ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం(AP Board Class 10 Exam Pattern) 2023-24: AP SSC పరీక్షా విధానం మరియు మార్కింగ్ స్కీమ్ గురించి తెలుసుకోండి.

Preeti Gupta

Updated On: December 06, 2023 04:33 pm IST

AP SSC 2023-24 పరీక్ష విధనాన్నీ (AP Board Class 10 Exam Pattern 2023-24) మరియు పరీక్షలో ప్రతీ సబ్జెక్టుకు ఉండే పేపర్ల సంఖ్య, ప్రశ్నల విధానం ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

AP SSC Exam Pattern
examUpdate

Never Miss an Exam Update

ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం(AP Board Class 10 Exam Pattern) 2023-24: 10 వ తరగతి  పరీక్షల నమూనాను (AP Board Class 10 Exam Pattern) ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్,(BSE AP) అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in లో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ బోర్డు గత సంవత్సరం 2022-23 జరిగిన పరీక్ష  విధానం (AP Board Class 10 Exam Pattern) లో  కొన్ని మార్పులను తీసుకుని వచ్చింది. అంతకు ముందు సంవత్సరం 2021-22 వరకు, భారతదేశంలోని అన్ని విద్యా బోర్డులతో పాటు, ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (BSE AP) రెండు టర్మ్ పరీక్షల విధానాన్ని అవలంబించింది. ఇందులో టర్మ్ 1 పరీక్షలు మల్టిపుల్ ఛాయిస్ (MCQ)ల ఆధారంగా ఉంటాయి, టర్మ్ 2  పేపర్ లో వివరణాత్మక ప్రశ్నలు ఉండేవి. టర్మ్ 1 మరియు టర్మ్ 2 పేపర్ల వెయిటేజీ ఆధారంగా 10వ తరగతి ఫలితాలు లెక్కించి విడుదల చేసేవారు. ఈ విధానం సమస్యాత్మకంగా మరియు గందరగోళంగా ఉండడం వలన ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (BSE AP) రెండు టర్మ్ పరీక్షల విధానాన్ని రద్దు చేసి ఒకే టర్మ్ పరీక్షను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం(AP Board Class 10 Exam Pattern) 2023-24 సంవత్సరానికి ఈ టర్మ్ విధానాన్నే అమలు చేస్తుంది. ప్రస్తుత విద్య సంవత్సరం 2023-24 లో కూడా కొత్త విధానంలోనే పరీక్షలు జరుగుతాయి. విద్యార్థుల నుండి భారాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ బోర్డు 10వ తరగతి సిలబస్ (AP SSC Syllabus)ని 30% వరకు తగ్గించింది. ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం(AP Board Class 10 Exam Pattern) 2023-24 పూర్తి వివరాలు మరియు తాజా సమాచారం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. 

ఇది కూడా చదవండి - AP SSC ఫలితాలు 2023 డైరెక్ట్ లింక్ 

10వ తరగతి ప్రశ్నపత్రాల తీరు మరియు వాటికి కేటాయించిన మార్కుల వివరాలను ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం(AP Board Class 10 Exam Pattern) 2023-24 ద్వారా విద్యార్థులు తెలుసుకోవచ్చు.విద్యార్థులు ఫైనల్ పరీక్షల కోసం సన్నద్ధం అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు నమూనా ప్రశ్నపత్రాలను  (AP SSC Sample Papers)ని కూడా విడుదల చేసింది, ఈ ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్‌సైట్ నుండి విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ  నమూనా పత్రాల గురించిన ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం, ఎందుకంటే ఫైనల్ పరీక్షలలో విద్యార్థులు ఇలాంటి ప్రశ్న పత్రాలకే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఈ నమూనా పత్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం(AP Board Class 10 Exam Pattern) 2023-24 కు అనుగుణంగా రూపొందిచబడినాయి. అందువల్ల విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరచుకోవడానికి ఆర్టికల్ లోని విషయాలు ఖచ్చితంగా సహాయపడతాయి.  ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం(AP Board Class 10 Exam Pattern) నమూనా ద్వారా ప్రశ్న పత్రంలో వివిధ ప్రశ్నలకు మరియు వివిధ విభాగాలకు కేటాయించిన మార్కుల గురించి ఈ ఆర్టికల్ లో సమగ్రంగా వివరించబడింది. 

AP SSC Exam Pattern 2022-23 లో చేసిన మార్పులు 

ఈ ఆర్టికల్ లో పైన వివరించిన విధంగా ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (BSE AP ) రెండు టర్మ్ పరీక్షల విధానాన్ని రద్దు చేసింది, దానితో పాటు ఈ విద్యా సంవత్సరంలో అనేక మార్పులను ప్రవేశపెట్టింది. ప్రశ్నపత్రం నిర్మాణం, మార్కుల కేటాయింపు, ప్రశ్నల తీరు మొదలైన వాటిలో ఈ మార్పులు చేయబడ్డాయి. క్రింద ఇచ్చిన పట్టికలో ఈ విద్యా సంవత్సరంలో చేయబడిన మార్పుల గురించి వివరంగా ఉంది. 

ఇవి కూడా చదవండి - AP SSC టైం టేబుల్ 2024

AP SSC Exam Pattern 2023-24 ముఖ్యాంశాలు (AP SSC Exam Pattern 2023-24 Highlights)

ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం 2023-2024 (AP SSC Exam Pattern 2023-24) గురించిన ముఖ్యమైన అంశాలు పూర్తి వివరాలతో క్రింద పట్టికలో వివరించబడ్డాయి.

ఏపీ 10వ తరగతి 2023-24 పరీక్ష వివరాలు

ముఖ్యాంశాలు

పరీక్ష పేరు

ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్ష

నిర్వహించే బోర్డు

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BSE AP)

అధికారిక వెబ్‌సైట్

bse.ap.gov.in

పరీక్ష ఫార్మాట్

ఆఫ్‌లైన్

మొత్తం మార్కులు

100

థియరీ మార్కులు

100

పాస్ మార్కులు

100కి 35

పరీక్ష తేదీ

మార్చి 2023

AP SSC పరీక్ష విధానం 2023-24 (AP SSC Exam Pattern 2023-24)

ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి బోర్డు పరీక్షలో 11 పేపర్లకు బదులుగా 7 పేపర్లు మాత్రమే ఉంటాయి. కింద ఉన్న పట్టికలో ప్రతీ సబ్జెక్ట్ యొక్క ప్రశ్నపత్రం విధానాలు వివరంగా అందించడం జరిగింది. 

సబ్జెక్టు

మొత్తం మార్కులు

ఇంగ్లీష్ 

100

హిందీ

100

తెలుగు

100

భౌతిక శాస్త్రం 

50

జీవశాస్త్రం

50

గణితం

100

సాంఘీక శాస్త్రం

100

AP SSC Exam Pattern 2023-24 సబ్జెక్ట్ ప్రకారంగా (AP SSC Exam Pattern 2023-24 Subject Wise)

ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం 2023-24  (AP SSC Exam Pattern 2023-24) సబ్జెక్టు ప్రకారంగా ఒకొక్క సబ్జెక్టు కు విడివిడిగా ఈ క్రింది పట్టికలలో వివరించబడింది :

ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం 2023-24 - ఇంగ్లీష్ (AP SSC Exam Pattern 2023-24 English)

క్రింద ఇవ్వబడిన పట్టికలో ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం 2023-24 - ఇంగ్లీష్ సబ్జెక్టు గురించి వివరించబడింది.

విభాగం

మొత్తం మార్కులు

విషయం అవగాహన

30 

వివరణాత్మక రైటింగ్ 

30 

వ్యాకరణం

40 

మొత్తం మార్కులు 100

ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం 2023-24 - హిందీ (AP SSC Exam Pattern 2023-24, Hindi)

క్రింద ఇవ్వబడిన పట్టికలో ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం 2023-24 - హిందీ సబ్జెక్టు గురించి వివరించబడింది.

విభాగం పేరు

మొత్తం మార్కులు

వ్యాసరూప ప్రశ్నలు 

36

లఘు ప్రశ్నలు 

28

అతి లఘు ప్రశ్నలు 

24

లక్ష్యాత్మక ప్రశ్నలు 

12

మొత్తం మార్కులు 100

ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం 2023-24 - తెలుగు (AP SSC Exam Pattern 2023-24: Telugu)

క్రింద ఇవ్వబడిన పట్టికలో ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం 2023-24 - తెలుగు సబ్జెక్టు గురించి వివరించబడింది.

విభాగం పేరు

మొత్తం మార్కులు

వ్యాసరూప ప్రశ్నలు 

56

లఘు ప్రశ్నలు 

12

అతి లఘు ప్రశ్నలు 

12

లక్ష్యాత్మక ప్రశ్నలు 

14

మొత్తం మార్కులు

100

ఇది కూడా చదవండి - 10వ తరగతి తర్వాత ఉత్తమ డిప్లొమా కోర్సులు 


ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం 2023-24 - సామాన్య శాస్త్రం (AP SSC Exam Pattern 2023-24: Science)

క్రింద ఇవ్వబడిన పట్టికలో ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం 2023-24 - భౌతిక శాస్త్రం మరియు జీవశాస్త్రం సబ్జెక్టుల గురించి వివరించబడింది:

ప్రశ్నల రకం

ఫిజికల్ సైన్స్జీవశాస్త్రం

మొత్తం మార్కులు

అతి లఘు ప్రశ్నలు 66

12

లఘు ప్రశ్నలు 88

16

 సంక్షిప్త ప్రశ్నలు1212

24

వ్యాసరూప  ప్రశ్నలు242448
మొత్తం మార్కులు5050100

ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం 2023-24 - సాంఘీక శాస్త్రం మరియు గణితం (AP SSC Exam Pattern 2023-24: Social Studies and Maths)

క్రింద ఇవ్వబడిన పట్టికలో ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి పరీక్షా విధానం 2023-24 - సాంఘీక శాస్త్రం మరియు గణితం సబ్జెక్టుల గురించి వివరించబడింది:

ప్రశ్నల రకంప్రశ్నల సంఖ్యప్రతి ప్రశ్నకు మార్కులు

మొత్తం మార్కులు

అతి లఘు ప్రశ్నలు 

121

12 మార్కులు

లఘు ప్రశ్నలు 82

16 మార్కులు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు84

32 మార్కులు

వ్యాసరూప ప్రశ్నలు

58

40 మార్కులు

మొత్తం

100 మార్కులు

ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి మార్కుల విధానం(AP Board Class 10 Marking Scheme) 

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డ్ 2021కి ముందు అనుసరించిన పరీక్షా విధానం మళ్ళీ ఈ విద్యా సంవత్సరంలో అమలు చేస్తుంది, కాబట్టి విద్యార్థులు గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలు ( AP SSC Previous Year Question Papers)  డౌన్‌లోడ్ చేసుకుంటే వారికి ఉపయోగకరంగా ఉంటుంది మరియు ప్రశ్నపత్రాలలో ప్రశ్నలు అడిగే విధానం వాటికి మార్కులు కేటాయించే విధానాన్ని(AP Board Class 10 Marking Scheme) అర్ధం చేసుకోవడానికి క్రింద ఉన్న పట్టిక విద్యార్థులకు ఉపయోగపడుతుంది.

ప్రశ్నల రకంప్రశ్నల శాతంమార్కులు(ఒక్కో ప్రశ్నకు)మొత్తం మార్కులుసమయం
అతి లఘు ప్రశ్నలు 20%116
లఘు ప్రశ్నలు 40%220
సంక్షిప్త జవాబు ప్రశ్నలు 20%424
వ్యాసరూప ప్రశ్నలు 20%840
మొత్తం100%1003 గంటలు 15 నిమిషాలు

ఇది కూడా చదవండి - 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వివిధ స్కాలర్షిప్ 


ఆంధ్రప్రదేశ్ బోర్డు 10 వ తరగతి గ్రేడింగ్ విధానం(AP Board SSC Grading System) 

10 వ తరగతి తర్వాత పై చదువుల కోసం విద్యార్థులు కళాశాలల్లో అడ్మిషన్లు పొందే ప్రక్రియలో విద్యార్థులకు కేటాయించిన గ్రేడ్ లను మార్కులుగా మార్చి వారికి సీట్లు కేటాయించడంలో అనేక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (BSE AP) విద్యార్థులకు ఇస్తున్న గ్రేడ్ లను తొలగించి గ్రేడ్ల స్థానంలో మార్కులను విడుదల చెయ్యాలి అని నిర్ణయించింది. అందుకేగ్రేడింగ్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ బోర్డు రద్దు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుండి ఆంద్రప్రదేశ్ 10వ తరగతి విద్యార్థులు మరియు ఇంటర్మీడియెట్ విద్యార్థులు వారి ఫలితాలను మార్కులలోనే పొందుతారు. 

సంబంధిత కధనాలు  

10వ తరగతి తర్వాత డిప్లొమా కోర్సుల జాబితా10వ తరగతి తర్వాత నర్సింగ్ కోర్సుల జాబితా
10వ తరగతి తర్వాత కామర్స్ కోర్సుల జాబితా 10వ తరగతి తర్వాత ITI కోర్సుల జాబితా
10వ తరగతి తర్వాత ఆర్కిటెక్చర్ కోర్సుల జాబితా 10వ తరగతి తర్వాత ఇంటీరియర్ డిజైన్ కోర్సుల జాబితా 



ఏపీ 10వ తరగతి పరీక్షల గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

FAQs

AP SSC బోర్డ్ 2024 మొత్తం మార్కులు ఏమిటి?

AP SSC బోర్డ్ 2024లో సమర్పించబడే అన్ని ప్రశ్న పత్రాలు హిందీ సబ్జెక్టులు మినహా 100 మార్కులను కలిగి ఉంటాయి. బోర్డు పరీక్షలలో మొత్తం 5 ప్రధాన సబ్జెక్టులు చేర్చబడ్డాయి మరియు కొన్ని ఐచ్ఛిక సబ్జెక్టులు ఉన్నాయి.

AP SSC ఉత్తీర్ణత మార్కులు 2024లో ఏదైనా మార్పు ఉందా?

AP SSC ఉత్తీర్ణత మార్కులు 2024 35 నుండి 36కి పెంచబడ్డాయి. విద్యార్థులు బోర్డు పరీక్షలలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించడానికి మొత్తం 36 మార్కులతో పేపర్ 1 మరియు పేపర్ 2 రెండింటిలోనూ కనీసం 18 మార్కులు సాధించాలి.

AP SSC బోర్డ్ 2024 లో 90% కంటే ఎక్కువ మార్కులు సాధించడం ఎలా?

AP SSC బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడిన నమూనా పత్రాలు మరియు మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రాలను ఉపయోగించడం ద్వారా విద్యార్థులు నిర్దిష్ట అధ్యయన సమయ పట్టికను అనుసరించాలి మరియు వారి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. మీ సన్నాహాలను ప్రారంభించడానికి తాజా సిలబస్‌ని డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించండి.

AP SSC బోర్డ్ 2024 లో మూడవ భాష ఏది?

AP SSC బోర్డ్ 2024 పాఠ్యాంశాల్లో మూడు భాషలు ఉన్నాయి. పాఠశాల యాజమాన్యం ప్రకారం మొదటి భాష తెలుగు తరువాత రెండవ భాష హిందీ మరియు మూడవ భాష ఆంగ్లం.

AP SSC బోర్డ్ పరీక్షలు కఠినంగా ఉన్నాయా?

AP స్టేట్ బోర్డ్ కఠినమైనది కాదు, అయితే బోర్డు పరీక్షలలో అధిక శాతం స్కోర్ చేయడానికి విద్యార్థులు తాజా సిలబస్ మరియు పరీక్షా సరళి ప్రకారం మంచి సన్నాహాలు కలిగి ఉండాలి.

AP SSC 2024 పరీక్ష వ్యవధి ఎన్ని గంటలు?

AP SSC 2024 పరీక్ష మొత్తం 3 గంటల పాటు నిర్వహించబడుతుంది, ప్రశ్నపత్రాన్ని చదవడానికి అదనంగా 15 నిమిషాలు అందించబడుతుంది.

ఇంగ్లీష్ కోసం AP SSC పరీక్షలో ఎన్ని భాగాలు ఉన్నాయి?

ఆంగ్లం కోసం AP SSC పరీక్షా సరళిలో నాలుగు భాగాలు ఉన్నాయి: టెక్స్ట్ బుక్ & సప్లిమెంటరీ టెక్స్ట్ బుక్స్, కంపోజిషన్ & లెటర్ రైటింగ్, కాంప్రహెన్షన్ మరియు గ్రామర్.

View More
/ap-ssc-exam-pattern-brd

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!