తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా విధానం 2023-24 (TS Intermediate Exam Pattern 2023-24) సబ్జెక్టు ప్రకారంగా చూడండి

Guttikonda Sai

Updated On: August 04, 2023 04:07 pm IST

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 2024 నెలలో ప్రారంభం అవుతాయి. పరీక్షా విధానం గురించి (Telangana Intermediate Exam Pattern 2024), మార్కుల కేటాయింపు మొదలైన సమాచారం ఇక్కడ చూడవచ్చు. 
Telangana Class 12 Exam Pattern
examUpdate

Never Miss an Exam Update

తెలంగాణ ఇంటర్మీడియట్  పరీక్షా విధానం 2023-24 (TS Intermediate Exam Pattern 2023-24): తెలంగాణ ఇంటర్మీడియట్  పరీక్షలు 2024 మార్చి నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది, ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు సిలబస్, పరీక్ష విధానం గురించి అవగాహన కలిగి ఉండాలి. అయితే అన్ని సబ్జెక్టులకు ఎగ్జామ్ ప్యాటర్న్ (TS Intermediate Exam Pattern 2023--24)  గురించి తెలుసుకోవడం కూడా ప్రిపరేషన్‌లో ముఖ్యమైన భాగం.  ఈ పరీక్ష విధానం, మార్కింగ్ స్కీమ్, పరీక్షలలో అడిగే ప్రశ్నల రకాలు,  ఇతర ముఖ్యమైన అంశాలను ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు. 

తెలంగాణ ఇంటర్మీడియట్ 2021-22 సంవత్సరానికి ప్రతి జాతీయ, రాష్ట్ర బోర్డు మాదిరిగానే TS బోర్డు కూడా టూ - టర్మ్ పరీక్ష విధానాన్ని అనుసరించింది. TS బోర్డు పరీక్షలు డివైడ్ చేయబడ్డాయి.  ప్రతిసారీ 30% సిలబస్‌తో నిర్వహించబడ్డాయి. సిస్టమ్‌లో కొన్ని ప్రధాన లోపాలు ఉన్నందున తెలంగాణ సంప్రదాయ పరీక్షల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. తెలంగాణ బోర్డ్ సెకండ్ ఇయర్  పరీక్షా విధానం 2023-24 కి (TS Intermediate Exam Pattern 2023-24) సంబంధించిన ప్రతి పాయింట్‌ను అర్థం చేసుకోవడానికి ఈ ఆర్టికల్‌ని జాగ్రత్తగా చదవండి.

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా విధానంలో మార్పులు (Changes Introduced in TS Intermediate Exam Pattern)

తెలంగాణ బోర్డు 2023-24 విద్యా సంవత్సరానికి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటెర్న్ (TS Intermediate Exam Pattern 2024) ను ఇంప్రూవ్ చేసింది.  2020లో ప్రవేశపెట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)తో ఓరియంట్ స్టేట్ ఎడ్యుకేషన్‌కు మార్పులు అమలు చేయబడ్డాయి. TSBIE గతంలో అనుసరించిన పరీక్షా విధానం రోట్ లెర్నింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చేత దీనిని రద్దు చేయాలని నిర్ణయించింది,  మరియు దీనికి బదులుగా , కొత్తవి అప్లికేషన్ బేస్డ్  మరియు అనుకూలంగా ఉండే లెర్నింగ్ మెథడ్స్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. . సవరించిన TS ఇంటర్మీడియట్ పరీక్షా ప్యాటెర్న్ (TS Intermediate Exam Pattern 2024) మరింత అప్లికేషన్-ఆధారితమైనది. కింది విభాగాలలో, మేము TS సెకండ్ ఇయర్  పరీక్షా విధానం 2023-24లో ప్రవేశపెట్టిన మార్పులను ఇవ్వడం జరిగింది. 

తెలంగాణ ఇంటర్మీడియేట్ పరీక్షా విధానం 2024-24 లో ప్రధాన మార్పులు (Major Changes in TSIntermediate Pattern 2023-24)

తెలంగాణలో TSBIE ప్రవేశపెట్టిన కొన్ని ప్రధాన మార్పులు క్రింది విధంగా ఉన్నాయి:

• ఫైనల్ ఎగ్జామ్  కోసం TS ఇంటర్మీడియట్ సిలబస్ సవరించారు  మరియు విద్యార్థుల పై నుంచి  భారాన్ని తీసివేయడానికి 30% వరకు సిలబస్ తగ్గించబడింది.

• TS ఇంటర్మీడియట్ ప్రశ్న పత్రాలు అడిగే ప్రశ్నల టైప్‌ని బట్టి వివిధ విభాగాలుగా విభజించడం జరిగింది. 

• ప్రతి పేపర్‌లోని మొదటి విభాగంలో మల్టిఫుల్ ఛాయిస్ క్వశ్చన్స్ (MCQలు) ఉంటాయి.

• కింది విభాగాలు వరుసగా వెరీ షార్ట్ , షార్ట్  & లాంగ్ ఆన్సర్  ప్రశ్నలు ఉంటాయి.

• ప్రతి MCQకి 1 మార్కు ఉంటుంది. సంక్షిప్త సమాధాన రకం ప్రశ్నలు 2- 3 మార్కులు, దీర్ఘ సమాధాన రకం ఒక్కొక్కటి 4 మార్కులు ఉంటాయి.

• ప్రశ్నపత్రంలో 40% కాంపిటెన్సి బేస్డ్  ప్రశ్నలు ఉంటాయి.

TS ఇంటర్మీడియట్ పరీక్షా విధానం ముఖ్యాంశాలు 2024 (TS Intermediate Exam Pattern Highlights 2024)

ఈ క్రింద దిగువ ఉన్న టేబుల్‌లో TS సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ 2023-24 (TSIntermediate Exam Pattern 2024) కి సంబందించిన కొన్ని ప్రధాన ముఖ్యంశాలు ఇవ్వబడ్డాయి.

పరీక్ష విధానం

ఆఫ్‌లైన్

మీడియం 

తెలుగు & ఇంగ్లీష్

వ్యవధి

3 గంటలు

ప్రశ్నల రకం

మల్టిపుల్ చాయిస్, షార్ట్ మరియు లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు

సబ్జెక్టులు

ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, అడిషనల్ సబ్జెక్ట్

మొత్తం మార్కులు

100

థియరీ పరీక్ష

80 (లాంగ్వేజ్ సబ్జెక్ట్ కోసం) & 70 (ఎలక్టివ్ సబ్జెక్ట్ కోసం)

అంతర్గత అంచనా

20 (భాషా సబ్జెక్ట్ కోసం) & 30 (ప్రాక్టికల్ సబ్జెక్ట్ కోసం)

పాస్ మార్కులు

ప్రతి సబ్జెక్ట్‌తో పాటు మొత్తం 35% మార్కులు

అధికారిక వెబ్‌సైట్

tsbie.cgg.gov.in

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా విధానం 2023-24 (TSIntermediate Exam Pattern 2023-24)

ఈ దిగువ ఇవ్వబడిన టేబుల్లో సబ్జెక్ట్ వైజుగా థియరీ , ప్రాజెక్ట్/ప్రాక్టికల్ మార్కులు ఇవ్వడం జరిగింది. ఇది తాజా తెలంగాణ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటెర్న్ 2023-24 ప్రకారం సూచించబడింది.

సబ్జెక్టులు

థియరీ మార్కులు

ప్రాజెక్ట్/ప్రాక్టికల్ మార్కులు

మొత్తం

ఇంగ్లీష్

80

20

100

సంస్కృతం, తెలుగు, హిందీ, ఉర్దూ, ఫ్రెంచ్, అరబిక్, తమిళం, ఒరియా

8020100

అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్

70

30

100

ఆర్థిక శాస్త్రం

80

20

100

గణితం (II-A) & గణితం (II-B)

75

25

100

ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్

60

40

100

జాగ్రఫీ, హిస్టరీ, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ

100

100

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా విధానం 2023-24: గ్రేడింగ్ విధానం (TSIntermediate Exam Pattern 2023-24: Grading System)

తెలంగాణ బోర్డు పరీక్షలు మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం చివరిలో నిర్వహిస్తున్నారు. కాబట్టి, తుది ఫలితం 1000 మార్కులలో మొత్తం స్కోర్ ఆధారంగా తయారు చేయబడుతుంది మరియు తదనుగుణంగా గ్రేడ్‌లు ఇవ్వబడతాయి. స్థూలంగా, తెలంగాణ బోర్డ్ గ్రేడింగ్ సిస్టమ్ 2024 అనేది నాలుగు-పాయింట్-స్కేల్ గ్రేడింగ్ సిస్టమ్. సిస్టమ్ చాలా సరళమైనది 1 అర్థం చేసుకోవడం సులభం. తెలంగాణ బోర్డు యొక్క పట్టిక రూపం గ్రేడింగ్ సిస్టమ్ 2024 క్రింద సూచించబడింది.

మార్కులు

మార్కుల శాతం

గ్రేడ్

>750

75% లేదా అంతకంటే ఎక్కువ

600 - 749

60% - 75%

బి

500 - 599

50% - 60%

సి

350 - 499

35% - 50%

డి

000-349

<35%

గ్రేడ్ ఇవ్వలేదు

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా విధానం 2023-24: ఉత్తీర్ణత ప్రమాణాలు (TSIntermediate Exam Pattern 2023-24: Passing Criteria )

Telangana Class 12 Exam Pattern 2022-23

తెలంగాణ బోర్డ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ 2024 లో పాస్ అవ్వడానికి విద్యార్థి ప్రతి సబ్జెక్టులో అలాగే మొత్తంగా స్కోర్ చేయాల్సిన కనీస మార్కులను సూచిస్తుంది. తాజా TS ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ప్యాటెర్న్ (TS Intermediate Exam Pattern 2024) మరియు మార్కింగ్ పథకం ప్రకారం, కనీస పాస్  మార్కులు 35%. అంటే TS ఇంటర్మీడియట్  పరీక్ష 2024 లో క్లియర్ చేయడానికి ఒక విద్యార్థి 1000కి కనీసం 350 మార్కులను స్కోర్ చేయాల్సి ఉంటుంది. వికలాంగ విద్యార్థులకు, బోర్డు కనీస పాస్  మార్కులను 35%కి బదులుగా 25%గా నిర్ణయించింది.

పైన ఇవ్వబడిన తెలంగాణ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ 2023-24 గురించి సరైన సమాచారాన్ని తెలుసుకోండి మరియు డానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి!

/ts-intermediate-exam-pattern-brd

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Quick Read

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!