail

-pursottam mandalUpdated on July 26, 2024 08:58 PM
  • 2 Answers
rohit, Student / Alumni

Yes

READ MORE...

What if i forgot to lock my choice?

-BhawnaUpdated on July 26, 2024 04:44 PM
  • 1 Answer
Soham Mitra, Student / Alumni

In case you forget to lock your choice during UBTER JEEP counselling, the filled choices will be automatically locked

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

సిమిలర్ ఆర్టికల్స్

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!