తెలంగాణ 10వ తరగతి పరీక్ష విధానం 2024(TS SSC Exam Pattern 2024) పూర్తి సమాచారం

Guttikonda Sai

Updated On: January 29, 2024 09:15 pm IST

తెలంగాణ 10వ తరగతి పరీక్ష విధానం (TS SSC Exam Pattern 2024) గురించిన పూర్తి సమాచారం అధికారిక వెబ్సైటు లో విడుదల చేయనున్నారు. 10వ తరగతి విద్యార్థులు వారి పరీక్ష విధానం గురించిన పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

Telangana Class 10 Exam Pattern
examUpdate

Never Miss an Exam Update

TS SSC పరీక్షా విధానం 2023-24(TS SSC Exam Pattern 2023-24) : తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు గత  విద్య సంవత్సరం 2022-23 10వ తరగతి పరీక్ష విధానంలో కొన్ని కీలకమైన మార్పులు చేసింది. గతంలో ( 2022 వరకు) విద్యార్థులు వ్రాస్తున్న 11 పేపర్లకు బదులుగా గత సంవత్సరం కేవలం 6 పేపర్లకు మాత్రమే పరీక్షలు వ్రాయాల్సి ఉంటుంది.  ఈ విద్యా సంవత్సరం 2023-24 లో కూడా ఇదే విధానం అమలు అవుతుంది. విద్యార్థులు తెలంగాణ 10వ తరగతి పరీక్ష విధానాన్ని (TS SSC Exam Pattern 2023-24) అధికారిక వెబ్సైట్  bse.telangana.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ SSC, ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ (TS SSC Time Table 2024)రాష్ట్ర బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో వరసగా bie.telangana.gov.in, bse.telangana.gov.inలో  2024 డిసెంబర్ నెలలో  విడుదల అయ్యింది . తెలంగాణ పదో తరగతి పరీక్ష 18 మార్చి 2024 నుండి 02 ఏప్రిల్ 2024 తేదీ వరకు నిర్వహించబడుతుంది.తెలంగాణ 10వ తరగతి పరీక్షల టైం టేబుల్ మరియు పరీక్ష విధానం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.  

తెలంగాణ 10వ తరగతి పరీక్ష విధానం 2024 (TS SSC Exam Pattern 2023-24) లో అన్ని సబ్జెక్టు ల పరీక్ష విధానం గురించిన సమాచారం ఉంటుంది. ఈ ఆర్టికల్ లో తెలంగాణ 10వ తరగతి పరీక్ష విధానం గురించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. 

సంబంధిత కధనాలు

తెలంగాణ SSC 2024 పూర్తి సమాచారం
తెలంగాణ SSC 2024 సిలబస్ 
తెలంగాణ SSC పరీక్ష విధానం 
తెలంగాణ SSC 2024 ఫలితాలు 
తెలంగాణ SSC 2024 ప్రిపరేషన్ టిప్స్ 
తెలంగాణ SSC 2024 హాల్ టికెట్ 

తెలంగాణ SSC పరీక్షా విధానం 2024 ముఖ్యాంశాలు (Telangana SSC Exam Pattern 2024 Highlights)

తెలంగాణ 10వ తరగతి పరీక్ష విధానం గురించిన ముఖ్యమైన అంశాలు ఈ క్రింది పట్టికలో వివరించబడ్డాయి.

పరీక్ష పేరు

తెలంగాణ రాష్ట్ర సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పరీక్ష

కండక్టింగ్ అధారిటీ 

డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ (BSE)

ఫ్రీక్వెన్సీ ఆఫ్ కండక్షన్

ఒక విద్యా సంవత్సరంలో ఒకసారి

పరీక్ష స్థాయి

మెట్రిక్యులేషన్ 

పరీక్షా విధానం

ఆఫ్‌లైన్

పరీక్ష వ్యవధి

3 గంటలు

ప్రశ్నాపత్రం మార్కులు

100 మార్కులు (థియరీ మార్కులు + ఇంటర్నల్ అసెస్మెంట్)

నెగెటివ్ మార్కింగ్

నెగెటివ్ మార్కింగ్ లేదు

అధికారిక వెబ్‌సైట్

Bse.telangana.gov.in

తెలంగాణ 10వ తరగతి పరీక్షా విధానం 2023-24 (Telangana SSC Exam Pattern 2023-24)

విద్యార్థుల కోసం 2023-24 విద్య సంవత్సరానికి మార్పులు చేసిన 10వ తరగతి  పరీక్ష విధానం ఈ క్రింది పట్టికలో వివరించబడింది.
Telangana SSC Exam Pattern 2022-23
  • తెలంగాణ 10వ తరగతి 2024 విద్యా సంవత్సరంలో బోర్డు పరీక్షల కోసం తాజా పరీక్షా విధానంలో కేవలం 6 పేపర్లు మాత్రమే ఉంటాయి.
  • ఒక్కో పేపర్‌కు కేటాయించిన మొత్తం మార్కుల సంఖ్య 100. థియరీ పేపర్ 80 మార్కులకు, ఇంటర్నల్ అసెస్మెంట్ 20 మార్కులకు ఉంటాయి.
  • ప్రతి పేపర్‌కు కనీస ఉత్తీర్ణత మార్కు 35 మార్కులు.
  • విద్యార్థులు తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుండి పేపర్‌ బ్లూప్రింట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS SSC పరీక్ష విధానం 2024 మార్కుల కేటాయింపు (TS SSC Exam Pattern 2024 Marks Distribution)

తెలంగాణ SSC పరీక్షలు 2024 నిర్వహించబడే 6 పేపర్‌ల మార్కుల కేటాయింపుకు సంబంధించిన సమాచారాన్ని దిగువ ఇవ్వబడిన పట్టికలో గమనించవచ్చు:

విషయం

మొత్తం మార్కులు

థియరీ పరీక్ష మార్కులు

అంతర్గత అంచనా

ప్రథమ భాష (హిందీ/ఉర్దూ/తెలుగు)

100

80

20

రెండవ భాష (హిందీ/తెలుగు)

100

80

20

మూడవ భాష (ఇంగ్లీష్)

100

80

20

గణితం 

100

80

20

జనరల్ సైన్స్ 

100

80

20

సోషల్ స్టడీస్ 

100

80

20

తెలంగాణ SSC పరీక్షా విధానం 2023-24 ఉత్తీర్ణత మార్కులు (Telangana SSC Exam Pattern 2023-24 Passing Marks)

TS SSC పరీక్ష 2024 లో ఉత్తీర్ణత సాధించడానికి, విద్యార్థులందరూ థియరీ మరియు ప్రాక్టికల్‌తో సహా ప్రతి సబ్జెక్టు లో  కనీసం 35% మార్కులు పొందాలి.క్రింద ఇచ్చిన పట్టికలో సబ్జెక్టు ప్రకారంగా పాస్ మార్కుల వివరాలు అందించబడ్డాయి. 

TS బోర్డ్ SSC పరీక్షా విధానం - థియరీ ఉత్తీర్ణత మార్కులు (TS Board SSC Exam Pattern - Passing Marks for Theory)

సబ్జెక్టులు

గరిష్ట మార్కులు

పాస్ మార్కులు

మొదటి భాష (హిందీ, సంస్కృతం, తెలుగు)

80

28

రెండవ భాష (ఉర్దూ)

80

28

ఆంగ్ల

80

28

గణితం

80 

28

జనరల్ సైన్స్ 

80 

28

సోషల్ స్టడీస్ 

80 

28 

TS బోర్డ్ SSC పరీక్ష విధానం - ప్రాక్టికల్ మరియు ఇంటర్నల్ అసెస్‌మెంట్ కోసం ఉత్తీర్ణత మార్కులు (TS Board SSC Exam Pattern - Passing Marks for Practical and Internal Assessment)

సబ్జెక్టులు

ప్రాక్టికల్/ఇంటర్నల్ అసెస్‌మెంట్ గరిష్ట మార్కులు

ప్రాక్టికల్/ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఉత్తీర్ణత మార్కులు

మొదటి భాష (హిందీ, సంస్కృతం, తెలుగు)

20

07

రెండవ భాష (ఉర్దూ)

20

07

ఇంగ్లీష్

20

07

గణితం

20

07

జనరల్ సైన్స్ 

20

07

సోషల్ స్టడీస్ 

20

07

ఇది కూడా చదవండి: తెలంగాణ 10వ తరగతి పరీక్ష తేదీలు 

తెలంగాణ SSC పరీక్షా విధానం 2023-24 గ్రేడింగ్ సిస్టమ్ (Telangana SSC Exam Pattern 2023-24 Grading System)

విద్యార్థులకు క్రింద అందించిన పట్టిక నుండి తెలంగాణ SSC పరీక్షా విధానం 2024 ప్రకారం గ్రేడ్‌లకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

మార్కులు

శాతం

గ్రేడ్

450 మరియు అంతకంటే ఎక్కువ మార్కులు

75% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు

360 నుండి  449 మార్కులు

60% కంటే ఎక్కువ లేదా సమానం మరియు 75% కంటే తక్కువ

బి

300 నుండి  359 మార్కులు

50% కంటే ఎక్కువ లేదా సమానం మరియు 60% కంటే తక్కువ

సి

210 నుండి 299 మార్కులు

35% కంటే ఎక్కువ లేదా సమానం మరియు 50% కంటే తక్కువ

డి

సంబంధిత కధనాలు  

10వ తరగతి తర్వాత డిప్లొమా కోర్సుల జాబితా10వ తరగతి తర్వాత నర్సింగ్ కోర్సుల జాబితా
10వ తరగతి తర్వాత కామర్స్ కోర్సుల జాబితా 10వ తరగతి తర్వాత ITI కోర్సుల జాబితా
10వ తరగతి తర్వాత ఆర్కిటెక్చర్ కోర్సుల జాబితా 10వ తరగతి తర్వాత ఇంటీరియర్ డిజైన్ కోర్సుల జాబితా 

తెలంగాణ SSC కి సంబందించిన మరిన్ని వివరాల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి. 

/telangana-ssc-exam-pattern-brd

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!