ఆంధ్రప్రదేశ్ SSC హాల్ టికెట్ 2024 (AP SSC Hall Ticket 2024) విడుదల అయ్యింది: ఏపీ 10వ తరగతి హాల్ టికెట్‌ డౌన్‌లోడ్ చేసుకోండి

Guttikonda Sai

Updated On: March 04, 2024 10:32 am IST

ఆంద్రప్రదేశ్ 10వ తరగతి హాల్ టికెట్ 2024 (AP SSC Hall Ticket 2024) బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా విడుదల చేశారు, 04 మార్చి 2024 నుండి 10వ తరగతి హాల్ టిక్కెట్లు అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
Andhra Pradesh SSC Admit Card
examUpdate

Never Miss an Exam Update

ఏపీ SSC హాల్ టికెట్ 2024 (AP SSC Hall Ticket 2024) : ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ ఏపీ పదో తరగతి  పరీక్షా హాల్ టికెట్లను (AP SSC Hall Ticket 2024)  మార్చి 04, 2024) విడుదలయ్యాయి. సంబంధిత అధికారిక వెబ్‌సైట్ నుంచి విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  హాల్ టికెట్లను  డౌన్‌లోడ్ చేయడానికి, వారు తమ పేరు, జిల్లా, పాఠశాల, పుట్టిన తేదీని నమోదు చేయాలి.   విద్యార్థులు తమ  హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ అందించడం జరుగుతుంది.  10వ తరగతి బోర్డు పరీక్షలు మార్చి 18, 2024న ప్రారంభమవుతాయి. మార్చి 30, 2024న ముగుస్తాయి. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుంచి వివరణాత్మక టైమ్‌టేబుల్‌ను చూడవచ్చు

AP SSC హాల్ టికెట్ లింక్ డైరెక్ట్ 2024 (AP SSC Hall Ticket Direct Link 2024)

ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి డైరక్ట్‌గా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండి. 
AP SSC హాల్ టికెట్ లింక్ డైరెక్ట్ 2024 ఇక్కడ క్లిక్ చేయండి

AP SSC సంబంధిత కథనాలు
AP SSC సంబంధిత ఆర్టికల్స్ 
AP SSC ఫలితం 2024
AP SSC సిలబస్ 2023-24
AP SSC పరీక్షా సరళి 2023-24
AP SSC ప్రిపరేషన్ చిట్కాలు 2024
AP SSC టైమ్ టేబుల్ 2024
AP SSC మోడల్ పేపర్ 2024
AP SSC మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రం
AP SSC సప్లిమెంటరీ ఎగ్జామ్ టైమ్ టేబుల్ 2024
AP SSC సప్లిమెంటరీ ఫలితం 2024

ఏపీ SSC హాల్ టికెట్ 2024 ముఖ్యాంశాలు (AP SSC Hall Ticket 2024 Highlights)

ఏపీ 10వ తరగతి హాల్ టికెట్లను సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు జారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు విధాలైన పాఠశాలలు ఉన్నాయి, అవి గవర్నమెంట్ పాఠశాలలు, గవర్నమెంట్ అయిడెడ్ పాఠశాలలు, అయిడెడ్ పాఠశాలలు మరియు అన్ అసిస్టెడ్ పాఠశాలలు. ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఏపీ బోర్డు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఎగ్జామ్ సెంటర్ లను ఏర్పాటు చేస్తుంది. విద్యార్థులు bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా వారి ఎగ్జామ్ సెంటర్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఏపీ SSC హాల్ టికెట్ 2024 (AP SSC Hall Ticket 2024) కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు. 

బోర్డు పేరు

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BSEAP)

పరీక్ష పేరు

AP SSC పబ్లిక్ పరీక్షలు

SSC బోర్డు పరీక్ష తేదీ

18 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు

హాల్ టికెట్  విడుదల తేదీ

04 మార్చి 2024  

రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్

డిక్లరేషన్ మోడ్

ఆన్‌లైన్ మరియు ఆఫ్లైన్ 

అధికారిక వెబ్‌సైట్

bseap.org లేదా bse.ap.gov.in

ఇది కూడా చదవండి - 10వ తరగతి తర్వాత ఇంటీరియర్ డిజైన్ కోర్సు మరియు ఉద్యోగ అవకాశాలు 

ఏపీ SSC హాల్ టికెట్ 2024 విడుదల తేదీ (AP SSC Hall Ticket 2024 Release Date)

ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు 2024 ఫిబ్రవరి చివరి వారంలో 10వ తరగతి హాల్ టికెట్లను(AP SSC Hall Ticket 2024) విడుదల చేస్తుంది. విద్యార్థులు 10వ తరగతి హాల్ టికెట్ల విడుదల తేదీలు, పరీక్ష తేదీల గురించిన వివరాలు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు. 

విశేషాలు

తేదీలు

AP SSC హాల్ టికెట్ విడుదల తేదీ

04 మార్చి 2024

AP SSC పరీక్ష తేదీలు 2024

18 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు

AP 10వ తరగతి ఫలితాలు 2024

జూన్ 2024

ఏపీ SSC హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ చేసే విధానం (Steps To Download AP SSC Hall Ticket 2024)

ఏపీ SSC హాల్ టికెట్ 2024 అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు వారి హాల్ టికెట్ ను ఈ క్రింద వివరించిన స్టెప్స్ అనుసరించి డౌన్లోడ్ (AP SSC Hall Ticket 2024 Download ) చేసుకోవచ్చు.

  • అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in ఓపెన్ చేయండి.
  • ' AP SSC Hall Ticket 2024' అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.
  • మీ వివరాలను ఎంటర్ చేసి ' Submit ' మీద క్లిక్ చేయండి. 
  • మీ హాల్ టికెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 
  • మీ హాల్ టికెట్ ను సేవ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఇవి కూడా చదవండి - 10వ తరగతి తర్వాత నర్సింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా?

ఏపీ SSC 2024 హాల్ టికెట్ లో పేర్కొనే వివరాలు (Details Mentioned on AP SSC 2024 Hall Ticket)

ఏపీ SSC హాల్ టికెట్ 2024 (AP SSC Hall Ticket 2024) లో విద్యార్థికి సంబంధించిన ఈ క్రింది వివరాలు ఉంటాయి. 

  • విద్యార్థి పేరు
  • విద్యార్థి హాల్ టికెట్ నెంబర్
  • మీడియం
  • జిల్లా
  • తండ్రి పేరు
  • తల్లి పేరు
  • పరీక్ష సమయం
  • ఎగ్జామ్ సెంటర్ మరియు చిరునామా
  • పాఠశాల పేరు
  • విద్యార్థి సంతకం
  • విద్యార్థి ఫోటో
  • పరీక్ష తేదీ

విద్యార్థులు గమనించవలసిన ఇతర ముఖ్యమైన అంశాలు: 

  • విద్యార్థి పేరు, హాల్ టికెట్ నెంబర్, జెండర్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్ మొదలైన సమాచారం అంతా ఏపీ SSC హాల్ టికెట్ లో ఉంటాయి. 
  • విద్యార్థులు పేరు మొత్తం ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ లోనే ఉంటుంది. మరియు విద్యార్థి డేట్ ఆఫ్ బర్త్ DD/MM/YYYY ఫార్మాట్ లో ఉంటుంది.
  • విద్యార్థులు వారి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొత్తం సమాచారం సరిగా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్ కు రిపోర్ట్ చేయాలి. 
ఇది కూడా చదవండి - 10వ తరగతి తర్వాత కామర్స్ కోర్సులు మరియు కెరీర్ స్కోప్ 

ఏపీ SSC హాల్ టికెట్ 2024 - పరీక్ష రోజు సూచనలు ( AP SSC Hall Ticket 2024 - Exam day instructions)

  • విద్యార్థులు పరీక్ష రోజుల్లో తప్పని సరిగా వారి హాల్ టికెట్ ను ఎగ్జామ్ సెంటర్ కు తీసుకుని వెళ్ళాలి. 
  • విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే విద్యార్ధులను మిగతా పరీక్షలు వ్రాయడానికి అనుమతించరు. 
  • విద్యార్థులకు ఇచ్చిన రెస్పాన్స్ షీట్ లో వారి వ్యక్తిగత సమాచారం రాసుకోవచ్చు కానీ ఆన్సర్ బుక్ లెట్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం రాయకూడదు. 
  • ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, డిజిటల్ వాచ్ లు ఎగ్జామ్ హాల్ లోపలికి అనుమతించబడవు. 
  • విద్యార్థులు 9:35 AM తర్వాత పరీక్ష హాల్ లోకి అనుమతించబడరు. 
  • విద్యార్థులు వారి ఎగ్జామ్ సెంటర్ ను ఒకటి లేదా రెండు రోజుల ముందే చూసుకోవడం మంచిది, ఇలా చేస్తే పరీక్ష రోజున అడ్రస్ గురించి వెతకాల్సిన అవసరం ఉండదు, దాంతో సమయం కూడా ఆదా అవుతుంది.
  • విద్యార్థులు పెన్ లు, పెన్సిల్, స్కేలు లాంటి పరికరాలు తెచ్చుకోవాలి. ఎగ్జామ్ సెంటర్ లో ఇలాంటి వస్తువులు ఏవీ విద్యార్థులకు ఇవ్వబడవు.
  • పరీక్ష రోజున ఇన్విజిలేటర్ ఇచ్చే సూపర్ వైజింగ్ షీట్ లో విద్యార్థులు తప్పకుండా సంతకం చేయాలి. 
  • విద్యార్థులు తీసుకున్న అడిషనల్ షీట్లు, గ్రాఫ్ ల లెక్క సరిగా షీట్ లో వ్రాయాలి
ఇది కూడా చదవండి -  10వ తరగతి తర్వాత ఆర్కిటెక్చర్ కోర్సులు మరియు ఉద్యోగ అవకాశాలు 

AP SSC 2024 టైం టేబుల్ (AP SSC Time Table 2024)

విద్యార్థులు AP SSC 2024 టైమ్‌టేబుల్‌ను (AP SSC Time Table 2024) డౌన్‌లోడ్ చేయడానికి బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్, bse.ap.gov.inకి వెళ్లాలి. టైమ్‌టేబుల్‌లో పరీక్ష తేదీలు సబ్జెక్ట్ కోడ్‌లతో సహా  విద్యార్థులకు అవసరమైన మొత్తం సమాచారం ఉంటుంది, ప్రత్యేకించి పరీక్ష తేదీలు, పరీక్ష సమయం తేదీ ప్రకారంగా సబ్జెక్టు వివరాలు ఉంటాయి. AP SSC 2024 టైం టేబుల్ (AP SSC Time Table 2024) ద్వారా విద్యార్థులు పరీక్ష తేదీలు మరియు ఇతర ప్రత్యేకతలతో సహా మొత్తం సమాచారాన్ని తెలుసుకోవచ్చు.  అలాగే విద్యార్థులు వారి అధ్యయన సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. AP SSC 2024 పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి విద్యార్థులు శ్రద్ధగా చదవాలి.  AP SSC 2024 పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింద ఉన్నాయి:

ఈవెంట్స్

తేదీలు

AP SSC పరీక్ష తేదీలు

18 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు

AP SSC హాల్ టికెట్

04 మార్చి 2024

AP SSC ఫలితాలు

మే 2024

AP SSC రీ వాల్యుయేషన్ 

జూలై 2024

AP SSC రీ వాల్యుయేషన్  ఫలితం

ఆగస్టు 2024

AP SSC సప్లిమెంటరీ పరీక్ష

జూలై 2024

AP SSC  సప్లిమెంటరీ ఫలితం

ఆగస్టు 2024

ఏపీ SSC హాల్ టికెట్ 2024 - ప్రిపరేషన్ టిప్స్ (AP SSC Hall Ticket 2024 - Exam Preparation Tips)

ఏపీ SSC పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఈ క్రింద అందించిన టిప్స్ ఉపయోగకరంగా ఉంటాయి.
  • ఏపీ 10వ తరగతి పరీక్ష తేదీలను ప్రకటించే ముందే విద్యార్థులు తమ సిలబస్ ను పూర్తి చేయాలి. 
  • ఏపీ 10వ తరగతి పరీక్షల  టైం టేబుల్ విడుదల అయిన తర్వాత విద్యార్థులు గత సంవత్సర ప్రశ్న పత్రాలను మరియు శాంపిల్ పేపర్లను సాల్వ్ చేయాలి.
  • గత సంవత్సర ప్రశ్న పత్రాల నుండి ఎక్కువగా వచ్చే ప్రశ్నలను బాగా ప్రిపేర్ అవ్వాలి.
  • విద్యార్థులు రివిజన్ కు సొంత టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని ఫాలో అవ్వడం మంచిది. 
  • విద్యార్థులు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి, చదువుతున్న సమయంలో చిన్న విరామం తీసుకుంటూ ఉండాలి. 
  • సిలబస్ ను  వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయడం విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి సహాయం చేస్తుంది. 

సంబంధిత కధనాలు  

10వ తరగతి తర్వాత డిప్లొమా కోర్సుల జాబితా10వ తరగతి తర్వాత నర్సింగ్ కోర్సుల జాబితా
10వ తరగతి తర్వాత కామర్స్ కోర్సుల జాబితా 10వ తరగతి తర్వాత ITI కోర్సుల జాబితా
10వ తరగతి తర్వాత ఆర్కిటెక్చర్ కోర్సుల జాబితా 10వ తరగతి తర్వాత ఇంటీరియర్ డిజైన్ కోర్సుల జాబితా 

ఏపీ SSC గురించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి CollegeDekho ను ఫాలో అవ్వండి. 

FAQs

AP SSC హాల్ టికెట్ 2024 ఎప్పుడు విడుదల చేయబడుతుంది?

AP SSC హాల్ టికెట్ 2024 మార్చి 2024 మొదటి వారంలో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు.

/ap-ssc-admit-card-brd

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!