తెలంగాణ SSC హాల్ టికెట్ 2024 ( TS SSC Hall Ticket 2024) విడుదల అయ్యింది : డైరెక్ట్ లింక్, డౌన్‌లోడ్ చేయడానికి స్టెప్స్

Guttikonda Sai

Updated On: March 07, 2024 10:19 pm IST

తెలంగాణ SSC హాల్ టికెట్ 2024(TS SSC Hall Ticket 2024) విడుదల తేదీ , సమయం, డైరెక్ట్ లింక్, డౌన్‌లోడ్ చేయడానికి స్టెప్స్ ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. తెలంగాణ బోర్డు అధికారిక వెబ్సైటు bse.telangana.gov.in నుండి విద్యార్థులు వారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
Telangana 10th Hall Ticket 2023
examUpdate

Never Miss an Exam Update

తెలంగాణ SSC హాల్ టికెట్ 2024 (TS SSC Hall Ticket 2024) : తెలంగాణ ప్రభుత్వ డైరెక్టరేట్ మార్చి 7, 2024న పదో తరగతి హాల్ టికెట్లను విడుదల చేసింది. TS BSE తెలంగాణ SSC పరీక్షలు 2024 మార్చి 18 నుంచి ఏప్రిల్ 2, 2024 వరకు పెన్, పేపర్ మోడ్‌లో నిర్వహించబడతాయి. విద్యార్థులు వారి హాల్ టికెట్ ( TS SSC Hall Ticket 2024) ను తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఈ ఆర్టికల్ లో అందించే డైరెక్ట్ లింక్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ 10వ తరగతి పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి తప్పని సరిగా వారి హాల్ టికెట్ ను తీసుకుని వెళ్ళాలి. హాల్ టికెట్ లేని విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు. విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ ( TS SSC Hall Ticket 2024) లో వారు పేరు, పరీక్ష తేదీలు, పరీక్ష కేంద్రం , చిరునామా మొదలైన సమాచారం ఉంటుంది. 

తెలంగాణ ప్రభుత్వ డైరెక్టరేట్ ఈ రోజు అంటే మార్చి 7, 2024న పదో తరగతి హాల్ టికెట్లను విడుదల చేసింది. TS SSC హాల్ టికెట్ 2024 లింక్ (TS SSC Hall Ticket Download 2024 Link) అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in/లో యాక్టివేట్ అవుతుంది. దీనికి నేరుగా లింక్ అందించడం జరుగుతుంది. ఆ లింక్‌ను ఈ  దిగువన జోడించబడుతుంది. హాల్ టికెట్లను యాక్సెస్ చేయడానికి విద్యార్థులు వారి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయడంతో పాటు జిల్లా,  పాఠశాలను ఎంచుకోవాలి. TS SSC 10వ హాల్ టికెట్ 2024 పరీక్ష తేదీ,  రోజుతో పాటు అభ్యర్థి వివరాలను కలిగి ఉంటుంది. విద్యార్థులు పరీక్ష రోజు కోసం SSC హాల్ టికెట్‌లో పేర్కొన్న సూచనలను చదువుకోవాలి.  వ్యక్తిగత పాఠశాలలు. విద్యార్థులు అడ్మిట్ కార్డ్‌పై ప్రిన్సిపాల్ సంతకాన్ని పొందాలి. ఈ దిగువ అభ్యర్థి TS SSC హాల్ టికెట్ 2024 విడుదల సమయాన్ని నేరుగా లింక్‌తో పాటు హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని చెక్ చేయవచ్చు. 

TS SSC హాల్ టికెట్ లింక్ 2024 (TS SSC Hall Ticket Link 2024)

TS SSC హాల్ టికెట్‌ని చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్‌ని క్రింది పట్టికలో అందించడం జరిగింది, విద్యార్థులు ఈ లింక్ మీద క్లిక్ చేసి వారి హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TS SSC హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ 2024 - ఇక్కడ క్లిక్ చేయండి(రెగ్యులర్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్)

TS SSC హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ 2024 - ఇక్కడ క్లిక్ చేయండి  (ప్రైవేట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్)
TS SSC హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ 2024: ఇక్కడ క్లిక్ చేయండి (OSSC Hall Ticket Download)

సంబంధిత కధనాలు

తెలంగాణ SSC 2024 పూర్తి సమాచారం
తెలంగాణ SSC 2024 సిలబస్ 
తెలంగాణ SSC పరీక్ష విధానం 
తెలంగాణ SSC 2024 ఫలితాలు 
తెలంగాణ SSC 2024 ప్రిపరేషన్ టిప్స్ 
తెలంగాణ SSC 2024 హాల్ టికెట్ 

తెలంగాణ పదో తరగతి డేట్స్ షీట్ 2024 (TS SSC Board Dates Sheet 2024)

ఈ విద్యా సంవత్సరం తెలంగాణ సెకండరీ బోర్డు TS SSC టైమ్ టేబుల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో మరియు వార్తా పత్రాల ద్వారా కూడా విడుదల చేసింది. బోర్డు అధికారిక తేదీని అధికారికంగా విడుదల చేసే వరకు విద్యార్థులు దిగువన ఉన్నTS 10వ టైమ్ టేబుల్ 2024 ని తనిఖీ చేయవచ్చు.

సబ్జెక్టులు

తేదీ, రోజు

ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ (గ్రూప్ - ఎ)

మార్చి 18, 2024 (సోమవారం)

ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 (కాంపోజిట్ కోర్స్)

ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్)

ద్వితీయ భాష

మార్చి 19, 2024

మూడవ భాష (ఇంగ్లీష్)

మార్చి 21, 2024

గణితం

మార్చి 23, 2024

పార్ట్ I: ఫిజికల్ సైన్స్

మార్చి 26 మరియు 28, 2024

పార్ట్ II: బయోలాజికల్ సైన్స్

సోషల్ స్టడీస్ 

మార్చి 30, 2024

OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ - I (సంస్కృతం మరియు అరబిక్)

ఏప్రిల్ 1, 2024

SSC వొకేషనల్ కోర్సు (థియరీ)

ఏప్రిల్ 1, 2024

OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ - II (సంస్కృతం & అరబిక్)

ఏప్రిల్ 2, 2024

తెలంగాణ SSC హాల్ టికెట్ 2024 ముఖ్యాంశాలు (TS SSC Hall Ticket 2024 Highlights)

తెలంగాణ 10వ తరగతి హాల్ టికెట్  ( TS SSC Hall Ticket 2024) కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు. 

బోర్డు పేరు

తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE), తెలంగాణ

పరీక్ష పేరు

TS SSC

సెషన్

2023-24

హాల్ టికెట్ విడుదల

ఫిబ్రవరి 2023

పరీక్ష తేదీ

మార్చి 18 నుంచి ఏప్రిల్ 2, 2024 వరకు

అధికారిక వెబ్‌సైట్ లింక్

bse.telangana.gov.in

సరి చూసుకోవాల్సిన డీటెయిల్స్

డేట్ ఆఫ్ బర్త్ , పాఠశాల పేరు, జిల్లా, నమోదు సంఖ్య మొదలైనవి.

ఇవి కూడా చదవండి

TS POLYCET పూర్తి సమాచారం TS POLYCET అప్లికేషన్ ఫార్మ్ 
TS POLYCET పరీక్ష విధానం TS POLYCET సిలబస్ 
TS POLYCET గత సంవత్సర ప్రశ్న పత్రాలు TS POLYCET కళాశాలల జాబితా 

తెలంగాణ SSC హాల్ టికెట్ 2024 ముఖ్యమైన తేదీలు (TS SSC Hall Ticket 2024 Important Dates)

తెలంగాణ 10వ తరగతి హాల్ టికెట్ మరియు తెలంగాణ 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టిక లో వివరించబడ్డాయి. 

కార్యక్రమం 

తేదీలు

TS SSC హాల్ టికెట్ 2024 విడుదల

ఫిబ్రవరి 2024 

TS SSC పరీక్ష తేదీ

మార్చి 18 నుంచి ఏప్రిల్ 2, 2024 వరకు

తెలంగాణ SSC హాల్ టికెట్ 2024 ను డౌన్లోడ్ చేయడం ఎలా? (How to Download TS SSC Hall Ticket 2024?)

తెలంగాణ SSC హాల్ టికెట్ 2024 ( TS SSC Hall Ticket 2024) ను అధికారిక వెబ్సైట్ లో విడుదల చేస్తారు. మరియు ఈ ఆర్టికల్ లో అందించే డైరెక్ట్ లింక్ ద్వారా కూడా విద్యార్థులు వారి హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

రెగ్యులర్ విద్యార్థుల SSC హాల్ టికెట్

తెలంగాణ SSC రెగ్యులర్ విద్యార్థులు వారి పాఠశాల నుండి హాల్ టికెట్  ( TS SSC Hall Ticket 2024)ను అందుకుంటారు. లేదా విద్యార్థులు ఆన్లైన్ లో వారి హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ SSC హాల్ టికెట్ 2024 ను ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకునే విధానం ఈ క్రింది స్టెప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. 

  • తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in ఓపెన్ చేయండి. 
  • మెనూ లో ఉన్న School Portal ను ఓపెన్ చేయండి. 
  • మీ పేరు మరియు పాస్వార్డ్ నమోదు చేసి లాగిన్ అవ్వండి. 
  • పాఠశాల ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల లిస్ట్ కనిపిస్తుంది.
  • విద్యార్థుల లిస్ట్ నుండి మీ పేరు ఎంచుకోండి. మీ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి. 

ప్రైవేట్ విద్యార్థుల హాల్ టికెట్ 

తెలంగాణ SSC పరీక్షకు ప్రైవేట్ గా హాజరు అవుతున్న విద్యార్థులు ఈ క్రింది స్టెప్స్ అనుసరించి వారి హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

  • తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in ఓపెన్ చేయండి.
  • Students Portal మీద క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ నమోదు చేసి లాగిన్ అవ్వండి. 
  • విద్యార్థి హాల్ టికెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 
  • హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి. 

విద్యార్థుల యొక్క తెలంగాణ 10వ తరగతి హాల్ టికెట్ ఈ క్రింద ఉన్నట్టు కనిపిస్తుంది. 

తెలంగాణ SSC హాల్ టికెట్ 2024 లో పేర్కొనే అంశాలు. (Details Mentioned on TS SSC Hall Ticket 2024)

తెలంగాణ బోర్డు SSC హాల్ టికెట్ 2024 ( TS SSC Hall Ticket 2024) మీద విద్యార్థికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ముద్రిస్తారు. విద్యార్థులు వారి హాల్ టికెట్ ను అందుకున్న తర్వాత వారి సమాచారం సరిగా ఉందో లేదో అని చెక్ చేసుకోవాలి. విద్యార్థుల హాల్ టికెట్ మీద ఉన్న సమాచారం , పరీక్ష పూర్తి అయినా తర్వాత మార్క్స్ మెమో మీద కూడా ఉంటుంది కాబట్టి విద్యార్థులు వారి హాల్ టికెట్ ను జాగ్రత్తగా సరి చూసుకోవాలి. ఒకవేళ ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్ కు రిపోర్ట్ చేయాలి. తెలంగాణ 10వ తరగతి హాల్ టికెట్ 2024 లో క్రింద ఉన్న అంశాలు పేర్కొంటారు. 

  • విద్యార్థి పేరు
  • హాల్ టికెట్ నెంబర్
  • జిల్లా
  • తండ్రి పేరు
  • తల్లి పేరు
  • పాఠశాల పేరు
  • పరీక్ష కేంద్రం పేరు, చిరునామా
  • డేట్ ఆఫ్ బర్త్
  • మీడియం 
  • జెండర్
  • పరీక్ష తేదీలు 
  • పరీక్ష సూచనలు
  • విద్యార్థి ఫోటో
  • విద్యార్థి సంతకం .

గమనిక : 

  • విద్యార్థులు వారి హాల్ టికెట్ ను తప్పని సరిగా పరీక్ష కేంద్రానికి తీసుకుని వెళ్ళాలి.
  • విద్యార్థులు హాల్ టికెట్ జీరాక్స్ కాపీ ను పరీక్ష హాల్ లోకి తీసుకుని వెళ్లకూడదు. 
  • విద్యార్థుల హాల్ టికెట్ మీద సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్ సంతకం మరియు స్టాంప్ ఉండాలి. 
  • విద్యార్థి పేరు మరియు వివరాల్లో ఎటువంటి తప్పులు లేకుండా ఉండాలి. 
  • విద్యార్థి ఫోటో స్పష్టంగా ఉండాలి. 
  • విద్యార్థులు వారి పరీక్ష కేంద్రం మరియు పరీక్ష కేంద్రం కోడ్ ను జాగ్రత్తగా చూసుకోవాలి. 
  • విద్యార్థులు పరీక్ష వ్రాయడానికి అవసరమైన పరికరాలు పెన్, పెన్సిల్, స్కేలు మొదలైనవి వారే తెచ్చుకోవాలి. 
  • పరీక్ష సమయం కంటే 30 నిమిషాలు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిది. 

తెలంగాణ SSC హాల్ టికెట్ 2024 లో వ్యత్యాసం (Discrepancy in TS SSC Hall Ticket 2024)

తెలంగాణ SSC హాల్ టికెట్ 2024 పరీక్షకు హాజరు అవ్వడానికి చాలా అవసరం మరియు హాల్ టికెట్ ( TS SSC Hall Ticket 2024) మీద ఉన్న సమాచారం విద్యార్థుల సర్టిఫికెట్స్ మీద నమోదు చేయబడతాయి కాబట్టి విద్యార్థుల హాల్ టికెట్ మీద ఉన్న సమాచారం అంతా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలి. విద్యార్థులు వారి హాల్ టికెట్ లో ఏదైనా వ్యత్యాసం లేదా తప్పులు గమనిస్తే వెంటనే సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్ కు రిపోర్ట్ చేసి తప్పులు సరిదిద్దుకోవాలి. 

తెలంగాణ SSC హాల్ టికెట్ 2024 పాఠశాల ప్రకారంగా (TS SSC Hall Ticket 2024 School Wise)

తెలంగాణ SSC హాల్ టికెట్ 2024 ( TS SSC Hall Ticket 2024) ను పాఠశాల ప్రకారంగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో ఉన్న School Portal ఓపెన్ చేసి పాఠశాల యొక్క ఐడీ మరియు పాస్వర్డ్ నమోదు చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్  అయిన తర్వాత సంబంధిత పాఠశాల నుండి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల అందరి హాల్ టికెట్లు ఉంటాయి. పాఠశాల మేనేజ్మెంట్ విద్యార్థులకు హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించవచ్చు. 

విద్యార్థులు తెలంగాణ SSC హాల్ టికెట్ 2024 ను పోగొట్టుకుంటే ఏం చేయాలి? (What to Do If You Lose TS SSC Hall Ticket 2024?)

విద్యార్థులు ఒకవేళ వారి తెలంగాణ SSC హాల్ టికెట్ 2024  ( TS SSC Hall Ticket 2024)ను పోగొట్టుకుంటే పైన వివరించిన విధంగా మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.  విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ మీద వారి పాఠశాల ప్రిన్సిపాల్ సంతకం మరియు స్టాంప్ తప్పని సరిగా ఉండాలి.

తెలంగాణ SSC హాల్ టికెట్ 2024 పరీక్ష రోజు సూచనలు. (TS SSC Hall Ticket 2024 Exam Day Instructions)

తెలంగాణ 10వ తరగతి పరీక్ష కు హాజరు అవుతున్న విద్యార్థులు ఈ క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. 

  • విద్యార్థులు పరీక్ష సమయానికి కనీసం 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. విద్యార్థులు ఆలస్యంగా వస్తే పరీక్ష హాలులోకి అనుమతించరు. 
  • విద్యార్థులు తప్పని సరిగా వారి హాల్ టికెట్ ను తీసుకుని రావాలి, మరియు ఇన్విజిలేటర్ అడిగినప్పుడు చూపించాలి. 
  • విద్యార్థులు పరీక్ష హాలులోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, కాలిక్యులేటర్లు తీసుకుని రాకూడదు. 
  • ఇన్విజిలేటర్ అందించిన షీట్ లో విద్యార్థులు సంతకం చేయలి. 
  • విద్యార్థులు వారికి కేటాయించిన చోటు మాత్రమే కూర్చోవాలి. 
  • విద్యార్థులు పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే, విద్యార్థులు అప్పటి వరకూ వ్రాసిన పరీక్షలూ కూడా రద్దు చేస్తారు. మరియు తర్వాత పరీక్షలకు కూడా విద్యార్థి హాజరు కాలేరు. 

తెలంగాణ SSC 2024 ప్రిపరేషన్ టిప్స్ (Preparation tips for TS SSC Exams 2024)

తెలంగాణ 10వ తరగతి పరీక్షల  కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఈ క్రింది అంశాలను పాటిస్తే , పరీక్షలలో మంచి స్కోరు సాధించగలరు. 

  • విద్యార్థులు వారి సిలబస్ మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. విద్యార్థులు సిలబస్ గురించి తెలుసుకుంటే ప్రిపరేషన్ సులభంగా ఉంటుంది. 
  • గత సంవత్సరాల ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయాలి. ఇలా సాల్వ్ చేయడం వలన విద్యార్థులకు పరీక్ష సమయం మరియు ప్రశ్నల విధానం, వేయిటేజీ గురించిన అవగాహన కలుగుతుంది. 
  • మీ వ్యక్తిగత టైం టేబుల్ ను రూపొందించుకొని దానికి తగ్గట్లు పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. 
  • సిలబస్ పూర్తి చేసిన తర్వాత వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయండి. 

సంబంధిత కధనాలు  

10వ తరగతి తర్వాత డిప్లొమా కోర్సుల జాబితా10వ తరగతి తర్వాత నర్సింగ్ కోర్సుల జాబితా
10వ తరగతి తర్వాత కామర్స్ కోర్సుల జాబితా 10వ తరగతి తర్వాత ITI కోర్సుల జాబితా
10వ తరగతి తర్వాత ఆర్కిటెక్చర్ కోర్సుల జాబితా 10వ తరగతి తర్వాత ఇంటీరియర్ డిజైన్ కోర్సుల జాబితా 

మీరు 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి? ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారా? మీ ఉన్నత చదువుల గురించి ఎటువంటి సహాయం కోసం అయినా CollegeDekho ను సంప్రదించండి. ఈ అప్లికేషన్ ఫార్మ్ ను పూర్తి చేయండి, మా సంస్థలో ఉన్న విద్యారంగ నిపుణులు మిమ్మల్ని గైడ్ చేస్తారు. 

FAQs

TS SSC హాల్ టికెట్ 2024 ఎప్పుడు విడుదల చేయబడుతుంది?

TS SSC హాల్ టికెట్ 2024 ఫిబ్రవరి 2024 చివరి వారంలో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు.

TS SSC హాల్ టికెట్ 2024లో ఏ వివరాలు పేర్కొనబడతాయి?

TS SSC హాల్ టికెట్ 2024లో విద్యార్థి పేరు, హాల్ టికెట్ నంబర్, జిల్లా, తండ్రి పేరు, తల్లి పేరు, పాఠశాల పేరు, పరీక్షా కేంద్రం వివరాలు, పుట్టిన తేదీ, గుర్తింపు గుర్తులు, పరీక్షా మాధ్యమం, లింగం, పరీక్ష తేదీలు మరియు పరీక్ష సూచనలు వంటి వివరాలు ఉంటాయి.

TS SSC హాల్ టికెట్ 2024లో వ్యత్యాసం ఉంటే అభ్యర్థులు ఏమి చేయాలి?

TS SSC హాల్ టికెట్ 2024లో ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే, అభ్యర్థులు లోపాన్ని సరిదిద్దడానికి అధికారులను లేదా సంబంధిత పాఠశాల అధికారులను సంప్రదించాలి.

పాఠశాల అధికారులు TS SSC హాల్ టికెట్ 2024ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు?

పాఠశాల అధికారులు TS SSC హాల్ టికెట్ 2024ను అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in నుండి జిల్లా, పాఠశాల, పుట్టిన తేదీ మరియు ఇతర వివరాలను నమోదు చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

/telangana-ssc-hall-ticket-brd

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Quick Read

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!