
Never Miss an Exam Update
AP ఇంటర్మీడియట్ పరీక్ష ముఖ్యమైన లింకులు |
---|
ఏపీ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మునుపటి సంవత్సరం ప్రశ్న పేపర్- డౌన్‌లోడ్ Pdf (AP Intermediate English Previous Year Question Paper- Download Pdf)
AP Intermediate English Syllabus 2023-24 పఠన గ్రహణశక్తి, కవిత్వం, సృజనాత్మక రచన, గ్రామర్‌లను కలిగి ఉంటుంది. నవలలు చదవడంతో పాటు, విద్యార్థులు ప్రసిద్ధ రచయితల కవిత్వం, చిన్న కథలను అధ్యయనం చేయాలి. వాటితో పాటు వ్యాసాలు, ప్రకటనలు, పోస్టర్లు, లేఖలను రూపొందించాలి. ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే BIEAP 2023-24 పరీక్షా సెషన్ కోసం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సిలబస్‌ని అప్‌డేట్ చేసింది. నమూనా పేపర్ లేదా మునుపటి సంవత్సరం పేపర్‌లను ప్రయత్నించే ముందు మొత్తం సిలబస్‌ని తప్పకుండా చదవండి. ఈ దిగువ AP ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రాన్ని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.AP ఇంటర్మీడియట్ మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రం | Pdfని డౌన్‌లోడ్ చేయండి |
---|---|
AP ఇంటర్మీడియట్ సెప్టెంబర్ 2021 ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం | |
AP ఇంటర్మీడియట్ మార్చి 2020 వొకేషనల్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం | |
AP ఇంటర్మీడియట్ మార్చి 2020 జనరల్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం | |
AP ఇంటర్మీడియట్ మే 2019 వొకేషనల్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం | |
AP ఇంటర్మీడియట్ మే 2019 జనరల్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం | |
AP ఇంటర్మీడియట్ మే 2018 జనరల్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం | |
AP ఇంటర్మీడియట్ మార్చి 2018 జనరల్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం |
BIEAP ఇంగ్లీష్ గత సంవత్సరం ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download BIEAP English Previous Year Question Paper?)
విద్యార్థులు BIEAP ఇంగ్లీష్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేయడానికి కింది దశలను అనుసరించాలి.- అధికారిక వెబ్‌సైట్ bieap.apcfss.in/ ని సందర్శించాలి.
- ప్రశ్నపత్రాల కోసం లింక్‌పై క్లిక్ చేయాలి.
- మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలను చూపించే కొత్త విండో ఓపెన్ అవుతుంది.
- AP ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ప్రశ్నపత్రంపై క్లిక్ చేయాలి
- భవిష్యత్ ఉపయోగం కోసం డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయాలి.
ఏపీ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రం ప్రాముఖ్యత (Importance of AP Intermediate English Previous Year Question Paper)
ఇంగ్లీషు అనేది తరచూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే అంశం. ఇంగ్లీష్ బాగా మాట్లాడటం, రాయడం రెండు వేర్వేరు విషయాలు. మాట్లాడేటప్పుడు గ్రామర్ వినియోగం ఎల్లప్పుడూ అవసరం ఉండదు. అయితే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ కోర్ పరీక్ష, విద్యార్థుల జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి, వ్యాకరణం, సాహిత్య గ్రహణశక్తిని అంచనా వేస్తుంది, అన్నీ మూడు గంటల సమయ పరిమితిలో ఉంటాయి. గత సంవత్సరం ప్రశ్నపత్రాన్ని విశ్లేషించడం, పరిష్కరించడం ద్వారా ప్రశ్నలు ఎలా రూపొందించబడ్డాయి. వాటికి సమాధానాలు ఇవ్వడానికి ఉత్తమమైన విధానాన్ని అర్థం చేసుకోవచ్చు.ఏపీ ఇంటర్మీడియట్ ఇంగ్లీషు కోర్ కష్టమైన సబ్జెక్ట్ కాదు. కానీ విద్యార్థులు చాలా పొడవుగా లేదా చాలా చిన్న సమాధానాలు రాస్తారు. కాబట్టి తరచుగా అండర్‌స్కోర్ చేస్తారు. ఇంగ్లీష్ సమాధానాలు కచ్చితంగా తప్పులు లేకుండా ఉండాలి. అధిక మార్కులు పొందే సమాధానాలను ఎలా రాయాలనేదానిపై అభ్యాసం కోసం, మునుపటి సంవత్సరం పేపర్‌లను పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఇది చిన్న లేదా దీర్ఘ సమాధానాల రకం ప్రశ్నలను ఎలా ప్రయత్నించాలనే దాని గురించి మీకు మంచి అవగాహన అందిస్తుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ సమాచారం, ఆర్టికల్స్ కోసం College Dekhoని ఫాలో అవ్వండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



